దోచుకున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

దోచుకున్నాయి..

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

సంస్థ మనుగడను పరోక్షంగా

దెబ్బతీస్తున్నాయి

తాడిచర్ల–2 బ్లాక్‌తో 2 వేల మందికి 40 ఏళ్లపాటు ఉపాధి

సింగరేణి భరోసా యాత్రలో

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు

మణుగూరుటౌన్‌/రుద్రంపూర్‌: పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ సింగరేణిని దోచుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్‌ దోచుకుంటోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో, మణుగూరు పీకే ఓసీ–2లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం సహాయంతో ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని సాధించుకున్నామని తెలిపారు. సింగరేణిలో కార్మి కుల సంఖ్య, బొగ్గు నాణ్యత తగ్గడంతోపాటు ఉత్పత్తి చేసిన బొగ్గు అమ్ముడుపోవడం లేదని, ఈ నేపథ్యంలో తన విన్నపంతో ప్రధాని మోదీ తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారని తెలిపారు. దీంతో సుమారు 2 వేల మందికి 40 సంవత్సరాలపాటు ఉపాధి లభిస్తుందని అన్నారు. 40 లక్షల బొగ్గు మాయమైందని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు తనకు లేఖ రాశారని, కానీ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్నడూ లేఖ రాయలేదన్నారు. అధికారం పోయిందని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కేసీఆర్‌ సింగరేణిని వేలంలో

పాల్గొనకుండా చేశారు..

ఇతర రాష్ట్రాలోని బొగ్గు పరిశ్రమలు వేలంలో పాల్గొని బ్లాకులు పొందితే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 54 వేల కోట్ల బకాయి చెల్లించకుండా పరోక్షంగా సింగరేణి మనుగడను దెబ్బతీస్తోందని అన్నారు. సింగరేణి సొమ్మును ఒకరు సిద్ధిపేటలో ఖర్చు చేస్తే మరొకరు కొడంగల్‌లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు జీతాలివ్వాలంటే సింగరేణి ఓడీ తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. కొత్త మిష న్లు కొనుగోలు, కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా అప్పు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సంస్థను అందరూ కలిసి కాపాడుకోవాలన్నారు. కార్మికుల రక్షణకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణి వేలంలో పాల్గొనకపోవడంతో గనులను ప్రైవేట్‌ కంపెనీలు దక్కించుకున్నాయని, తాము వాటిని రద్దు చేశామని తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఆ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయని, సింగరేణి కోసం కోర్టులో కొట్లాడతామని అన్నారు. సింగరేణి అధికారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా మణుగూరు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పీకేఓసీ–2 డీప్‌సైడ్‌ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని కోరుతూ ఏఐటీయూసీ, టీబీజీకేఎస్‌, బీఎంఎస్‌, ఇఫ్టూ యూని యన్లు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ధన్‌పాల్‌, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, బీఎంఎస్‌, బీజేపీ నాయకులు మాధవ్‌ నాయక్‌, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయచంద్రారెడ్డి, పొడియం బాలరాజు, పున్నం భిక్షపతి, జాడి దేవేంద్ర వర ప్రసాద్‌, కోటేశ్వరరావు, గౌతంరావు, ఆనంద్‌ గౌడ్‌, జీవీకే మనోహర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement