ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
వికారాబాదు జిల్లా: కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో బాధితుడిపై దాడి చేసి, అతని భార్యపై లైంగిక దాడిచేస్తామని బెదిరించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. ఆల్విన్ కాలనీ ఫేజ్–1లో గుంటి వేణుగోపాల్‌తో పాటు తన సోదరులు శ్రీనివాస్, రవి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
2022లో వీరి తండ్రి నాగభూషణం చనిపోయారు. కొన్ని రోజుల నుండి శ్రీనివాస్, రవి ఇప్పుడుంటున్న 100 గజాల ఇంటి ప్రాపర్టీ విషయమై రిజిస్ట్రేషన్ చేయించుకొని రుణం తీసుకుంటున్నట్లు దీనికి గాను తన తమ్ముడు వేణుగోపాల్‌ను సంతకం చేయమని కోరారు. దీనికి తాను ఒప్పుకోనని, తనకు రావాల్సిన వాటా చెల్లించిన తర్వాతే ఆస్తి పత్రాలపై సంతకం చేస్తానని వేణుగోపాల్ చెప్పడంతో గొడవ మొదలైంది.
ఈ విషయమై శనివారం మధ్యాహ్నం మాట్లాడాలని వేణుగోపాల్‌ని పిలిచారు. వెళ్లగానే అన్నలు శ్రీనివాస్, రవిలు పిడిగుద్దులు గుద్దుతూ ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని వేణుగోపాల్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో పొత్తికడుపు, ఎడమ కాలి బొటనవేలికి గాయాలయ్యాయి. అంతే కాకుండా అడ్డు వచ్చిన బాధితుడి భార్యను అన్న రవి లైంగికదాడి చేస్తామని అసభ్య పదజాలంతో దూషించి తోసేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


