
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో క్షణికావేశంలో అఘాయిత్యాలకు, దారుణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత తనను తాను అదుపు చేసుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక జీవితంలో ప్రశాంతత కరువై, తగిన నిర్ణయాలు తీసుకోలేక పలువురు ఆత్మహత్యలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది.
గురుగ్రామ్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుమార్ తన భార్య స్వీటీ శర్మతో ఏదో విషయమై గొడవపడ్డాడు. తరువాత ఆవేశంతో ఆమె గొంతు కోసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. భార్యపై దాడిచేసిన అనంతరం నిందితుడు అజయ్ కుమార్ (30), తన స్నేహితునికి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియో సందేశం పంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నివాసి కుమార్‌కు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌కు చెందిన స్వీటీ శర్మ(28)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.
కాగా తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకోబోతున్నానని తనకు వీడియో సందేశం పంపాడని కుమార్ స్నేహితుడు పోలీసులు తెలిపాడు. కుమార్ పంపిన వీడియో సందేశంలో అతను భార్యతో గొడవ పడుతున్న దృశ్యాలున్నాయి. విషయం తెలియగానే పోలీసులు సెక్టార్ 37లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలో కుమార్ దంపతులుంటున్న ఫ్లాట్‌కు చేరుకున్నారు. స్వీటీ శర్మశర్మ మృతదేహం నేలపై పడి ఉండటాన్ని వారు గమనించారు. అక్కడ వారికి పదునైన కత్తి కూడా లభ్యమయ్యింది. కుమార్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు బావిస్తున్నారు. కాగా ఈ ఘటన వెనుక గల కారణం ఇంకా వెల్లడికాలేదు. అయితే స్వీటీ శర్మ కుటుంబ సభ్యులు కుమార్‌పై పలు ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.