భారత్‌లో డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ | India Approves First Dengue vaccine QDENGA for Ages | Sakshi
Sakshi News home page

భారత్‌లో డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

Jul 20 2026 1:38 PM | Updated on Jul 20 2026 2:57 PM

India Approves First Dengue vaccine QDENGA for Ages

న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారిగా డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం లభించింది. టెకిడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా సంస్థకు చెందిన ‘క్యూడెంగు’ వ్యాక్సిన్‌ మార్కెట్ విక్రయాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అధికారిక అనుమతి మంజూరు చేసింది. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులకు ఈ టీకాను వేయవచ్చు.

డెంగ్యూ బారిన పడినవారైనా, లేకపోయినా ఈ వ్యాక్సిన్‌ను ఎవరైనా తీసుకోవచ్చని, ముందస్తు పరీక్షలు అవసరం లేదని  డీజీఐజీ అధికారులు స్పష్టం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన విస్తృత క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా ఈ అనుమతి ఇచ్చినట్లు టెకిడా సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు తయారైన ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. భవిష్యత్తులో ఉత్పత్తిని మరింత పెంచేందుకు బయలాజికల్-ఈ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే దేశంలో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ ఆమోదం ప్రజా ఆరోగ్య రక్షణలో కీలక అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement