శంషాబాద్‌.. ఫ్యామిలీ ఫ్రెండ్లీ | Hyderabad Airport Ranked World’s 4th Most Family Friendly Airport By UK Travel Firm, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌.. ఫ్యామిలీ ఫ్రెండ్లీ

Jul 14 2026 8:18 AM | Updated on Jul 14 2026 10:19 AM

Hyderabad Airport Family Friendly Ranking Telangana

ఎయిర్‌పోర్టుకు ప్రపంచంలో 4వ ర్యాంక్‌

హైదరాబాద్‌, శంషాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత కుటుంబాలకు అనుకూలమైన ఎయిర్‌పోర్టు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్‌గా నాలుగో ర్యాంకును దక్కించుకుంది. యూకేకు చెందిన ప్రముఖ ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రొవైడర్‌ అట్రాక్షన్‌ టికెట్స్‌ డాట్‌కామ్‌ హ్యాపియెస్ట్‌ ఎయిర్‌పోర్టు కింద వివిధ ప్రమాణాలను పరిశీలించి ఈ గుర్తింపును అందజేసినట్లు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు వెల్లడించాయి.

మొత్తం 20 మార్కులకు గాను 18.5 లభించాయని పేర్కొన్నాయి. కుటుంబాలకు ప్రత్యేక భద్రత, శిశు సంరక్షణ సదుపాయాలు, విశ్రాంతి సేవలు, పిల్లల ఆటస్థలాలతో పాటు వైఫై ఇతరత్రా అనేక సౌకర్యాలతో గూగుల్‌ రేటింగ్‌లను పరిగణనలోకి తీసుకుని ర్యాంకును అందజేసినట్లు తెలిపారు. ఈ గుర్తింపు గర్వకారణమని జీహెచ్‌ఏఐఎల్‌ లిమిటెడ్‌ సీఈఓ కదీర్‌ కదరవన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement