సైలెంట్ గా బాయ్ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం చేసుకున్న నటి బ్రిగిడా సాగా.(Brigida Saga)
తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్‌గా తెగ వైరలైన బ్రిగిడా సాగా.. ఇటీవలే తన ప్రేమ సంగతి బయటపెట్టింది.
నటుడు ఆనంద్ రామ్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి.
Photo Credit : Actress Brigida Saga Instagram


