రూ. 2 కోట్ల బంగారం పేస్ట్‌ : తమిళనాడు జంట అరెస్ట్‌ | Tamil Nadu Couple Held At Kochi Airport With Gold Worth Nearly Rs 2 Crore, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల బంగారం పేస్ట్‌ : తమిళనాడు జంట అరెస్ట్‌

Jul 14 2026 11:46 AM | Updated on Jul 14 2026 12:22 PM

Tamil Nadu couple held at Kochi airport with gold worth nearly Rs 2 crore

కొచ్చి: అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. దీంతో గోల్డ్‌ను దొడ్డిదారిన తరలించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.  కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని, కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బంగారాన్ని పేస్ట్‌ రూపంలో ప్యాంటు నడుము పట్టీలలో దాచి తరలిస్తుండగా తమిళనాడుకు చెందిన ఒక జంటను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు మంగళవారం తెలిపారు.

నిందితులను తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాకు చెందిన రిఫ్నాస్ హమీద్ మహమ్మద్ షరీఫ్ (26)  అతని భార్య జానోఫర్ కదర్ బీవి ఉమర్ ఫరూక్ (23)గా గుర్తించారు. వీరు జూలై 13న అబుదాబి నుండి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 418లో విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు గా ఈ జంటను అడ్డగించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  దీంతో అసలు విషయం తెలిసి షాకయ్యారు. నడుము బెల్ట్‌లో దాచిన బంగారాన్ని  వెలికితీశారు. అనంతరం సుమారు రూ. 1.94 కోట్ల విలువైన 1,353.92 గ్రాముల 24-క్యారెట్ బంగారం కలిగిన బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: చిన్నగొడవ, భర్తను మొబైల్‌తో కొట్టింది.. అంతే..!
ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement