ఉపాధికై నగరానికి వచ్చి.. నిండు ప్రాణాలు కోల్పోయి | Three People Dies Hyderabad Road Accedent | Sakshi
Sakshi News home page

ఉపాధికై నగరానికి వచ్చి.. నిండు ప్రాణాలు కోల్పోయి

Jul 14 2026 9:10 AM | Updated on Jul 14 2026 9:10 AM

Three People Dies Hyderabad Road Accedent

పాధి కోసం.. పని వెదుక్కుంటూ.. కూతురుని చూసేందుకు.. నగరానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరుచోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో ఏపీలోని ప్రకాశం జిల్లా వారు ఇద్దరు యువకులు, రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లాకు మహిళ మృతి చెందారు.  

నిజాంపేట్‌: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామానికి చెందిన ఎల్రక్టీíÙయన్‌ శివసాయి పవన్‌ (25) బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఉంటున్నాడు. స్నేహితుడు ఉమాప్రసాద్‌ (23)తో కలిసి ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై బాచుపల్లి నుంచి ప్రగతి నగర్‌ వైపు బయలుదేరారు.   బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివసాయి పవన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఉమాప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు  అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..
హయత్‌నగర్‌: ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని  ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. హయత్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ (35) హయత్‌నగర్‌లోని సూర్యనగర్‌లో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా, హయత్‌నగర్‌లో వెనుక నుంచి వేగంగా వచి్చన ఆర్‌టీసీ బస్సు ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తల బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement