‘నీకు పిల్లలే పుట్టరు’.. నా కొడుకుకు మరో పెళ్లి చేస్తా! | Married Woman Ends Life Affter Alleged Husband Over Childlessness | Sakshi
Sakshi News home page

‘నీకు పిల్లలే పుట్టరు’.. నా కొడుకుకు మరో పెళ్లి చేస్తా!

Jul 13 2026 1:57 PM | Updated on Jul 13 2026 2:01 PM

Married Woman Ends Life Affter Alleged Husband Over Childlessness

మౌనిక (ఫైల్‌)

మంచిర్యాల జిల్లా: సంతానం లేదని భర్త వేధింపులకు వివాహిత  అనుమాన స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామానికి చెందిన పంజాల మౌనిక (29)ను చింతలపల్లి గ్రామానికి చెందిన పంజాల రవితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. గత ఐదేళ్లుగా సంతానం లేదు. తన కుమారుడికి మరో అమ్మాయితో వివాహం చేస్తామని అత్త రాజవ్వ, మామ రాజన్నలు మౌనికను మానసికంగా వేధించేవాడు. 

గత సంవత్సరం గొడవ కావడంతో పెద్దలు మందలించడంతో భర్త తిరిగి తీసుకెళ్లాడు. సిర్పూర్‌(యూ) మండలంలో భర్త గీత వృత్తి చేసుకుంటూ అక్కడే కాపురం పెట్టారు. ఆదివారం భార్యభర్తలు చింతలపల్లికి వచ్చారు. భర్త, అత్తమామలు మౌనికను వేధించి హత్యచేసినట్లు మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. జన్నారంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని చెబుతున్నారు. మృతదేహాన్ని చింతలపల్లికి తీ సుకెళ్లారు. అయితే అత్తారింటి వారు ఎలాంటి స మాచారం ఇవ్వలేదు. 

వేరేవారితో సమాచారంతో మౌనిక బంధువులు నేరుగా పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే అత్తింటివారు మృతదేహాన్ని లక్సెట్టిపేటకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆగ్రహించిన మౌనిక బంధువులు పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, జన్నారం ఎస్సై ఉదయ్‌కిరణ్‌లు మృతదేహాన్ని తిరిగి జన్నారం రప్పించడంతో ఆందోళన విరమించారు. కాగా, మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. మౌనిక ఆత్మహత్యకు పాల్పడిందా, లేక హత్య జరిగిందా అని పోలీసులు తేల్చాల్సి ఉంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement