గిరిజనుల చెంతకు ప్రభుత్వ పథకాలు | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల చెంతకు ప్రభుత్వ పథకాలు

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

ఉన్నత విద్యలో రాణించాలి

భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజ నుల చెంతకు చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఐటీడీఏ ప్రా జెక్ట్‌ అధికారి బి.రాహుల్‌ అన్నారు. సోమవా రం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడు తూ గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలన్నారు. స్వయం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలని చెప్పారు. గిరి జనులు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులు, పరిష్కారాల వివరాలు, పరిష్కారం కాకపోతే తగిన కారణాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. గిరిజన దర్బార్‌ ఫిర్యాదుల విషయంలో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోఅధికారులు డేవిడ్‌ రాజ్‌, ఆనంద్‌కుమార్‌, చందన, అరుణకుమా రి, మధుకర్‌, సైదులు, సున్నం రాంబాబు, గన్యా నాయక్‌, నారాయణరావు, సమ్మయ్య, మణిధర్‌ పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం: ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ అన్నారు. మణుగూరు మండలం చిన్నవారిగూడెం గ్రామానికి చెందిన శ్రీ సున్నం జగదీష్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2026లో ప్రతిభ కనబరిచి పంజాబ్‌ రాష్ట్రంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌లో ప్రవేశం పొందాడు. విద్యార్థికి సోమవారం పీఓ ఫీజు, పుస్తకాల కొనుగోలు ఖర్చు కోసం ఐటీడీఏ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.30 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్‌ డేవిడ్‌ రాజ్‌, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement