సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికిపైగా స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాదంపై తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన ఆరుగురి కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురికి రూ.లక్ష చొప్పున గాయపడిన మరో 15 మందికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


