తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు, అధికారిక కార్యక్రమాల వల్ల మాత్రమే కాకుండా.. ఆయన సహజమైన, సరదా క్షణాల వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆసియా ఆపరేషన్స్ సీఈఓ ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau)తో జరిగిన సమావేశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. ఈ సమావేశంలో విన్‌ఫాస్ట్ కంపెనీ ప్రతినిధి.. ముఖ్యమంత్రి విజయ్‌కు తమ కంపెనీకి చెందిన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు స్కేల్ మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ చిన్న కారు బొమ్మను విజయ్ తీసుకుని, పక్కన పెట్టకుండా ఆసక్తిగా చేతిలో పట్టుకుని పరిశీలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.
చాలామంది నెటిజన్లు విజయ్ అమాయకత్వాన్ని, సరళ స్వభావాన్ని ప్రశంసించారు. కొందరు ఆయన ఆ చిన్న కారును ఎంతో ఆసక్తిగా చూస్తున్న తీరు చాలా క్యూట్‌గా ఉందని, చిన్నపిల్లాడిలా ఆనందపడ్డారని కామెంట్లు చేశారు.
నిజానికి సీఎం విజయ్‌కు ఇచ్చిన టాయ్ కారు విన్‌ఫాస్ట్ వీఎఫ్8 అనే ఎలక్ట్రిక్ ఎస్యూవీకి చెందిన చిన్న నమూనా. దీనిని కంపెనీ పిల్లలు ఆదుకునే బొమ్మగా కాకుండా.. తమ వాహనాలను ప్రచారం చేయడానికి లేదా ప్రత్యేక అతిథులకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి రూపొందించింది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్8 గురించి
అసలైన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో తరం. ఇది 60.13 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 228 హార్స్‌పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.
#CMVijay's cute playtime with a Miniature Toy Car... 🤎🚗 pic.twitter.com/dmrxMCbeO2
— 𝐒𝐚𝐤𝐭𝐡𝐢 𝐀𝐠𝐫𝐢 𝑻𝑽𝑲 (@mersal_sakthi03) July 13, 2026


