‘సర్‌’ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ వేగవంతం చేయాలి

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

కొత్తగూడెంఅర్బన్‌: సర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. సోమవారం ఆయన కొత్తగూడెం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, స్వీకరణపై ఆరా తీశారు. బీఎల్‌ఓలు సేకరించిన ఫారాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్‌ చేయాలన్నారు. ఓటర్లకు ఫారాలు పూరించే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి, ఫారాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సూపర్‌వైజర్లకు తెలపాలని బీఎల్‌ఓలకు సూచించారు. తహసీల్దార్‌ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement