breaking news
Complaint
-
అంబానీ ‘వంతారా’పై సిట్ విచారణ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను తీసుకురావడంలో చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపధ్యంలో అనంత్ అంబానీకి చెందిన ‘వంతారా’పై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గల గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ, పునరావాస కేంద్రం వంతారాపై నిజనిర్ధారణ విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చిన పలు నివేదికలు, ఎన్జీఓలు, వన్యప్రాణుల సంస్థల నుండి ‘వంతారా’లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణల మేరకు దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్‌లు పంకజ్ మిథల్, పీబీ వరలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం మాజీ న్యాయమూర్తి జె. చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సిట్ కమిటీని ‘వంతారా’పై విచారణకు ఏర్పాటు చేసింది.పిటిషన్లలో ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, ప్రైవేట్ ప్రతివాది లేదా మరే ఇతర పార్టీల కౌంటర్‌ను లెక్కించడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని సుప్రీం కోర్టు పేర్కొంది. సాధారణంగా ఇటువంటి ఆధారం లేని ఆరోపణలపై ఆధారపడిన పిటిషన్‌ను చట్టపరంగా స్వీకరించేందుకు అర్హత లేదని, అందుకు బదులుగా దానిని తాత్కాలికంగా కొట్టివేయాలని కూడా పేర్కొంది. అయితే వంతారాలో వాస్తవ పరిస్థితిని ధృవీకరించాలని, అప్పుడు ఇటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది తేలుతుందని, అందుకే విచారణ అనేది న్యాయ దృక్పథంలో సముచితమని భావిస్తున్నామని తొమ్మిది పేజీల ఉత్తర్వులో సుప్రీం కోర్టు పేర్కొంది.‘వంతారా’కు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల సిట్ బృందంలో జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు, జస్టిస్ (రిటైర్డ్) రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అనిష్ గుప్తా ఉండనున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను సేకరించడం, వన్యప్రాణుల (రక్షణ) చట్టం అమలు, సజీవ జంతువుల దిగుమతి, ఎగుమతులకు సంబంధించి ‘వంతారా’ అనుసరిస్తున్న విధానాలపై దర్యాప్తు జరిపి, ఆ నివేదికను సమర్పించాలని ‘సిట్’కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లలో ఆరోపించిన మనీలాండరింగ్ లాంటి ఆరోపణలను కూడా ఈ ప్యానెల్ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. -
బ్యాంకులపై.. భారీగా ఫిర్యాదులు!
భారతీయ బ్యాంకులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదులు అందుకోవడంలోనూ ముందుంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచింది. సేవల విషయంలో కొన్ని బ్యాంకులు స్వల్ప మెరుగుదలను చూపించినప్పటికీ మొత్తం ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా ఉంది. ఖాతాదారుల తమ సమస్యలను నివేదించేందుకు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చిన వేదికలపైనే కాదు.. సేవల్లో విఫలమైతే సామాజిక మాధ్యమాల్లోనూ బ్యాంకులను ఎండగట్టేందుకు వెనకాడటం లేదు.డిజిటల్ ఎకానమీ మారుమూల పల్లెలకూ విస్తరిస్తుండడంతో బ్యాంకింగ్ సామాన్యులకూ చేరువైంది. బ్యాంకింగ్ విస్తృతితోపాటు అదే స్థాయిలో కస్టమర్లు సమస్యలనూ ఎదుర్కొంటున్నారు దీంతో బ్యాంకులకు అందుతున్న ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. 2024–25 సంవత్సరానికిగాను బ్యాంకుల బిజినెస్ రెస్పాన్సిబిలిటీ, సస్టేనబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్ఎస్ఆర్) ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఎస్బీఐలో 29.8 లక్షలుఅనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి వినియోగదారుల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 6.87 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 1.05 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఖాతాదారుడి అనుమతి లేకుండా మోసపూరితంగా బ్యాంక్ ఖాతా, డెబిట్/క్రెడిట్ కార్డు నుండి డబ్బు తీసుకోవడం, ఆన్ లైన్ కొనుగోళ్లు, ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను అనధికార ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలుగా పరిగణిస్తారు. ఇక రుణాల మంజూరుతో సహా ముఖ్యమైన సేవలను అందించడంలో జాప్యంపై 12,502; సైబర్ భద్రత, ముఖ్యమైన సేవల పంపిణీ మినహా ఇతర ఫిర్యాదుల విభాగం కింద 21.50 లక్షల కంప్లెయింట్లను బ్యాంకు అందుకుంది. అంత క్రితం ఏడాదిలో ‘ఇతర’ విభాగం కింద బ్యాంకుకి 24.02 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి 29.8 లక్షల కంప్లెయింట్లు వస్తే పెండింగులో 1.2 లక్షలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి 11.39 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 5.34 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.ప్రైవేటు బ్యాంకుల్లోనూ..2024–25లో యాక్సిస్ బ్యాంకు 5.90 లక్షల ఫిర్యాదులను అందుకుంది. వీటిలో మార్చి చివరి నాటికి 11,143 పెండింగ్‌లో ఉన్నాయి. ‘ఇతర’ విభాగంలో 76,111, ప్రకటనలకు సంబంధించి 12,744, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అవలంబించిందన్న ఆరోపణలపై 4,438 కంప్లెయింట్లు అందాయి. » ఐసీఐసీఐ బ్యాంకుకి మొత్తం 5.34 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 45,151 పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. అంత క్రితం ఏడాది 3.46 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అన్ని మార్గాలలో కస్టమర్ ఫిర్యాదులను స్వీకరించే విధానం మెరుగుపడిందని, ఫలితంగా సంఖ్య పెరిగిందని బ్యాంకు తెలిపింది. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు 4.57 లక్షల ఫిర్యాదులను స్వీకరించింది. వీటిలో 16,306 పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాది క్రితం 4.85 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి. అంబుడ్స్మన్కూ..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) చెందిన అంబుడ్స్‌మన్ కార్యాలయాలకు 2024–25లో వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి 2.96 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 2.93 లక్షలు. రుణాలు, అడ్వాన్సులు, డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్లు లేవనెత్తిన సాధారణ సమస్యలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. ఈ కంప్లెయింట్లలో ఎక్కువ భాగం బ్యాంకులపైనే ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), నాన్–బ్యాంక్ సిస్టమ్ పార్టిసిపెంట్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఉన్నాయి.సోషల్ మీడియాలో చురుగ్గా..సామాజిక మధ్యమాల్లో కస్టమర్ ఫిర్యాదులు, ప్రశ్నలకు పరిష్కారం, స్పందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యంత చురుగ్గా ఉన్నాయని సోషల్ మీడియా రిసెర్చ్ సంస్థ ‘సింప్లిఫై360’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. జూన్ 13–28 మధ్య తొమ్మిది ప్రముఖ బ్యాంకుల సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.» ఫేస్బుక్లో రోజుకు 3 పోస్టులతో ఎస్బీఐ అత్యంత చురుకైన బ్యాంకుగా నిలిచిందని ఈ నివేదిక వివరించింది.» ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 45 శాతం, ఎస్బీఐ 41 శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చాయి.» యాక్సిస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 80 శాతం ప్రశ్నలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. » ఫేస్బుక్లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. కానీ ఇవి ఎక్స్‌లో పెద్దగా రాణించలేదు. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎక్స్‌లో చాలా చురుకుగా ఉన్నప్పటికీ బ్యాంక్ తన ప్రయత్నాలకు పెద్దగా గుర్తింపు పొందలేదని నివేదిక వివరించింది. -
తప్పతాగిన శ్రీశైలం ఎమ్మెల్యే..అటవీ సిబ్బందిపై దాడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు/యర్రగొండపాలెం/పెద్దదోర్నాల: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మద్యం మత్తులో అరాచకం సృష్టించారు. తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో అనే కనీస స్పృహ లేకుండా అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి, వారిపై దాడికి దిగారు. మద్యం సేవించి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం అతిథి గృహంలో బసచేసి దిగజారి ప్రవర్తించారు. దీనికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దోర్నాల–శ్రీశైలం ఘాట్‌రోడ్డు రాత్రి 9 గంటలకు మూసేస్తారు. ఉదయం 6 గంటలకు తిరిగి వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలంలోని శిఖరం వద్ద కూడా ఇదే సమయాన్ని అటవీ అధికారులు పాటిస్తారు. మంగళవారం రాత్రి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, బీట్‌ఆఫీసర్లు మోహన్‌కుమార్, గురవయ్య, డ్రైవర్ కరీం రాత్రి గస్తీ చేపట్టారు. చిన్నారుట్ల బీట్ సమీపంలో శిఖరం చెక్‌పోస్టు సమీపంలో రెండు వాహనాలు రోడ్డుపై ఆగి ఉండటాన్ని గమనించి హారన్ కొడుతూ వాటివద్దకు వెళ్లినా వాహనాలు కదల్లేదు. ఆ వాహనాల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తన అనుచరులతో ఉండటాన్ని చూసి ఎమ్మెల్యేకు సెల్యూట్ చేశారు. మద్యం మత్తులో ఊగిపోతున్న ఎమ్మెల్యే తన వాహనాల వద్దకు వచ్చి హారన్ కొట్టడంపై అటవీ సిబ్బందిపై బూతులతో రెచి్చపోయారు. ‘మీరంతా ప్రకాశం జిల్లా ఫారెస్టోళ్లు. శ్రీశైలం నా పరిధి. ఇక్కడ సిబ్బంది వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వాహనాలు పంపిస్తూ నాకు చెడ్డపేరు తెస్తారా?’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. గడువు దాటిన తర్వాత కూడా శిఖరం చెక్‌పోస్టు నుంచి వాహనాలను ఎమ్మెల్యే ముందుకు పంపించారు. ‘ఇది టైగర్ జోన్. వాహనాలను పంపకూడదు’ అని అటవీ సిబ్బంది చెబుతున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. శిఖరం తమ పరిధిలోకి రాదని, ఆత్మకూరు రేంజ్ పరిధిలోకి వస్తుందని, తమకు సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా వారిపై చేయి చేసుకున్నారు. అటవీ సిబ్బంది ఐడీ, ఆధార్ కార్డులు, పర్సులను ఎమ్మెల్యే అనుచరులు లాగేసుకున్నారు. అటవీ అధికారుల వాహనంలో ఇద్దరు సిబ్బందిని, తన వాహనంలో మరో ఇద్దరు అటవీ సిబ్బందిని బలవంతంగా కూర్చోబెట్టారు. అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుని సిబ్బందిని కిడ్నాప్ చేసి శ్రీశైలంలోని ఓ అతిథి గృహంలో నిర్బంధించారు. అక్కడికి జనసేన నాయకుడు అశోక్‌కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు రవుత్ చేరుకుని అటవీ అధికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అర్ధరాత్రి తర్వాత వారిని విడిచిపెట్టారు.ఎమ్మెల్యేపై కేసు నమోదు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మార్కాపురం డీఎఫ్‌ఓకు వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు దాడి చేసిన వారిలో జనసేన నాయకుడు ఉన్నారని చెప్పారు. దీనిపై అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని తొలుత భయపడ్డారు. చివరకు ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలతో పాటు ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దల సూచనతో శ్రీశైలం వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, జనసేన నేత అశోక్‌పై కేసు నమోదు చేశారు.మద్యం సేవించి శ్రీశైలంలో బస! శ్రీశైలంలో మద్యపానం పూర్తిగా నిషేధం. కానీ.. ఎమ్మెల్యే, వారి అనుచరులు పూటుగా మద్యం సేవించి అటవీ సిబ్బందిపై బూతులతో విరుచుకుపడి, దాడి చేయడమే కాకుండా శ్రీశైలంలోని ఓ అతిథిగృహంలో బస చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, అదీ తన సొంత నియోజకవర్గం శ్రీశైలంలో మద్యం మత్తులో బస చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పే అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తన సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేయడం, మద్యం సేవించి శ్రీశైలంలో బస చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ జరుగుతోంది. ఉపేక్షించేది లేదు: అటవీశాఖ డీడీతమ సిబ్బందిపై దాడి చేసిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ పేర్కొన్నారు. తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటనను ఆయన ఖండించారు. ఇటువంటి దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు. బాధిత సిబ్బంది శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారని, ఆ ఫిర్యాదుతో పాటు తాము శాఖాపరంగా విచారణ జరుపుతామన్నారు. బాధితుల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చెందిన వారున్నారని, దోషులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు దాడులు, కిడ్నాప్, దోపిడీ లాంటి కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.తక్షణం చర్యలు తీసుకోవాలి: ఫారెస్ట్ అధికారుల సంఘంఅటవీ శాఖాధికారిపైన, సిబ్బందిపైన దాడికి పాల్పడిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ మార్కాపురం ప్రాంత అధ్యక్షుడు పి.కరీముల్లా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ నెక్కంటి డిప్యూటీ రేంజ్ అధికారి డి.రామానాయక్, ఎఫ్ఎస్ఓ జె.మోహన్‌కుమార్, ఎఫ్బీఓ టీకే గురువయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాను శ్రీశైలం శిఖరం వద్ద అటకాయించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, దాదాపు 30 మంది అనుచరులు దాడి చేశారన్నారు. సిబ్బందిని వాహనంలో కిడ్నాప్ చేసి తీవ్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. సిబ్బంది వద్ద ఉన్న వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు, నగదు, వ్యక్తిగత వస్తువులు కూడా అపహరించారని వివరించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఫారెస్ట్ సిబ్బందిని విడిచి పెట్టారని, దాడికి గురైన వారంతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని ఆయన తెలిపారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ తక్షణమే స్పందించాలని, సీఎం చంద్రబాబు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, దాడికి పాల్పడిన వారు తమ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని, వారికి చట్టపరమైన శిక్ష పడేవరకు తాము విధులను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సంఘం సభ్యులు డి.శివశంకర్, జె.ఫిలిప్, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బ్యాంకింగ్ వ్యవస్థపై ఫిర్యాదుల గుదిబండ
భారత బ్యాంకింగ్ రంగం అధిక మొత్తంలో ఖాతాదారుల ఫిర్యాదులతో సతమతమవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టెయినబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్ఎస్ఆర్) ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అత్యధికంగా ఖాతాదారుల ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్ ముందుస్థానంలో ఉంది. సర్వీస్ డెలివరీ, డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ‘ఇతర’ కేటగిరీల కింద సమస్యలు పెరిగాయి. ఇందులో సైబర్ సెక్యూరిటీ, అత్యవసర సర్వీసులు అందించడంలో ఆలస్యం జరగడం వంటివి ఉన్నాయి.టాప్‌లో ఎస్బీఐ2025 బీఆర్ఎస్ఆర్ ప్రకారం ఎస్బీఐ అనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి 6.87 లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అదనంగా రుణ మంజూరుతో సహా అత్యవసర సేవలను ఆలస్యంగా అందించినందుకు 12,502 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరం కంటే 7,223 పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 24.02 లక్షల ఫిర్యాదులతో పోలిస్తే ఎస్బీఐ ‘ఇతర’ కేటగిరీ కింద 21.50 లక్షల ఫిర్యాదులను నివేదించింది. ఈ కేటగిరీలో సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ ఆలస్యం.. వంటివాటి పరిధిలోకి రాని ఇతర ఫిర్యాదులు ఉంటాయి. అయితే, పారదర్శకత, ప్రతిస్పందనను మెరుగుపరచడానికి ఉద్దేశించిన బహుళ ఫిర్యాదుల పరిష్కార మార్గాలను బ్యాంక్ హైలైట్ చేసింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 2024 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 11.30 లక్షల ఫిర్యాదు సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగి 11.39 లక్షలకు చేరింది.బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)కి 5.34 లక్షల ఫిర్యాదులు రాగా, వీటిలో ఎక్కువ భాగం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ సేవలు, ఏటీఎం/డెబిట్ కార్డు సంబంధిత సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.ప్రైవేట్ బ్యాంకులు ఇలా..ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్‌లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదయ్యాయి. నిత్యావసర సేవల్లో జాప్యానికి సంబంధించి 4.97 లక్షల ఫిర్యాదులు రాగా, మార్చి నెలాఖరు నాటికి 8,782 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ‘ఇతర’ కేటగిరీ కింద 76,111 ఫిర్యాదులు రాగా, ప్రకటనలకు సంబంధించి 12,744, వాణిజ్య పద్ధతులకు సంబంధించి 4,438 ఫిర్యాదులు వచ్చాయి.ఐసీఐసీఐ బ్యాంక్‌లో సర్వీసుల ఆలస్యం ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 5.34 లక్షల ఫిర్యాదులను నివేదించింది. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 45,151 కేసులు పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.హెచ్డీఎప్సీ బ్యాంక్‌లో ‘ఇతర’ కేటగిరీ కింద 4.42 లక్షల ఫిర్యాదులు అందాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల నుంచి ఇది తగ్గింది. 16,133 ఫిర్యాదులు ఇప్పటికీ పరిష్కరించలేదు.ఇదీ చదవండి: స్పెషాలిటీ స్టీల్ తయారీకి ప్రోత్సాహకాలు?ప్రధాన రుణదాతల్లో కస్టమర్ ఫిర్యాదులు స్థిరంగా పెరుగుతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను స్వీకరించడం, సర్వీస్ డెలివరీ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల్లో అంతరాలను ఇది సూచిస్తుంది. బ్యాంకులు వాటి సర్వీసులు, సామర్థ్యాలను విస్తరించినప్పటికీ, అపరిష్కృత సమస్యలు, ముఖ్యంగా అత్యవసర సేవలను పరిష్కరించాల్సిన కార్యాచరణను హైలైట్ చేస్తుంది. -
మమ్మల్ని తరిమేశారు..
-
టీడీపీ అరాచకాలపై YSRCP నేతలు ఫిర్యాదు
-
పులివెందులలో టీడీపీ అరాచకాలు.. డీజీపీ ఆఫీస్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై తక్షణం స్పందించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం ఆదివారం.. డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. గత నాలుగు రోజులుగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, అందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు.దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో పోలీసులు ఇంతగా అధికారపార్టీకి లొంగిపోయి, చట్టాలనే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీ ఇప్పటికైనా స్పందించి, ప్రజాస్వామ్య రక్షణకు, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా పార్టీ నేతలు వినతిపత్రంలో కోరారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా పోలీసుల తీరు: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉంది. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒకవైపు, కూటమి పార్టీలు మరోవైపు పోటీ చేస్తున్నాయి. కానీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు చూస్తుంటే, పోటీ కూటమి పార్టీలతో కాదు, పోలీసులతోనే అని అర్థమవుతోంది.పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారు. దాడులకు గురైన మా పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తారు. బైండోవర్ పేరుతో ప్రతిరోజూ స్టేషన్లో గంటల తరబడి నిర్బంధిస్తారు. దాడులకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకు పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు. ఇదీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిస్తే, అది పోలీసులు గెలిచినట్లుగా భావించాలి. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి గురించి వినలేదు.డీజీపీ ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి.. పోలీస్ విభాగం అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్లా పనిచేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్షంగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కూడా డీజీపీ నుంచి సమయం ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు? ఎవరి ఒత్తిడితో డీజీపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతినిధి బృందం నుంచి కనీసం స్వేచ్ఛగా వినతిపత్రంను కూడా తీసుకోలేని నిస్పహాయ స్థితిలో ఉన్నారు? మరోవైపు ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను కిలోమీటర్ల దూరంలోని వేరే గ్రామాలకు మార్చేశారు. ఓటర్లు ఏ ధైర్యంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? పోలీసులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకునే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును టీడీపీ గూండాలు కాలరాస్తుంటే, పోలీసులు వారికి అండగా నిలబడటం దారుణం. ఇప్పటికైనా డీజీపీ కళ్లు తెరవాలి.రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పోలీస్ టోపీపై కనిపించే మూడు సింహాలు నీతీ, నిజాయితీ, ధైర్యం కు మారుపేరు అని ఇప్పటి వరకు ప్రజలు భావిస్తూ వచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీతో పోలీసులు కుమ్మక్కై అరాచక శక్తులకు అండగా నిలుస్తున్న వైనంను చూసిన తరువాత వారి టోపీపై కనిపిస్తున్నవి టీడీపీ, జనసేన, బీజేపీలు మాత్రమే. ఖాకీ యూనిఫారం తీసేసి, పచ్చచొక్కాలతో పోలీసులు పనిచేస్తున్నారు. పులివెందుల్లో జరిగే చిన్న ఎన్నికల్లో ఒక పెద్ద యుద్దంగా మార్చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, పోలీసులు నిర్భందంలోకి తీసుకుంటున్నారు. మరోవైపు నేరుగా టీడీపీ గూండాలు నామినేషన్ వేసిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఒక ఎమ్మెల్సీగా ఉన్న నాపైనే నేరుగా దాడిచేసి, హతమార్చేందుకు ప్రయత్నించారంటేనే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న నాకే రక్షణ లేని పరిస్థితి ఉంటే, ఒక ప్రతిపక్షంలోని కార్యకర్తల పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీకి బీసీలంటేనే చాలా చులకనభావం. ప్రతిపక్షంకు చెందిన మాజీ మంత్రి విడతల రజిని, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక, ఇప్పుడు నాపైన జరిగిన దాడులే దీనికి నిదర్శనం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే దానికి కూడా సరైన విధంగా స్పందించకపోవడం దారుణం. చట్టాన్ని కాపాడే స్థానంలో ఉన్న వారే చట్టాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే మాటకే విలువ ఉండదు. రాజ్యాంగ స్పూర్తిని నీరుగారుస్తున్నారు: మేరుగు నాగార్జునపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నంచి టీడీపీకి చెందిన వారు దాడులు, దౌర్జన్యాలతో మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం పాలు చేసేలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పులివెందుల్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉప ఎన్నికలో స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను, కార్యకర్తలను కూడా భయబ్రాంతులకు గురి చేసేందుకు తెగబడ్డడారు.ఈ నెల అయిదో తేదీన ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులుపై కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్ళతో పది వాహనాల్లో వచ్చిన టీడీపీ అరాచక శక్తులు దాడికి పాల్పడ్డాయి. ఏకంగా వారి వాహనాలపై పదిలీటర్ల పెట్రోల్ కుమ్మరించి వారిని సజీవంగానే దహనం చేసే దారుణానికి సిద్ధపడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములు గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వద్దకు వెళితే ఆయన కూడా పట్టించుకోలేదు. దీనిపై చట్టప్రకారం పోలీసులు వ్యవహరించేలా చూడాలని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.ఆయన దీనిపై స్పందిస్తూ పత్తేపారం కోసం ఆ గ్రామానికి వెళ్ళారా... మేం ఉండబట్టే తలలు పగిలాయి, లేకపోతే తలలు తెగిపోయేవే' అంటూ చాలా హేళనగా మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ పచ్చచొక్కాలు వేసుకున్న వారిలా అధికారపార్టీకి అండగా నిలబడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని పోలీస్ వ్యవస్థే నీరుగారుస్తోంది. పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడా భయపడకుండా ముందుకు సాగుతుంటే, దానిని కూడా సహించలేక ఎవరైతే మాపైన దాడుల చేశారో వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని, బాధితులైన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ అరాచకానికి, పోలీస్ వ్యవస్థ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషంగా చంద్రబాబు పాలన సాగుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.పులివెందులలో టీడీపీ దౌర్జన్యం: మల్లాది విష్ణుమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పులివెందులలో టీడీపీ దౌర్జన్యం చేసి హింసను ప్రోత్సహిస్తోంది. మా నాయకులపై బైండోవర్లు పెట్టించారు. పోలింగ్ స్టేషన్లు నాలుగు కిలోమీటర్ల దూరానికి మార్చేశారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని టీడీపీ చూస్తోంది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ దిగజారిపోయి వ్యవహరిస్తోంది. కర్రలు, రాళ్లు, కత్తులు పట్టుకుని రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసుల తీరు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టంమవుతోందిటీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలపై రివర్స్‌లో కేసులు పెడుతున్నారు. ఈ మొత్తం తతంగానికి బాస్ డీజీపీనే. బాధితులపైనే తిరిగి కేసులు పడుతున్నారు. పోలీసుల తీరును న్యాయ స్థానాలు తప్పుపడుతున్నా వారు మారడం లేదు. పులివెందులలో మంత్రులకు,ఇతర ఎమ్మెల్యేలకు పనేంటి?. బయటి ప్రాంతాల నుంచి పులివెందులలో తిష్టవేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలను తక్షణమే పులివెందుల నుంచి బయటికి పంపించాలి. సత్వరమే డీజీపీ చర్యలు తీసుకోవాలి. డీజీపీ వాట్సాప్ నెంబర్‌కు కూడా మా ఫిర్యాదును పంపిస్తాం. టీడీపీ రౌడీయిజం, గూండాయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత డీజీపీ పైన ఉంది.చంద్రబాబు పతనానికి ఇది నాంది: మేయర్ భాగ్యలక్ష్మివిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మేమేమీ సంఘ విద్రోహ శక్తులం కాదు. మేం ప్రజాప్రతినిధులం. డీజీపీ కార్యాలయంలోకి మమ్మల్ని పంపించడానికి సమాలోచనలు చేయడమేంటి?. మేం చెప్పులరిగేలా ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నాం. మాట్లాడితే నేను 40 ఏళ్ల సీనియర్‌నంటూ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. పులివెందుల ఎన్నికల్లో ఇంతలా దిగజారిపోవాలా?. చంద్రబాబు పతనానికి ఇది నాంది గుర్తుంచుకోండి. -
విశాఖలో ఆటీన్ రాణులు
విశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లే్ల పేకాట డెన్లు జూద క్రీడ అంటే టక్కున గుర్తొచ్చేది మగ మహరాజులే. ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్‌గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్‌గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది. భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్‌గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
టీడీపీ గూండాల అరాచకంపై గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల అరాచకం, నిర్వీర్యమైన శాంతిభద్రతలు, అధికారపార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై విజయవాడలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్‌ను కలిశారు.ఈ సందర్బంగా పులివెందుల్లో టీడీపీ గూండాలు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తున్నారో అన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి చేసి, ఎలా గాయపరిచారో తెలియచేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా టీడీపీకి చెందిన గూండాలు పది వాహనాల్లో వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రవి, ఇతరులను హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడులు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. బీసీ నాయకుడు రమేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే, పట్టించుకోకుండా ఉన్నారు.కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోంది. ఆయన మాటలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరాం. ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేశాం. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం.ఆ విషయాన్ని కూడా గవర్నర్‌కు వివరించాం. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనంను ఆధారాలతో సహా గవర్నర్‌కు తెలియచేశాం. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడిన మాటలు పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. అన్ని సందర్భాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. వ్యవస్థలు చట్టప్రకారం పనిచేయాలే తప్ప రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకూడదు.గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నౌడు వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
భార్య పేకాట ఆడుతుందంటూ భర్త ఫిర్యాదు
సాక్షి,విశాఖ: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట ముఠా గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పేకాట ఆడుతున్న మహిళలు స్థానికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆగడాల్ని తట్టుకోలేని పేకాట ఆడుతున్న ఓ మహిళ భర్త సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయారు. పేకాట ఆడటం.వాగ్వాదానికి దిగడం.. అడ్డు చెప్పిన వారిపై దాడులకు తెగబడ్డారు.ఈ క్రమంలో స్థానికులు వరుస ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పులివెందులలో టీడీపీ రౌడీ రాజకీయాలు.. పోలీసులకు ముందే తెలుసు
పులివెందులలో బీసీ నేత.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ శ్రేణుల దాడికి పాల్పడడంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. జెడ్పీటీసీ ఉపఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. పోలీసులకు తెలిసే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని అంటోంది.సాక్షి, విజయవాడ: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్సీపీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి గాయపడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఓ వినతి పత్రం అందజేసింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబుకి వయసు పెరిగేకొద్దీ బుద్ధి సన్నగిల్లుతోంది. పులివెందులకు టీడీపీ గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. కత్తులు, రాళ్లతో దాడి చేసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి చంపాలని చూశారు. అక్కడి పోలీసులకు తెలిసే ఇదంతా జరిగింది. పథకం ప్రకారమే చంపేందుకు ప్రయత్నించారు. ఏదోరకంగా రౌడీయిజం చేసి ఎన్నిక గెలవాలని చూస్తున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు. రేపు జగన్ వచ్చాక పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో పోలీస్ యంత్రాంగం ఉందా?. టీడీపీ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కావాలనే వందల మందిని బైండోవర్ చేస్తున్నారు అని అన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అరాచకం,దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారు. పులివెందులలో టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు, అధికారులను చట్టం ముందు నిలబెడతాం అని అన్నారు.అంతకు ముందు.. పులివెందుల దాడి ఘటనను ఖండిస్తూ ఎన్నికల కమిషనర్ కార్యాలయం బయట వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులు
సాక్షి టాస్క్‌పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్‌లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్‌కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు. -
పవన్ కళ్యాణపై కేసు
-
టీడీపీ ఎమ్మెల్యే థామస్‌కు బిగ్ షాక్
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పీఏ చంద్రశేఖర్‌పై టీడీపీ నేతలే జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.థామస్ పీఏ చంద్రశేఖర్‌ను విధులు నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసిగట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పీఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు కోరారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, టీడీపీ పార్టీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.‘‘టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పీఏ చంద్రను వెంటనే తొలగించాలి. అతని ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరుతున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ నలుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని కోట్లు దోచుకుంటున్నారు’’ అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. -
Parliament: ‘విదేశాంగ విధానాల్లో ప్రభుత్వ వైఫల్యం?’.. చర్చకు ఇండియా కూటమి కసరత్తు
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు తగిన వ్యూహాన్ని రూపొందించేందుకు 24 పార్టీల ఇండియా కూటమి నేతలు ఆన్లైన్లో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, డీలిమిటేషన్ తదితర అంశాలపై అధికార ప్రభుత్వంతో చర్చించాలని వారు తీర్మానించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. INDIA bloc parties discuss key issues ahead of monsoon session of ParliamentRead @ANI Story | https://t.co/83WAD84ikS#INDIABloc #Parliament #MonsoonSession pic.twitter.com/yDCinNKDFB— ANI Digital (@ani_digital) July 19, 2025ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను ఘాటుగా తిప్పికొట్టకపోవడాన్ని ప్రతిపక్షం హైలైట్ చేస్తుందని ఇండియా కూటమి నేతలు తమ వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగా ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని కూడా పార్టీలు నిర్ణయించాయి . అలాగే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌ను కూడా లేవనెత్తాలని ప్రతిపక్ష నేతలు యోచిస్తున్నారు.విలేకరులను ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మాట్లాడుతూ తమ కూటమి నేతలు ఎనిమిది ప్రాధాన్యతా అంశాలను ఈ జాబితాలో చేర్చారని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ దాడిలో పాల్గొన్న ముష్కరులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. భారత్-పాక్ మధ్య శాంతి స్థాపన చేసేందుకు.. తమ వాణిజ్య ఒప్పందాన్ని చర్చల కార్డుగా ఉపయోగించుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారని, దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని తాము సభలో ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ అంశాలపై చర్చించే సమయంలో ప్రధాని హాజరవుతారని తాము ఆశిస్తున్నామని తివారీ పేర్కొన్నారు. ఈ ప్రతిపక్షాల సమావేశంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఇండియా కూటమి పార్టీల పలువురు నేతలు పాల్గొన్నారు. -
అసభ్యంగా దూషిస్తున్నారు.. ఆయన తరగతికి వెళ్లం!
వజ్రకరూరు: ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో ఆయన క్లాసుకు వెళ్లేది లేదని విద్యార్థినులు తెగేసి చెప్పారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని చిన్నహోతురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, అందువల్ల ఆయన తరగతికి వెళ్లబోమని విద్యార్థినులు కన్నీరు పెట్టుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగిన ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులు ఒక దశలో చేయిచేసుకోబోయారు. తోటి ఉపాధ్యాయులు అతికష్టం మీద తల్లిదండ్రులను ఆపారు. కాగా, గణితం తరగతికి వెళ్లబోమని హెచ్ఎంకు విద్యార్థినులు ఈ సందర్బంగా లేఖ అందించారు.చర్యలకు ఉన్నతాధికారుల సిఫారసువజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, ఎంఈఓ ఎర్రిస్వామి తదితరులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ప్రవర్తన బాగోలేదని విచారణలో తేలడంతో చర్యల కోసం డీఈఓ ప్రసాద్‌బాబుకు సిఫారసు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. కాగా, సతీష్ కుమార్ గతంలో చాబాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసినప్పుడు, ఆయన వ్యవహారశైలి బాగోకపోవడంతో అక్కడి ప్రధానోపాధ్యాయుడు డీవైఈఓకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అప్పటి ఘటనలపైనా అధికారులు దృష్టి సారించారు. -
పోలీసులకు ఫిర్యాదు చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎందుకంటే!
ప్రముఖ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ (24) పోలీసులను ఆశ్రయించింది. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబయిలోని అంబోలి స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన బీరువాలోని రూ.4 లక్షల నగదు చోరీ చేశాడని జూలై 9న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. సచిన్ కుమార్ మార్ చౌదరి గత ఐదు నెలలుగా ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారని పోలీసులకు తెలిపింది. కాగా.. బిగ్‌బాస్ బ్యూటీ కశిశ్ కపూర్ బీహార్ స్వస్థలం కాగా.. ప్రస్తుతం ముంబయి అంధేరి వెస్ట్‌లోని ఆజాద్‌నగర్ వీర దేశాయ్ రోడ్‌లోని సొసైటీలో నివసిస్తోంది. ఆమె సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. -
కృష్ణా జిల్లా ఎస్పీని కలిసిన జడ్పీటీసీలు
సాక్షి, కృష్ణా జిల్లా: జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి కృష్ణా జిల్లా జడ్పీటీసీలు ఫిర్యాదు చేశారు. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి సమాజం తలదించుకునేలా ఉందని జడ్పీటీసీలు అన్నారు. హారికపై దాడిని తీవ్రంగా ఖండించారు.కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు, గౌరవం లేదు. ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం.. సామాన్య ప్రజలకు, మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని కోరామని జడ్పీటీసీలు తెలిపారు.ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జడ్పీటీసీలు మండిపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ పదవిలో ఉన్న మహిళకే రక్షణ లేకుండా పోయింది. జిల్లా ప్రథమ పౌరురాలికే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?. ఆడపిల్లకు కష్టం కలిగితే తాట తీస్తామని చంద్రబాబు, పవన్ కబుర్లు చెబుతున్నారు. అయ్యా పవన్ ఎక్కడున్నావ్?. గుడివాడలో ఇంత జరిగితే ఏం చేస్తున్నావ్? ఎందుకు తాట తీయడం లేదు?’’ అంటూ జడ్పీటీసీలు ప్రశ్నించారు.గుడివాడలో ఉప్పాల హారిక కారు పై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి. రక్షించాల్సిన పోలీసులు టీడీపీ భటుల్లా మారారు. గంటన్నర పాటు టీడీపీ, జనసేన గూండాలు హారిక కారును నిర్భంధిస్తే పోలీసులు చోద్యం చూశారు. కృష్ణాజిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జడ్పీటీసీలు డిమాండ్ చేశారు. -
గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు
-
ఈసీకి జ్ఞానోదయం కలగాలి!
ఏ ఫిర్యాదు వచ్చినా, ఎలాంటి సమస్య ముంచుకొచ్చినా తక్షణం స్పందించాల్సిన బాధ్యతల్లో ఉన్నవారు మౌనంగా ఉండిపోతే అనుమానాలు బలపడతాయి. అలాంటివారి తటస్థత ప్రశ్నార్థకమవుతుంది. నిరుడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లొసుగులపై అప్పట్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. కానీ ఎన్నికల సంఘం(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. ఏడాదికాలం గడిచాక ఎట్టకేలకు గురువారం ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు ఆ ఫిర్యాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల వివరణల్ని విన్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల నిర్వహణ లోపరహితంగా ఉండాలి. అనుమానాలకు తావీయకూడదు. కానీ ఏపీలో ఆద్యంతమూ అందుకు విరుద్ధంగా నడిచింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదట్లోనే కూటమి నాయకులు ఫిర్యాదు ఇవ్వటం తడవుగా జిల్లాల్లో ఉన్నతాధికారుల్ని మార్చారు. అయిదేళ్లుగా అమలవుతున్న పథకాలను సైతం ఆపేయాలని ఆదేశించారు. నిర్ణయం తీసుకునేముందు కనీసం కూటమి నేతల ఆరోపణలకు ఆధారాలున్నాయో లేదో చూసుకోవాలన్న స్పృహ కూడా లేకపోయింది. ఫలితంగా అలాంటి జిల్లాల్లో పోలింగ్ రోజున ఎన్ని అవకతవకలు చోటుచేసుకున్నాయో మీడియా సాక్షిగా బయటపడింది. చాలా గ్రామాల్లో బడుగు వర్గాల్ని ఓటేయకుండా భయభ్రాంతులకు గురిచేశారు. వారి దౌర్జన్యాలకు అనేకమంది తలలు పగిలాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొంపా గోడూ వదిలి చెట్లల్లో పుట్టల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అటు తర్వాత ఇక ఎదురులేదనుకుని ఈవీఎంలను దొంగవోట్లతో నింపేశారు. వీటిపై ఏ క్షణానికాక్షణం ఫిర్యాదులు వెల్లువెత్తినా దిక్కులేకుండా పోయింది. పోలైన నాలుగు కోట్లకుపైగా ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఇదంతా మాయాజాలం అనిపించదా? ఎన్నికలు ముంగిట్లోకొచ్చాక ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై వదంతులు వ్యాపింపజేసినా ఈసీలో వెంటనే కదలిక లేదు. అటు తర్వాత చంద్రబాబు, లోకేష్‌లపై కేసుపెట్టాలని ఆదేశించారు సరే... దాని అతీగతీ ఏమిటో ఎవరికీ తెలియదు. వేరే రాష్ట్రాల్లో విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని ఏమైనా అంటే నొచ్చుకుని వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన ఈసీ... అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టాలని బాబు నోరు పారేసుకున్నా చోద్యం చూసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే లెక్కింపు నాడు వెల్లడైన వైపరీత్యాలకు అంతూ దరీ లేదు. పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలున్నాయి. నిరుడు మే నెల 13న రాత్రి 8 గంటలకు ఏపీ పోలింగ్ శాతం 68.12 అని ఈసీ ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి 76.50 శాతమన్నారు. మరో నాలుగు రోజులకల్లా అది 80.66 శాతం అని మాట మార్చారు. మొదట, చివరి ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడా ఉంది. గతంలోనూ మారిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఈ తేడా ఒక శాతంకన్నా ఎప్పుడూ ఎక్కువ లేదు. పర్యవసానంగా సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది 87 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించింది. అంతేనా... పోలింగ్ ముగిసిన రోజున ఈవీఎంలలో ఉన్న చార్జింగ్ శాతం కౌంటింగ్ రోజుకు అమాంతం పెరిగింది. పదో, పదిహేను శాతమో చార్జింగ్ ఉన్నట్టు కనబడింది కాస్తా 98 శాతానికి ఎగబాకింది. రీచార్జబుల్ బ్యాటరీలు కనుక అలాంటిది జరగదని చెప్పటం తప్ప ఈసీ దగ్గర సంతృప్తికరమైన జవాబు లేకపోవటం దిగ్భ్రాంతికరం.బాహాటంగా బయటపడిన ఇలాంటి అవకతవకల పర్యవసానంగానే ఈవీఎంలలోని ఓట్లూ, వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్యనూ లెక్కేసి, అవి ఒకదానితో ఒకటి సరిపోయాయో లేదా తేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లు ఇవ్వాలని కూడా కోరింది. ఇవేమీ గొంతెమ్మ కోరికలు కాదు. నదురూ బెదురూ లేకుండా కూటమి నేతలు తిమ్మిని బమ్మి చేసిన పర్యవసానంగానే వైఎస్సార్ కాంగ్రెస్ ఈ డిమాండ్లు చేసింది. తమ నిర్వాకం కళ్లముందు కనబడుతున్నప్పుడు మొండిగా అవేమీ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పటం ప్రజాస్వామికమేనా? అసలు సీసీ టీవీ ఫుటేజ్‌లూ, వీవీ ప్యాట్లూ ఎందుకొచ్చాయో, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎన్నికల ప్రక్రియలో వాటిని చేర్చాల్సివచ్చిందో సీఈసీకి, మరో ఇద్దరు కమిషనర్లకూ తెలుసా? ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు వాటిని నివృత్తి చేయటం వారి బాధ్యత కాదా? కనీసం హేతుబద్ధమైన జవాబైనా ఇచ్చే ప్రయత్నం చేయొద్దా? ఈసీ తీరు దేవతా వస్త్రాల కథను తలపిస్తోంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసి సీసీ కెమెరాలూ, వీవీ ప్యాట్లు సమకూర్చుకోవటం, వాటిని ఉపయోగంలోకి తీసుకురావటం– తీరా రాజకీయ పార్టీలు సందేహం వెలిబుచ్చినప్పుడు వెల్లడించటం కుదరదని మొండికేయటం, నిబంధనలు ఒప్పుకోవనటం ఏం నీతి? పారదర్శకత లేని ఎన్నికలు జరపటం ఎవర్ని ఉద్ధరించటానికి? ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలకూ శిరోధార్యం రాజ్యాంగం. అది నిర్దేశించిన ప్రకారం నడుచుకోవాలి తప్ప ఇతరేతర ప్రభావాలకు లోను కాకూడదు. మళ్లీ బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్ సర్వత్రా వినిపించటానికి తమ నిర్వాకం కూడా కారణమని ఈసీ తెలుసుకోవాలి. ఈసీ తటస్థతపై తలెత్తుతున్న సందేహాల కారణంగానే ఇప్పుడు బిహార్‌లో ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితాల నవీకరణకు చేస్తున్న ప్రయత్నాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికైనా ఈసీ వైఖరి మారాలి. పారదర్శకంగా వుండే ప్రయత్నం చేయాలి. -
గవర్నర్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
అర్ధరాత్రి వీడియో కాల్స్.. మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులను చీఫ్ కంట్రోలర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. చీఫ్ కంట్రోలర్ వేధింపులను భరించలేక మంత్రి సీతక్కకు ఆ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని.. అర్ధరాత్రి వీడియో కాల్స్, జిల్లా టూర్లతో వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.చీఫ్ ఇంజనీర్ వేధింపులు భరించలేక పలువురు మహిళలు ఉద్యోగం మానేసినట్లు సదరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫిర్యాదుతో మంత్రి సీతక్క విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రెటరీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహిళా మంత్రి శాఖలో మహిళలపై వేధింపుల అంశంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆన్లైన్ ఫార్మసీలకు చెక్!
ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫార్మసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే టాటా 1ఎంజీ, ఫార్మ్ఈజీ, నెట్మెడ్స్లాంటి దిగ్గజ ప్లాట్‌ఫాంలు వేగంగా విస్తరిస్తుండటంతో పాటు కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పేకి చెందిన పిన్‌కోడ్ ఈ మధ్య బెంగళూరు, పుణే, ముంబైలో 10 నిమిషాల్లోనే ఔషధాల డెలివరీ సరీ్వసును ప్రారంభించింది. ఇక ప్రైవేట్ ఫార్మసీ చెయిన్ దవా ఇండియా సంస్థ పుణేలో 60 నిమిషాల్లో డెలివరీ సేవలు అందిస్తోంది. అటు ఓటీపీ వెంచర్స్ నుంచి 2.4 మిలియన్ డాలర్లు సమీకరించిన జీల్యాబ్ ఫార్మసీ కూడా ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో 60 నిమిషాల్లో ఔషధాలు అందిస్తోంది. వీటిలో కొన్ని ప్లాట్‌ఫాంలు కస్టమర్లను సమీపంలోని మెడికల్ స్టోర్స్‌తో అనుసంధానం చేస్తుండగా, మరికొన్ని తమ డార్క్ స్టోర్స్ (గిడ్డంగులు) ద్వారా వినియోగదారులకు నేరుగా ఔషధాలను అందిస్తున్నాయి. ఔషధాలతో పాటు మెడికల్ పరికరాలు, ఇతరత్రా అధిక మార్జిన్ ఉండే ఉత్పత్తులు మొదలైనవి విక్రయిస్తున్నాయి. అయితే, సదరు సంస్థలు సత్వరం ఔషధాలను అందిస్తున్నప్పటికీ కొన్ని విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఔషధాల ప్రిస్కిప్షన్, ఆర్డర్ ఇచ్చిన వారి వయస్సు మొదలైన వివరాలను ఈ–ఫార్మసీలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఇవి మరింతగా పెరిగాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీల నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి.హోమ్ డెలివరీని నిలిపివేయాలి: ఏఐవోసీడీ ఇంటివద్దకే ఔషధాల సరఫరా సేవలను తక్షణం నిలిపివేయాలంటూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో అత్యవసర వేళల్లో పేషెంట్ల సౌకర్యార్థం ఈ సరీ్వసులను ప్రవేశపెట్టారని, ప్రస్తుతం అటువంటి అత్యవసర పరిస్థితుల్లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఏఐవోసీడీలో ప్రస్తుతం 12.4 లక్షల మంది కెమిస్టులు, డ్రగ్గిస్టులు సభ్యులుగా ఉన్నారు. క్రిసిల్ నివేదిక ప్రకారం దేశీయంగా మొత్తం రిటైల్ ఫార్మసీ మార్కెట్ 2.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో అసంఘటిత విభాగం వాటా 85 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫార్మసీల వాటా 3–5 శాతంగా ఉంది. కొన్ని సంపన్న దేశాల్లో ఇది 22–25 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.కొత్త చట్టంపై ప్రభుత్వం కసరత్తు.. సత్వరం ఔషధాలను అందిస్తున్న ఈ–ఫార్మసీల నియంత్రణకు ప్రస్తుతం నిర్దిష్ట చట్టం అంటూ లేదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు ఆన్లైన్ ఫార్మసీలకు నిర్దిష్టంగా చట్టబద్ధత కల్పించకపోవడం, స్పష్టత లోపించడం వల్ల, ప్రస్తుత నిబంధనల స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఔషధాల ఆన్లైన్ అమ్మకాలను కూడా చేరుస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945ని మార్చేలా 2018లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా సవరణలను ప్రతిపాదించింది. వీటిపై తమకేవైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియజేయాలంటూ ఓ నోటిఫికేషన్లో సంబంధిత వర్గాలను కోరింది. అయితే, ఈ నోటిఫికేషన్‌ను కెమిస్టుల సమాఖ్య సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 2018 డిసెంబర్లో లైసెన్సు లేని ఆన్లైన్ ఫార్మసీలు ఔషధాలను విక్రయించడంపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేయనున్న వరంగల్ నేతలు
-
పక్కా కుట్రతోనే టీడీపీ నేతల దాడులు.. డీజీపీకి సాక్షి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా తమ కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు తెగపడుతుండడంపై సాక్షి మీడియా సంస్థ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఉదయం సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి ఫిర్యాదు అందజేసింది. ఏపీలో సాక్షి యూనిట్‌తోపాటు ప్రాంతీయ కార్యాలయాలపై టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు జరిపిన దాడులు.. ఆస్తులు విధ్వంసం తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సాక్షి ప్రతినిధుల బృందం కోరింది. తద్వారా రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని తెలిపింది. మహిళలు, బాలికలతో పాటు అన్ని వర్గాల పట్ల సాక్షి మీడియా పూర్తి గౌరవంతో వ్యవహరిస్తోందని, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను సాక్షి మీడియా సమర్థించదని, పక్కా కుట్రతోనే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీకి స్పష్టం చేసింది. కార్యాలయాలపై దాడికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించాలని ఆయన్ని సాక్షి బృందం కోరింది.ఏపీ పోలీస్ హెడ్క్వార్టర్స వద్ద సాక్షి ప్రతినిధుల బృందం -
టీడీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలు సోమవారం కుట్ర పూరితంగా దాడులు చేయడాన్ని ఖండిస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల్లో సాక్షి జర్నలిస్టులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల ‘సాక్షి’ కార్యాలయాల గేట్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడటం దుర్మార్గం అని చెప్పారు.‘సాక్షి’ నేమ్ బోర్డులను ధ్వంసం చేసి తగులబెట్టడం, కార్యాలయ గేట్లు, ప్రహరీ పైకి ఎక్కి సిబ్బందిపై దాడికి ప్రయత్నించడం సరైన చర్యలు కాదన్నారు. వారి చర్యల వల్ల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయోత్పాతానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై తక్షణ విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని, సాక్షి కార్యాలయ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ‘సాక్షి’ కార్యాలయాల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైం అని, టీడీపీ నేతల దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై సెక్షన్ 143, 147, 427, 341, 506, 352 కింద కేసులు నమోదు చేయాలని కోరారు. -
కన్నడ భాషపై కమల్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు!
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు మండిపడుతున్నారు. కమల్ హసన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను ఉద్దేశించిన కమల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ కౌంటరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. తమిళులకు, మాకు విష బీజాలు నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ సినిమా విడుదలైన ప్రతిసారీ కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంచ్ సందర్భంగా తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.కాగా.. కమల్ హాసన్ వ్యాఖ్యలతో అనేక కన్నడిగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కమల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బెళగావి మరికొన్ని ప్రదేశాలలో కార్యకర్తలు కమల్ పోస్టర్లను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఆయన సినిమా థగ్ లైఫ్ ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా బెదిరించారు. -
తప్ప తాగి.. నాతో అనుచితంగా ప్రవర్తించారు
ఆయనో సీనియర్ పార్లమెంటేరియన్. చట్ట సభకు సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్లో పీకల దాకా తాగారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న యువ సభ్యురాలితో అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఫిర్యాదు దాకా వెళ్లింది. సీనియర్ సభ్యుడొకరు తనను బాగా ఇబ్బంది పెట్టారని ఆస్ట్రేలియా స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమన్(Fatima Payman) ఆరోపణలకు దిగారు. ఈ మేరకు పార్లమెంటరీ వర్క్‌ప్లేస్ సపోర్ట్ సిస్టమ్(PWSS)లో ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ‘‘పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన బాగా తాగారు. నన్ను కూడా తాగి.. టేబుల్ ఎక్కడి డ్యాన్స్ చేయమంటూ బలవంతం చేయబోయారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. .. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి అంటూ కటువుగానే ఆయనకు సమాధానం ఇచ్చా’’ ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సదరు సీనియర్ సెనేటర్ పేరును ఆమె మీడియాకు ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యాఖ్యలు మతపరంగా తన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు లైంగిక వేధింపుల కిందకు వస్తుందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పీడబ్ల్యూఎస్ విచారణ జరుపుతామని ఆమెకు హామీ ఇచ్చింది.అఫ్గన్ సంతతికి చెందిన ఫాతిమా(30).. 2022లో లేబర్ పార్టీ(Labour Party) తరఫున వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఎన్నికయ్యారు. ఆ టైంలో అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. 2024లో పాలస్తీనా తీర్మానం సమయంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా ఓటేశారు. ఈ పరిణామంతో ఆమె లేబర్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: ఇదేం చెండాలం?.. నడిరోడ్డు మీద డర్టీ పిక్చర్ -
టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తున్నారు
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వంలో అధికారులకు వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులే లక్ష్యంగా ప్రారంభమైన వేధింపుల పర్వం.. మండల స్థాయి అధికారులకూ తప్పడం లేదు. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తనను వేధిస్తున్నారని, అసభ్య పదజాలంతో ఫోన్లో దూషించారని సాక్షాత్తు ఓ మండల మేజి్రస్టేట్ ఆవేదన వ్యక్తం చేయడం ఉద్యోగ వర్గాలను విస్మయపరుస్తోంది. ‘‘ఈ నెల 15న రాత్రి 21.59 నిమిషాలకు పార్వతీపురం ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్ చేసి, మహిళ అని చూడకుండా మాటలకు అందని పదజాలంతో నన్ను దూషించారు’’ అంటూ పార్వతీపురం ఎస్ఐకు స్థానిక తహసీల్దార్ వై.జయలక్ష్మి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంటున్న లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది.శుక్రవారం మధ్యాహ్నం జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, సంయుక్త కలెక్టర్ శోభికలను కలిసి కూడా తన ఆవేదన వినిపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడం.. ఆయన దృష్టిలో పెట్టకుండా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకూడదని అధికారులు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలిసింది. ఇదే విషయమై తహసీల్దార్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టకుండా తాను ఏ విషయమూ బయటకు చెప్పలేనని, తర్వాత తానే పిలిచి చెబుతానని అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు విషయం పెద్దది కాకుండా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఏమంటున్నారంటే.. ఈ ఘటనపై పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందించారు. తహసీల్దారు మీద అవినీతి ఆరోపణలు రావడం వల్లే అడిగినట్లు చెప్పారు. పార్వతీపురం మండలంలోని ములగ గ్రామానికి చెందిన రైతుల వద్ద నుంచి డిజిటల్ సిగ్నేచర్ కోసం రూ.10 లక్షలు ఆమె డిమాండ్ చేసినట్లు తెలిసిందని, అందులో ఇప్పటికే రూ.2 లక్షలు కూడా తీసుకున్నట్లు పలువురు చెప్పారని తెలిపారు. -
మాజీ ప్రియురాలిపై దాడి చేసిన యువకుడి అరెస్టు
బంజారాహిల్స్(హైదరాబాద్): మాజీ ప్రియురాలిపై దాడికి పాల్పడటమే కాకుండా ఆమె తాజా బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేసన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన కోటి అఖిల్‌కుమార్(28) బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఉన్నత చదువుల కోసం పోలాండ్ దేశానికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మాజీ ప్రియుడు అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను తరచూ వెంబడిస్తూ ఆమె రాకపోకలపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి క్యాబ్‌లో తార్నాకలోని తన గదికి వెళ్తుండగా ఆమెను అనుసరించి ఆమెకు తెలియకుండా నేరుగా ఆమె గదిలోకి వెళ్లి తాజా ప్రియుడితో కలిసి ఉండగా ఫొటోలు తీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె సెల్‌ఫోన్ లాక్కొని అందులో డేటాను తొలగించి ధ్వంసం చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కన్ను, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
