మనస్తాపంతో పోలీసులను ఆశ్రయించిన మహిళ
బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్‌ఆర్‌గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్‌తో వివాహం జరిపించారు.
వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది.
అత్తమామల ముందు కూడా నగ్నంగా సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్‌లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


