సింగరేణి భరోసా యాత్రలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో డీకే అరుణ, రాంచందర్‌రావు
సంస్థ కష్టాలు తీర్చడానికే తాడిచర్ల–2 బ్లాక్ కేటాయింపు
‘సింగరేణి భరోసా యాత్ర’లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రుద్రంపూర్: దేశ ప్రధానిగా మన్మోహన్‌సింగ్ ఉన్నప్పుడు రూ.2.50 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక పైసా దారి తప్పకుండా చూస్తూ సింగరేణిని ఆదుకునే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ‘సింగరేణి భరోసా యాత్ర’పేరిట చేపట్టిన యాత్ర మొదటి రోజైన సోమవారం కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి వరకు కొనసాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే.అరుణ, నాయకులతో కలిసి యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పైసలు తీసుకొని బ్లాక్‌లు కేటాయించే విధానం ఉంటే, దీన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చాక వేలంలో పాల్గొన్న వారే బ్లాక్‌లు పొందే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు.సింగరేణి సంస్థకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్, బొగ్గుకు సంబంధించి సుమారు రూ.54 వేల కోట్ల బకాయి ఉండడంతో అభివృద్ధి కుంటు పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రం తొలిసారి వేలం లేకుండా తాడిచర్ల–2 బ్లాక్‌ను సంస్థకు కేటాయించిందని తెలిపారు. ప్రజలు, కారి్మకులు బీజేపీ కృషిని గుర్తించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఆదరించాలని కిషన్‌రెడ్డి కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, నేతలు కోటేశ్వరరావు, అంజిరెడ్డి, గౌతంరావు, ఆనంద్ గౌడ్, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


