భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 14th July 2026 | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Jul 14 2026 3:53 PM | Updated on Jul 14 2026 4:11 PM

Stock Market Closing Update 14th July 2026

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.

శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్‌జీ జవేరి లిమిటెడ్, బాల్ ఫార్మా లిమిటెడ్, నూరేకా లిమిటెడ్, వ్రాజ్ ఐరన్ & స్టీల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్, పీపీఏపీ ఆటోమోటివ్ లిమిటెడ్, బిఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement