ఐవరీ చీరలో ‘రాధమ్మ’ను తలపిస్తున్న నీతా అంబానీ! | Nita Ambanis latest Krishna inspired ivory saree look is rooted in tradition | Sakshi
Sakshi News home page

కృష్ణుడి స్ఫూర్తితో డిజైన్‌ చేసిన ఐవరీ చీరలో 'రాధమ్మ'లా నీతా అంబానీ..!

Jul 20 2026 1:03 PM | Updated on Jul 20 2026 2:39 PM

Nita Ambanis latest Krishna inspired ivory saree look is rooted in tradition

నీతా అంబానీ ధరించే చీరలే సందర్భం ఏంటో చెప్పేస్తాయి. కార్యక్రమానికి అనుగుణమైన వస్త్రాధారణతో తన ఫ్యాషన్‌ అభిరుచి ఏంటో చెప్పకనే చెప్పేస్తారామె. ముఖ్యంగా భారతీయ గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పేలా హస్తకళకు అద్దంపట్టే చీరలతో అందర్నీ ఆశ్చర్యపర్చడమే గాక మన కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి చాటుతారామె. ఈసారి కూడా అలాంటి అందమైన చీరలో దివ్యంగా కనిపించింది నీతా అంబానీ. తన శారీతో ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని మేకప్‌ ఆర్టిస్ట్‌ స్మారవ్‌ రాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఆ వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన ఇంట జరిగే కృష్ణుడి పూజ కోసం..శ్రీకృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ చీరలో ప్రత్యేకంగా కనిపించింది. ఫ్యాషన్‌ని సందర్భానుసారంగా స్టైలిష్‌గా కనిపించడంలో నీతాకు సాటిలేరని చెప్పొచ్చు. ప్రకాశవంతమైన సంప్రదాయంతో ఫ్యాషన్‌ని చాటుతుందామె. ఈసారి కూడా అలానే ఇంట్లో జరిగే పూజ కోసం కృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ రంగు చీరలో దివి నుంచి భువికి వచ్చిన దేవతాలా మెరిసింది. 

తెల్ల గన్నెరు రంగు చీరపై పురాతన బంగారు, వెండి జరీతో కృష్ణుడి రూపాన్ని అందంగా ఎంబ్రాయిడరీ చేశారు. చీర అంతటా ఆ చిన్న కృష్ణుడి మోటీప్‌లను ఆలోచనాత్మకం నేయడం విశేషం. ఆ శారలో అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన అంచు, క్లిష్టమైన పూల నమునాలు ప్రధాన ఆకర్షణగా కనిపించాయి. ఏక వర్ణంగా ఉండే ఈ చీరకు ఆ డిజైన్‌ అద్భుతమైన లుక్‌ని ఇచ్చింది. అలాగే పల్లు కూడా పారదర్శకమైన ఆర్గాంజా వస్త్రంతో కూడిన వంపుల అంచు ఆమె భుజాల మీద నుంచి అందంగా జాలువారింది. 

ఆ చీరకు మ్యాచింగ్‌గా నిరాడంబరైమన గుండ్రని మెడ, హాఫ్‌ హ్యాండ్స్‌..ఆ చీరపై ఉన్న క్లిష్టమైన హస్తకళా నైపుణ్యం స్పష్టంగా కనిపించేలా ఆకర్ణగా నిలిచింది. ఆ అందమైన లుక్‌కి అనుగుణంగా ధరించిన వజ్రాభరణాలు మరింత శోభను చేకూర్చాయి.  ముఖ్యంగా ఎమరాల్డ్-కట్ రాళ్లతో కూడిన పొరల వజ్రాల నెక్లెస్, దానికి సరిపోయే పూల చెవిపోగులు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్‌లెట్‌లు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్‌లెట్‌లు, ఒక పెద్ద కాక్‌టెయిల్ ఉంగరం వంటి జ్యువెలరీ నీతాకు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లుక్‌ని అందించాయి.  అలాగే కురులను ముడివేసి, ముఖానికి లైట్‌ మేకప్‌తో చక్కటి గుండ్రటి బొట్టుతో సంప్రదాయం మేళవింపుతో కూడిన ఆధునిక మహిళలా మెరిసింది నీతా అంబానీ. 

 

(చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement