కాళేశ్వరం బ్యారేజీలపై తుది పరీక్షలు పూర్తి.. ప్రభుత్వం కీలక నిర్ణయం! | Final tests Almost Complete On Kaleshwaram Barrages | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం బ్యారేజీలపై తుది పరీక్షలు పూర్తి.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Jul 14 2026 9:14 AM | Updated on Jul 14 2026 9:14 AM

Final tests Almost Complete On Kaleshwaram Barrages

సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యతపై చేపట్టిన సాంకేతిక పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. కాంక్రీటు నాణ్యతకు సంబంధించిన అన్ని పరీక్షలు ముగియగా, ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలలో అల్ట్రాసోనిక్ పరీక్షలు చివరి దశలో కొనసాగుతున్నాయి.

బ్యారేజీల బలం, స్థిరత్వం, వరద ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యంపై నిర్వహించిన కీలక పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జూలై 16, 17 తేదీల్లో అధికారుల బృందం పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS)ను సందర్శించి పరీక్షల నివేదికలను పరిశీలించనుంది. ఇదిలా ఉండగా, మేడిగడ్డ బ్యారేజీలో సీకెంట్ పైల్స్ లోతు అవసరమైన స్థాయిలో లేదని డిజైన్ సంస్థ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో బ్యారేజీ భద్రతను మరింత బలోపేతం చేయడానికి అదనంగా సీకెంట్ పైల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తన నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది.

అయితే, తుది పరీక్షల ఫలితాలు, నిపుణుల నివేదికల ఆధారంగానే బ్యారేజీల మరమ్మతులు, పునర్నిర్మాణం లేదా ఇతర చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీంతో కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement