ఫార్చ్యూన్ ఇండియా 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (ఎంపీడబ్ల్యూ) 2026' జాబితాను విడుదల చేసింది. ఇందులో వ్యాపారం, రాజకీయాలు, పారిశ్రామిక రంగం, స్టార్టప్ వంటి వివిధ రంగాల్లోని మహిళలు ఉన్నారు. టాప్ 10 జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ మొదటి స్థానంలో నిలిచారు.
తరువాత స్థానాల్లో వరుసగా ''రోష్నీ నాడార్ మల్హోత్రా, రెడ్డి సిస్టర్స్ (శోభన కామినేని, సంగీతా రెడ్డి, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి), సావిత్రి జిందాల్, డాక్టర్ ప్రీతి అదానీ, కిరణ్ మజుందార్-షా, ఇషా అంబానీ, ప్రియా నాయర్, బేలా బజారియా, లీనా నాయర్'' ఉన్నారు.
➤రోష్నీ నాడార్ మల్హోత్రా: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్
➤శోభన కామినేని, సంగీతా రెడ్డి, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి: అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం
➤సావిత్రి జిందాల్: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్
➤డాక్టర్ ప్రీతి అదానీ: అదానీ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్
➤కిరణ్ మజుందార్-షా: బయోకాన్ వ్యవస్థాపకురాలు & చైర్‌పర్సన్
➤ఇషా అంబానీ: రిలయన్స్ రిటైల్ డైరెక్టర్
➤ప్రియా నాయర్: హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ
➤బేలా బజారియా: నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్
➤లీనా నాయర్: షెనెల్ (ఫ్యాషన్ బ్రాండ్) సీఈఓ
ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన 16వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో నీతా అంబానీ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఒక తల్లిగా తన కుమార్తె ఇషా అంబానీ (రిలయన్స్ రిటైల్ డైరెక్టర్) కూడా ఈ పవర్‌ఫుల్ 100 మంది జాబితాలో చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.


