తెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదల | Telangana TET results released | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదల

Jul 13 2026 2:43 PM | Updated on Jul 13 2026 4:14 PM

Telangana TET results released

సాక్షి హైదరాబాద్: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ డైరెక్టర్‌ టెట్‌ రిజల్ట్స్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.వారిలో ఇన్‌ సర్వీస్‌లో అర్హత సాధించిన టీచర్లు 8,804 మంది ఉన్నారు. అభ్యర్థులు అధికారిక వైబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌ 16 నుంచి జూన్‌ 22 వరకూ టెట్‌ పరీక్షలను నిర్వహించారు. మెుత్తంగా 1.15 లక్షలమంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నెలరోజులు తిరగకుండానే విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పరీక్షలకు పోటీపడే అభ్యర్థులకు టెట్‌ స్కోరు కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement