స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్‌ | Police Raids on Kukatpally SPA Center | Sakshi
Sakshi News home page

స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్‌

Feb 14 2026 10:40 AM | Updated on Feb 14 2026 10:48 AM

Police Raids on Kukatpally SPA Center

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై కేపీహెచ్‌బీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ లింగం తెలిపిన మేరకు.. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 6వ ఫేజులోని ఆవాస స్పాలో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్‌ మసాజ్‌ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులతో పాటు, 15 మంది పురుషులను, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.      

Advertisement
 
Advertisement
Advertisement