స్వస్థలాలకు తమిళుల మృతదేహాలు | - | Sakshi
Sakshi News home page

స్వస్థలాలకు తమిళుల మృతదేహాలు

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

● నేడు అంత్యక్రియలు ● పొన్‌రాజ్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

సాక్షి, చైన్నె: వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 10 మంది తమిళుల మృత దేహాలు మంగళవారం స్వస్థలాలు చేరుకోనున్నాయి. ఇందు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియలకు కుటుంబీకులు,ప్రభుత్వం తరపున చర్యలు తీసుకున్నారు. వివరాలు.. వియత్నాంకు వెళ్లిన పర్యాటకులు బోటు ప్రమాదానికి గురైనవిషయంతెలిసిందే. . ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన పది మంది ఉన్నారు. వీరిలో పళనికి చెందిన మురుగప్రభు, ధర్మపురికి చెందిన సెంథిల్‌కుమార్‌, తిరుచ్చికి చెందిన అళగురాజన్‌, బాలాజీ, షేక్‌ అబ్దుల్లా, సేలంకు చెందిన శ్రీధర్‌, గుమ్మిడిపూండికి చెందిన బాబు, రవిశంకర్‌, వెల్లూరుకు చెందిన సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ అధికారులను రంగంలోకి దించారు. వియత్నాం నుంచి మృత తదేహాలను వెంటనే రాష్ట్రానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం ద్వారా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో సోమవారం పోస్ట్‌మార్టం, చట్టపరమైన లాంఛనాలను వేగంగా పూర్తి చేశారు.

వియత్నాం బోటుప్రమాదం

సాక్షి, చైన్నె:తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ రాజకీయ విశ్లేషకుడు పొనన్‌రాజ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై చైన్నె హైకోర్టు తీర్పును తేదీ ఖరారు చేయకుండా వాయిదా వేసింది. వివరాలు.. టీవీకే అధినేత విజయ్‌కు మద్దతుగా ఇంటర్వ్యూలు ఇచ్చిన మహిళా కార్యకర్తలను ఉద్దేశించి రాజకీయ విశ్లేషకుడు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం మాజీ సలహాదారు అయిన పొన్‌రాజ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వివాదం రేగింది. దీనిపై మంత్రులు నిర్మల్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మే 12వ తేదీన చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు, కడలూరు పోలీసులు పొన్‌రాజ్‌పై కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ పొన్‌రాజ్‌ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో విచారించిన హైకోర్టు, ఈ కేసులకు సంబంధించి ఎలాంటి తుది నివేదిక దాఖలు చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం న్యాయమూర్తి జి.కె. ఇళంతిరైయన్‌ ఎదుట పిటిషన్‌ మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సమయంలో ఇరు పక్షాల వాదనలు సాగాయి. పొనన్‌రాజ్‌ తరపున సీనియర్‌ న్యా యవాది ఎన్‌.ఆర్‌. ఇళంగో హాజరై వాదనలు వినిపి స్తూ.. యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మాత్రమే పిటిషనర్‌ సమాధానం ఇచ్చారేగానీ, మహిళలను ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఫిర్యాదులపై కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా నేరుగా కేసులు నమోదు చేశారఅని కోర్టుకు తెలిపారు. పోలీసుల తరపున న్యాయవాది అరుణ్‌ అన్బుమణి వాదిస్తూ.. దివంగత మాజీ రాష్ట్రపతికి కా ర్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదని, ఆయన వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని ఉద్దేశించి సాధారణీకరించినట్లు ఉన్నాయని వివరించారు. ఆయన మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కేసు ప్రాథమిక దశలోనే ఉన్నందున దీనిని రద్దు చేయవద్దు అని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును తేదీ పేర్కొనకుండా వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

టీవీకే మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసు

స్వస్థలాలకు తరలింపు ఏర్పాట్లు

మృతదేహాలను తమిళనాడుకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ముంబై వెళ్లారు. ముంబై విమానాశ్రయానికి అర్థరాత్రి సమయానికి చేరుకున్న మృతదేహాలను విమానాల ద్వారా చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి నగరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సేలం డీఐజీ సంతోష్‌ హతీమణి మాట్లాడుతూ.. మృతదేహాలను ముంబై నుండి తమిళనాడుకు ఉదయాన్నే తీసుకొచ్చిన వెంటనే, విమానాశ్రయాల నుండి ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా వారి స్వగ్రామాలకు తరలిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. విహారయాత్రకు వెళ్లి మృత దేహాలై వస్తున్న తమ వారి ఆకరి చూపు కోసం ఆయా గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి. మంగళవారం సాయంత్రంలోపు ఆయా గ్రామాలలో మృతదేహాలకు అంత్యక్రియల ప్రక్రియలు పూర్తి చేయడానికి ఓ వైపు కుటుంబీకులు, మరో వైపు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement