breaking news
wife
-
చీరలో మెరిసిపోతున్న జహీర్ ఖాన్ భార్య (ఫోటోలు)
-
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
ఢిల్లీ మెట్రో రైలు ఎక్కిన కేంద్ర మంత్రి బండి దంపతులు.. కారణం ఏంటంటే..
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైలులో ప్రయాణించారు. వాస్తవానికి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లోని తన నివాసం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే, భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీవల్ల ఢిల్లీలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రోటోకాల్ కాన్వాయ్‌ను పక్కన పెట్టి సతీమణి బండి అపర్ణతో కలిసి సమీపంలోని శివాజీ స్టేడియం వద్దనున్న మెట్రో స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ టిక్కెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కి ఢిల్లీలోని ఏరో మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పయనమయ్యారు. -
నేను టీడీపీ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్‌ని..!
సాక్షి, గుంటూరు: టీడీపీ జెండా పట్టుకుంటే చాలు.. ఎంతటి మోసం, అన్యాయం, అక్రమమైనా చేయొచ్చనే భావనతో పొన్నూరులో పచ్చ పార్టీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కుడి భుజం(రైట్ హ్యాండ్) అని చెబుతూ తిరిగే తన భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఓ మహిళ వాపోయింది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు సార్లు, స్థానిక పొన్నూరు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ... పొన్నూరు మండలం అలూరు గ్రామానికి చెందిన తనకు సుమారు ఎనిమిదేళ్ల క్రితం పౌల్రాజుతో ప్రేమ వివాహమైందని చెప్పారు. భర్త పంచాయితీ పనులకెళ్తూ, ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కుడి భుజమని చెబుతున్నాడని పేర్కొన్నారు. కట్నకానుకల కింద పాండ్రపాడులోని రెండెకరాల పొలం, పది తులాల బంగారం తమవారు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం కొంత పొలాన్ని రూ.19 లక్షలకు విక్రయించి రాజకీయాల్లో తిరిగి ఖర్చు చేశాడని తెలిపారు. మరో ఎకరం విక్రయించేందుకు అంగీకరించకుంటే కాపురానికి రానివ్వ బోనని, తనను, తన బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఎవరికై నా దీనిపై ఫిర్యాదు చేసినా చంపేస్తానని, తర్వాత స్టేషన్లో లొంగిపోతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పేరు చెప్పి తీవ్రంగా బెదిరించేవాడని కన్నీరు మున్నీరయ్యారు. గత నెల 11వ తేదీన మరణాయుధంతో దాడికి పాల్పడగా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. భర్త వద్దనే తమ కుమార్తె కూడా ఉందని పేర్కొన్నారు. తనకు కుమార్తెను అప్పగించాలని వేడుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భర్త, అతని కుటుంబ సభ్యుల నుంచి తనను, తన వారిని కాపాడి న్యాయం చేయాలని కోరారు.ఆస్తుల కోసమే తనను పెళ్లి చేసుకున్నట్లు భర్త పలుమార్లు చెప్పాడని బాధితురాలు వివరించారు. తక్కువ కులం దానినంటూ నోటికొచ్చినట్లు ధూషించేవాడని వాపోయారు. చిత్రహింసలకు గురిచేయడంతోపాటు, తన కుటుంబ సభ్యులను ఇంటికి రానిచ్చేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడటానికి కూడా అంగీకరించేవాడు కాదని వాపోయారు. స్నేహితులతో కలిసి నిత్యం మద్యం తాగొచ్చి, వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వేధించేవాడని తెలిపారు. -
వన్డే వరల్డ్‌కప్-2025కి సిద్ధమైన బుమ్రా సతీమణి సంజనా (ఫొటోలు)
-
భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు
భార్యామణికోసం, ఆమె ప్రేమకోసం అందమైన ప్రేమ మందిరాన్ని నిర్మించిన ఘనత మనది. ఉద్యోగం ఒక లెక్కా అనుకున్నాడో ఏమోగానీ తాజాగా గర్భవతి అయిన జీవిత భాగస్వామి కోసం కోటి రూపాయలిచ్చే ఉద్యోగాన్ని ఒక భారతీయుడు. కోటి రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఘటన నెట్టింట సందడిగా మారింది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందించారు.గర్భవతిగా ఉన్న భార్యను చూసుకోవడానికి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశానంటూ ఇండియన్ పెట్టిన రెడ్డిట్పోస్ట్ వైరల్‌గా మారింది. జయనగర్‌లో రూ. 1.2 కోట్ల జీతం, వర్క్‌ఫ్రం హోంఅ యినా భార్యకంటే ఇవేవీ ముఖ్యం కాదు అంటూ రాసుకొచ్చాడుఅతగాడు.. తన భార్య గర్భధారణ ప్రయాణంలో ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. గర్భం అని తెలియగానే మొదట ఉద్యోగం వదిలేయమని అడిగిన భార్య ఆ తరువాత ఉద్యోగం చేయాలని కోరిందని అయితే ఆమెను కంటికిరెప్పలా కాపాడుకునేందుకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే తనకున్న పరిచయాలు, ,అనుభవంతో ఎప్పుడైనా మార్కెట్లోకి తిరిగి రాగలననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. లైఫ్‌లో సరైన సమయంలో సరైన ప్లేస్‌లో ఉండటం చాలా ముఖ్యమైందంటూ తన పోస్ట్‌ను ముగించాడు. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను కూడా కొన్ని పంచుకున్నాడు. ‘‘కాలేజీ డ్రాపౌట్, స్టార్టప్‌లలో పనిచేస్తూ 7 సంవత్సరాలలో 0 నుండి 7కోట్లకు చేరుకున్నా’’ అని తెలిపాడు.ఇదీ చదవండి: లండన్‌నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే అతని నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకునే స్థోమతలో అందరూ ఉండరని చాలామంది వ్యాఖ్యానించారు. “మీరు.. మీ భార్య అదృష్టవంతులు, కానీ అందరి స్టోరీ ఒకేలా ఉండదు. చాలామందికి ఉద్యోగాలను కోల్పోవడం చాలా దుర్భరం, “ చాలా బాగుంది, జీవిత ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఇది ఉత్తమ నిర్ణయం అని నేను భావిస్తున్నాను, జీవిత వాస్తవ అనుభవం లేదా కేవలం అనుభవానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి అంటి కొందరు అభినందనలు తెలిపారు. “తెలివైన మనిషి!తక్కువ ఒత్తిడితో కూడిన సంపాదన అవకాశాలను అన్వేషించే వీలు చిక్కుతుంది. ఇది మీ బిడ్డను చూసుకుంటూ మీరు సంపాదించేలా చేస్తుంది.’’ అని మరొకరు విషెస్ తెలిపారు. -
భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి... మానవత్వమా నీవెక్కడ?
నాగ్‌పూర్: రక్షాబంధన్ వేళ ఆ భార్యాభర్తలు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ, జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్నారు. ఇంతలో ఊహించని విధంగా ఒక ట్రక్కు వారి బైక్‌ను బలంగా ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భార్య కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు సాయం చేయాలంటూ ఆ మార్గంలో వెళుతున్నవారినందరినీ ఆమె భర్త సాయం కోసం అభ్యర్థించాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు, అతనికి సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంతటి నిస్సహాయ స్థితిలో ఆ భర్త ఏం చేశాడు?ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని నాగ్‌పూర్-జబల్పూర్ జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో గ్యార్సి అమిత్ యాదవ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమె భర్త అమిత్ యాదవ్ నిశ్చేష్టుడైపోయాడు. సహాయం కోసం కనిపించిన అందరినీ ప్రాధేయపడ్డాడు. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనం వెనుక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్‌లోని తమ స్వగ్రామానికి బయలుదేరాడు. అమిత్ జాతీయ రహదారిలో బైక్‌పై భార్య మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. A video showing Amit transporting his wife's body tied to his motorcycle has gone viral on social media.#Wife #Accident https://t.co/wNwuj33TJk— News18 (@CNNnews18) August 11, 2025మొదట్లో అమిత్‌కు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే అతను భార్య మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన చాలా మంది అతని బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అమిత్ అందుకు నిరాకరిస్తూ, బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. హైవే పోలీసులు అమిత్ వాహనాన్ని గమనించి, ఆపమని కోరారు. అయినా అమిత్ వారి మాటను లేక్కచేయలేదు. కొంతదూరం వరకూ పోలీసులు అతని బైక్‌ను వెంబడిస్తూ ఎట్టకేలకు బైక్‌ను ఆపించారు. అనంతరం పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి తరలించారు. అలాగే అమిత్‌కు తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఈ ఘటన ప్రస్తుత కాలంలో అడుగంటుతున్న మానవత్వాన్ని ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు. -
ప్రియుడ్ని ఇంటికి పిలిచి.. దారుణంగా హత్య చేసిన మహిళ!
సాంభాల్: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాంభాల్‌లో మరో హత్యోందంతం వెలుగుచూసింది. నైతికత మరిచి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ప్రియుడ్ని పక్కా పథకం ప్రకారం అడ్డు తొలగించుకునే యత్నం చేసింది ఓ మహిళ, ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్, ;పట్టకారు సాయంతో హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల అనిష్ అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రూ. 7 లక్షలను సితార తీసుకుంది. ఆ సొమ్మును ఇవ్వాలని అనిష్ పదే పదే అడగడంతో సితార ప్రణాళిక రచించింది. అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్ అహ్మద్‌కు కూడా తెలిసినదే కావడంతో హత్యా రచన అనేది ఇద్దరూ కలిసే చేశారు. ఈ క్రమంలోనే అనిష్‌ను ఇంటికి పిలిచింది సితార. ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి స్క్రూ డ్రైవర్, ఇంటిలోని ఇతర వస్తువుల సాయంతో అనిష్‌ను హత్య చేశారు. వివాహేతర సంబంధమే కారణం..ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమె ఇంటికి తరుచు వస్తూ పోతూ ఉండే అనిష్‌ను అడ్డు తొలగించుకోవాలని సితార భావించింది. దీనిలో భాగంగానే ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం అనిష్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్యా భర్తల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకే..అయితే అనిష్ కుటుంబ సభ్యులు మాత్రం సితారతో వివాహేతర సంబంధం గురించి తమకు తెలియదని అంటున్నారు. ఆమె తమకు తెలుసున్న వ్యక్తి అని, ఆ క్రమంలోనే అనిష్ వద్ద నుంచి రూ. 7 లక్షలను అప్పుగా తీసుకుందని అంటున్నారు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకే తన కుమారుడు అనిష్‌ను పొట్టనపెట్టుకున్నారని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. చాలా దారుణంగా తన తనయుడ్ని హత్య చేశారని, డబ్బులు అడిగినందుకే ఇంత ఘోరానికి ఒడిగట్టారని, అంతకుమించి తనకు తెలియదని తండ్రి తెలిపారు. తన కుమారుడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పును అడగడానికి వెళుతున్నట్లు తమకు చెప్పాడని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. -
ఆలయంలో అజిత్ దంపతుల ప్రత్యేక పూజలు.. కాళ్లకు నమస్కరించిన భార్య!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత సినిమాలకు కాస్తా విరామం ప్రకటించారు. ఈ సమయంలో ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా అజిత్ తన భార్య షాలినితో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తన భార్యకు నుదుట తిలకం దిద్దారు. ఆమె కూడా అజిత్ కాళ్లకు నమస్కరించి భర్త ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఈ వీడియోను అజిత్ భార్య తన షాలిని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. నా హదయాన్ని కరిగించిందంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అజిత్, షాలిని 1999లో అమర్కాలం అనే మూవీ సెట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరు 2000 సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు స్వస్తి పలికింది. ఈ ఏడాది రెండు హిట్ తన ఖాతాలో వేసుకున్న అజిత్.. మరో మూవీని ఇంకా ప్రకటించలేదు. విరామం దొరికితే చాలు కారు రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు మన స్టార్ హీరో. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) Made for each other ❤️ The cutest duo ever - Thala Ajith & #Shalini Mam 🥰#AjithKumar #ShaliniAjithKumar pic.twitter.com/QqBfYXQjx9— AJITH FANS COMMUNITY (@TFC_mass) August 9, 2025 -
విశాఖలో ఆటీన్ రాణులు
విశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లే్ల పేకాట డెన్లు ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్‌గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్‌గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది.భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్‌గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
వంట బాగోలేదనడం వేధింపెలా అవుతుంది?
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఈ మధ్య ఆసక్తికరమైన తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నదే. తాజాగా.. బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కొట్టేసింది. ఈ క్రమంలో భార్య వంట బాగా లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని అనడం వేధింపుల కింద రాదని పేర్కొంది. 2022 మార్చిలో ఆ జంటకు వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. ఆమె భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ తరుణంలో తన భర్త, అత్తమామలు, భర్త తరఫు బంధువులపై 498A కింద కేసు పెట్టింది. ఈ కేసు చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. తన భర్త తాను వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని సూటిపోటి మాటలతో వేధించాడని ఆమె కోర్టులో వాపోయింది. పైగా భర్తకు శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం తన దగ్గర దాచారని, ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు.. బంధువులు హింసించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తనపై వేధింపులను ఆమె ఏరకంగానూ నిరూపించలేకపోయిందని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘భార్య దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం’’ అని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ సంజయ్ ఏ. దేశ్‌ముఖ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆమెకు ఇది రెండో వివాహం. 2013లో విడాకులు తీసుకున్న పిటిషనర్.. 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు "ఓమ్నిబస్" (సారవంతం లేని) విధంగా ఉన్నాయి. తగిన సాక్ష్యాలు లేకపోగా.. ఆమెవన్నీ అతిశయోక్తితో కూడిన ఆరోపణలనే అనే విషయం ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. వివాహానికి ముందు భర్త ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదని ఈమె చెబుతోంది. కానీ, ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అలాగే ఇల్లు కొనుగోలు కోసం డబ్బుకై వేధించారని చెబుతోంది. కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉంది. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముంది?.. వివాహ సంబంధం బలహీనపడినప్పుడే ‘వంట, దుస్తులు బాగోలేవనే..’ అతిశయోక్తులు జోడించబడతాయి. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సదరు భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
విశాఖలో ఆటీన్ రాణులు
విశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లే్ల పేకాట డెన్లు జూద క్రీడ అంటే టక్కున గుర్తొచ్చేది మగ మహరాజులే. ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్‌గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్‌గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది. భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్‌గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
యూఎస్‌లో డైరెక్టర్ సుకుమార్ దంపతులు (ఫోటోలు)
-
భార్య పేకాట ఆడుతుందంటూ భర్త ఫిర్యాదు
సాక్షి,విశాఖ: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట ముఠా గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పేకాట ఆడుతున్న మహిళలు స్థానికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆగడాల్ని తట్టుకోలేని పేకాట ఆడుతున్న ఓ మహిళ భర్త సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయారు. పేకాట ఆడటం.వాగ్వాదానికి దిగడం.. అడ్డు చెప్పిన వారిపై దాడులకు తెగబడ్డారు.ఈ క్రమంలో స్థానికులు వరుస ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
జూలై రౌండప్.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బుమ్రా భార్య సంజనా (ఫొటోలు)
-
పోలీసులా రాక్షసులా వాళ్ళు.. చంద్రబాబుపై అశోక్ బాబు భార్య ఫైర్
-
లవర్ తో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
-
ఆ భార్య బారి నుంచి దేవుడే రక్షించాడేమో!
ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్ బయటపడింది.భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్. అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్‌ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్‌కు కాల్ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్‌ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్.రాజీవ్ తండ్రి ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే.. -
హీరో భార్య 'అనొద్దన్న సెలబ్రిటీ వైఫ్'.. మిగిలిన హీరోల భార్యలు..?
ఓ పెద్ద నటుడు, మరీ ముఖ్యంగా అగ్ర హీరోల భార్యలుగా మారడం చాలా మందికి అదృష్టం కావచ్చు అయితే కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించడంలో మన మాధ్యమాలు తరచుగా విఫలమవుతుంటాయి. ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికి మాత్రమే పరిమితమైన గృహిణి ఆకాంక్షలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కూడా గడపదాటి తనను తాను నిరూపించుకుంటూ సాగిపోయే వివాహిత ఆకాంక్షలు మరోలా ఉంటాయి అనేది నిర్వివాదం. ఏ వ్యక్తి అయినా తాను సాధించిన విజయాలకు, ప్రత్యేకతలకు తగ్గ వ్యక్తిగత గుర్తింపును ఆశించడం సహజం. దీనికి మగ, ఆడ వ్యత్యాసం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా మళయాళ నటుడు ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ తాజాగా ఇచ్చిన ఒక సంచలనాత్మక ప్రకటన ప్రస్తావనార్హం.ప్రసార మాధ్యమాలతో పాటు అనేక మంది తనను తరచుగా ప్రృధ్వీరాజ్ భార్యగా పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను కేవలం ఒక టాప్ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు ‘పృథ్వీరాజ్ భార్య‘గా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు తన స్వంత కెరీర్లో ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఆమె తనకంటూ స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏ మగవాడికి సంబంధించి అయినా ‘అతని భార్య‘, ‘అతని తల్లి‘ లేదా ‘అతని కుమార్తె‘గా తగ్గిపోకూడదని ఆమె అంటున్నారు.పూర్వ జర్నలిస్ట్, ప్రస్తుత చిత్ర నిర్మాత, పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్‌కు సహ యజమాని అయిన సుప్రియా, ‘ఎల్2: ఎంపురాన్‘ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇవే కాక తన కంటూ స్వంత వృత్తిపరమైన విజయాలు ఉన్నప్పటికీ, నిరంతరం తన భర్త పేరుతోనే గుర్తించబడటం అనేది తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆమె ధైర్యంగా వెల్లడించడం హర్షణీయం.ఇలా ఒక అగ్రహీరో భార్య బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది నిజంగా ఒక గేమ్ ఛేంజర్ కావచ్చు. మహిళల స్వయం సాధికారత గురించి మాట్లాడే ఉపన్యాసాలు దంచే ఎందరో ప్రముఖులు వారి భార్యలు సాధిస్తున్న విజయాలను తమ సెలబ్రిటీ స్టేటస్ మాటున బలిచేస్తున్న పరిస్థితి ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు నటుల భార్యలు హీరోయిజం అనే షాడో మాటున తమని తాము కోల్పోకుండా వ్యక్తిగత విజయాల కోసం తపిస్తుండడం కనిపిస్తోంది. ఉదాహరణకు టాలీవుడ్ హీరో రామచరణ్ భార్య ఉపాసన, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ... వంటివారు వ్యక్తిగతంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్నారు. జీవిత భాగస్వామికి మాత్రమే కాదు తమ కష్టాల ఫలితంగా అందుకున్న తమ వ్యక్తిగత విజయాలకూ గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు.. అది.. మహిళ అయినా మగవారైనా.. -
కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!
వికారాబాద్: తనను వివాహం చేసుకుంటానని భర్త నుంచి దూరం చేసిన ప్రియుడు ఆ తర్వాత మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఈ విషయమై మంగళవారం తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనకు న్యాయం చేయాలని కోరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఇదే ఊరికి చెందిన మరో యువకుడు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం ఆమెను కర్ణాటకకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత సదరు యువతి భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పాడు. దీంతో యువతిని ఆమె భర్త వదిలేశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన సదరు వ్యక్తి, కాలయాపన చేస్తూ మోసం చేశాడని యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. ఇదిలా ఉండగా యువతి పీఎస్‌కు వచి్చన మాట వాస్తవమేనని పోలీసులు తెలిపారు. బుధవారం వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వెళ్లిపోయారని చెప్పారు. -
పాకిస్తాన్ భార్యను తోడ్కొని రావాలి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ హనుమాన్ బేణివాల్ సోమవారం రాత్రి సభలో వ్యాఖ్యలో పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ భార్యగా మారిపోయిందని, ఆ భార్యను మన ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘భీకర దాడులతో పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం. ఈ ఆపరేషన్‌కు సిందూర్ పేరుపెట్టారు. అంటే పాకిస్తాన్ నుదుటిపైనా సిందూరం అద్దినట్లే. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు పవిత్ర సిందూరాన్ని తమ భర్తగా భావిస్తారు. పాకిస్తాన్‌పై భారత్‌పై సిందూరం పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ధర్మపత్నిగా మారిపోయినట్లే. ఇక వధువును తోడ్కొనిరావడం ఒక్కటే మిగిలి ఉంది. దయచేసి మీరు(ప్రభుత్వం) వెళ్లి, పాకిస్తాన్‌ను ఇంటికి తీసుకురండి’’అని కోరారు. ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ సూచించగా, అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారని, తన ప్రసంగం రేపు పత్రికలో ప్రచురితం కాదని, ఇక సోషల్ మీడియాను మేనేజ్ చేసుకోవాల్సిందే అని హనుమాన్ బేణివాల్ చెప్పగా సభలో మరోసారి నవ్వుల విరిశాయి. -
ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం!
ఒక వ్యక్తికి పలువురు భార్యలున్న కథలు మనం చాలానే విని ఉంటాం.. ఈమధ్యే హిమాచల్ యువతి ఆచారం ప్రకారం అన్నదమ్ముల్ని మనువాడడం చూశాంమహాభారతంలోని ‘‘పాంచాలి.. పంచ భర్తుక’’ అన్నట్టు కాదు కానీ...ఒక మహిళకు ముగ్గురు భర్తలుండటం గురించి మీరెప్పుడైనా విన్నారా?విని ఉండరు లెండి. ఎందుకంటే ఆమె ఉండేది టాంజానియాలో మరి!. ఇక్కడో విశేషం ఏంటంటే.. ముగ్గురు భర్తలుండటం కాదు, వాళ్లందరి పోషణ బాధ్యత తనే తీసుకోవడం!. ఎంచక్కా.. ఎలాంటి కీచులాటలూ లేకుండా అందరూ ఒకే ఇంట్లో కాపురం కొనసాగిస్తూండటం!. ఆ విశేషాలేవో చూసేద్దాం రండి..నెల్లి... టాంజానియా సరిహద్దులోని ఒకానొక పట్టణంలో ఉంటోంది. కార్లు అమ్మడం, కొనడం వృత్తి. బాగా సక్సెస్ఫుల్ కూడా. ఎనిమిదేళ్ల కాలంలో ఈమె వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు కూడా ఒక భర్త ఉండేవాడు. కానీ.. ఓ కారు ప్రమాదంలో అతడు మరణించాడు. ఆ తరువాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది. కానీ.. మరణించిన భర్త తమ్ముడు హసన్ ఆమె పంచన చేరాడు. మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. కొంతకాలానికి ఈ వ్యవహారం కాస్తా ప్రేమకు ఆ తరువాత పెళ్లికి దారితీసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కొన్నేళ్లు గడిచాయో లేదో.. ఆమె జీవితంలోకి ‘జిమ్మీ’ ఎంటరయ్యాడు. ఇతగాడు అప్పట్లో బాగా డిప్రెషన్లో ఉండేవాడట. తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్‌తో బాధపడేవాడు. పాపం అనుకుందేమో నెల్లీ అతడిని రెండో మొగుడిగా స్వీకరించింది. ఇది జరిగిన కొంత కాలానికి నెల్లీకి డానీ పరిచయమయ్యాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు. దొరుకుతుందో లేదో అన్న బెంగ, దొరకదేమో అన్న అత్మనూన్యత భావం డానీని వెంటాడేవట. ఈ నేపథ్యంలో నెల్లీ అతడికి ధైర్యం చెప్పేది. ఆ తరువాత ఇతడిని మూడో భర్తగా స్వీకరించింది!అందరూ ఒకే ఇంట్లో..నెల్లీ, అమె ముగ్గురు భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకొక్కరికి ఒక్కో బెడ్రూమ్ కూడా ఉంది. ప్రస్తుత ముగ్గురు భర్తలూ నిరుద్యోగులు. దీంతో కార్ల డీలర్‌గా నెల్లీ సంపాదిస్తున్న దాంతోనే కుటుంబ నడుస్తోంది. ముగ్గురిలో ఎవరితో ఎంత సేపు గడపాలన్న విషయంలో నెల్లీ మాటే చెల్లుతుంది. వారానికి తగిన షెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతానంటోంది నెల్లీ. ‘‘ముగ్గురు భర్తలూ నాకు సమానమే. అందరినీ ఒకేలా చూసుకుంటా. వాళ్లు కూడా ఎంతో అనోన్యంగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కూడా’’ అంటుంది నెల్లీ. హసన్, జిమ్మీ, డానీలు కూడా తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు. ఈ ఏర్పాటు బాగానే ఉందని చెబుతున్నారు. ‘‘మగాడికి ఎక్కువ మంది భార్యలున్నప్పుడు లేని అభ్యంతరం.. ఒక మహిళకు ఎక్కువమంది భర్తలుంటే ఎందుకుండాలి?’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు జిమ్మీ. చిక్కులూ లేకపోలేదు..నెల్లీ వ్యవహారం టాంజానియాలో కొంతమేరకు చిక్కులు సృష్టించింది. చట్టం ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు కానీ.. బహుభర్తృత్వం(Polyandry) మాత్రం తప్పు. కేసు పెడితే నెల్లీకి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చునని టాంజానియా లాయర్ ఒకరు చెబుతున్నారు. అంతేకాదు.. నెల్లీ ఇరుగుపొరుగు కూడా ఈ వ్యవహారంపై చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. అయితే ఒక్కటైతే స్పష్టం. మానవ సంబంధాలన్నవి అంత సులువుగా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అని!!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
తల్లా? పెళ్లామా?
తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్‌ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.తనపై తన భార్య తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్ జోక్యం చేసుకుంది.మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది. -
గర్భిణీ భార్య హత్య.. ఇంట్లో మృతదేహం.. బయట భర్త నాటకం
సాక్షి,బెంగళూరు: ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. నువ్వులేకపోతే నేను లేనన్నాడు. కాదూ కూడదు అంటే చచ్చిపోతున్నాడు. చివరికి ఆమెను లేకుండా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను కడతేర్చాడు. ఆపై పరారయ్యాడు.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు శివం తన 22 ఏళ్ల గర్భవతి భార్య సుమనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.శివం, సుమన ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం, బెంగళూరుకు పారిపోయి వచ్చారు. బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శివమ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా.. సుమన ఇంట్లోనే ఉంటుంది. ఆమె మూడు నెలల గర్భిణీ.ఐదేళ్ల పాటు ప్రేమ,దోమ అంటూ సుమన వెంటబడ్డ శివమ్ పెళ్లి తర్వాత తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. అనుమానం పేరుతో సుమనను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇదే విషయమై సుమనపై శివమ్ చేయిచేసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఎవరికి వారు వేర్వేరు రూముల్లోకి వెళ్లి నిద్రించాడు. మరునాడు అంటే మంగళవారం ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో ఎప్పటిలాగే పనికెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. పూటగా మద్యం సేవించాడు. బుధవారం సైతం ఆమెను లేపేందుకు ప్రయత్నించగా అచేతనంగా పడి ఉండి.సుమన మరణించిందని నిర్ధారించుకొని ఇంటినుంచి పారిపోయాడు. అయితే,ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి సుమనపై అనుమానం పెంచుకున్న భర్త శివమ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. -
పడక సుఖం ఇవ్వని భర్తను..
భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో ఓ భార్య పక్కదారి పట్టింది. భర్తను అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో కట్టుకథ అల్లింది. కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు ఊరుకుంటారా?.. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టింది.జులై 20వ తేదీన నీహాల్ విహార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా ఖాన్(29) అనే మహిళ తన భర్త మొహమ్మద్ షాహిద్(32)ను హతమార్చింది. ఆపై ఏం ఎరగనట్లు భర్త మృతదేహంతో ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త ఆన్లైన్ రమ్మీలో డబ్బు పొగొట్టుకున్నాడని, అప్పుల బాధ భరించలేక కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని కన్నీళ్లు పెట్టుకుంది.అయితే షాహిద్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు.. గాయాలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె మొబైల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.సల్పాస్ మందుతో హత్య చేయడం ఎలా?.. చాట్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా? అనే అంశాలను ఆమె సెర్చ్ చేసినట్లు ఉంది. వీటి ఆధారంగా ఆమెను ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చలేకపోతున్నాడని, ఈ క్రమంలోనే తాను మూడుసార్లు కత్తితో పొడిచి హతమార్చానని చెబుతోంది. అయితే ఆమె ఎవరితో, ఏం చాటింగ్ చేసిందనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తకు నిద్రమాత్రలిచ్చి, ఆపై కరెంట్ షాక్ పెట్టి హతమార్చింది. ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటకు రావడంతో ఈ కేసు వెలుగు చూసింది. అందుకు సంబంధించిన కథనం కింది లింక్‌లో చదవండి.👇ఇదీ చదవండి: నా భర్త బతికే ఉన్నాడు.. నిద్ర వస్తోంది.. నువ్వు రా -
సతీమణి పుట్టినరోజు స్పెషల్.. రచ్చ రవి ఎమోషనల్ పోస్ట్
-
ప్రతి రోజు రాత్రి నా భార్య కాళ్లు మొక్కిన తర్వాతే నిద్రపోతా: నటుడు
పేరుకే ఆడమగ సమానం అని చెప్పినప్పటికీ, సమాజంలో చాలా చోట్ల ఇప్పటికీ పురుషాధిక్యత కొనసాగుతోంది. కొన్ని పనులు, ముఖ్యంగా గృహసంబంధిత బాధ్యతలు, సంతాన సంరక్షణ వంటివి స్త్రీలు మాత్రమే చేయాలనే సాంప్రదాయ ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయి. సంప్రదాయం పేరుతో వారిని అణచివేసే కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక నటుడు మాత్రం స్త్రీలను గౌరవించాలని మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాడు. ప్రతి రోజు రాత్రి తన సతీమణి పాదాలకు నమస్కరించిన తర్వాతే నిద్ర పోతాడట. తన కష్టసమయాల్లో తోడుగా నిలిచిన సతీమణికి ఇలా పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గర్వంగా చెబుతున్నాడు. ఆ నటుడు మరెవరో కాదు..‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రవి కిషన్(Ravi Kishan). తాజాగా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కోసం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ‘రవి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు భార్య ప్రీతి కిషన్ పాదాలను నమస్కారం చేస్తాడు’ అని చెప్పగా.. దీనికి రవి నవ్వుతూ అంగీకరించాడు.‘మీరు చెప్పింది నిజమే. ప్రతి రోజు రాత్రి నా భార్య పాదాలకు నమస్కారం చేస్తా. ఆమెకు ఇలా చేయడం నచ్చదు. అందుకే నిద్రపోయిన తర్వాత ఆమె పాదాలను తాకుతా. నా జీవితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా భార్య ఎంతగానే అండగా నిలిచింది. డబ్బు, పలుకుబడి లేనప్పుడు కూడా నా పక్కనే నిలబడింది. ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం నా భార్య మాత్రమే. అంత చేసిన ఆమెకు నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను. అందుకే కనీసం పాదాలను తాయి అయినా కృతజ్ఞతతలు తెలపాలనుకున్నా’ అని రవి కిషన్ ఎమోషనల్ అయ్యాడు. రవి కిషన్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం, ఆమె పట్ల చూపే గౌరవాన్ని చాటడం అందరినీ ఆకట్టుకుంది.కాగా, రవి, ప్రీతిల వివాహం 1993లో జరిగింది. వీరికి నలుగురు సంతానం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంగానే దూసుకెళ్తున్నాడు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయయ్యాడు. బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించాడు. -
ఓ మహిళ పశ్చాత్తాప స్టోరీ : ‘భర్తలూ మిమ్మల్ని మీరే కాపాడుకోండయ్యా!’
ఇటీవలి కాలంలో భర్తలపై భార్యల హత్యాకాండలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అలాగే మహిళపై హింసకు వ్యతిరేకంగా, రక్షణకోసం తీసుకొచ్చిన గృహహింస చట్టం, 498ఏ చట్టాలు దుర్వినియోగ మవు తున్నాయనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు బాధితులుగానే ప్రపంచానికి తెలిసిన మహిళా లోకం ఎందుకు తిరగబడుతోంది? ఎందుకు ఇలా వికృతంగా మారుతోంది అనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఒక మహిళ స్టోరీ నెటిజన్లను తీవ్రంగా కదిలిస్తోంది. అదేంటో తెలుసుకుందామా!రెడ్డిట్‌లో మర మహిళ పోస్ట్ ప్రకారం ఈ స్టోరీలోని మహిళది ప్రేమ వివాహం , ఇద్దరు పిల్లలు. చక్కగా సజావుగా సాగుతున్న కాపురమే. కానీ ఆమె భర్తతో జరిగిన చిన్న గొడవ , ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆమె క్షణికావేశాన్ని తండ్రి , సోదరుడు వాడుకున్నారు. భర్త మీద వరకట్నం, గృహ హింస కింద కేసు నమోదు చేయమని ఆమెను బలవంతం చేశారు. ఈమె కూడా మరేమీ ఆలోచించకుండా భర్తపై తప్పుడు కేసు పెట్టింది. విచారణల అనంతరం నాలుగేళ్లకు ఇరువురూ విడి పోయారు. కానీ భర్తతో విడిపోయే దాకా ఆమెను రెచ్చగొట్టిన సొంత తల్లిదండ్రులు, సోదరుడు, భార్య ఇప్పుడు ఆమెతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పడుగానీ ఆమెకు తత్త్వం బోధపడలేదు. అసలు విషయం తెలిసి వచ్చి.. తప్పు చేశానని పశ్చాత్తాపడింది. భర్తకు క్షమాపణ చెప్పాలని ఆలోచించింది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 37 ఏళ్ళ వయసులో ఆమె భర్త మళ్లీ వివాహం చేసుకున్నాడు. ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు“నా భర్త వద్దకు వెళ్లి అతనిపైనా, అతని కుటుంబంపైనా పెట్టిన అన్ని కేసులకుగాను క్షమాపణ చెప్పాలని అనుకున్నాను. కానీ అతను వివాహం చేసుకున్నాడు. జీవితంలో పూర్తిగా ఫెయిలయ్యాను” అని ఆ మహిళ రాసుకొచ్చింది. దీనిపై నెటిజనులు మిశ్రమంగా స్పందించారు. జరిగిన విషయంపై మహిళకు సానుభూతి తెలిపారు. ‘ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది, ధైర్యంగా ఉండండి’ అని ఒకరు ధైర్యం చెబితే, మరొకరు అన్యాయంగా కష్టాలు పడ్డ భర్తపై సానుభూతి వ్యక్తం చేశారు.‘మీకు తోడు నీడగా, కంఫర్ట్ జోన్‌గా ఉండాల్సిన భర్తను చాలా బాధపెట్టారు. గాయపరిచారు. పగవాళ్లకి కూడా మీ భర్తలాంటి కష్టం రాకూడదు’ అని మరొకరు కమెంట్ చేశారు. బంధువులు కాదు రాబందులు అంటూ ఒకరు, తల్లిదండ్రులు తోబుట్టువులను తప్పుబట్టారు. దగ్గరి బంధువులెవరైనా ఇంత మోసపూరితంగా ఎలా ఉంటారు అసలు? అంటూ మరి కొందరు వారి కుటుంబ సభ్యులను నిందించారు.చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం“భారతీయ భర్తలూ/పురుషులూ : ఇటువంటి మోసగాళ్లనుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్న ఒక యూజర్ వ్యాఖ్య వైరల్‌గా మారింది.తప్పుడు కేసులు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 మహిళలపై నేరాలను పోలీసుల డేటా ప్రకారం, మొత్తం 34,662 కేసులు తప్పుడు కేసులుగా తేల్చారు. ఇందులో భర్త లేదా అతని బంధువులు చేసిన క్రూరత్వం కింద 7,076 కేసులు, అత్యాచారం కేసులు 4,340 మరియు మహిళలపై దాడి కింద 6,821 కేసులు ఆమె నమ్రతను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉన్నాయి. అలాగే, కిడ్నాప్ మరియు అపహరణ కింద 8,588 కేసులు కూడా తప్పుడు కేసులుగా ముగిశాయి.ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే! -
భర్త ఇంటికి మొదటి భార్య నిప్పు
కర్ణాటక: విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటికి మొదటి భార్య నిప్పంటించింది. ఈ విడ్డూరం దొడ్డ పట్టణ పరిధిలోని కొంగాడియప్ప కళాశాల వెనుక ఇంట్లో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికుడు గౌతమ్ అనే వ్యక్తి కలహాల కారణంగా భార్యతో విడిపోయాడు. ఇద్దరూ కోర్టులో విడాకుల కేసు వేసుకున్నారు. కేసు నడుస్తున్న క్రమంలో గౌతం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య వచ్చి, విడాకులు కాకుండానే ఎలా పెళ్లి చేసుకున్నావని అతనితో గొడవపడింది. ఇరువైపుల వారు మాట్లాడుతుండగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆగ్రహం పట్టలేని మొదటి భార్య ఇంటికి నిప్పంటించినట్టు అనుమానాలున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రాత్రి 11కి ఎవరితో మాట్లాడుతున్నావ్..!
వికారాబాద్: ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ (33)కు ఇదే మండలం కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఈశ్వర్ ప్రసాద్ (10), సుకుమార్ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, ఎస్ఐలు రాథోడ్ వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. -
భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?
సాక్షి,బెంగళూరు: భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్‌కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్‌పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గం మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్‌ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది.నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది.ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.అయితే, ఇదే కేసులో భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. In #Karnataka's Yadagiri, a wife pushed her husband into the river on the pretext of taking a selfie.The couple got married 2 months ago, the husband had gone to his mother's house to pick up his wife, while returning,1/2 pic.twitter.com/u0N8xK8QLI— Siraj Noorani (@sirajnoorani) July 16, 2025 -
భర్తను చంపేసి ఇంట్లో టైల్స్ కింద పాతిపెట్టి..!
మనకు దృశ్యం సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది మాత్రం అందులో మర్డర్ సీన్ చుట్టూ తిరిగిన ఓవరాల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చి సుమారు దశాబ్దకాలం పూర్తి కావొస్తున్నా.. ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయి మరీ చూసేస్తూ ఉంటాం. అందులో హీరో చేసిన హత్య.. ఆపై ఆ శవాన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ కిందే పాతిపెట్టడం సినిమాకే హైలైట్. అక్కడ తన కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని తండ్రి చంపి మొత్తం కేసునే తప్పుదోవ పట్టిస్తూ సీన్లు అల్లిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇది సినిమా కాబట్టి ఆసక్తికరం అనిపిస్తోంది. మరి నిజ జీవితంతో జరిగితే వామ్మో అనే పరిస్థితి.మరి, ఇదే దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది ఓ మహిళ. భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. లవర్‌తో కలిసి మరీ భర్తను హత్య చేసి టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. ఇది మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల విజయ్ చావన్, 28 ఏళ్ల కోమల చావన్‌లు భార్యా భర్తలు. ముంబైకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వీరి జీవితంలోకి ఒక ‘ లవర్’ వచ్చాడు. కోమలకు ప్రియుడు.. విజయ్‌కు యముడు మాదిరి వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతని పేరు మోను. కోమల, మోను కలిసి విజయ్ను చంపేశారు. అంటే కోమల తన భర్త విజయ్ను మోనుతో కలిసి అంతమొందించింది. మరీ ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచన చేస్తే.. ఇంట్లోనే టైల్స్ కిందే శవాన్ని పూడ్చిపెట్టేందని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే చేసేశారు. ఆ తర్వాత కోమల, మోనులు కలిసి ‘లాంగ్ టర్మ్ హనీమూన్’( వేరే చోటకి పరార్) వెళ్లిపోయారు. అయితే విజయ్ సోదరునికి అనుమానం వచ్చి ఇంటికి రాగా, అక్కడ తాళం వేసి ఉంది. ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అన్నను చంపేసిన వదిన.. ఆ ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టందనే విషయాన్ని తెలుసుకుని షాక్ తిన్నాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు. -
లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)
-
నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్‌తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్‌షాక్‌కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్‌లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్‌తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్‌ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్‌కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్‌తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్‌తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025 -
‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్ ఫేం పోస్ట్ (ఫొటోలు)
-
రష్యన్ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్‌కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్, నావీ పోర్ట్ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్‌లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్‌లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు. -
భార్య రాసిన మరణ శాసనం.. ప్లాన్ చేసి కార్ తో గుద్ది..!
-
Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్
-
బామ్మర్ది భార్యతో బావ వివాహేతర సంబంధం..!
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అసలు జరిగింది ఇదీ..ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎస్ఎన్ మోటార్స్‌లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్‌తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్ఎన్ మోటార్స్ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు. గొడవలు ఇలా..స్వాతి సోదరుడు మహేశ్‌కు ఇద్దరు భార్యలు. మహేష్ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్‌కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్‌కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్‌కు వివరించింది. సాయికుమార్ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్ వివాహేతర సంబంధానికి మహేష్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్ నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటుస్వామిని హత్య చేయడానికి సాయికుమార్, స్వాతి, మహేష్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్ డిలీట్ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్ నంబర్‌ను కూడా సెల్ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. కారు అద్దెకు తీసుకుని..ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేష్‌కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్‌పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్‌పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్‌కు çస్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మహేష్, స్వాతి, సాయికుమార్ వాట్సాప్ గ్రూప్ కాల్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్, రామలింగస్వామిని బైక్‌పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.నిందితుల అరెస్ట్గుంటి సాయికుమార్, స్వాతి, పొట్టెపాక మహేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శంకర్‌గౌడ్, మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్‌యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కారుతో.. కదిలిన డొంకరోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్ ఆధారంగా కారు యజమానికి ఫోన్ చేసి విచారించగా.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్ సెల్‌ఫోన్ చెక్ చేయగా స్వాతి నంబర్ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు. -
డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)
-
భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య
సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్,ఓదెలకు చెందిన మోటం మల్లేష్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. -
నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు. -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్‌ఘడ్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్‌గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
భార్య విడాకులు.. పాలతో స్నానం చేసిన భర్త
-
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
కడప జిల్లా: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది.. అయితే తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని రెండవ భార్య అందరిని నమ్మించింది. భర్త మృతి విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారించారు. ఇది ఆత్మహత్య కాదు, రెండవ భార్య చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించి రెండో భార్యను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా..ఖాజీపేట మండలం అప్పనపల్లె గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసులు యాదవ్ (50)కు 30 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన నక్కా లక్ష్మిదేవితో వివాహమైంది. భార్యతో గొడవల కారణంగా ఆమెకు తెలియకుండా చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నక్కా సునీత (35)ను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని తప్పుడు ధ్రువ పత్రాలను చూపించాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య లక్ష్మి దేవి తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న శ్రీనివాసులు యాదవ్‌పై కేసు పెట్టింది. కోర్టులో ఈ కేసు నడుస్తోంది.మొదటి భార్య ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి..శ్రీనివాసులు యాదవ్ జూన్ 11వ తేదీన మృతి చెందాడు. తన భర్త మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ మొదటి భార్య లక్ష్మిదేవి జులై 1వ తేదీన ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ మోహన్ కేసు నమోదు చేశారు. జులై 2న శ్రీనివాసులు యాదవ్ మృతదేహాన్ని రిమ్స్ డాక్టర్లు, తహసీల్దార్ సమక్షంలో వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి తల వెనుక భాగంలో బలమైన గాయం ఉందని ఈ గాయం కారణంగా చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అప్పనపల్లె గ్రామంలో లోతైన విచారణ జరిపారు.భర్త అసభ్యకరమైన ప్రవర్తన కారణంగానే హత్య..మృతుడు శ్రీనివాసులు యాదవ్ మద్యం మత్తులో పిల్లల ఎదుటే భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులు గుర్తించారు. దీంతో రెండవ భార్య విసుగు చెందేది. జూన్ 11న ఇద్దరు పిల్లలు బయట ఉండగానే ఇంట్లోకి తాగి వచ్చి భార్య పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. భార్య తోసేయడంతో మంచం కోడికి తల తగిలి కింద పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసులు తిరిగి పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతను పైకి లేస్తే తనను చంపుతాడని భావించిన భార్య సునీత మంచం కోడికి తల పట్టుకుని కొట్టింది. దీంతో అక్కడికక్కడే స్పహ తప్పి పడిపోయాడు.హత్యను ఆత్మహత్యగా..తన భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న భార్య సునీత తీవ్ర ఆందోళన చెందింది. దీంతో ఇంట్లో పిల్లలను ఊయల ఉపే తాడుతో మృతదేహానికి ఉరి వేసింది. ఆ తర్వాత ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వారు వచ్చి చూసే సరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అందరిని నమ్మించింది. శరీరంపై ఎలాంటి రక్తగాయాలు గానీ దెబ్బలు గానీ పెద్దగా లేకపోవడంతో అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించారు. జూన్ 12న అంత్యక్రియలు పూర్తి చేశారు.నిందితురాలి అరెస్టుమొదటి భార్య ఫిర్యాదు మేరకు జులై 2న పోస్టుమార్టం నిర్వహించినప్పటి నుంచి రెండో భార్య సునీత పరారీలో ఉంది. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకుని అప్పనపల్లె పంచాయతీ సెక్రటరీ ద్వారా జులై 12న పోలీసుల ఎదుట లొంగిపోయింది. పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రెండవ భార్య సునీతను ఖాజీపేట సీఐ మోహన్ శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. -
ప్రియుడితో భార్య జంప్.. పాల స్నానంతో భర్త సంబరాలు
భార్య నుంచి విడాకులు పొందానన్న ఆనందంతో ఓ భర్త సంబరాలు చేసుకున్నాడు.. అక్కడితో ఆగలేదు.. ఇక తాను స్వేచ్ఛాజీవినంటూ 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకులను నాలుగు బకెట్ల పాల స్నానంతో వేడుక చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీకి భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ భార్యభర్తలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇంటికి చేరుకున్న భర్త.. పాలతో స్నానం చేసి సంతోషంతో ఎగిరి గంతేశాడు.తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడంటూ చెప్పుకొచ్చిన మాణిక్ అలీ.. తనతో పెళ్లై ఓ బిడ్డ జన్మించినా కానీ.. ఆమె తీరు మారలేదని.. తన ప్రియుడితో వివాహేతర బంధం కొనసాగించిందని తెలిపాడు.. తనను, తన బిడ్డను వదిలేసి ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని.. ఇలా.. ఒక్కసారి కాదు రెండు సార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు.మొదటిసారి తప్పు చేసినప్పుడు తన బిడ్డ కోసం ఆమెను క్షమించానని చెప్పాడు. మా కుటుంబం శాంతి కోసం తాను మౌనంగా ఉన్నానని.. మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని మాణిక్ అలీ తెలిపారు. విడాకులు తీసుకున్నాక.. కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని.. ఈ రోజు నుండి తాను విముక్తి పొందానని.. కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానంటూ మాణిక్ అలీ చెప్పాడు. -
ఫొటో తీస్తానని.. నదిలోకి నెట్టేసి..
కృష్ణా: కొత్తగా పెళ్లయిన జంట.. బైక్‌పై వెళ్తూ మాంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. వారు వెళ్తున్న దారిలో కృష్ణానదిపై గుర్జాపూర్ బ్రిడ్జి వచి్చంది. అదే మంచి స్పాట్ అనుకొని ఫొటోలు దిగటానికి సిద్ధమయ్యారు. భర్త తన భార్యకు ఫోన్ ఇచ్చి.. తనను ఫొటోలు తీయాలని కోరి వెళ్లి బ్రిడ్జి అంచున నిలబడ్డాడు. భార్య కూడా ఫొటోలు తీస్తూనే భర్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతన్ని నదిలోకి తోసేసింది. బిక్కచచ్చిపోయారు భర్త నీళ్లలో పడి కొట్టుకుపోతూ.. నదిలో ఓ రాయిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడి కేకలు విని జాలర్లు రక్షించి పైకి తీసుకొచ్చారు. అయితే, భార్యే తనను నదిలోకి తోసిందని భర్త చెబుతుండగా, లేదులేదు.. అతడే నదిలో పడిపోయాడని భార్య వాదిస్తోంది. ఏం చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో నారాయణపేట జిల్లాలో ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ప్రమాదమా? హత్యాయత్నమా? కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్‌కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మ (20)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్‌పై వడిగేరికి వెళ్లి శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్‌ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచి్చన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు. -
సెల్పీ దిగుదాం రా బావా..!
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్‌చూర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్‌కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx— Yasir Mushtaq (@path2shah) July 12, 2025 -
లవర్‌తో దిగిన ఫోటోలు భర్త ఫోన్లో ఉండిపోవడంతో.. భార్య ఏం చేసిందంటే..!
న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్ తీసుకుని లవర్‌తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలనే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్ మ్యాప్ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్‌కు ఏ రూట్లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్ టైమింగ్స్ అన్ని షేర్ చేసింది. భర్త ఫోన్లో లవర్‌తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్‌తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్‌తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది. ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్ గోహ్లత్ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్‌తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.దాంతో అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్) డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది. -
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే?
బెంగళూరు: ఓ భర్త.. భార్య ముక్కును కొరికేసిన ఘటన కర్ణాటకలోని దేవనగరిలో కలకలం సృష్టించింది. అప్పు చెల్లింపు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో భార్య ముక్కును కొరికాడు. భార్య విద్య అప్పు తీసుకోగా, భర్త విజయ్ పూచీకత్తు ఇచ్చాడు. విద్య.. కిస్తీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.మంగళవారం జరిగిన ఈ గొడవలో భార్యపై దాడి చేశాడు.. ఆమె నేలపై పడిపోగా.. తర్వాత విజయ్ ఆమె ముక్కును కొరికేశాడు. ఆమెను స్థానికులు వెంటనే చిన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పరిధి ఆధారంగా దావణగేరె జిల్లా చిన్నగిరి పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. -
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు. తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు. పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు. -
అడవిలోకి తీసుకెళ్లి.. ఆలిని హతమార్చాడు
ఆదిలాబాద్ టౌన్: అనుమానం పెనుభూతమై ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్ పట్టణం సుందరయ్యనగర్‌కు చెందిన హింగోలి శంకర్‌కు ఇంద్రవెల్లిలోని నర్సాపూర్‌కు చెందిన వందన (45)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్లు పైబడిన ఇద్దరు కుమారులు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుండగా, ఆయన భార్య గృహిణి. సాఫీగా సాగిన వీరి సంసార జీవితంలో భార్యపై అనుమానం శంకర్‌లో అశాంతి రేపింది.టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఆరోగ్యం బాగాలేదని, క్షుద్రపూజలు చేయిస్తానని, ఆయుర్వేద మందు తాగిస్తానని చెప్పి ఈనెల 2న శంకర్ ఆదిలాబాద్ నుంచి వందనను బస్సులో తీసుకెళ్లాడు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతం (మహారాష్ట్ర సరిహద్దు)లోకి తీసుకెళ్లి చెట్లకు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నట్లు నటించాడు. వెంట తెచ్చుకున్న కారంపొడిని వందన కళ్లలో చల్లాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా బండరాయితో తలపై బాదాడు. దీంతో రక్తపు మడుగులో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మ నాన్న తిరిగి రాకపోవడంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు.శనివారం రాత్రి కూతురు ప్రియాంక టూటౌన్లో ఫిర్యాదు చేయగా, అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డితో పాటు పోలీసులు వెళ్లి చూడగా ఆమె మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
జగన్ పేరు చెప్తే.. కోటి రూపాయలు..! బట్టబయలైన లోకేష్ కుట్ర
-
వంశీని చంపేందుకు కుట్ర.. పోలీసులకు భార్య పంకజశ్రీ లేఖ
-
సింగయ్య లేచి వచ్చి చెప్పిన.. అది కూడా మేనేజ్ అంటారేమో చంద్రబాబు
-
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్‌లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
జూలూరుపాడు/ఖమ్మం క్రైం: భర్త పోలీసు శాఖలో ఎస్సై, బావ కూడా అదే ఉద్యోగం.. మామ సైతం రిటైర్డ్ పోలీసు అధికారి. సమాజంలో ప్రజల కష్టాలు తీర్చే ఉద్యోగుల ఇంటికి కుమార్తెను ఇస్తే బిడ్డ జీవితం బాగుంటుందని భావిస్తే వివాహేతర సంబంధాల పేరిటే కాక రకరకాల కారణాలతో వేధిస్తుండడంతో ఆమె తనువు చాలించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోతు రాణాప్రతాప్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన రాజేశ్వరి(34)కి 2018లో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.40 లక్షలతో పాటు, 35 తులాల బంగారం, మరో రూ.4లక్షల విలువైన కానుకలను ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉండగా.. కొన్నాళ్ల నుంచి భర్తతో పాటు అత్తామామలు పుష్పరాణి – చంద్రం, బావ మహేష్ (ఎస్సై, మహబూబాబాద్ వీఆర్) రాజేశ్వరికి వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నట్లు సమాచారం. కాగా, రాణాప్రతాప్‌కు ఖమ్మం జీఆర్పీ ఎస్సైగా పోస్టింగ్ రావడంతో భార్యాపిల్లలను జూలూరుపాడులోనే ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే, కుటుంబీకుల వేధింపులు తాళలేక రాజేశ్వరి జూలూరుపాడులోని అద్దె ఇంట్లో జూన్ 25న పురుగుల మందు తాగగా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది.మామపై దాడి..హైదరాబాద్ నుంచి రాజేశ్వరి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈక్రమాన రాణాప్రతాప్ తండ్రి చంద్రయ్య మార్చురీ వద్దకు రావడంతో తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో జూలూరుపాడు, ఖమ్మం టూటౌన్ పోలీసులు అడ్డుకుని ఆయనను టూటౌన్‌కు తరలించారు. ఘటనపై మృతురాలు తండ్రి సోమ్లా ఫిర్యాదుతో రాణాప్రతాప్, పుష్పరాణి, చంద్రం, మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్ఐ రవి తెలిపారు. కాగా, రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేష్ మొదటి నుంచీ వివాదాస్పదులుగానే ఉన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపాన ఓ చెప్పుల షాపు యజమానిపై కొన్నాళ్ల క్రితం అకారణంగా దాడి చేసిన రాణాప్రతాప్ తుపాకీతో బెదిరించాడు. ప్రస్తుతం ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
నా భర్త నిర్దోషి.. పూర్ణ భార్య సంచలన వీడియో
-
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్‌లో న్యూస్‌రీడర్, యాంకర్‌గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్‌పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
ముక్కలు చేస్తా అంటూ భర్తకు భార్య మాస్ వార్నింగ్
-
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
అన్నానగర్: వివాహేతర సంబంధం నడుపుతుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు. చెన్నై సమీపంలోని పెరుంబాక్కంలో ఉన్న హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అపార్ట్మెంట్లో నివసిస్తున్న జాహీర్ హుస్సేన్ (39)కు సుప్రియ భేగం(26) భార్య ఉంది. వీరు ఉత్తర రాష్ట్రానికి చెందినవారు. వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. దీంతో ఆగ్రహించిన జాహీర్ హుస్సేన్, సుప్రియా బేగంపై దాడి చేసి, గొంతు నులిమాడు. అప్పుడు ఆమె స్పృహ తప్పింది. దీంతో వెంటనే ఆమెను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, సుప్రియభేగం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు జాహీర్ హూస్సెన్ను అరెస్టు చేసి, విచారించారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, మందలించిన వివాహేతర సంబంధాన్ని వదులకపోవడంతో ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. -
పెళ్ళాం టార్చర్ కు మరో భర్త బలి
-
నాలోని దుష్టశక్తి పోవాలని నా భార్య అలా చేస్తుంది: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తెగ ప్రమోషన్లు చేస్తున్న విష్ణు.. ఒకటి రెండు రోజుల్లో శ్రీకాళహస్తిలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్‌ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ రంగన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సినిమా అంటే నాకు ఇష్టం. 'కన్నప్ప' కూడా నా పరంగా అలాంటి మూవీనే. అలానే నేను హార్డ్ కోర్ హిందువుని.. నా భార్య క్రిస్టియన్. ఆమె రోజూ బైబిల్ చదువుతుంది. అలానే రోజూ నిద్రపోయేటప్పుడు నా తలగడ కింద బైబిల్ ఉంచుంది. నాలోని ఏవైనా దుష్టశక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఆమె నమ్మకం. దేవుడు అన్నిచోట్ల ఉంటాడు. కాకపోతే గుడికి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?) ఇప్పటివరకు వచ్చిన 'కన్నప్ప' సినిమాల్లో క్లైమాక్స్ ఒక్కటే అయినా.. అంతకు ముందు సన్నివేశాల్ని మాత్రం ఎవరికి వాళ్ల ఊహలకు తగ్గట్లు తెరకెక్కించారని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. దాదాపు 50 ఏళ్ల తర్వాత, ప్రస్తుత జనరేషన్‌కి చూపించేందుకు తాను 'కన్నప్ప' తీశానని, శివుడి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని విష్ణు అన్నాడు.భారీ బడ్జెట్‌తో తీసిన 'కన్నప్ప'లో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా.. సినిమాపై కూడా కాస్తోకూస్తో అంచనాలు ఉన్నాయి. గతవారం థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' హిట్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆ జోష్ని 'కన్నప్ప' కూడా కొనసాగిస్తుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష) " I'm a HARDCORE HINDU and my wife is a Christian.She reads the Bible and puts it under my head in the bed, because she believes that the devil in me will leave."- #VishnuManchu | #Kannappa pic.twitter.com/nT3cPqKtSS— Movies4u Official (@Movies4u_Officl) June 23, 2025 -
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్‌కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా! -
‘కక్ష సాధింపునకే బాబు సర్కార్ తప్పుడు కేసులు’
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద నిరసన నిర్వహించారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసనకు దిగారు. చెవిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యమంటూ నినాదాలు చేశారు. ‘‘రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు- అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు" అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఈ ర్యాలీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏనాడు బయటకు రాని వాళ్లం మేము ఈరోజు మీడియా ముందుకు బాధతో రావాల్సిన పరిస్థితి...చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన తప్పా.. గత పదేళ్లు మేము చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసింది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలకు దిగింది’’ అని చెవిరెడ్డి సతీమణి లక్ష్మి పేర్కొన్నారు. -
ప్రియునితో పట్టుబడిన భార్య.. ముక్కు కొరికిన భర్త
హర్దోయ్: వివాహమైన తరువాత ఏర్పడే అక్రమ సంబంధాలు ఎటువంటి పరిస్థితులకైనా దారి తీస్తుంటాయి. భార్యాభర్తలలో ఏ ఒక్కరు దారితప్పి నడిచినా, వారి మధ్య కలహాలు ఏర్పడుతుంటాయి. యూపీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ పరిధిలో గల ఒక గ్రామానికి చెందిన రామ్ ఖిలావన్ తన భార్యను ఆమె ప్రియునితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తరువాత ఆగ్రహంతో ఆమె ముక్కును బలంగా కొరికివేశాడని హరియావన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య తీవ్రవాగ్వాదం జరిగిందని, ఆమె ప్రియుని ముందు భర్త ఆమె ముక్కును కొరికాడని పోలీసులు తెలిపారు.ఆమె రోదనలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన మహిళను హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు లక్నోలోని వైద్య కేంద్రానికి తరలించారు. ఈ కేసులో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు -
పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?
నాకు పెళ్లయి 20 ఏళ్లవుతోంది. ఒక పాప..16 ఏళ్లు. బాబు..14 ఏళ్లు. పెళ్లి నాటికి నాకు ఇరవై ఏళ్లు. నా భార్యకు పదహారేళ్లు. గత కొన్నేళ్లుగా మా ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. విడాకులు ఇచ్చి నాకున్న ఏకైక ఇంటిని తన పేర రాసివ్వాలని, లేకపోతే తన మైనార్టీ తీరకముందే లైంగికంగా లొంగదీసుకుని, బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు కేసు పెడతానంటూ బెదిరిస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఏం చేయమంటారు? – శ్రీహరి, కర్నూలుబాల్యవివాహాల నిరోధక చట్టం, 2006 ప్రకారం ఒక మేజర్ పురుషుడు ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి చేసుకున్న పురుషుడికి అలాగే ఆ పెళ్లి జరిపించిన పెద్దలకు, ఆ పెళ్లి జరగాలని ్ర΄ోత్సహించిన వారికి కూడా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లక్ష రూ΄ాయల వరకు జరిమానా ఉంది. ఈ చట్టం ప్రకారం పెళ్లికి పురుషులకైతే చట్టబద్ధమైన వయసు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ వివాహ చట్టం ప్రకారమైనా, బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారమైనా.. బాల్య వివాహం జరిగితే సదరు అమ్మాయి తనకు ఇరవై ఏళ్లు నిండేలోపు కోర్టును ఆశ్రయించి తన వివాహం చెల్లదని దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మైనర్‌గా ఉన్నప్పుడు కూడా ఒక ప్రతినిధి ద్వారా, మిత్రుల సహాయంతో, బాల్యవివాహాల నిరోధక అధికారి ద్వారా కూడా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా? 20 ఏళ్లు నిండిన తర్వాత వివాహ రద్దుకు ప్రస్తుత చట్టం అంగీకరించదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వైవాహిక సంబంధం కొనసాగించిందని చట్టం భావిస్తుంది. ఇరవై ఏళ్ల వైవాహిక బంధం, సంతానం కూడా కలిగిన తర్వాత మీపై పోక్సో కేసు వేసే ఆస్కారం లేదు! వివాహం కాకుండా ఉండి ఉంటే అది వేరే సంగతి! బలవంతపు పెళ్లి చేశారనే ఆస్కారం కూడా లేదిప్పుడు. ఎందుకంటే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12 (2) ప్రకారం కూడా బలవంతపు పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామితో వైవాహిక సంబంధం కొనసాగిస్తే ఆ బలవంతం/మోసపూరితమైన అంగీకారం అనే కారణాలపై వివాహాన్ని రద్దు చేయడం కుదరదు. మీరిద్దరూ కలిసి ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ని కలవండి. సమస్యలు పరిష్కారం కాకపోతే సామరస్యంగా విడిపోయే ప్రయత్నం చేయండి. లాయర్‌ను సంప్రదించి మీకున్న అవకాశాలు, హక్కులను తెలుసుకోవడం కూడా మంచిదే! – శ్రీకాంత్ చింతల,హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
భర్తకు తుది వీడ్కోలు: కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కడసారి దర్శించుకున్న భార్య అంజలి రూపానీ కన్నీంటి పర్యంత మయ్యారు. సోమవారం జరిగే అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని గౌరవ సూచికంగా త్రివర్ణ పతాకం కప్పి ఊరేగింపు నిర్వహించారు. ఆయనకు కడసారి నివాళులర్పిస్తున్న సమయంలో ఆయన భార్య అంజలి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అక్కడే ఉన్న ఆమె కుమారుడు ఆమెను ఓదార్చిన దృశ్యాలు చూసిన వారి కళ్లు చెమర్చకమానవు.విజయ్కుమారుడు రుషాభ్ రూపానీ తన తండ్రి అంత్యక్రియల సమయంలో దుఃఖిస్తున్న తల్లిని ఓదార్చిన హృదయ విదారకమైన దృశ్యాలు నెటిజన్లు, పార్టీ శ్రేణులను కంట కన్నీరుపెట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయ్ రూపానీ మరణం పట్ల గుజరాత్ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4— ANI (@ANI) June 16, 2025తండ్రి అకాలమరణంపై కుమారుడు రుషాభ్ రూపానీ మాట్లాడుతూ, ఇది తన కుటుంబానికి మాత్రమే కాదు, ఈ విషాదకరమైన సంఘటనలో ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా దుఃఖకరమైన సమయం అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి విజయ్ గురించి మాట్లాడుతూ, 50-55 సంవత్సరాలుగా, తన తండ్రి ప్రజల కోసం పనిచేశారని, వారందరూ తమ కష్ట సమయంలో తమకు అండగా వారి పక్కనే ఉన్నారని రుషాభ్ పేర్కొన్నారు.#WATCH | Former Gujarat CM Vijay Rupani's last rites begin with state honours in Rajkot. He died in the #AirIndiaPlaneCrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ— ANI (@ANI) June 16, 2025 కాగ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఒకరు. ఆరు నెలల తర్వాత తన భార్య అంజలిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి లండన్‌కు వెళ్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్యవిజయ్ రూపానీ - అంజలి రూపానీ విజయ్ రూపానీ- అంజలి రూపానీ ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పనిచేశారు. ఈ పరిచయం నేపథ్యంలోనే అంజలి, విజయ్ 1980లో సాంప్రదాయ హిందూ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అంజలి అధికారికంగా ఎలాంటి బాధ్యతల్లో లేనప్పటికీ, బీజేపీ మహిళా మోర్చాకు సీనియర్ నాయకురాలిగా రాజకీయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరి చిన్న కుమారుడు పూజిత్ 3ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు. ఇపుడీ వయసులో భర్త దూరం కావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
విశాఖలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను డంబుల్తో కొట్టి చంపేశాడు.. భార్యను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణమమని పోలీసులు అంటున్నారు.తమ్ముడి చేతిలో అన్న హతంమరో ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలా జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను కట్టెతో తలపై తమ్ముడు కూన రాములు విచక్షణారహితంగా కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వరంగల్‌లో దారుణం.. భర్త గొంతు కోసిన భార్య
సాక్షి, వరగల్: వరంగల్ నగరంలో దారుణ ఘటన జరిగింది. భర్త గొంతును భార్య కోసేసింది. దుబాయ్ వెళ్లి సంపాదించాలని భర్తపై ఒత్తిడి చేసింది. దుబాయ్ వెళ్లనందుకు భర్తపై హత్యాయత్నం చేసింది. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఎంజీఎంలో మృత్యువుతో రెహమాన్ పోరాడుతున్నాడు. గత కొద్దిరోజులుగా రహమాన్‌ను భార్య కుటుంసభ్యులు వేధిస్తుండగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సమ్మర్ జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న బన్నీ భార్య (ఫొటోలు)
-
ఏపీలో ఘోరం: కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా..!
తాడేపల్లి రూరల్ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు.. దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
పక్కా ప్లాన్ తో భర్తను హత్య చేసిన భార్య
-
భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త.. కారణం ఏంటంటే?
బెంగళూరు,సాక్షి: బెంగళూరు సమీపంలో ఒళ్లు గగూర్పొడిచే సంఘటన చోటు చేసుకుంది. అనేకల్ ప్రాంతంలోని హీలాలిగె గ్రామంలో నివసిస్తున్న ఓ యువకుడు తన భార్యను నరికి, ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయిన ఘటన కలకలం రేపింది.28 ఏళ్ల శంకర్ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య మానసను తల నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్, మానస దంపతులు కొంతకాలంగా హీలాలిగె గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ తన పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మానస మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి శంకర్ తీవ్రంగా కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, మానస పుట్టింటికి వెళ్లింది.అయితే, ఆ తర్వాత కొన్ని రోజులు మానస తిరిగి ఇంటికి వచ్చి శంకర్‌ను వేధించినట్లు సమాచారం. హత్యకు ముందు రోజు కూడా ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 6 రాత్రి శంకర్ తాను మానసను హత్య చేసి, ఆమె తల నరికి, నేరుగా సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడే తాను హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శంకర్, తలను కూడా పోలీసులకు చూపించాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు రూరల్) సీకే బాబా మాట్లాడుతూ...రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో భార్యను తలను నరికి స్టేషన్‌కు తీసుకువచ్చాడు. మానసకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గత వారం రోజులుగా ఈ దంపతులు తరచూ గొడవపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, శంకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ మహేశ్ విట్టా (ఫొటోలు)
-
వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. -
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి ప్రసవం
భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆ ఆస్పత్రులపై నమ్మకం పెరిగేలా అడుగు ముందుకేశారు. ఆయన భార్య శ్రద్ధ గర్భం దాల్చినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేరి్పంచగా సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్ నేతృత్వాన వైద్యులు సరళ, అనూష, హెడ్ నర్సు రేవతి బుధవారం ఉదయం 10.03 గంటలకు ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు. కలెక్టర్ దంపతులకు ఇప్పటికే కుమారుడు ఉండగా, రెండో కాన్పులోనూ పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఆస్పత్రికి చేరుకున్న కలెక్టర్ తన కుమారుడిని ఎత్తుకుని మురిసిపోవడమే కాక వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉన్నందున ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. అభినందనలు తెలిపిన మంత్రులు కలెక్టర్ జితేష్ పాటిల్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్విట్టర్లో ఆయనను ప్రశంసించారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబీకులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. -
ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!
ఉద్యోగం మానేయమని చెప్పానని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది! తను ఉద్యోగం చేస్తే ఎవరిమాటా వినడం లేదనే ఉద్యోగం మానిపించాం. మళ్లీ తిరిగి వచ్చాక ఎలాగోలా మానిపిద్దాము అనుకుంటే నేను తాగుతున్నాను అనే వంకతో తిరిగి రానంటోంది. ఇప్పుడు నాకు కూడా తనంటే ఇష్టం పోయింది. ఏం చేయమంటారు? – పవన్ కుమార్, రాజమండ్రిమీరు వెంటనే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. మీలాంటి పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తితో ఎవరూ ఉండకూడదు. మీ నుంచి ఆవిడకి విముక్తి అవసరం. భర్తని తన తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకోవడం క్రూరత్వం అని చాలా సందర్భాలలో కోర్టులు ఎలాగైతే చెప్పాయో, భార్య చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనుకోవటం, భర్త – అత్తామామల ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనుకోవడం కూడా అలాగే ‘గృహ హింస’ కిందకి వస్తాయి. ఆవిడా మీరు వద్దని అంటోంది కాబట్టి సామరస్యంగా మాట్లాడుకొని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ (పరస్పర అంగీకార విడాకులు) తీసుకుని మిమ్మల్ని మీరు కేసులనుండి కాడుకోవటం మంచిది.నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నెలసరి వడ్డీకి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద సంతకాలు, సాక్షుల సంతకాలు తీసుకున్నాను. అయితే అతను అసలు వడ్డీ కట్టకపోగా అసలు కూడా ఇవ్వడం లేదు. అతనికి, అతని భార్యకి, పిల్లలకి కూడా ఆస్తులు ఉన్నాయి. ఎంత అడిగినా ‘నేను చెక్కులు కూడా ఇవ్వలేదు కదా ఏం చేసుకుంటావో చేసుకో’ అంటున్నాడు. నా డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారమే లేదా? – ఎస్డీ. జహంగీర్, హైద్రాబాద్మీరు డబ్బులు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది అని చెప్తున్నారు కాబట్టి మీరు సివిల్ కోర్టును ఆశ్రయించి అతనిపై దావా వేయవచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతను మిమ్మల్ని మోసం చేశాడు అనడానికి ఏదైనా ఆధారం లేదా రుజువు చేసే పత్రాలు ఉంటే ΄ోలీసులను ఆశ్రయించి క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే వీలు ఉంది. మీ లేఖలో రాసిన దాని ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావు అని చెప్పలేము. అలాగే కచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పలేము. మీ దగ్గర ఉన్న పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, మీ ఆర్థిక స్థితిగతులు చూపించడానికి వీలు ఉండే ఏదైనా ఆధారాలు తీసుకొని ఒక లాయర్ గారిని కలవండి. అన్నీ పరిశీలించిన తర్వాత మీ కేసులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..) -
సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
-
ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్‌ఆర్‌పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
రచ్చకెక్కిన డాక్టర్‌బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్‌పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఆమె డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!. -
900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్ దంపతులు.. లండన్ ప్రిన్సెస్‌తో డిన్నర్ (ఫోటోలు)
-
శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)
-
చనిపోయిన భార్యకు గుడి కట్టించిన భర్త
కొరుక్కుపేట(తమిళనాడు): అరియలూరుకి చెందిన ఓ ఎలక్ట్రీషియన్ తన భార్య జ్ఞాపకార్థం గుడి కట్టించి, పూజలు చేస్తున్నాడు. అరియలూర్‌కు చెందిన విజయకుమార్, కవిత అనే మహిళను 16 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారి వివాహం తర్వాత, అతను కవితను కాలేజీకి తీసుకెళ్లి, చదివించాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ, కవిత తన భర్త విజయకుమార్‌ను ‘ఆసియుమ్మ‘ (కోరిక) అని పిలుస్తూనే ఉంది. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ, వారి తల్లిదండ్రుల నుంచి కఠినమైన మాటలకు గురయ్యారు. ఒక సమయంలో ఆమె తన భర్త విజయకుమార్‌తో కలిసి తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లారు. 2022లో, తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన కవిత, కృత్రిమ గర్భధారణ శస్త్రచికిత్స చేయించుకుంటున్న సమయంలో ఔషధం అధిక మోతాదు కారణంగా మరణించింది. రోజులు గడిచే కొద్దీ, భార్యపై అతనికి ప్రేమ తగ్గలేదు. ఆమెతో గడిపిన రోజులను లెక్కించుకుంటూ జీవిస్తున్న విజయకుమార్, తన ప్రియమైన భార్యకు గుడి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఇలంగేరి గ్రామంలో తన భార్య కవితకు ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. నాలుగు రోజులకొకసారి, విజయకుమార్ పనికి వెళ్లే ముందు, ఆమెకు పూజలు చేస్తున్నాడు. విజయకుమార్ ను అతని అత్తమామలు, బంధువులు మళ్లీ వివాహం చేసుకోమని చెప్పినప్పటికీ, తన భార్య కవితతో తన జీవితం ముగిసిందని, కానీ ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని చెబుతాడు. ఆయన మాట్లాడుతూ కవిత తనతో చాలా ప్రేమగా ఉండేదన్నారు. ఆ అభిమానానికి అవధులు లేవన్నారు. తనకు పిల్లలు లేకపోయినప్పటికీ, అది తమకు చాలా పెద్ద విషయం, తాము ఒకరికొకరు పిల్లలుగానే జీవించామని చెప్పారు. View this post on Instagram A post shared by Thanthi TV (@thanthitv) -
డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!
మధిర: మధిరలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క మంగళవారం మామిడి పచ్చడి తయారు చేశారు. ఏటా బంధువులతో పాటు కార్యాలయ ఉద్యోగులు, గన్మన్ల కోసం ఆమె పచ్చడి తయారుచేసి అందించడం దశాబ్దకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం స్థానిక మహిళలతో కలిసి పచ్చడి సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్ -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి. -
వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..
-
జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది. -
భార్య చూపిన అమితమైన ప్రేమకు భర్త ఫిదా..!
బెళుగుప్ప(అనంతపురం): లగ్జరీ జీవితం ఆమె కల. పెళ్లి పేరిట ఆ కల నెరవేర్చాలనుకుంది. ఇందుకు దివ్యాంగుడైన వ్యక్తిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంది. అనుకున్న విధంగా నగదు, నగలు, కారు సమకూర్చుకున్న తర్వాత.. భర్తతో గొడవ పెట్టుకుని ఉడాయించింది. అవసరాలన్నీ తీర్చి బికారిగా మారిపోయిన భర్త.. తన భార్య మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. బెళుగుప్ప మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీం ఫయాజ్ దివ్యాంగుడు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ ద్వారా ప్రయత్నాలు చేస్తుండగా.. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షబానా నచ్చింది. అటువైపు నుంచి కూడా సుముఖత వ్యక్తం చేయడంతో అనంతపురంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనంతపురంలోనే ఓ ఇంటిని తీసుకుని కాపురం పెట్టారు. నమ్మించి.. వంచించి.. భార్య చూపిన అమితమైన ప్రేమకు భర్త ఫిదా అయిపోయాడు. ఆమె సంతోషం కోసం ఏది అడిగినా కాదనలేకపోయేవాడు. అలా తన మాట చెల్లుబాటు అవుతున్న సమయంలో షబానా తన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చింది. మొదట తన అక్క జరీనా కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భర్త ఫయాజ్ పేరిట రూ.30 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంది. ఆయన వేతనం నుంచి 2024 ఫిబ్రవరి నుంచి రూ.60 వేల చొప్పున ఈఎంఐ కట్ అవుతూ వస్తోంది. ఆ తర్వాత అనంతపురంలోని సొంతింటిని కూడా విక్రయించి రూ.40 లక్షలు తీసుకుంది. దీంతో ఏడాదిగా బెళుగుప్పలోని అద్దె ఇంటికి మకాం మార్చారు. ఈ క్రమంలోనే అనంతపురంలో ఫయాజ్ పేరున ఉన్న ప్లాట్‌ను సైతం విక్రయించి రూ.7 లక్షలు తీసుకుంది. అలాగే సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ఐదు తులాల బంగారు నగలు కొనుగోలు చేయించింది. రాకపోకలకు అనువుగా ఉండాలని రూ.6 లక్షల విలువైన కారు కొనుగోలు చేయించింది. ఇలా తన అవసరాలు తీర్చుకున్న తరువాత గత నెల 28న బెళుగుప్పలోని నివాసంలో గొడవపడిన షబానా.. ఆ మరుసటి రోజే (29న) తన తల్లిదండ్రులు షమి, అలీ, అక్క జరీనాను పిలిపించి దివ్యాంగుడైన భర్తను ఇంట్లోనే బంధించి.. సామగ్రిని వాహనంలో వేసుకుని కారుతో సహా తెనాలికి వెళ్లిపోయింది. విలాసవంతమైన జీవితానికి అవసరమైన డబ్బు కోసం తనను వాడుకుని వంచనకు గురి చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫయాజ్ బెళుగుప్ప పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ మంగళవారం మీడియాకు తెలిపారు. -
భార్య ప్రసవం కోసం వచ్చి
యశవంతపుర(కర్ణాటక): ఎంతో కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశప్రజల ప్రాణాలు కాపాడుతున్న జవాన్లు సెలవుల్లో ఇళ్లకు వచ్చారు. అయితే అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ నుంచి పిలుపురావడంతో ఉన్నఫళంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు. చెల్లెలు పెళ్లి కోసం వచ్చిన జవాన్‌కు ఆర్మీ అధికారుల నుంచి అత్యవరసమైన పిలుపు రావటంతో కుటుంబసభ్యులు జవాన్‌కు సింధూరం దిద్ది విధులకు పంపించారు. ఈ ఘటన బీదర్‌లో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా భాల్కీ తాలూకా చందాపుర గ్రామానికి చెందిన బసవకిరణ బీరుదార పంజాబ్ అమృత్‌సర్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 27న చెల్లెలు పెళ్లి కారణంగా సెలవుపై చందాపుర వచ్చాడు. ప్రస్తుతం భారత్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న కారణంగా సెలవులు రద్దు చేసుకొని విధులకు రావాలని ఆర్మీ అధికారులు అత్యవసరమైన సందేశం పంపారు. దీంతో చందాపుర గ్రామస్తులు జవాన్ బసవకిరణకు సింధూర తిలకరం దిద్ది, హారతి పట్టి విధులకు సాగనంపారు. భారత సైన్యంలో పని చేస్తున్న జవాన్లకు అక్కా చెల్లెళ్ల అశీర్వాదం ఉంటుందని బసవకిరణ చెల్లెలు వచనశ్రీ తెలిపారు. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసి హతం చేయటం విజయంగా భావిస్తున్నట్లు వచనశ్రీ సంతోషం వ్యక్తం చేశారు. భార్య ప్రసవం కోసం వచ్చి భార్య ప్రసవం కోసం స్వగ్రామానికి వచ్చిన జవాన్ ఉన్నత అధికారుల ఆదేశాలతో తిరిగి విధులకు వెళ్లాడు. కలబురిగికి చెందిన హనమంతరాయ సీఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య స్నేహ ప్రసవం తేదీ దగ్గర పడటంతో ఏడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్య పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది. ఈ సంతోషంలో ఉండగానే కశీ్మరు నుంచి పిలుపు వచ్చింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వెంటనే విధులకు రావాలని చెప్పారు. దీంతో బాలింతగా ఉన్న భార్య, ఏడు రోజుల నవజాత శిశువునుంచి వీడ్కోలు తీసుకొని దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశసరిహద్దులకు బయల్దేరి వెళ్లాడు. స్నేహితులు, బంధువులు బరువైన హృదయాలతో వీడ్కోలు పలికారు. -
డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
తిరువొత్తియూరు(తమిళనాడు): భర్తను మోసం చేసి భార్య రెండో వివాహం చేసుకుంది. భార్య మరొకరిని వివాహం చేసుకున్న దృశ్యం ఇన్స్టాగ్రామ్ లో చూసిన భర్త ఆవేదన చెందాడు. తన భార్యను విడిపించాలని పోలీసులకు మొర పెట్టుకున్నాడు. కన్యాకుమారి జిల్లా మైలాడి ప్రాంతానికి చెందిన మురుగేషన్ కుమారుడు అజిత్ కుమార్ తాపీ మేస్త్రి. ఇతనికి ఇతనికి కుల శేఖరం సమీపంలో తుంబకోడు ప్రాంతానికి చెందిన అభిషా(22) అనే యువతితో గత 2022వ సంవత్సరం వివాహమైంది. దంపతులిద్దరూ కులశేఖరంలో ఉన్న అభిషా ఇంటిలో ఉంటున్నారు. పిల్లలు లేరు. ఈ క్రమంలో అభిషా అరుమలై సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనికి చేరింది. అభిషా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటూ అక్కడే పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గత 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాను ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పి వెళ్లిపోయింది. దీంతో 6వ తేదీ అజిత్ కుమార్ భార్యకు ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అజిత్‌కుమార్ ఆసుపత్రిలో విచారణ చేయగా ఆమె ఎవరో బంధువులకు ఆరోగ్యం సరిలేదని 16 సంవత్సరాల యువకుడితో వెళ్లిందని తెలిపారు. దీంతో 7వ తేదీన అరుమనై పోలీస్ స్టేషన్లో అజిత్ కుమార్ తన భార్య అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అజిత్‌కుమార్ స్నేహితుడు అతనికి ఒక వీడియో పంపిస్తాను చూడు అని, ఇన్‌స్ర్ట్రాగామ్ వీడియో ఒకటి పంపాడు. అది చూసిన అజిత్‌కుమార్ దిగ్భ్రాంతి చెందాడు. అందులో తన భార్య మరొక యువకుడిని వివాహం చేసుకున్న దృశ్యం ఉంది. దీంతో అజిత్‌కుమార్ భార్య చేసిన పని చూసి బోరున వినిపించాడు. అజిత్‌కుమార్ తర్వాత పోలీసులకు ఈ వీడియోను చూపించి తన భార్యను విడిపించాలని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. -
నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని గ్లామరస్ స్టిల్స్ (ఫొటోలు)
-
అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
భార్యకు సీమంతం చేసిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
ట్రోలింగ్‌పై సీరియస్
పహల్గాం ఉగ్రదాడిలో 26మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో.. నేవీ అధికారి అయిన తన భర్త వినయ్ నర్వాల్ మృతదేహం వద్ద భార్య హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఆ ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) తీవ్రంగా స్పందించింది.న్యూఢిల్లీ: నేవీ అధికారి వినయ్ భార్య హిమాన్షిపై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడిలో ఎంతో మంది చనిపోయారు. లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్‌ను మతం అడిగి మరీ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. అయితే వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గం.కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దారుణం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అలా కామెంట్లు చేయడం సరికాదు అని ఎన్సీడబ్ల్యూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా గౌరవాన్ని, ఔనత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని పేర్కొంది. మరోవైపు.. కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఉదంతంపై స్పందించారు. నేవీ అధికారి వినయ్ నర్వాల్ స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ముస్లింలు లేదా కశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని... శాంతి, న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గానీ, కశ్మీరీలకు గానీ వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. "మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. కచ్చితంగా మాకు న్యాయం జరగాలి" అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ, తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలకు గానూ సోషల్ మీడియాలో ఆమెను కొందరు నిందిస్తూ పోస్టులు చేయసాగారు.గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్డీ స్కాలర్. కేవలం కొద్ది వారాల క్రితమే, ఏప్రిల్ 16న ఆమెకు నేవీ అధికారి వినయ్ నర్వాల్‌తో వివాహం జరిగింది. ఏప్రిల్ 19న రిసెప్షన్ అనంతరం, వారు హనీమూన్ కోసం కశ్మీర్‌లోని పహల్గామ్కు వెళ్లారు. అయితే, ఏప్రిల్ 22న వారు సేదతీరుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వినయ్ నర్వాల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం వద్ద హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వినయ్ నర్వాల్ అంత్యక్రియలను హర్యానాలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హిమాన్షిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త శవపేటిక వద్ద హిమాన్షి సెల్యూట్ చేసిన దృశ్యాలు పలువురిని కదిలించాయి. जम्मू-कश्मीर के पहलगाम में हुए आतंकी हमले में देश के अनेक नागरिकों की हत्या कर दी गई थी। इस हमले में अन्य लोगों के साथ लेफ्टिनेंट विनय नरवाल जी से उनका धर्म पूछकर उन्हें गोली मार दी गई थी। इस आतंकी हमले से पूरा देश आहत व क्रोधित है। लेफ्टिनेंट विनय नरवाल जी के मृत्यु के पश्चात…— Vijaya Rahatkar (@VijayaRahatkar) May 4, 2025 -
రామ్ చరణ్ మదర్ ఆవకాయ పచ్చడి.. మరో స్పెషల్ అంటూ మెగా కోడలు ఉపాసన పోస్ట్ (ఫోటోలు)
-
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
సాక్షి, క్రైమ్: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. -
ప్రభుత్వాస్పత్రిలో పెద్దపల్లి కలెక్టర్ భార్య ప్రసవం
కోల్ సిటీ (రామగుండం): ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన సతీమణి విజయకు గో దావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ప్రసవం చేయించారు. శనివారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు రావడంతో వెంటనే జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు సిజేరియన్ చేయగా 3.6 కిలోల మగబిడ్డకు కలెక్టర్ భార్య జన్మనిచ్చారు. ఆమెకు ఇది రెండో కాన్పు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన సతీమణి గర్భం దాల్చినప్పటి నుంచి గోదావరిఖని జీజీ హెచ్‌లోనే పరీక్షలు చేయిస్తూ వచ్చారు. కలెక్టర్ తీరు ఇతర అధికారు లకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచిందని.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేశారంటూ ఆస్పత్రి వైద్యాధికారులు కలెక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన సతీమణికి సిజేరియన్ చేసిన వైద్య బృందం గైనిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అరుణతోపాటు డాక్టర్ లక్ష్మి, అనెస్తీషియా డాక్టర్ భానులక్ష్మిని కలెక్టర్ అభినందించారు. -
కట్టుకున్న భార్యలను కడతేర్చారు..
కలకాలం కాపురం చేస్తామని చేసిన బాసలు మరిచిన ఆ ఇద్దరు భర్తలూ భార్యల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కోపం పెంచుకున్న ఓ భర్త అదనుచూసి సహచరిని అంతం చేయగా, ఆడపిల్లలను కనిందన్న కోపంతో భార్యను హత్య చేశాడు మరో భర్త. నమ్మించి మెడ కోశాడు..గుడిహత్నూర్: కలహాల కాపురంతో విసిగిపోయిన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సహించలేకపోయిన భర్త ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. నాలుగు రోజులు అత్తింటి వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నమ్మించాడు. గురువారం కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్‌కు చెందిన లట్పటే మారుతికి ఇదే గ్రామానికి చెందిన కీర్తి (28)తో 2012లో వివాహం జరిగింది. మారుతి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై కీర్తి పలుమార్లు భర్తను నిలదీసింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఇటీవల కీర్తి తన ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కక్ష పెంచకున్న మారుతి తన భార్యను అంతమొందించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అత్తగారింటికి వచ్చి వారితో మర్యాదగా ప్రవర్తించాడు. గురువారం ఉదయం కీర్తి తాగునీటి కోసం ఇంటి సమీపంలోని నల్లా వద్దకు వెళ్లగా, మారుతి వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తి మెడపై దాడి చేసి పారిపోయాడు. రిమ్స్‌కు తరలించేలోపే ఆమె మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ తెలిపారు.ఆడపిల్లలు పుట్టారని హతమార్చాడు..కాగజ్‌నగర్ రూరల్: మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవ పడి తలపై దాడి చేసి చంపాడు. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజిరి గ్రామానికి చెందిన డోకే జయరాంకు ఆసిఫాబాద్‌కు చెందిన భీంబాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఓ కూతురు పుట్టగా, మగసంతానం లేదని జయరాం కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్‌కు చెందిన పోషక్కను (40) 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా ఇద్దరూ కూతుళ్లే రవళి (12), గౌతమి (6) పుట్టారు. దీంతో మగపిల్లలు లేరని జయరాం తరచూ ఇద్దరు భార్యలతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా రెండో భార్య పోషక్కతో గొడవ జరిగింది. ఆవేశానికి గురైన జయరాం పలుగుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోషక్క అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనస్థలాన్ని కాగజ్‌నగర్ ఇన్చార్జి సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో దారుణం.. భార్య, అత్తపై అల్లుడు దాడి
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. క్యాబ్ డ్రైవర్ మహేష్.. శ్రీదేవి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో శ్రీదేవి తల్లి మంగ తన కూతురును చూసేందుకు ఇంటికి రాగా, అయితే మహేష్, శ్రీదేవిల మధ్య మరోసారి గొడవ జరిగింది. వారిని గొడవ పడొద్దని మంగ వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ తన భార్య శ్రీదేవి, అత్త మంగపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీదేవి స్వల్పంగా గాయపడగా.. ఆమె తల్లి మంగ తీవ్రంగా గాయపడింది. ఆమెను మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. -
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!
నేటి కాలంలో భార్యా భర్తల సంబంధాల్లో ఆస్తులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేసిన బంధాల్ని చిదిమేస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వేట మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అబ్బాయికి ఎంత ఉంది(ఆస్తి).. అమ్మాయి ఎంత స్త్రీ ధనం(కట్నం) తెచ్చుకుంటుందనే తతంగం మరీ ఎక్కువైపోయింది. అసలుకంటే కొసరు ముద్దు అనే చందంగా తయారైంది. అది చివరకు వైవాహిక బంధాలు నాశనం కావడానికి కూడా కారణమవుతోంది. తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త. భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎటావాలో 33 ఏళ్ల ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య నుంచి ఎలా వేధింపులకు గురయ్యాడో వీడియో రికార్డ్ చేసి మరీ తనువు చాలించాడు. మోహిత్ యాదయ్‌కు ప్రియా అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఏడేళ్ల పాటు రిలేషనలో ఉన్న వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచీ అమ్మాయి తల్లి.. వీరి కాపురాన్ని శాసిస్తూ వస్తోంది. చివరకు భార్య ప్రియ గర్బవతి అయినా కూడా అబార్షన్ చేయించిందట అత్త. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన అత్త తీసుకెళ్లిపోయిందని మోహిత్ రికార్డు చేసిన వీడియో ద్వారా తెలిసింది.చనిపోయి ముందే మోహిత్ చెప్పిన మాటలు..‘ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని నా భార్య తరచు వేధింపులకు గురిచేస్తోంది. ఇల్లు, ఆస్తి అంతా తన పేరునే రాయాలట. మా అమ్మా, నాన్నలపై కూడా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆమె తండ్రి చేత ఒక తప్పుడు కేసు పెట్టించింది. నా భార్య సోదరుడు నా బావమరిది నన్ను చంపుతానని పదే పదే బెదిరిస్తున్నాడు. రోజూ ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంది నా భార్య, ఆమె తల్లి దండ్రులకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.అమ్మా నాన్న క్షమించండి.. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లి పోతున్నా. నాకు న్యాయం జరిగాలి. నా చావుతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా బూడిదను డ్రైన్ లో కలిపేయండి’ అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు.ఇదీ చదవండి: నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు -
Viral: అబ్బాయి జీతం రూ.2.50 కోట్లు ఉండాలి.. పిల్లలు వద్దు!, వధువు 18 కోరికల చిట్టా
అమ్మా..! సుధా(పేరు మార్చాం) బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. మా వయసు మీద పడిపోతుంది. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలని మీ నాన్న కంగారు పడుతున్నారు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. సంబంధాలు వెతుకుతాం అంటూ జానకి తన కూతురికి విజ్ఞప్తి చేసింది. తల్లి విజ్ఞప్తితో ఏమో అమ్మా.. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నా పెళ్లి నీ ఇష్టం అని చెప్పడంతో నా బంగారు తల్లి అనుకుంటూ భర్త భూషణ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఏవండోయ్ సుధా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది.. మనోళ్లు ఉన్నారు కదా మంచి సంబంధం చూసి పెట్టమనండి అంటూ వంటింట్లోకి వెళ్లిన జానకి గుక్కెడు పంచదారను భర్త భూషణం నోట్లు కుమ్మరించింది. భార్య జానకి మాటలకు సంబరపడిపోయిన భర్త నాగభూషణం కుమార్తె సుధాకు పెళ్లి సంబంధాలు చూసేందుకు పక్కూరు తన పెద్దమ్మ పార్వతమ్మ ఇంటికి బయల్దేరాడు. ఈ స్టోరీ వినడానికి ఎంత బాగుంది.కానీ అదే సుధని పెళ్లి సంబంధాలు చూస్తాం. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పమ్మా అంటూ అడిగిన తల్లిదండ్రులకు ఎలాంటి కోరికలు లేవంటూనే తనకు కాబోయే వరుడిలో 18 రకాల కోరికలు ఉండాలంటూ తన కోరికల చిట్టా విప్పితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఓ యువతి విషయంలో అలానే జరిగింది. పేరు, ఊరు వెలుగులోకి రాలేదు. కానీ ఆమె కోరికల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఆ కోరికల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జీతం ఏడాదికి 3లక్షల డాలర్ల సంపాదించాలి (మన కరెన్సీలో దాదాపు రూ.2.5 కోట్లు!)జెనరస్, స్పాయిల్‌గా ఉండాలి. అంటే భోజనం, ప్రయాణం, ఫ్యాషన్ ఇలా ప్రతీది కాస్ట్లీగా ఉండాలిలగ్జరీ లైఫ్ ఇష్టపడాలి (ఫైన్ డైనింగ్, ట్రావెలింగ్, వైన్ టేస్టింగ్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్)నన్ను నిజంగా ప్రేమించాలి. అన్ని విషయాల్లో నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలిఎమోషనల్ ఇంటెలిజెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండాలినైట్ ఎప్పుడైనా బయటికి వెళితే షాడోలా నన్ను వెన్నంటే ఉండాలిఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం, దూర దృష్టితో కష్టపడి పనిచేసే వ్యక్తి కావాలికుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇష్టమైన వారితో గడపడం. తరచుగా కుటుంబ విలువలు, సంప్రదాయాలు బాధ్యతలకు ప్రాముఖ్యత ఇవ్వాలిసోషల్ మీడియాలో షో ఆఫ్ వద్దు. ప్రైవసీ ఇష్టంశృంగారం విషయంలో నమ్మకంగా ఉండాలి.నాకు పిల్లలు వద్దు .. ఆవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పని,వంట పని ఇలా అన్నింట్లో సహాయపడే వ్యక్తే జీవిత భాగస్వామి కావాలని పోస్టులో పేర్కొంది. She sent me a list of her requirements. One of them includes a salary of $300k+byu/New_Ambassador2442 inTinder -
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
‘కష్టాల్లో, సుఖాల్లో భర్తకు తోడుగా’ అంటుంటారు. కష్టాలు, సుఖాల్లోనే కాదు... వృత్తిలోనూ భర్తకు తోడూ నీడగా ఉంటుంది జ్యోతి. భర్త డ్రైవర్, భార్య క్లీనర్!జ్యోతి ఎందుకు క్లీనర్ కావాల్సి వచ్చింది? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... లారీ డ్రైవర్ అయిన భర్త శోభనాద్రి దూరప్రాంతాలకు వెళుతుండేవాడు. ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా‘ఎక్కడ ఉన్నాడో... ఏం తింటున్నాడో’ అని ఎప్పుడూ భర్త గురించి బెంగగా ఉండేది. అందుకు తగ్గట్టే డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన భర్త బక్కచిక్కి కనిపించే వాడు.ఒకరోజు అడిగింది...‘నేను నీతోపాటే వస్తాను’‘మరి ఇల్లు?’ అన్నాడు భర్త.‘బండే మన ఇల్లు’ అన్నది ఆమె. ఇక ఆరోజు నుంచి బండే వారి ఇల్లు, బండే స్వర్గసీమ. లారీ ఎక్కడికి కిరాయికి వెళ్లినా క్లీనర్‌గా జ్యోతి భర్త వెంటే వెళుతుంది. లారీలోనే వంట సామగ్రి ఏర్పాటు చేసుకుని, మార్గ మధ్యంలో భర్తకు అవసరమైన భోజనం, టీ, అల్పాహారం వంటివి ఏర్పాటు చేస్తుంది. గతంలో దూర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో సరైన భోజనం లేక శోభనాద్రి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. భర్త వెంట వెళితే ఇబ్బందులు ఉండవని జ్యోతి భావించింది. రాత్రి పూట భర్త డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర రాకుండా ఉండేందుకు భర్తతో ముచ్చట్లు పెడుతూ అతడిని అప్రమత్తం చేస్తుంటానని చెబుతోంది జ్యోతి. కోళ్ల దాణా, ధాన్యం, బొగ్గు, మొక్కజొన్న వంటివి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు రవాణా చేస్తుంటామని, భార్య తోడు రావడం వల్ల ఇంటి బెంగ కూడా ఉండదని శోభనాద్రి చెబుతున్నాడు.చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!‘పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. బాధ్యతలు తీరిపోయాయి. ఇక మా ఇద్దరి జీవనం ఇలా కలిసిమెలిసి సాగిపోతోంది’ అని భార్యాభర్తలు చెబుతున్నారు. వీరిది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం.జి.వి.వి. సత్యనారాయణ, సాక్షి, కొవ్వూరు -
తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు (ఫొటోలు)
-
పుజారా చాలా మొండివాడు.. రాజ్‌కోట్ వీధుల నుంచి ఇక్కడిదాకా (ఫొటోలు)
-
‘కేన్సర్.. మనీ వేస్ట్’ : రియల్టర్ ఎంత పనిచేశాడు!
కేన్సర్ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్‌ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్ వ్యాధి నివారణలో ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం. ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయ్.ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి (46) తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే తనకు కేన్సర్ వ్యాధి సోకిందని, ఎంత డబ్బు ఖర్చు చేసినా అది నయం కాదని భయపడిపోయాడు. అందుకే ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్దీప్ తన భార్యను లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో కాల్చి చంపి, ఆపై నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఇంట్లో తనను తాను కాల్చుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో వారి కుమారులు ఇంట్లో ఉన్నారు. తుపాకీ కాల్పులు విన్న వెంటనే వారి తల్లిదండ్రుల గదికి చేరుకున్నారు. కుల్దీప్ మృతదేహం నేలపై, అన్షు మృతదేహం మంచంపై కనిపించింది. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను శవపరీక్షకు పంపారు.‘‘కేన్సర్ ఉందని నిర్ధారణ అయింది. నా కుటుంబానికి దాని గురించి తెలియదు. కోలుకుంటానన్న గ్యారంటీ లేదు. దీనికి చికిత్స కోసం డబ్బు వృధా .. అందుకే ఈ నిర్ణయం. ఇందులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు, ముఖ్యంగా నా పిల్లలు నిందించాల్సిన అవసరం లేదు" అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే కలిసి ఉంటామని ప్రమాణం చేశాను కాబట్టి తన భార్య అన్షు త్యాగిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతున్నా అంటూ ఆమెను కూడా కాల్చి చంపేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుల్దీప్ తండ్రి రిటైర్డ్ పోలీసు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పూనమ్ మిశ్రా వెల్లడించారు. -
ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. -
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
విశాఖపట్నం,సాక్షి: విశాఖలో (Visakhapatnam) దారుణం జరిగింది. మరో 24 గంటల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి చంపాడు. తప్పించుకునేందుకు పథకం వేశాడు. ఆపై దారుణానికి ఒడిగట్టింది తానేనని నిజం ఒప్పుకున్నాడు పోలీసుల సమాచారం మేరకు.. పీఎం పాలెం ఉడా కాలనీలో జ్ఞానేశ్వర్, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వారిది ప్రేమ వివాహం. జ్ఞానేశ్వర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తుండగా.. భార్య అనుష గర్భవతి. మంగళవారమే డెలివరీ కావాల్సి ఉంది. ఈ తరుణంలో సోమవారం ఉదయం అనూషకు ఆరోగ్యం బాగోలేదని జ్ఞానేశ్వర్ ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా ఉన్న అనూషను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. భర్త జ్ఞానేశ్వర్ తీరుపై పోలీసులు అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తనకు, తన భార్య అనుషకు మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో భార్య అనుషను గొంతు నులిమి హత్య చేసినట్లు భర్త జ్ఞానేశ్వర్ పీఎం పాలెం పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వితిక-వరుణ్ సందేశ్ తిరుమల ట్రిప్ (ఫోటోలు)
-
సీరియల్ బ్యూటీ స్రవంతి.. భర్తతో సరదాగా ఇలా (ఫొటోలు)
-
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్‌ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్‌పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్‌స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్‌ను పీఎస్‌లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రామ్ చరణ్ తో పెళ్లి బంధం సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన.. వారంలో ఒక రోజు తప్పనిసరి! (ఫోటోలు)
-
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
పాట్నా: కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) మనవరాలు సుష్మాదేవి (Sushma Devi) దారుణ హత్య కలకలం రేపుతోంది. సుష్మాదేవిని ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.గయా ఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామానికి చెందిన జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్ సింగ్ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్ గన్నుతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్, సుష్మా పిల్లలు పరిగెత్తుకొని రాగా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. కాల్పులమోతతో ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూఈ ఘటనపై గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు. సుష్మాను ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’అని తెలిపారు. జితన్ రామ్ మాంఝీ ఎవరు?మనవరాలి హత్యపై గయ లోక్‌సభ ఎంపీ, సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించలేదు. జితన్ రామ్ మాంఝీ బీహార్ సీఎంగా పనిచేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు. -
నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్
ఏదైనా సక్సెస్ సాధించిన తరువాత స్నేహితులకు, సన్నిహితులు పార్టీ ఇవ్వడం చాలా కామన్. ఒక్కోసారి చిన్న చిన్న గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. మరి అలాంటిది ఊహించని విజయం వచ్చి వరిస్తే ఆసంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఈ సంతోషాన్ని తన కరియర్లో సక్సెస్‌కు తొడుగా నిలిచిన తన భార్యకు ఖరీదై గిఫ్ట్ ఇవ్వడం విశేషంగా నిలిచింది. స్టోరీ ఏంటంటే..నటుడు, కంటెంట్ సృష్టికర్త అవినాష్ ద్వివేది 'దుపాహియా' వెబ్ సిరీస్ ద్వారా అద్భుత విజయం సాధించాడు. దీంతో అతని బార్య సంభావన సేథ్‌కు తన కలల కారును బహుమతిగా ఇచ్చాడు. సంభావన కూడా నటి, యూట్యూబర్. ఇది తమ ప్రేమ, పట్టుదలతోపాటు పాటు, తమ ఉమ్మడి కలలకు ప్రతిరూపమని చెప్పాడు. భార్యకు రూ. 1.81కోట్ల విలువైన విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. దీని ప్రకారొం ఈ కారు వారి 7 సిరీస్ BMW 750e లాగా కనిపిస్తోంది. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.అవినాష్ ద్వివేది, సంభావన సేథ్ప్రారంభం నుండి కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా అన్నివిధాల సంభావన, అండగా నిలిచి, ప్రతి పోరాటంలో తనకు వెన్నెముకగా నిలిచింది అంటూ భార్యకు కృతజ్ఞతలు తెలిపాడు. కష్టాల్లో, నష్టాల్లో తొడుగా నిలిచింది. నిజంగా ఆమె తనకు లభించిన గొప్ప వరమని పేర్కొన్నాడు. మరిన్ని కలలతో, తమ ప్రయాణం, ఇలాగే కలకాలం సాగిపోవాలని కోరుకున్నాడు. ఇది కేవలం మన విజయం మాత్రమే కాదు. మన తల్లిదండ్రులు ఆశీర్వాద బలం కూడా అంటూ View this post on Instagram A post shared by Avinash Dwivedi (@imavinashdwivedi)మీ(సంభావన) తల్లిదండ్రులు ఇప్పుడు వారితో లేకపోయినా, పై నుంచి వారు ఆశీర్వదిస్తారంటూ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి ముంబైలో తను పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి ముంబైకి వచ్చినప్పుడు, ఒకే ఒక్క లక్ష్యం. నటుడిగా మారాలి. సక్సెస్సాధించాలి. ఇదే పట్టుదల. ఇందుకోసం గత ఐదేళ్లుగా నా సర్వస్వం అర్పించాను అని చెప్పాడు. అలాగే దుపాహియాపై ప్రేక్షకుల అపారమైన ప్రేమ కురిపించారు అంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. మార్చి 2025 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదలైంది. ఇది విమర్శకులు, వీక్షకులు ప్రశంసలు దక్కించుకుంది. సంభావన సేథ్ , అవినాష్ ద్వివేది 2016, జూలై 14న వివాహం చేసుకున్నారు. -
హైదరాబాద్ లో దారుణం.. గర్భవతిపై బండరాయితో భర్త దాడి
-
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
భువనేశ్వర్ : ‘నాకు పెళ్లై రెండేళ్లవుతుంది. పెళ్లైన నాటి నుంచి నా భర్య నన్ను మానసికంగా వేధిస్తోంది. ఆమె వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇక నాకు చావే శరణ్యం’ అంటూ ఓ భర్త కదులుతున్న ట్రైన్ ఎదురు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ దుర్ఘటన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈస్ట్ కోస్ట్ డివిజన్ రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం ఖోర్ధాజిల్లా కుంభార్బస్తా (Kumbharbasta) కు చెందిన రామచంద్ర బర్జెనా కదులుతున్న ట్రైన్ నుంచి ప్రాణాలు తీసుకున్నాడు. దుర్ఘటనకు ముందు ఓ వీడియోను తన సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు.ఆ వీడియోలో ‘నేను రామచంద్ర బర్జెనాను. నేను కుంభార్బస్తాలో ఉంటాను. ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అందుకు కారణం నా భార్య రూపాలీనే. రూపాలీ నన్ను మెంటల్ టార్చర్ చేస్తోంది. ఇక నేను బ్రతకలేను’ అని విలపిస్తూ వీడియోలో చెప్పాడు. వీడియో తీసిన అనంతరం, నిజిఘర్-తపాంగ్ రైల్వే ట్రాక్ సమీపంలో కదులుతున్న రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు రామచంద్ర, రూపాలీకి రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికో కుమార్తె. అయితే, పెళ్లైన నాటి నుంచి భార్య రూపాలి.. భర్త రామచంద్రను మానసికంగా వేధిస్తుండేది. అది సరిపోదున్నట్లు మెట్టినింట్లో చిచ్చుపెట్టేది. ఇవన్నీ తట్టుకోలేక రామచంద్ర ప్రాణాలు తీసుకున్నాడు. రామచంద్ర ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు రామచంద్ర తీసిన వీడియో ఆధారంగా భార్య రూపాలీని అరెస్ట్ చేశారు. Odisha: Unable to endure relentless torture from his wife, a young man tragically ended his life. The incident occurred in Kumarabasta village of Khordha district. The deceased has been identified as Ramchandra Badjena. Before his death, Ramchandra posted a video on social media,… https://t.co/hmwt0hzaEx— ସତ୍ୟାନ୍ୱେଷୀ/सत्यान्वेषी/Satyanweshi (@imsatyanweshi) April 5, 2025 రామచంద్ర ఆత్మహత్య తర్వాత అతని తల్లిదండ్రులు.. కోడలు రూపాలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నా కుమారుడు రామచంద్రకు రూపాలీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి కూడా మా ఇంట్లోనే అంగరంగ వైభవంగా చేశాం. పెళ్లైన నాటి నుంచి రూపాలీ నా కొడుకుని చిత్ర హింసలు పెట్టేది. పాప పుట్టింది. తరుచూ మెట్టి నుంచి పుట్టింటికి వెళ్లేది. పుట్టింటికి వెళ్లకపోతే నన్ను నా కుటుంబ సభ్యుల్ని దూషిస్తుండేది. అయినప్పటికీ, అత్త కుటుంబసభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రూ.20లక్షలు అప్పుగా ఇచ్చాం. కానీ రూపాలీ తీరు మారలేదు. నా కొడుకు ఆమె చేతిలో నరకాన్ని అనుభవించాడు. ఆమె క్రూరత్వానికి ఫలితం ఇదే. మాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పిల్లలతో రాధిక సమ్మర్ వెకేషన్.. యష్ ఎక్కడ? (ఫోటోలు)
-
భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య
యశవంతపుర: కుటుంబ కలహాలకు ఓ కుటుంబమే కడతేరింది. ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలబురగి పట్టణం జీవర్గి రోడ్డులోని కెహెచ్బీకాలనీ అపార్ట్మెంట్లో బుధవారం జరిగింది. సంతోష్ కోరళ్లి(45) అనే వ్యక్తికి బీదర్‌కు చెందిన శృతి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈయన జెస్కాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మునిశ్(9), మూడు నెలల అనిశ్ అనే సంతానం ఉన్నారు. శృతి పుట్టింటికి వెళ్లే విషయంలో బుధవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్నిసంతోష్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా తనను పుట్టింటికి పంపకపోతే చావో రేవో తేల్చుకుంటానని శృతి పేర్కొంది. విచక్షణ కోల్పోయి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలబురగి నగర కమిషనర్ డాక్టర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు. మానసిక సమస్యలతో సంతోష్ ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కలబురగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. -
మొదటి భార్యకు విడాకులపై నాటకం
కర్ణాటక: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ దాఖలాలను సృష్టించిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా రెండో భార్య వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకొని పరారైన సంఘటన నగరంలోని కువెంపునగర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసకారి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని వంచనకు గురైన బాధితురాలు రోజా ఆనే మహిళ కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని కువెంపు నగరలో లేడీస్ పీజీని నిర్వహిస్తున్న రోజా ఆనే మహిళ మొదటి భర్త నుంచి కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి అండగా ఉండటం కోసం రెండో పెళ్లి చేసుకోడానికి డైవర్స్ మ్యాట్రిమోనిలో యాప్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళకు చెందిన త్రిశూర్‌లో నివాసం ఉంటున్న శరత్ రామ్ రోజాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి అయిందని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చానని నకిలీ దాఖలాలు రోజాకు చూపించాడు. దాంతో శరత్రామ్ను నమ్మిన రోజా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే షికార్లు ఇద్దరు కలిసి పెళ్లికి ముందు షికార్లు తిరిగారు. శారీరకంగాను కలిశారు. పెళ్లి ఘనంగా వద్దని రిజిస్టర్ పెళ్లి చెసుకుందామని ఆనుకున్నారు. ఈ సందర్బంగా తనకు వ్యాపారం కోసం అని విడతల వారీగా రోజా వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నగదును తీసుకున్నాడు. అనంతరం లేడీడిస్ పీజీలో వచ్చిన డబ్బు కూడా తీసుకున్నాడు. రోజా పేరుతో రెండు కంపెనీలు పెట్టి ఆందులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి వారిని కూడా మోసం చేశారు. పెళ్లి చేసుకుందామని కోరుతున్నా వాయిదా వేస్తూ వచాచడు. దాంతొ ఆనుమానం పెంచుకున్న రోజా ఆతని విడాకులు నిజమా, కాదా? అని న్యాయవాది ద్వారా విచారిందగా అవి నకిలీ అని, అతను విడాకులు తీసుకోలేదని మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని రోజా ప్రశ్నించడంతో తననే ఎదిరిస్తావా? ఆని రోజా పైన దాడి చేసి కొట్టి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్‌ల ట్రెండ్‌నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్ డే రోజున డైమండ్ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్(ట్విటర్)లో షేర్ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించు కోవడం విశేషం. -
కుమారుడితో సానియా మీర్జా.. కొత్త భార్యతో షోయబ్ మాలిక్ సెలబ్రేషన్స్ చూశారా? (ఫొటోలు)
-
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.. అయితే ఏమైందో..ఏమో కానీ..ఆ ఇరు కుటుంబీకు ల మధ్య కొన్ని నెలల కిందట వివాదం తలెత్తింది. దూరం పెరిగింది. మాటల్లేవ్.. ఈ తరుణంలో భర్త ఫోన్లో ఆ పక్కంటి మహిళా ఫోన్ నంబరు ఉందని భార్య గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన పక్కంటి మహిళా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పదెంకెల ఫోన్ నంబరు తెచ్చిన తంటాకు ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మంగళవారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రా మంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు, పోలీసులు వివరాల మేరకు...చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య ఉమ (30). ఈ దంపతులకు పెళ్లిలై ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ల ఇంటి పక్కనే శివమణి, సుజాత అనే దంపతులు ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువు లు. వీళ్ల మధ్య ఏర్పడిన చిన్న తగదాలు గొడవగా మారాయి. కొన్ని నెలలుగా ఈ ఇరు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి మొబైల్లో ఉమ ఫోన్ నంబరును సుజాత గమనించింది. ఆ నంబరు నీ ఫోన్లో ఎందుకు ఉందని సుజాత భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇలా అక్రోశానికి గురైన సుజాత రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఇలా మాట మాట పెరిగి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో జాకెట్లోని అట్టముక్కలో తన చావుకు కారణం సుజాతనేని రాసి పెట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళా ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశానికి గురై ఆ మహిళ పరువుకు తలొంచి ఆత్మహత్య చేసుకుంది. -
ట్రాఫిక్ సిగ్నల్‌లో భార్య రీల్స్ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
ఛండీఘడ్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ హర్యానా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్ పాడటం లేదంటే, డ్యాన్స్‌లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్‌లో జ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్‌సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025 ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్ వీడియోను అజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. -
నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్
బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి సూట్‌కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్ రాజేంద్ర ఖడేకర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ అతన్ని పోలీసులకు పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్‌కేస్‌లో పెట్టి బాత్రూమ్లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్ కట్ చేశారు. అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. పుణె చేరుకోగానే రాకేశ్ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్‌ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పుణెకు చేరిన హుళిమావు పోలీసులు పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్ దయానంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు. -
భార్యను హత్య చేసిన ఘటన.. టెకీ ఆత్మహత్యాయత్నం!
బెంగళూరు: భార్యను హత్య చేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య.. ఇవే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైవాహిక బంధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారో.. లేక ఆ బంధంలో భారాన్ని మోయలేకపోతున్నారో కానీ ఈ తరహా హత్యోదంతాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా మరో హత్య వెలుగుచూసింది. బెంగళూరులో టెకీగా పని చేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి.. భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాకేష్ రాజేంద్ర ఖేదకర్.. ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా భార్య గౌరీ అనిల్ షెంబేకర్ (32)ను హత్య చేశాడు . బుధవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న కత్తిని భర్తపైకి విసిరింది భార్య. దీంతో భర్త రాజేంద్రకు గాయమైంది. దాంతో సహనాన్ని కోల్పోయిన భర్త.. అదే కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.సూట్ కేస్ లో ప్యాక్ చేసి..అయితే భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పార్శిల్ చేసి ఇంటి లోపల పెట్టిన భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు. తాను మీ కూతుర్ని హత్య చేశానంటూ ఫోన్ చేప్పాడు. డెడ్ బాడీని బయట సూట్ కేస్ లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. దాంతో ఆ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడన్నుంచి కర్ణాటక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక ప్యాక్ చేసి ఉన్న ఒక సూట్ కేస్ కనిపించింది. అందులో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపగా అది హత్యగా ధృవీకరించారు. మెడపై, చాతీలో కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.ఆత్మహత్యకు యత్నంభార్యను హత్య చేసిన తర్వాత పుణెకు పారిపోయాడు భర్త రాజేంద్ర.. అయితే అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఎక్కుడున్నాడో విషయాన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పుణె పోలీసులకు అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో అతన్ని పుణె ఆస్పత్రిలో చేర్చించారు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పుణెకు చేరుకున్నారు. రాజేంద్ర సృహలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.ఏడాది క్రితమే బెంగళూరుకు..మహారాష్ట్రకు చెందిన వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం జరగ్గా, ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చారు. కొంతకాలంగా వీరి వైవాహిక సాఫీగానే సాగింది. భర్త ఒక ప్రైవేటు కంపెనీ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మాస్ మీడియలో బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది. -
భార్య, భర్త ఓ ప్రియుడు
-
భార్యను ముక్కలు చేసి.. సూట్‌కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్‌కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
‘నేను పెళ్లి చేసుకోలేదు.. బతికిపోయా’, మీరట్ ఘటనపై బాగేశ్వర్ బాబా
లక్నో: ‘థ్యాంక్ గాడ్. నేను పెళ్లి చేసుకోలేదు. లేదంటే’.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసుపై బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రేమించి పెళ్లాడిన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను ప్రియుడు సాహిల్ సాయంతో కట్టుకున్న భార్య ముస్కాన్ దారుణంగా హత్య చేసి,ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకుంది. అనంతరం, ప్రియుడి సాయంతో ముస్కాన్ తన భర్త సౌరభ్ రాజ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి శరీర భాగాన్ని బులుగు రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి పెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఈ నేపథ్యంలో సౌరభ్ రాజ్ ఘటనపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి స్పందించారు. ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన ఘటనను ఉదహరించారు. ‘ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తల్లి దండ్రులు వారి పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. వారి పెంపకంలో లోపాలు కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు విలువల్ని నేర్పించాలి. ఇందుకోసం శ్రీరామ చరిత్మానస్ బోధనలను పాటించాలని సూచించారు.#WATCH | Meerut, UP | On the Meerut murder case, Bageshwar Dham's Dhirendra Shastri said, "The Meerut case is unfortunate. In the present society, the declining family system, the advent of Western culture and married men or women engaged in affairs are destroying families...… pic.twitter.com/ULalTXvTj5— ANI (@ANI) March 27, 2025 ‘ప్రస్తుతం మనదేశంలో బ్లూ డ్రమ్ బాగా పాపులరైంది. చాలా మంది భర్తలు షాక్‌లో ఉన్నారు. థ్యాంక్ గాఢ్.నేను పెళ్లి చేసుకోలేదు’ అని నవ్వుతూ ప్రతిస్పందించారు. మీరట్ ఘటన దురదృష్టకరం. క్షీణిస్తున్న కుటుంబ వ్యవస్థ, పాశ్చాత్య సంస్కృతి, వివాహిత స్త్రీ, పురుషుల వ్యవహారాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. అందుకే ఉన్నతవంతమైన కుటుంబాన్ని నిర్మించేందుకు ప్రతి భారతీయుడు శ్రీరామచరిత్మానస్‌ను ఆచరించాలని కోరారు. -
మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధమే.. అంటోన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య (ఫొటోలు)
-
విశాఖ: భర్తపై అలిగి.. పోలీసులకు చుక్కలు చూపించింది!
విశాఖపట్నం, సాక్షి: కాపురంలో కలహాలు సహజం. చిన్నచిన్నవాటికే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న రోజులివి. అయితే ఇక్కడో భార్య తన భర్త సరిగ్గా చూడడం లేదని బలవన్మరణానికి పాల్పడబోయింది. మేడ మీద నుంచి దూకుతానంటూ స్థానికులతో పాటు పోలీసులను హడలెత్తించింది. విశాఖ మధురవాడ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త సరిగ్గా చూడడం లేదని.. రూ.500 అడిగితే ఇవ్వడం లేదంటూ వాపోయింది. మేడ మీద హల్ చల్ చేస్తూ దూకడానికి ప్రయత్నించింది. ఆ టైంలో అక్కడికి చేరుకున్న ఎస్ఐ భాస్కర్ తెలివిగా ఆమెను కిందకు దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేసినట్లు తెలుస్తోంది. -
హ్యాపీ బర్త్‌డే అమ్మలూ.. ఎన్టీర్ స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
భార్యకు భర్త యజమాని కాడు!
ప్రయాగ్‌రాజ్: భార్య తనతో ఉన్న ఇంటిమేట్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోగానే భార్యకు భర్త యజమాని అయిపోడని వ్యాఖ్యానించింది. అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇంటిమేటెడ్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి దరఖాస్తుదారుడు (భర్త) వివాహ బంధానికున్న పవిత్రతను ఉల్లంఘించారు. భార్య తనపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టారు. భార్య గౌరవాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం భార్యాభర్తల మధ్య బంధాన్ని నిర్వచించే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ నమ్మక ద్రోహం వైవాహిక బంధం పునాదినే దెబ్బతీస్తుంది’అని విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ దివాకర్ వ్యాఖ్యానించారు. భార్య అంటే భర్తకు కొనసాగింపు కాదని, తనకంటూ సొంత హక్కులు, కోరికలు, ఉన్న వ్యక్తని ఆయన పేర్కొన్నారు. తామిద్దరూ సాన్నిహిత్యంతో ఉన్న వీడియోలను తన భర్త మొబైల్లో చిత్రీకరించి, తనకు తెలియకుండా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని, తరువాత బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నాడంటూ మీర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్న్ యాదవ్ అనే వ్యక్తిపై అతని భార్య కేసు నమోదు చేసింది. తాను ఆమె భర్త కాబట్టి అది నేరం కాదని, తనపై మోపిన క్రిమినల్ కేసులను కొట్టేయాలని ప్రద్యుమ్న్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది కాబట్టి.. కేసును కొట్టేయాలంటూ ఆయన తరపు న్యాయవాది సైతం వాదించారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అయినప్పటికీ, ఆమెను అశ్లీల వీడియో తీసి బంధువులకు, గ్రామస్తులకు పంపే హక్కు భర్తకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. -
చీటింగ్ యాప్ : భర్త ఫోన్లను ఎక్కువగా చెక్ చేస్తోంది ఈ నగరంలోనేనట!
భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పరం విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుకుంది. ఆ నమ్మకం వమ్ము అయినపుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ఫోన్లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు, షాపింగ్ దాకా అంతా అన్లైన్లోనే. అందుకే తమ భాగస్వాములను వ్యవహారాల్ని పసిగట్టేందుకు స్మార్ట్‌ఫోన్‌ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్లుకూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్‌ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్‌లో ఉందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా. అన్నట్టు ఇది నేరుగా ఉండదు సుమా. గుట్టుచప్పుడు గాకుండా సాగుతుందన్నట్టు అచ్చం వాళ్లు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో... అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుసుకుందాం.CheatEye.ai నివేదిక ప్రకారం, మహిళలు తమ భాగస్వాములను అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్‌లో జరిగిన టిండర్-సంబంధిత శోధనలలో 27.4శాతం మంది తమ భాగస్వామి గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని ఇటీవలి విశ్లేషణలో వెల్లడైంది. ముఖ్యంగా, ఈ శోధనలలో 62.4శాతం తమ భర్తలు లేదా బాయ్ఫ్రెండ్లు డేటింగ్ యాప్‌ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ యాప్‌లోకి వస్తున్నారట. ఇక లండన్ తరువాత మాంచెస్టర్ బర్మింగ్‌హామ్ తరువాతి టాప్ ప్లేస్‌లో నిలిచాయి. భాగస్వాములపై అనుమానంతో జరిగి టిండర్ చెకింగ్స్‌లో మాంచెస్టర్‌లో, 8.8శాతంగా బర్మింగ్‌హామ్‌లో 8.3శాతంగా ఉన్నాయి. అయితే, బర్మింగ్‌హామ్ లో 69 అనుమానాస్పద శోధనలు పురుష భాగస్వాములపై మహిళలే నిర్వహింనవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా కూడా ఈ జాబితాలో కనిపించింది, 4.7శాతం టిండర్-సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో, 62.1శాతం మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాములను లక్ష్యంగా ఉన్నాయట. దీనికి ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా యువకులలో డేటింగ్ యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణమని నిపుణురాలు సమంతా హేస్ విశ్లేషించారు."లండన్ వంటి నగరాల్లో, డేటింగ్ అనేది డైనమిక్‌గా ఉంటుంది. ఇది సహజంగానే భాగస్వాముల కార్యకలాపాలపై అనుమానం పరిశీలనకు దారితీస్తుంది" అని ఆమె వివరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ భాగస్వాముల విశ్వసనీయత గురించి ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు.ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జర జాగ్రత్త భయ్యో అంటూ కమెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో.. మూడో వ్యక్తి రాకూడదు. అప్పుడ అది నూరేళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది. -
కట్టుకున్నోడిని కాటికి పంపింది..
వికారాబాద్ జిల్లా: మద్యానికి బానిసైన భర్త పెడుతున్న వేధింపులు భరించలేని ఓ భార్య కట్టుకున్నోడిని హతమార్చింది. మృతుడి తల్లి కూడా ఇందుకు సహకరించింది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి, నాయనమ్మ పరారీలో ఉండటంతో ఇద్దరు పిల్లలూ బిక్కుబిక్కుమంటున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. హన్మాపూర్‌కు చెందిన బక్కని వెంకటేశ్ (33)కు 14 ఏళ్ల క్రితం ఇదే ఊరికి చెందిన సబితతో వివాహం జరిగింది. వీరికి లావణ్య, కిషోర్ ఇద్దరు పిల్లలు సంతానం. తల్లి లక్ష్మమ్మ, భార్యాపిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం పొలం అ మ్మగా డబ్బులు రావడంతో వెంకటేశ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగివచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వెంకటేశ్ ఇంటి ఆవరణలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల్లి, భార్య మృతుడి సోదరుడైన శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని పరిశీలించారు. తన అన్న మృతికి తల్లి, వదినే కారణమని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, లక్ష్మమ్మ, సబిత పరారీలో ఉన్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ నగేశ్‌తో కలిసి హన్మాపూర్‌లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
ఏం కష్టమొచ్చిందో.. దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు
సిద్దిపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో దంపతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ముందుగా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఆపై భార్త కూడా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం ఎల్లారెడ్డిలో ఈ దారుణం జరిగింది. కెమ్మసారం భాగ్య పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన భర్త నాగరాజ్.. భార్య లేని జీవితం వద్దకుని అతను కూడా పురుగుల మందు సేవించాడు. దాంతో నాగరాజ్ కూడా తనువు చాలించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ దంపతులకున్న నలుగురు పిల్లలు అనాథులుగా మారిపోయారు. అమ్మా, నాన్న ఇక తమతో ఉండరని తెలిసి రోదిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
జగిత్యాల: జిల్లాలోని పొలాసలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య. భర్త కమాలకర్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అవ్వగా, మరో పెళ్లి చేసుకున్నాడనేది కూడా ఆమె ఆరోపిస్తోంది. తమను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని, అందుచేత భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు భార్య చెబుతోంది.గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తమను వేధిస్తున్నాడని భార్య పేర్కొంది. భార్యా పిల్లలను కొడుతుండటంతో ఓపిక నశించి కమలాకర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెబుతోంది. పిల్లలతో కలిసి కమాలకర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు భార్య స్పష్టం చేసింది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమాలకర్ పరిస్థితి విషమంగా ఉంది. -
‘భార్య అలా చేస్తే భర్తకు ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదు’ :హైకోర్టు
భోపాల్ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో అసభ్యకరమైన ఫోన్ ఛాటింగ్‌లు చేయకూడదని, తన భార్య ఆ తరహా చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించలేడని పేర్కొంది. దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఫోన్ ఛాటింగ్‌పై వ్యాఖ్యానించింది. నా భార్య చాటింగ్ చేస్తోందిమధ్యప్రదేశ్కు చెందిన భార్య,భర్తల గొడవ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చర్చకు దారితీసింది. 2018లో దంపతులకి వివాహమైంది. అయితే, ఆ ఇద్దరి దంపతుల మధ్య పొరపొచ్చలొచ్చాయి. అప్పుడే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ‘విచారణలో నా భార్య వివాహం తరువాత కూడా ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. అందుకు వాట్సప్ చాటింగే నిద్శనం. పైగా ఆ చాటింగ్ అసభ్యంగా ఉందని ఆధారాల్ని అందించారు.లేదు.. నా భర్తే నాకు రూ.25లక్షల భరణం ఇవ్వాలికానీ పిటిషనర్ భార్య మాత్రం భర్త చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. నా భర్త చెప్పినట్లుగా నేను ఎవరితోను సాన్నిహిత్యంగా లేను. చాటింగ్ చేయడం లేదు.నా భర్త కావాలనే నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాడు. నా ఫోన్ హ్యాక్ చేసి మరి మరో ఇద్దరు పురుషులతో చాటింగ్ కూడా చేశారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించనందుకు రూ.25లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు ఆరోపణలు చేసింది.భార్యే నిందితురాలుఅంతేకాదు, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్య-భర్త ఏపిసోడ్ భర్త చెప్పేవన్నీ నిజాలేనని నిర్ధారించింది. వాటిని నివృత్తి చేసుకునేందుకు భార్య తండ్రిని సైతం విచారించింది. విచారణలో ఆమె తండ్రి కూడా అంగీకరించారు. తన కుమార్తె పరాయి మగాడితో చాటింగ్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లు కోర్టుకు చెప్పారు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.నాకు విడాకులొద్దు.. భర్తతోనే కలిసుంటాఫ్యామీలి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జస్టిస్ వివేక్ రష్యా, జస్టిస్ గజేంద్ర సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో పిటిషనర్ తన ప్రియుడితో సె* లైఫ్ గురించి చాటింగ్ చేసినట్లు గుర్తించింది. భార్య పరాయి పురుషుడితో ఈ తరహా చాటింగ్ చేస్తే ఏ భర్త సహించలగడనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదువివాహం తర్వాత, భర్త మరియు భార్య ఇద్దరూ తమ స్నేహితులతో మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ.. సంభాషణ స్థాయి సౌమ్యంగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా, మహిళ.. పురుషుడితో.. పురుషుడు స్త్రీతో మాట్లాడితే జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా ఉండకూడదు’ అని కోర్టు పేర్కొంది. ఒక భాగస్వామి ఇలా అసభ్యకరమైన చాటింగ్ చేస్తే.. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదని తెలిపింది. చివరగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
మటన్ కర్రీ వండలేదనే కోపంతో భార్యను చంపిన భర్త
సాక్షి,మహబూబ్ నగర్: జిల్లాలో దారుణం జరిగింది. మటన్ కూర వండలేదని భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. సీరోల్ ఎస్సై సీఎహెచ్ నాగేష్ వివరాల మేరకు.. సీరోల్ మండల కేంద్రానికి చెందిన ఎం కళావతి,ఎం బాలు భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలుకి నాన్ వెజ్ తినాలని బుద్ధి పుట్టింది. ముందుగా చికెన్ కూర తిందామని అనుకున్నాడు. అసలే బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని షాపుకెళ్లి మటన్ కూర తెచ్చాడు.మటన్ తినాలని ఉంది. అందుకే మటన్ తెచ్చా. వెంటనే మటన్ కూర చేయమని భార్యను కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో నిందితుడు బాలుకి కోపం నషాళానికి అంటింది. ఏం చేయాలే పాలుపోలేదు. పట్టరాని కోపంతో భార్య కళావతిని వెనక్కి నెట్టాడు. ఫలితంగా బాధితురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భర్త నెట్టడంతో బాధితురాలి తలకి బలమైన గాయాలయ్యాయి. అక్కడికక్కడే మరణించింది. అనంతరం బాలు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెపై డీఆర్ఐ అధికారులకు ఆమె భర్తే జతిన్ హుక్కేరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచి తరచు విదేశాలకు వెళ్తోంది. ఆమె విదేశీ టూర్లతో నిత్యం గొడవలు జరిగేవి.ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తన భర్త రన్యారావు డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రన్యారావు కదలికలపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు.. ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడంకన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇకపోతే రన్యా రావు తండ్రి కర్ణాటక డీజీపీ డాక్టర్ కే.రామచంద్రారావు పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. -
చాంపియన్స్ ట్రోఫీతో బుమ్రా భార్య సంజనా.. రోహిత్ శర్మతో ముచ్చట్లు (ఫోటోలు)
-
కలికాలంలో.. ఓ తండ్రి విషాదగాథ!
తెలుగులో చంద్రమోహన్-జయసుధ నటించిన కలికాలం అనే సినిమా ఒకటుంది. సమాజంలో.. తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరించే తీరును సమకాలీన అంశాల ఆధారంగా అప్పట్లో చూపించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అయితే ఆనాటికి.. ఈనాటికి ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.హరేంద్ర మౌర్య(46).. మోరెనా టౌన్లో ఎలక్ట్రీషియన్ పని చేసేవారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఓ కొడుకు. మార్చి 1వ తేదీన ఒకేసారి ఇద్దరు కూతుళ్లకు అంగరంగ వైభవంగా వివాహం చేశాడాయన. అయితే కొన్ని గంటలకే ఆ ఇంట విషాదం నెలకొంది. ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న హరేంద్ర.. ఎంత సేపటికి బయటకు రాలేదు. దీంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు.భార్య విడాకులు తీసుకుంటుందనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువుల్లో కొందరు.. ఇంట్లో మనస్పర్థలవల్లే ఆయన చనిపోయాడని చుట్టుపక్కలవాళ్లు.. సొంత తండ్రి, సోదరుడే హరేంద్రను చంపారని భార్య తరఫు బంధువులు.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకోసాగారు. ఈలోపు ఓ భయంకరమైన విషయం వెలుగు చూసింది.హరేంద్రను అతని భార్య, కూతుళ్లు కలిసి దారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది. భార్య ఆయన కాళ్లను పట్టుకుంటే.. ఓ కూతురు చేతులు పట్టుకుంది. మిగతా ఇద్దరు కూతుళ్లు కర్రలతో ఆయన్ని విచక్షణ రహితంగా చితకబాదారు. ఆ బాధతో ఆయన అరుస్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. కొడుకు ఆ తండ్రిని రక్షించే ప్రయత్నం చేయగా.. అతన్ని వారించి మరీ హరేంద్రను హింసించడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోను ఎవరు చిత్రీకరించారో.. ఎవరు బయట పెట్టారో తెలియదుగానీ.. హరేంద్ర మరణించిన తర్వాత బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. Note: కలవరపరిచే దృశ్యాలు ఉన్న కారణంగా.. వీడియోను అప్లోడ్ చేయలేకపోతున్నాంఈ వీడియో ఆధారంగా హరేంద్రది బలవన్మరణం కాదని.. అతన్ని హింసించి హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆ వీడియో రికార్డు చేసినట్లు ఉండగా.. పోలీసులు ఈ వీడియో ఆధారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తండ్రికి ఎలాగైనా న్యాయం చేయాలంటూ పలువురు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్‌గల్‌కు చెందిన ఎండీ పర్వీన్‌బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్‌గల్‌కు వచ్చి సంతబజార్‌లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్‌గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్‌పై అక్కడికి వచ్చి హతమార్చారు. చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణంరాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్‌బేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
Nishant Tripathi : ‘భార్యకు ప్రేమతో’.. కంపెనీ సైట్లో కంటతడి పెట్టిస్తోన్న లేఖ
ముంబై : ‘ఓయ్ నిన్నే.. నీపై నాకు ప్రేమ అనంతం. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా అది ఎప్పటికీ చెరిగిపోదు’ అంటూ ఓ భర్త తన భార్యపై అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశాడు. అనంతరం, నా చావుకు నా భార్య, ఆమె అత్తే కారణమని ఆ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆత్మహత్యకు గల కారణాలేంటో మా అమ్మకు బాగా తెలుసు. నా మరణం తర్వాత.. మీరు (భార్యను,భార్య అత్తను ఉద్దేశిస్తూ) ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికే ఆమె మనసు విరిగిపోయింది. ఇకనైనా ఆమెను మనశాంతిగా ఉండనివ్వండి’ అంటూ విజ్ఞప్తి చేశాడు. ముంబైలో యానిమేటర్‌గా పని చేస్తున్న నిషాంత్ త్రిపాఠి (Nishant Tripathi) గత శనివారం ముంబైలో సహారా హోటల్ (sahara hotel mumbai) రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, తమ హోటల్లో రూం బుక్ చేసి మూడురోజులవుతున్నా.. ఎప్పుడు వెళ్లినా ‘డు నాట్ డిస్ట్రబ్’ అనే బోర్డ్ తగిలించే ఉంది. దీంతో సహార హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చి నిషాంత్ త్రిపాఠి ఉన్న రూంను పరిశీలించింది. త్రిపాఠిని పిలిచే ప్రయత్నించింది. సిబ్బంది ఎంత సేపటికి పిలుస్తున్నా హోటల్ గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ఉరికి వేలాడుతూ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్టర్ కీ సాయంతో హోటల్ రూంను ఓపెన్ చేసి చూడగా ఉరికి వేలాడుతూ త్రిపాఠి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి తల్లి,మహిళా హక్కుల కార్యకర్త నీలం చతుర్వేది ఫిర్యాదుతో బాధితుడి భార్య అపూర్వ పరేఖ్, భార్య అత్త ప్రార్థనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘భార్యకు ప్రేమతో’.. కంపెనీ సైట్లో సూసైడ్ నోట్పోలీసుల దర్యాప్తులో బాధితుడు త్రిపాఠి కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో అతను తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. తన మరణానికి ఆమెను, ఆమె అత్తే కారణమన్నారు. అంతేకాదు, భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేనుండనేమో. నా చివరి క్షణాల్లో జరిగిన ప్రతిదానికీ నేను నిన్ను ద్వేషించేవాడినే. కానీ నేను అలా చేయను. చావు ముందు క్షణం వరకు నేను ప్రేమనే ఎంచుకుంటాను. అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ నేను నిన్నే ప్రేమిస్తుంటాను. ఇప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మాటిచ్చినట్లు నీపై నా ప్రేమ ఎప్పటికీ మసకబారదు’ అని రాశాడు.నా తలకొరివి పెట్టాల్సింది పోయితన కుమారుడి మరణంపై త్రిపాఠి తల్లి నీల చతుర్వేది (neelam chaturvedi) ఫేస్బుక్ (meta)లో సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో నేను నా జీవితాన్ని మహిళల హక్కులు, లింగ సమానత్వం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఇప్పుడు నా జీవితం ఇప్పుడు ముగిసింది. నా కొడుకు నిషాంత్ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నన్ను జీవత్సవాన్ని చేశాడు. నాకు అంత్యక్రియలు చేయాల్సిన కొడుక్కే ఈరోజు ఈరోజు మార్చి 2న ముంబైలో ఈకో మోక్షాలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నా. నా కుమార్తె ప్రాచి తన అన్నయ్య అంత్యక్రియలు నిర్వహించింది. ఇంతటి విషాదంలో నా కుమార్తె ప్రాచిలో ధైర్యాన్ని నూరి పోయిండి అంటూ వేడుకుంది.కాగా, భార్యల వేధింపుల కారణంగా ఆత్మహత్య కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మగవారికి అనుకూలంగా ఉండేలా చట్టాలు తేవాలనే డిమాండ్లు కొనసాగుతున్న ఆందోళనల మధ్య ఈ దుర్ఘటన జరగడంపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. -
పెళ్లి వేడుకలో మెరిసిన స్టార్ హీరోల భార్యలు (ఫోటోలు)
-
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు