హైదరాబాద్: షాబాద్ హత్య కేసుల నిందితుడు రాజ్‌కుమార్ ఈరోజు(సోమవారం, జూలై 13వ తేదీ) సాయంత్రం ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించింది. అయితే హత్యలకు ముందే సెల్పీ వీడియో తీసుకున్న విషయం పోలీసులు కనుగొన్నారు.
ఇదిలా ఉంచితే, ఘటనా స్థలంలో రాజ్‌కుమార్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్‌కుమార్‌కు ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఇచ్చారని, అతడ్ని కాల్చి కాల్చి చంపేసి ఉండాల్సిందంటూ పోలీసుల వద్ద ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కన్నబిడ్డలను సైతం రాజ్‌కుమార్ పొట్టనబెట్టుకున్నాడని సోదరుడు ప్రధానంగా ప్రస్తావించాడు. ఆ పిల్లల్ని బతకనిస్తే కనీసం తానైనా చూసుకునేవాడనన్నాడు. ఈ నరరూప రాక్షసుడ్ని అప్పుడే కాల్చి పారేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని కోపావేశం ప్రదర్శించాడు.
ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్ మృతి