చెరువునే ‘ముద్దాడ’!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తమ్ముడు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారి! అన్న.. అసలే టీడీపీ నాయకుడు.. ఆపై అండగా అధికారం! ఇక ఆగడాలకు అడ్డేముంది? అచ్చెప్ప చెరువు... శోభనాద్రి చెరువు.. ఉప్పరవానిబంద చెరువు.. పాపమ్మ కోనేరు.. భూసమ్మ చెరువు, మంగళివాని చెరువు.. గాది బంద..! చేంతాడు లాంటి ఈ చెరువుల జాబితా ఏమిటనుకుంటున్నారా..? ఇవేవో శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువుల పట్టిక కాదు!! సీఎం చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర సోదరుడు, టీడీపీ నేత శ్రీనివాసరావు వరుసబెట్టి చెరువులను కబ్జా చేసి కలిపేసుకోవటంపై గ్రామస్థులు గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో ముద్దాడ శ్రీనివాసరావు వరుసగా చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపారు. చెరువులను ఆక్రమించడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అక్రమంగా మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా గ్రామం సమీపంలో ఉన్న భూసప్ప కోనేరు వద్ద పశువుల తొట్టెలు నిరి్మస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.రక్షించండి.. ప్రభుత్వ చెరువులను రక్షించాలని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా. ముద్దాడ శ్రీనివాసరావు సోదరుడు రవిచంద్ర ఉన్నతాధికారి కావడంతో యంత్రాంగం అడ్డు చెప్పలేక పోతోంది. చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. పేదలకో న్యాయం పెద్దలకో న్యాయం సరికాదు. – ధర్మాన అనిత, సర్పంచ్, సైరిగాంపేదలపై ఎందుకీ వివక్ష? నాకున్న 20 సెంట్లలో ఆక్రమణలు ఉన్నాయంటూ పొలంలో తవ్వకాలు జరిపి నా కడుపు కొట్టారు. అదే ముద్దాడ శ్రీనివాసరావు తన తమ్ముడి పేరు చెప్పి చాలా వరకూ చెరువులను ఆక్రమించాడు. పేదలపై ఎందుకీ వివక్ష? – ముద్దాడ సింహాచలం. రైతు, సైరిగాంనేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేయలేదు. ఊరుగుండం చెరువులో ఆక్రమణలు తొలగించాం. ఆస్పత్రి ఎదురుగా అచ్చెప్ప కోనేరు అభివృద్ధి కోసం మట్టి వేశా. మా గ్రామస్తులు కొంత మంది నేను ఏదో చేస్తున్నానని ఊహించుకుని బురద జల్లుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే నిరూపించండి. – ముద్దాడ శ్రీనివాసరావు (రవిచంద్ర సోదరుడు), సైరిగాం గ్రామం నివేదిక ఇవ్వాలని ఆదేశించాం.. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాం. ఇప్పటికే నేను వెళ్లి పరిశీలించా. నివేదిక వచ్చాక ఆక్రమణలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జె.రామారావు, తహసీల్దార్, జలుమూరు. -
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
వికారాబాద్: మనిషి జీవితంలో సెల్‌ఫోన్ భాగమైపోయింది. నేడు మొబైల్ ఫోన్ లేని ఇళ్లంటూ లేదు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకు వీటి వాడకం భారీగా పెరిగిపోయింది. 90 శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. ఒక్కో మొబైల్ కోసం రూ.10 వేల నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. ఐదేళ్లుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన కేంద్ర టెలీకామ్ మంత్రిత్వ శాఖ నూతన టెక్నాలజీ (సీఈఐఆర్ పోర్టల్)ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా జిల్లా పోలీసు విభాగం మంచి పురోగతి సాధించింది. భారీగా రికవరీ గత ఏడాది జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి లో 3,647 ఫోన్లు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్ల బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. మరికొన్ని చోట్ల సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మోమిన్‌పేట్, కుల్కచర్ల, తుంకిమెట్ల, మర్పల్లి ప్రాంతాల్లో సంతలు నిర్వహించే సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. జిల్లాలో చోరీకి గురైన ఫోన్ల రికవరీ బాధ్యతను ఎస్పీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీఈఐఆర్ టెక్నాలజీని వినియోగించి దాదా పు రూ.2 కోట్ల విలువ చేసే 1,250 సెల్ ఫోన్లను రికవ రీ చేశారు.తెలంగాణ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి వీటిని స్వాదీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన కొందరు జిల్లాలో సెల్ ఫోన్లను చోరీ చేస్తు న్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లేనని పోలీసులు గుర్తించారు. ఫోన్ పోతే ఏం చేయాలి? సెల్‌ఫోన్ పోయినా.. చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. బాధితులు తమ ఫోన్ ద్వారా www.ceir.gov.in వెబ్ సైట్లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదా మీసేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఫోన్ ఎక్కడ పోయిందో అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఐఎంఈ నంబర్, ఫోన్ నంబర్, మొబైల్ కొన్న సమయంలో పొందిన బిల్, అడ్రస్ తదితర వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మనం ఈ పోర్టల్‌లో నమోదు చేస్తే చోరీకి గురైన ఫోన్ స్టేటస్ చూసుకోవటానికి వీలుంటుంది. దాన్ని ఎవరు.. ఎక్కడ వాడుతున్నారు. అసలు వాడుతున్నారా..? లేదా..? అదే నంబర్‌ను వినియోగిస్తున్నారా..? వేరే నంబర్ వాడుతున్నారా..? లాంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుపడుతుంది. పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు. ఏడాది క్రితం వరకు చోరీకి గురైన ఫోన్ల రికవరీ పోలీసులకు పెద్ద సవాల్‌గా ఉండేది.. దొంగ దొరికితే తప్ప కేసులు కొలిక్కి వచ్చేవి కాదు.. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేసుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.. నేరం చేసిన వారితోపాటు.. చోరీకి గురైన కోట్ల రూపాయల విలువ చేసే సెల్ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కడున్నా దొరికిపోతాయిసీఈఐఆర్ టెక్నాలజీతో దొంగిలించన ఫోన్లు ఎక్కడున్నా కనిపెట్టవచ్చు. కొందరు చోరీ చేసిన మొబైల్స్‌ను గుర్తించకుండా స్పేర్ పార్ట్స్‌గా మార్చి విక్రయిస్తున్నారు. అయినా దొరికిపోతారు. ఫోన్ ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా గుర్తించడాని సీఈఐఆర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత ఆలస్యం కావచ్చు అంతే.. – నారాయణరెడ్డి, ఎస్పీ -
నీవు నాకు తెలుసు.. నీ నంబర్ నా దగ్గర ఉంది..!
వట్పల్లి(అందోల్): ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి వివాహిత మహిళను అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలతోపాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన వట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్ కథనం మేరకు.. మండల పరిధిలోని పల్వట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(35) ఆదివారం జోగిపేటలో చీరలు కొన్నది. చీర డ్యామేజ్ ఉండటంతో తిరిగి ఇవ్వడానికి గురువారం జోగిపేటకు వెళ్లింది. ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా లిఫ్ట్ చేసి మాట్లాడగా.. కొత్త వ్యక్తి అని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేసి నీవు నాకు తెలుసు, నీ నంబర్ నా దగ్గర ఉంది.. అంటూ పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగగా తాను ఉన్న బట్టల షాపు అడ్రస్ చెప్పింది. వెంటనే అక్కడికి వచ్చి వ్యక్తి ఆమె డబ్బులను షాపులో చెల్లించాడు. షాపింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మహిళను బైక్‌పై ఎక్కించుకున్నాడు. అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బ గ్రామ రోడ్డు సమీపంలోకి రాగానే వర్షం రావడంతో తన బైక్‌ను నిలిపాడు. మళ్లీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళను ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్‌పై వట్పల్లి మీదుగా బాధిత మహిళ గ్రామం పల్వట్ల వైపు వెళ్తూ నాగులపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మహిళను దిగమన్నాడు. నన్ను మా ఇంటి దగ్గర దించాలంటూ ఆమె బైక్ దిగలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అతడు మహిళను బయపెట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. బాధిత మహిళ అదే రాత్రి వట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్‌డేటా ఆధారంగా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
Banjara Hills: అడిగిన పాట వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
హైదరాబాద్ : తాను కోరిన పాటను ప్రసారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ యువతి బెదిరించడంతో ఛానల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఓ టీవీ ఛానెల్ రోజూ మ్యూజిక్ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తుంది. ఓ యువతి ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఒకే పాటను కోరుకుంటుంది.ఒకసారి ప్రసారం చేసిన తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి అదే పాట కావాలంటూ పట్టుబడుతూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫోన్లో అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదంటూ హెచ్చరించేది. తాజాగా శనివారం ఫోన్ చేసిన ఆమె నేను కోరిన పాటను వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన టీవీ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీమరాజా యూట్యూబ్ ఛానల్‌పై ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసభ్యకరమైన భాష వాడుతున్నారని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో సీమరాజా యూట్యూబ్ ఛానల్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్‌పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వేమారెడ్డి పేర్కొన్నారు. -
HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్ క్యూరీని రిట్ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది. -
నాకు ప్రాణహాని ఉంది..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి తెలిపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన అఘోరితో కలిసి ఆమె మంగళవారం రాత్రి నెన్నెల పోలీసులను ఆశ్రయించింది. అనంతరం యువతి అఘోరి స్వగ్రామమైన నెన్నెల మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి వెళ్లింది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తమ కూతురు శ్రీవర్షిణికి అఘోరి మాయమాటలు చెప్పి వెంట తిప్పుకుంటోందని, తమ కూతురిని తమకు అప్పగించాలని మంగళగిరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, తాను మే జర్నని తన ఇష్ట ప్రకారమే అఘోరి వెంట వ చ్చానని, ఎవరూ బలవంతం చేయలేదని యు వతి పోలీసులకు తెలిపింది. తాను కూడా అఘోరి దీక్ష తీసుకున్నానని శ్రీవర్షిణిలో చెప్పినట్లు ఎస్సై ప్రసాద్ పేర్కొన్నారు. -
సేవలపై ఫిర్యాదుకు వేచి చూడాల్సిందే
న్యూఢిల్లీ: ఏఐ ఏజెంట్లు, చాట్బాట్లు ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా.. కస్టమర్ సేవల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభించడం లేదు. ఫిర్యాదు నమోదు చేయడానికే గంటలు, రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. 2024లో దేశీయ వినియోగదారులు సేవలపై ఫిర్యాదు నమోదు చేయడానికి వేచి చూసిన సమయం 1500 కోట్ల గంటలు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలను సర్విస్ నౌ ‘కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్’ నివేదిక వెల్లడించింది. కస్టమర్ల అంచనాలు, లభిస్తున్న సేవల మధ్య ఉన్న ఎంతో అంతరం ఉన్నట్టు ఈ నివేదిక గుర్తించింది. 5,000 మంది కస్టమర్లు, 204 మంది కస్టమర్ సేవల ఏజెంట్లను ప్రశ్నించి, వచ్చిన వివరాల ఆధారంగా ఫలితాలను విశ్లేషించింది. ఓపిక పట్టాల్సిందే.. 80 శాతం భారత వినియోగదారులు కనీస అవసరాలైన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఉత్పత్తుల సిఫారసుల కోసం ఏఐ చాట్బాట్లపై ఆధారపడుతున్నారు. కస్టమర్లు అంతా కలసి ఇందుకోసం ఏటా 1500 కోట్ల గంటల సమయం వెచ్చిస్తున్నారు. 2023తో పోల్చితే 2024లో ఒక ఫిర్యాదు పరిష్కారానికి వేచి చూడాల్సిన సమయం 3.2 గంటలు తగ్గింది. అయినప్పటికీ కస్టమర్ల అంచనాలకు, లభిస్తున్న సేవలకు మధ్య ఎంతో అంతరం ఉంది. 39 శాతం కస్టమర్ల ఫిర్యాదులను హోల్డ్‌లో పెట్టడం, 36 శాతం ఫిర్యాదులను బదిలీ చేయడం కనిపించింది. ఫిర్యాదుల ప్రక్రియ ఎంతో కష్టంగా ఉందని 34 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకం సేవల కారణంగా బ్రాండ్లను మార్చడానికి 89 శాతం వినియోగదారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. బలహీనమైన సేవలపై ఆన్లైన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రతికూల అభిప్రాయాలను నమోదు చేస్తామని చెప్పారు. కస్టమర్ల సేవల్లో నెలకొన్న అంతరాన్ని తొలగించడానికి, వేగంగా పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి వీలుగా వ్యాపార సంస్థలు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఏఐ ఆధారిత సామర్థ్యాలను పెంచుకోకుంటే కంపెనీలు కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుందని సర్విస్‌నౌ ఇండియా ఎండీ సుమీత్ మాధుర్ అన్నారు. -
రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తా..!
యశవంతపుర: భార్య వేధిస్తోందని ఆత్మహత్య చేసుకున్న భర్తల గురించి బెంగళూరులో వార్తలు వస్తుంటాయి. అదే రీతిలో భార్య సతాయిస్తోందని గోడు వెళ్లబోసుకున్నాడు ఓ భర్త. దగ్గరకు పిలిస్తే, రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తానంటోందని వాపోయాడు. ఆమె వేధింపులను తట్టుకోలేక టెక్కీ భర్త పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. టెక్కీ శ్రీకాంత్‌కు 2022లో సదరు యువతితో వివాహమైంది. పెళ్లి రోజు నుంచి ఒక్కరోజు కూడా సంసారం చేయలేదు. పిల్లలు కావాలని శ్రీకాంత్ భార్యను అడగ్గా, 60 ఏళ్లు వయస్సు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం, ఇప్పుడైతే ఎవరినైనా దత్తతకు తీసుకొందామని ఉచిత సలహాలిచ్చేది. భార్య కదా అని ఆమెను ముట్టుకోబోతే భగ్గుమనేది. డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించేది. పాటలు పెట్టి డ్యాన్సులు భర్త వర్క్ ఫ్రం హోంలో డ్యూటీ చేసుకుంటుంటే చాలు, ఆమె గట్టిగా పాటలు పెట్టి డ్యాన్స్ చేసేది. ఒక వేళ విడాకులు తీసుకోవాలని అనుకుంటే తనకు రూ.45 లక్షలు పరిహారం ఇవ్వాలని, ప్రతినెలా భరణం కింద పెద్దమొత్తం ముట్టజెప్పాలని తేల్చిచెప్పింది. ఇంత డబ్బును తానెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని బాధితుడు వాపోయాడు. ఇదే కాకుండా వీరిద్దరూ మాట్లాడిన ఆడియో సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. భార్యకు ఆమె తల్లిదండ్రులు వంత పాడుతున్నారని తెలిపాడు. ఈ మేరకు వయ్యలికావల్ ఠాణాలో అతడు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నాయకులు నారాయణమూర్తి, కొమ్మూరు కనకారావులు ఫిర్యాదు చేశారు. -
ఆ గంటే.. కీలకమంట
శ్రీకాకుళం క్రైమ్ : గోల్డెన్ అవర్.. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం వినుంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యా దు చేయగలిగితే.. మన ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్‌లో సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేయడమే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు ఐదువేలలోపు సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు వెళ్లాయి. తాము మోసానికి గురవుతున్న నిమిషాల్లోనే ఎన్సీఆర్బీకి, 1930 సైబర్ సెల్ నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన సుమారు రూ. 4.09 కోట్ల వరకు సేవ్ అయినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో తొలిసారిగా ఐదు సైబర్ కేసులకు సంబంధించి రూ. 10.13 లక్షలు బాధితులకు అందించిన ట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల వెల్లడించారు. ఫిర్యాదు చేయాలిలా.. » మనం మోసపోయిన క్షణానే1930 నంబర్‌కు కాల్ చేయాలి. » లేదంటే https://cybercrime.gov.in/ అనే పోర్టల్‌ను క్లిక్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్‌పై క్లిక్ చేయాలి. » తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. » ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో ఫిల్ చేసి సబి్మట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే. » ఈ పేజీలో ఒక ఫారం కనిపిస్తుంది.. దానిలో మనకు జరిగిన సైబర్ మోసం గురించి రాయాలి. కాకపోతే నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి. » ప్రతి సెక్షన్లో అడిగిన వివరాలను సమర్పిస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివ రాలు సరిగా ఉన్నాయమని భావిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (అకౌంట్ ట్రాన్సాక్షన్ తదితర) ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి. » అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు. » ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది. క్షణాల్లో ఫిర్యాదు చేయండి.. సైబర్ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. క్షణాల్లో ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవి.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రాసెస్. 1930కు గానీ, ఎన్సీఆర్బీకి గానీ ఫిర్యాదు చే సి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ -
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్‌లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
కేసు దాకా వెళ్లిన కోడి కూత
పథనంథిట్ట(కేరళ): ప్రకృతి రమణీయతకు, ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరైన కేరళలో పథనంథిట్ట జిల్లా అంతే స్థాయిలో ప్రశాంతంగా ఉంటుంది. ఆ జిల్లాలో భూమి కోసమో నగదు కోసమో తగాదా జరిగితే అది వార్త స్థాయికి చేరేదికాదు. కానీ ఒక కోడి కూత ఇప్పుడు ఫిర్యాదుచేసి కేసు పెట్టేదాకా వెళ్లింది. ఆ కోడి అన్ని కోళ్లలాగా ఉదయం ఆరు గంటలకో అంతకు కాస్తంత ముందే కూత పెట్టట్లేదు. ఆ కోడి పుంజు ప్రతిరోజూ ఠంచనుగా తెల్లవారుజామున మూడు గంటలకే కూత అందుకుంటోంది. నిశ్శబ్దం రాజ్యమేలే మూడు గంటల వేళ అందరూ గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ కోడి కూత ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. ఇది ముఖ్యంగా పక్కింట్లో ఉండే వృద్ధుడు రాధాకృష్ణ కురూప్ నిద్రకు తీవ్రస్థాయిలో భంగం వాటిల్లజేస్తోంది. ఆ శబ్దాలకు నిద్ర పట్టక రాధాకృష్ణ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని ఆ కోడి యజమాని అనిల్‌కుమార్‌కు చెప్పిచూసినా లాభం లేకుండాపోయింది. దీంతో చేసిదిలేక అదూర్ రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆ కోడి పుంజుపై ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బందులు పడుతున్న ఆ పెద్దాయన అవస్థ చూడలేక అధికారులు కోడి యజమాని అనిల్ కుమార్‌ను పిలిపించారు. తన తప్పేంలేదని యజమాని అనిల్ వాదించారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పోలీసులు రంగంలోకి దిగి కోళ్లను పరిశీలించేందుకు వచ్చారు. అనిల్ కుమార్ ఆ కోళ్లను నేలపై పెంచకుండా తన స్థలంలోని తొలి అంతస్తులో పెంచుతున్నాడు. ఎత్తు నుంచి శబ్దం వస్తుండటంతో చుట్టూతా గోడలు, ఎలాంటి అడ్డూ లేకపోవడంతో కోడి కూత పెద్దగా వినిపిస్తోందని అధికారులు తేల్చారు. దీనికి పరిష్కారంగా కోళ్లను మొదటి అంతస్తు నుంచి తరలించి అదే స్థలంలో దక్షిణ వైపు నేలపై పెంచుకోవాలని అధికారులు సూచించారు. మరో 14 రోజుల్లోపు ఈ కోళ్ల తరలింపు ప్రక్రియ పూర్తవ్వాలని యజమాని అనిల్‌కు అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో వృద్ధుడు కాస్తంత ఆనందం వ్యక్తంచేశారు. కోడి కూత అంశం కేసుదాకా వెళ్లిందని ఇరుగుపొరుగు తెగ మాట్లాడుకుంటున్నారు. పళ్లిక్కల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
పట్నా: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది.ఈ కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది’ అని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్‌గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
ఏసీబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని ఆరోపిస్తూ ఆమె మంగళవారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అవినాష్ మహంతికు లేఖ పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నటీమణులు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం ఆమోదయోగ్యమైన ప్రవర్తనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులలో భయాన్ని, బాధను కలిగించాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు జేసీ పార్క్ వద్ద తరచుగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు హాజరుకావద్దని మాధవీలత సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి ఆమెపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. -
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
యూపీఐ రాంగ్ పేమెంట్.. ఇలా చేయండి కంప్లయింట్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వచ్చాక ఆర్థిక లావాదేవీలు అత్యంత సులభతరం అయ్యాయి. విస్తృతమైన బ్యాంకింగ్ ఆధారాల అవసరం లేకుండా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి, బిల్లులు చెల్లించడానికి, వివిధ లావాదేవీలను నిర్వహించడానికి యూపీఐ వినియోగదారులకు వెసులుబాటు కలిగింది. ఓ వైపు సౌలభ్యం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్లో బ్యాంక్ సర్వర్లు, సాంకేతిక లోపాలు లేదా అనధికార లావాదేవీలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు ఎలా చేయాలో ఇక్కడ అందిస్తున్నాం..యూపీఐ సమస్యల రకాలుఫిర్యాదును ఫైల్ చేసే ముందు మీరు ఎదుర్కొనే వివిధ రకాల యూఏఐ సమస్యలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.» పిన్ సమస్యలు: యూపీఐ పిన్ బ్లాక్ అవడం లేదా ఎర్రర్ రావడం వంటి సమస్యలు మిమ్మల్ని లావాదేవీలను పూర్తి చేయకుండా నిరోధించవచ్చు.» ప్రాసెసింగ్ సమస్యలు: లావాదేవీలు జరగకుండానే డబ్బు కట్ అవడం, తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లడం, లావాదేవీలు పెండింగ్‌లో పడిపోవడం లేదా తిరస్కరణకు గురికావడం, లావాదేవీల పరిమితులను అధిగమించడం లేదా లావాదేవీల సమయం ముగియడం వంటి సమస్యలు ఉంటాయి.» ఖాతా సమస్యలు: ఖాతా వివరాల లింక్, ఫెచ్చింగ్, ఖాతాను మార్చడం లేదా తొలగించడం లేదా నమోదు రద్దు చేయడం వంటి సమస్యలు.» ఇతర సమస్యలు: వీటిలో లాగిన్ వైఫల్యాలు, నమోదు సమస్యలు లేదా ఓటీపీ (OTP) లోపాలు ఉండవచ్చు.తప్పు లావాదేవీపై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ సమయంలో సమస్యలను ఎదుర్కొంటే, మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఫిర్యాదు చేయవచ్చు. తప్పుడు లావాదేవీపై ఫిర్యాదు చేయడానికి ఈ దశలను అనుసరించండి..» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Incorrectly transferred to another account' ఎంచుకుని, మీ సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌పై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ విఫలమైతే ఈ దశల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Transaction failed but amount debited' ఎంచుకుని సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. -
స్నేహంగా మెలిగితే.. పెళ్లి చేసుకోవాలని వేధింపులు
వెంగళరావునగర్: స్నేహంగా మెలిగినందుకు యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలంటూ వేధించిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... జగిత్యాల ప్రాంతానికి చెందిన యువతి స్థానిక మధురానగర్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ క్రమంలో బోరబండలో ఉండే రఘువంశీతో పరిచయం ఏర్పడింది. ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో చనువుగా ఉండటంతోపాటు పలు దేవాలయాలకు కలిసి వెళ్లారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను సైతం కలిసి దిగారు. అయితే కొన్ని రోజుల తరువాత రఘువంశీ సదరు యువతిని పెళ్లిచేసుకోవాలని కోరాడు. అందుకు యువతి నేను స్నేహితురాలిని మాత్రమేనని పెళ్లిచేసుకోవడం కుదరదని తేలి్చచెప్పింది. దీంతో ఇరువురూ కలిసి దిగిన ఫొటోలను బంధువులకు పంపడంతోపాటు యువతి గురించి చెడు ప్రచారం చేస్తానని బెదిరించసాగాడు. వేధింపులు తట్టుకోలేక యువతి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ చాంబర్ లో మాధవీలత ఫిర్యాదు
-
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో ఫిర్యాదు వెళ్లింది. అవుటర్ రింగ్‌రోడ్‌లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ.. బీసీ పొలిటికల్ జేఏసీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్(ORR)లో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ అక్రమాలపై దర్యాప్తు జరపాలని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు వెళ్లింది. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాల పై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఇవాళ ఏసీబీకి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. ఆదయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి ముపై ఏళ్ళ పాటు లీజ్‌కు ఇచ్చారు. అయితే.. ఆ కంపెనీ రూ. 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్ కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లో భూకెటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో(quid pro quo) ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. హెచ్ఎండీఏ నిధుల పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు జరపాలి’’ అని బీసీ పోలిటికల్ జేఏసీ నేత యుగంధర్ గౌడ్ చెప్తున్నారు.ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?: కేటీఆర్ఏసీబీ నోటీసుల్లో ఏముందంటే.. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో ఏసీబీ కీలకాంశాలకు ప్రస్తావించింది..‘‘విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చినప్పుడు మీ లాయర్‌ను అనుమతించాలని మీరు కోరారు. కానీ, చట్ట ప్రకారం అది సాధ్యం కాదని మీకు తెలియజేశాం. కాబట్టి, 9వ తేదీన మీ విచారణకు కూడా లాయర్‌ను అనుమతించడం కుదరదు. మీరు విచారణకు హాజరుకండి. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఏం డాక్యుమెంట్లు కావాలో అడుగుతాం’’ అని ఏసీబీ పేర్కొంది. మరోవైపు విచారణకు తన లాయర్‌ను అనుమతించేలా కోర్టు నుంచి అనుమతి కోసం కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. -
బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బిగ్ టీవీ, మహాటీవీ కథనాలపై వైఎస్సార్సీపీ మండిపడింది. సబ్ రిజిస్టార్ సింగ్, శ్రీకాంత్ వ్యవహారాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.తప్పుడు కథనాలను ప్రసారం చేసిన సదరు చిల్లర ఛానళ్లపై చర్యలకు వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చర్చించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు -
ఆ మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి: నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్రపై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బి.సుబ్బలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా పనిచేశారని మండిపడ్డారు. ఈమేరకు సుబ్బలక్ష్మి పలువురు కౌన్సిలర్లతో కలిసి అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో సత్యనారాయణకు గురువారం ఫిర్యాదు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప దినాల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహిచడం సరికాదన్న ఉద్దేశంతో డిసెంబర్ 31న జరగాల్సిన సమావేశాన్ని జనవరి 2కు వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌కు చెప్పానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నిర్ణయం, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాన్ని కాదని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో కౌన్సిల్ సమావేశం నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఆ సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత మహిళనైన తనపై కమిషనర్ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని, మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పరిధి దాటి విధులు నిర్వర్తిస్తున్నారని, త్వరలోనే ఆయన అక్రమాలను బయటపెడతానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు ఏకా శివ డిమాండ్ చేశారు. -
యువకుడిని చితకబాదిన SIపై జక్కంపూడి రాజా పిర్యాదు
-
పుష్ప–2 దర్శకుడు,హీరో, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలి
మేడిపల్లి: పోలీసులను కించపరిచేలా పుష్ప–2 చలన చిత్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని అందుకు బాధ్యులైన సినిమా దర్శకుడు, హీరో, నిర్మాతలపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 చిత్రంలో పోలీసులను అవమానించేలా కొన్ని దృశ్యాలను చిత్రీకరించడం దారుణమని ఇందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు. -
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ బయట గురువారం(డిసెంబర్19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్ చెప్పారు. కాగా,పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో గందరగోళం.. రేపటికి వాయిదా -
ప్రేమికురాలికి ఫోన్ కొనిచ్చేందుకు తల్లినే చంపాడు..!
ఖమ్మంఅర్బన్: ప్రేమికురాలికి ఫోన్ కొనివ్వడానికి అవసరమైన డబ్బు కోసం కన్నతల్లినే కడతేర్చాడో కొడుకు. హత్యానంతరం ఆమె ఒంటిపై ఆభరణాలు లాక్కొని పరారయ్యాడు. తమ చిన్న కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి లక్ష్మీనారాయణ, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం 7వ డివిజన్ ఖానాపురానికి చెందిన కొప్పెర లక్ష్మీనారాయణ– వాణి(45) దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గోపి మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం తల్లి మాత్రమే ఉన్న సమయాన డబ్బు కావాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది.ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఒంటిపై ఆభరణాలైనా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనికి ఆమె ససేమిరా అనగా ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా, గోపి తన తల్లి గొంతునులిమి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఆపై తల్లి ఒంటిపై ఉన్న బంగారు చెవిదిద్దులు, నాన్ తాడు తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి ఇంటి పక్కనవారు వచ్చే చూసేసరికి వాణి విగతజీవిగా పడి ఉండడంతో పోలీసులు, ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు.ఈ మేరకు పోలీసులు చేరుకొని డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా, ఓ కర్చీప్ వద్ద ఆగిపోయింది. దీనిపై ఆరా తీయగా, గోపీదని తేలినట్టు సమాచారం. దీంతో ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా వైరాలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. -
రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం(డిసెంబర్10) ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు రెరా,టీజీఐఐసీ,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏల్లో కాటిపల్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరిగా నేను మాట్లాడిన 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటించారు. వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీల మీద హైడ్రా రంగనాథ్‌కు ఫిర్యాదు చేశా.దీనిపై అసెంబ్లీలో మాట్లాడతాం.తప్పు చేసిన మంత్రులు అధికారులు ఎవరైనా శిక్షకు అర్హులే. ఈ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవాలి.ఈ యాక్ట్‌తో కబ్జాల నివారణ వీలవుతుంది.దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం.ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్ పై రిఫార్మ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టం ఏమి లేదు’అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. -
మనోజ్ ఆధీనంలోకి ‘మంచు టౌన్’!
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రేగిన కలకలానికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్ ‘మంచు టౌన్’ను ఆయన కుమారుడు మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నా రు. మనోజ్‌పై దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన మనోజ్.. సోమవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫామ్‌హౌస్‌ను స్వాధీనం చేసు కున్నారు.ఆపై సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు పంపారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులకు వైద్య పరీక్షల రికార్డులుబంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు వైద్యులు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే తది తర పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రికార్డులు డిశ్చార్జి సమయంలో మనోజ్‌కు ఇచ్చారు. వాటిని మనోజ్ వెంటనే వాట్సాప్ ద్వారా పహాడీషరీఫ్ పోలీసులకు పంపారు. తొలుత తన ఇంటికి వెళ్లారు. తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్పల్లిలోని మంచు టౌన్‌కు వెళ్లారు. వీరి వెంట కర్నూలు నుంచి వచ్చిన కొందరు భూమా మౌనిక అనుచరులు కూ డా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దుబాయ్‌లో ఉ న్న మంచు విష్ణు సైతం కొందరు బౌన్సర్లను ఫామ్ హౌస్ వద్దకు పంపారు.ఇలా మనోజ్, విష్ణులకు సంబంధించిన దాదాపు 70 మంది బౌన్సర్లు అక్కడకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌస్ చుట్టూ, గేట్ వద్ద కొందరు మహిళ బౌన్సర్లు కూడా పహారా కాస్తున్నారు. అయితే పహాడీషరీఫ్ పోలీసులతో ఫోన్లో మాట్లాడిన మనోజ్.. వారిలో బౌన్సర్లు లేరని చెప్పి నట్లు తెలిసింది. కాగా మనోజ్ ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం మంచు టౌన్‌కు వచ్చిన మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి గంటకు పైగా మనోజ్‌తో చర్చలు జరిపి వెళ్లారు. సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్ మాయం: మనోజ్తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో మనోజ్ హఠాత్తుగా పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం తనపై పది మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశా రని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. సీసీ కెమె రాల హార్డ్‌డిస్క్ మాయం అయిందని, దీని వెనుక కిరణ్, విజయ్ రెడ్డి అనేవారి పాత్ర ఉన్నట్లు అను మానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ.. మనోజ్ తనపై ఎవరు, ఎందుకు దాడి చేశారో తెలియదని, తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా మనోజ్ ఫిర్యాదుపై పహడీషరీఫ్ పోలీసులు 329, 351, 115 సెక్షన్ల కింద మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. మనోజ్ నా ఇంటిని ఆక్రమించుకున్నాడు: మోహన్బాబుమోహన్బాబు సైతం మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ‘జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నా. నాలుగు నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నా.నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ని. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను బయటకు పంపండి. వారు, వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి..’ అని ఫిర్యాదులో మోహన్‌బాబు కోరారు. మోహన్‌బాబు లెటర్ హెడ్‌పై, ఆయన సంతకంతో ఉన్న ఈ ఫిర్యాదు లేఖ వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీసు కమిషనర్‌కు అందింది. ఆయన దాన్ని పహాడీషరీఫ్ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. కమిషనర్ సుధీర్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ...‘మనోజ్ నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదు వాట్సాప్ ద్వారా వచ్చింది. రెండింటి పూర్వాపరాలు పరిశీలించి, కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తాం..’ అని తెలిపారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు
-
తల్లి ఆవేదన.. పట్టించుకోని కొడుకులు
-
కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా!
‘వంద శాతం జాబ్ గ్యారెంటీ’, ‘100 శాతం సెలెక్షన్’ వంటి అసత్య ప్రకటనలతో, అబద్ధాలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచి్చంది. ఇలాంటి మోసపూరిత, తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు తప్పుడు హామీలు ఇవ్వకుండా చర్యలు చేపట్టింది. మోసపూరిత హామీలతో అభ్యర్థులను ఏమార్చవద్దని వాటిని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. – సాక్షి, ఏపీ,సెంట్రల్ డెస్క్ఈ ఏడాది 6,980 ఫిర్యాదులు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ)కు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు మభ్యపెట్టడం, తక్కువే సీట్లే ఉన్నాయని.. త్వరపడకపోతే సీట్లు అయిపోతాయని అభ్యర్థులపై ఒత్తిడి తేవడం, గతంలో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, తప్పుడు, మోసపూరిత హామీలు ఇవ్వడం వంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఇలా 2021–22లో 4,815, 2022–23లో 5,351, 2023–24లో 16,276, ఈ ఏడాది ఇప్పటివరకు 6,980 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థలకు సీసీపీఏ 54 నోటీసులు పంపింది. వీటికి రూ.54.60 లక్షలు జరిమానా కింద విధించింది. 2023 సెపె్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రూ.1.15 కోట్లను విద్యార్థులకు పరిహారంగా ఇప్పించింది.తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థలపై కఠిన చర్యలు ఉండాలితప్పుడు ర్యాంకుల ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి జరిమానాలు విధించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు. యావజ్జీవ శిక్షకు తగ్గకుండా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై చర్యలు ఉండాలి. అలాగే తమ సంస్థల్లో శిక్షణ తీసుకున్నట్టు చెప్పాలని ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు డబ్బులు ఇస్తాయి. క్లాస్ రూం కోచింగ్ ఒకరి వద్ద, ఆన్లైన్ కోచింగ్ ఇంకొకరి వద్ద, మెటీరియల్/బుక్స్ మరొకరి వద్ద తీసుకున్నామంటూ ఆయా సంస్థల డబ్బులకు ఆశపడి అబద్ధాలు చెప్పే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల డబ్బులకు ఆశపడి అనేక కో చింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నామని చెబితే వా రిపై చర్యలు తీసుకోవాలి.మీడియా కూడా తప్పు డు ప్రకటనల పట్ల జాగరూకతతో ఉండాలి. గతంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల హా ల్టికెట్లను పరిశీలించాకే వారి గురించి ప్రచురించేవి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి. – కె.లలిత్ కుమార్, జేఈఈ కోచింగ్ నిపుణులు, ఎడ్యుగ్రామ్360.కామ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట.. కోచింగ్ కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. అయితే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నష్టపోకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలు అభ్యర్థులకు గైడెన్స్, విద్యాపరమైన మద్దతు, ట్యూటరింగ్, స్టడీ ప్రోగ్రామ్స్, విద్యకు సంబంధించిన ప్రకటనలకు వర్తిస్తాయని స్పష్టతనిచి్చంది. కౌన్సెలింగ్, థియేటర్ ఆర్ట్స్, క్రీడలు, డ్యాన్స్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వర్తించవని తెలిపింది. కోచింగ్ సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని వివరించింది. కోచింగ్ సెంటర్లు ఖచ్చితత్వంలో వ్యవహరించడం ద్వారా అభ్యర్థుల హక్కులను గౌరవించాలని పేర్కొంది. 50 మంది కంటే ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది.కేంద్రం మార్గదర్శకాలు ఇవి..» కోర్సు–వ్యవధి, అధ్యాపకుల వివరాలు, ఫీజులు–వాపసు (రిఫండ్) విధానాలు, ఎంపిక, పరీక్ష ఫలితాలు లేదా ఉద్యోగ నియామకం లేదా జీతం పెరుగుదలకు సంబంధించి మోసపూరిత హామీలను, ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వకూడదు.» ఉద్యోగాలకు ఎంపికైన లేదా ర్యాంకులు సాధించిన అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని శిక్షణ సంస్థలు ఉపయోగించకూడదు. అలాగే వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచాలి.» సివిల్స్ రాసే అభ్యర్థుల్లో కొందరు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వారే సొంతంగా సిద్ధమవుతారు. ఇంటర్వ్యూకు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ముందుగానే స్పష్టతనివ్వాలి. » అభ్యర్థులకు వారి కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. వారి అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. » అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా తమ సేవలు, వనరులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించాలి.» తాము అందిస్తున్న కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి సంస్థల గుర్తింపు ఉందని నిర్ధారించాలి. » చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే శిక్షణ కేంద్రాలను నడపాలి. » విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను శిక్షణ కేంద్రాలు కల్పించాలి. » కోర్సులు, కాలపరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు, రిఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారెంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. » విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ‘కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి’ వంటి ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం. » కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలను ధ్రువీకరించుకోవాలి. » కోచింగ్ సెంటర్ల తరఫున ప్రచారం చేసే సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు వారు చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. » తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. » ఇప్పటిదాకా.. ఏవైనా షరతులు ఉంటే చిన్నగా ‘‘స్టార్’’ గుర్తు పెట్టి.. ప్రకటన చివర్లో కనిపించీ, కనిపించకుండా వాటిని చూపించేవారు. ఇకపై ఇలా కుదరదు. ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఏ ఫాంట్ సైజులో ఉంటే అదే సైజులో షరతులను కూడా ప్రచురించాలి. » తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు కచి్చతంగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఇసుక దోపిడీ దారుణంగా ఉంది
మహారాణిపేట (విశాఖ): శ్రీకాకుళంలోని ఇసుక రీచ్‌లలో దళారుల దోపిడీ దారుణంగా ఉందని, వారి నుంచి తమను కాపాడాలని విశాఖ కలెక్టర్‌కు క్వారీ లారీ ఓనర్స్ మొరపెట్టుకున్నారు. విశాఖ జిల్లా క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే ఇసుక విధానం పారదర్శకంగా ఉండేదని చెప్పారు. కూటమి నాయకులు ఇసుక రీచ్‌ల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టన్ను ఇసుకకు అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారని, ఎందుకు అదనంగా ఇవ్వాలని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే ఉచితంగా వస్తుందనుకున్నామని, కానీ డబ్బులు చెల్లించాలనడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళంలోని 11 ఇసుక రీచ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖలో ఇసుక అమ్మాలంటే టన్ను రూ.వెయ్యి కంటే తక్కువకు విక్రయించలేని పరిస్థితి ఉందన్నారు.సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే మీరు ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. -
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
పోలీసులకు మహిళ బెదిరింపులు
లింగోజిగూడ: తన భర్త వద్ద ఉన్న కారు బంగారు, నగదును ఇప్పించాలని పోలీసులను కోరిన మహిళ అందుకు వారు నిరాకరించడంతో పోలీసులపైనే బెదిరింపుకు పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే హయత్‌నగర్, మునగనూర్‌లో నివాసం ఉంటున్న కాటమోని పావని తన మొదటి భర్త గోపీతో విడాకులు తీసుకుని ఐదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన గోరుకంటి శ్రీకాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. శ్రీకాంత్ స్థానికంగా పురోహితం చేస్తుండగా, పావని జూనియర్ లాయర్‌గా పని చేసేది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెలలో శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పావనీ మీర్‌పేట పోలీస్టేషన్లో తన భర్త తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని అతడి తల్లి పద్మ పేరున ఉన్న కారుతో పాటు బంగారం, నగదు తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. సివిల్ కేసు కావడంతో తమ పరిధిలోకి రాదని పోలీసులు తేల్చి చెప్పారు.దీంతో ఆమె గత నెల 16న తన భర్త కనిపించడం లేదంటూ హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ కర్నూలులో ఉన్నట్లు గుర్తించి అతడిని పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. అతను పావనీతో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో వదిలేశారు. దీంతో ఆమె అతడి వద్ద ఉన్న కారు, బంగారం, నగదు ఇప్పించాలని కోరడంతో వారు కారు, కొంత నగదును ఇప్పించారు. అయినా సంతృప్తి చెందని పావని బంగారం మరింత నగదు కోసం డిమాండ్ చేయడంతో అది తమ పని కాదని సివిల్ తగదాలు కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 23న హయత్‌నగర్ పోలీస్టేషన్లో తన భర్త శ్రీకాంత్, అతని సోదరుడు దుర్గప్రసాద్‌తో కలిసి వేధింపులకు గురి చేస్తున్నారని, దుర్గప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎస్ఐపై ఆరోపణలు పావనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్ సైదులు కేసు వివరాలు తెలుసుకునేందుకు తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేయడంతో పాటు సీపీకి ఫిర్యాదు చేసినట్లు సామాజిక మధ్యమాల్లో వార్త సంచలనమైంది. మా పరిధి కాదన్నందుకే.. సివిల్ తగదాలు తాము పరిష్కరించమని, కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతోనే పావనీ ఎస్ఐ సైదులుతో పాటు తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని హయత్‌నగర్ సీఐ నాగరాజ్‌గౌడ్ అన్నారు. పావని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. -
జగన్ పై అనుచిత పోస్టులు... పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు కంప్లైంట్
-
YSRCP నేతలపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
-
YSRCP నేతలపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
-
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్‌టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్‌రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, సిరిగిరి అర్జున్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధ్ రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు మంగళవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయ భారతిని కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎవరెవర్ని అరెస్టు చేశారు, మోపిన కేసుల వివరాలని్నంటినీ ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ అరెస్టులపై తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు.కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు..అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం బీఎన్ఎస్ సెక్షన్ 111 పెట్టడం ఘోరమని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులయిన 57 మందిపై అక్రమ కేసులు పెట్టారని, పోలీసుల వేధింపుల కారణంగా 12 మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. హింసించి, భయపెట్టి వారికి అనుకూలమైన స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్ట అని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎంపీలను కూడా నియోజకవర్గాల్లో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. శాంతియుతంగా ఉన్న తమ కార్యకర్తలు తిరగబడితే ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎక్కడకి వెళతాయో తెలియదని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు. తాము ఇప్పటివరకు డిఫెన్స్ ఆడామని, ఇక అఫెన్స్ మొదలు పెడితే తట్టుకోలేరని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయలేకే ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఎంపీ మేడా రఘునాధ్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు తాము అండగా ఉంటామని, వారిపై జరుగుతున్న వేధింపులను అరికడతామని ఎంపీ డాక్టర్ తనూజరాణి భరోసా ఇచ్చారు. -
అదే దుర్మార్గం..
సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ వైఫల్యాలపై, మోసాలపై, ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మరోమారు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని అడిగినందుకు, ప్రభుత్వం ఇచ్చే సరుకుల్లో తూకం తేడా ఉందన్నందుకు, పింఛన్లు తెచ్చుకోవడానికి వెళ్లిన వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారని చెప్పినందుకు.. తుదకు కార్టూన్‌ను ఫార్వర్డ్ చేసినందుకు.. ఇలా చిన్న చిన్న విషయాలను సాకుగా చూపి తప్పుడు కేసులు పెడుతోంది. చెప్పాపెట్టకుండా ఇళ్లకు వచ్చి పోలీసులు ఎత్తుకెళ్లిపోతున్నారు. పలువురు బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుండటంతో వారి అరెస్టులు చూపక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటూరి రవికిరణ్‌పై పోలీసులు మరో నింద మోపి తాజాగా ఇంకో కేసు నమోదు చేశారు. పులివెందులలో సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే 13 కేసులు నమోదు చేశారంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో ఇట్టే తెలుస్తోంది. |ఇంటూరిపై 15కు చేరిన కేసులు మధురవాడ ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్ పొలిటికల్ పంచ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసుల పేరుతో మానసికంగా వేధించారు. ఇప్పటికే ఆయనపై దువ్వాడ, గుంటూరు, విజయవాడ, మార్టూర్ పోలీస్స్టేషన్లలో ఒక్కో కేసు.. గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేస్తూ 41ఏ నోటీసులు జారీ చేశారు. రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లోనూ పలు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇతనిపై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రవికిరణ్‌ను దువ్వాడ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో రాత్రి 9 గంటలకు వరకు వేధించారు. చివరికి 41ఏ నోటీసులు అందించి ఈ నెల 11న మెజి్రస్టేట్ ముందు హాజరు కావాలని ఆదేశించి విడిచిపెట్టారు. ఈలోగా రవికిరణ్‌పై మహారాణిపేట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారని తెలుసుకుని మళ్లీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఆదివారం ఉదయం మళ్లీ మహరాణిపేట పోలీసులు విచారణకు తీసుకొచ్చారు. అనంతరం రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీసులు వచ్చి, రవికిరణ్‌ను తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులెవరికీ సమాచారం ఇవ్వలేదు. పీటీ వారెంట్‌పై మార్టూరుకు వెంకటేష్ గాజువాక మండలం గొల్ల జగ్గరాజుపేటకు చెందిన బోడి వెంకటేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 3న బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 5న బాపట్ల పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. 6న దువ్వాడ పోలీస్ స్టేషన్లో టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరోసారి వెంకటేష్‌ని తీసుకెళ్లారు. 7న మరోసారి విచారణకు పిలిపించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. వెంకటేష్‌పై 9న మహరాణిపేట స్టేషన్లో మరో కేసు నమోదైంది. బెయిల్‌పై వచ్చిన వెంకటేష్‌ని మరోసారి విచారణ పేరుతో మహరాణిపేట పోలీసులు తీసుకెళ్లారు. స్టేట్మెంట్ రికార్డు చేసి పంపించే సమయానికి బాపట్ల జిల్లా మార్టూరుకి చెందిన పోలీసులు వచ్చి.. పీటీ వారెంట్‌పై ఆదివారం వెంకటేష్‌ను మార్టూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచారు. వెంకటేష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అన్ని చోట్లా అదే తీరు » సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని చెబుతూ పులివెందుల పట్టణ, అర్బన్ పోలీస్ స్టేషన్లలో వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిలపై కేసు నమోదైంది. మరికొంత మందిపై కూడా కేసులు పెడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఐ జీవన్ గంగనాథ్ బాబును వివరణ కోరగా.. ఇది ఎస్సీ, ఎస్టీ కేసు అని, ప్రస్తుతానికి ముగ్గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. » ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివారెడ్డిపై ఈ నెల 8వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 13వ తేదీ విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదివారం కంకిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన కూడా ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. » గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ మేకా వెంకటరామిరెడ్డి సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారనే నెపంతో నెల్లూరు 35వ డివిజన్ జనసేన పార్టీ ఇన్చార్జి అశోక్ ఆదివారందర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. » కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవల కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో చిందులు తొక్కడంపై ట్విట్టర్, ఇన్‌స్టాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. » తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మొండోరాకు చెందిన బద్దం అశోక్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంగళగిరి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి కోర్టులో హజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఎక్కడెక్కడి నుంచో ఫిర్యాదులు » అద్దంకిలో కల్లం హరికృష్ణ రెడ్డి, హరీశ్వర్రెడ్డిలు సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్త యర్రాకుల రామాంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు డి.చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. » మేదరమెట్లకు చెందిన టీడీపీ కార్యకర్త గోలి అజయ్ ఫిర్యాదు మేరకు కడపకు చెందిన కె.హనుమంతారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. » సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వసంత వేణు ఫిర్యాదుపై గురజాలకు చెందిన పి.వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. » ఎన్.బాలాజీరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని తప్పు పడుతూ పోస్టులు పెట్టాడని రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు బొర్రా సూర్యరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. చెరుకుపల్లిలో తిరుమల కృష్ణ అనే వ్యక్తిపై కూడా రాం»ొట్లవారిపాలెం గ్రామానికి చెందిన అలుమోలు దుర్గారెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం కార్టూన్ ఫార్వర్డ్ చేశారని..వన్‌కళ్యాణ్, చంద్రబాబులపై వచ్చిన పోస్టింగ్‌ని తన వాట్సా‹ప్ నుంచి ఇతరుల ఫోన్లకు పంపించాడనే నెపంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఘంటా మురళీకృష్ణపై తాడేపల్లిగూడేనికి చెందిన జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి ఈ నెల 6వ తేదీన స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై భీమవరం పోలీసులు ఈ నెల 6వ తేదీన మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు.తీరా ఈ నెల 10వ తేదీ ఆదివారం అయినప్పటికీ తాడేపల్లిగూడెంలోని న్యాయమూర్తి ఇంటి వద్ద మురళీకృష్ణను హాజరు పరిచగా రిమాండ్ విధించారు. ‘రెండేళ్ల క్రితం నా ఫోన్ వాట్సాప్‌కు పవన్‌కళ్యాణ్, చంద్రబాబుపై ఒక వ్యంగ్య కార్టూన్ వచ్చి0ది. అప్పట్లో దానిని నేను ఫార్వార్డ్ చేశాను. ఆ సమయంలో భీమవరానికి చెందిన జనసేన కార్యకర్త పలికెల కిరణ్‌కుమార్ స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశాడు. దీంట్లో నిజానిజాలు విచారించకుండానే నాపై తప్పుడు కేసు పెట్టారు’ అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
అసభ్య పోస్టులను నివారించండి.. అక్రమ అరెస్టులు ఆపండి
-
టీడీపీ అసభ్యకరమైన పోస్టులపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
అసభ్య పోస్టులను నివారించండి.. అక్రమ అరెస్టులు ఆపండి
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసభ్య పోస్టులు పెడుతున్న టీడీపీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని, వైఎస్సార్సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులు, వేధింపులు నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు శనివారం పోలీసులకు ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేశారు. విశాఖ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజితకు ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్‌రాజు ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అదనపు ఎస్పీ భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డీఎస్పీ కార్యాలయంలో, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ ఫిర్యాదు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ..కూటమి ప్రభుత్వం చేపట్టిన సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌కు ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు తదితరులు వినతిపత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్‌పై అసభ్య పోస్టులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీకి ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి ఫిర్యాదు చేశారు.ఇవే అంశాలపై ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ నాయకులతో కలిసి డీఎస్పీ కార్యాలయంలోను, నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీకి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల బీజేంద్ర, ఎమ్మెల్సీ ఇసాక్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు సీపీకిు ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి చిన్న హనిమిరెడ్డిలు ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు.అక్రమ కేసులు, అరెస్టులపై ఫిర్యాదులుమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి టీడీపీ అధికారిక వెబ్సైట్లు, సోషల్ మీడియాల్లో అసభ్యకర పోస్టులు పెడుతూనే.. మరోపక్క సోషల్ మీడియా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని గర్హిస్తూ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు.మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి శ్రీనివాస్, నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి తూర్పు గోదావరి జిల్లా అదనపు ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఇవే అంశాలపై వైఎస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. -
వేధింపులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీమంత్రి అంబటి
-
వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్లో కచ్చితత్వం లేని కూడిన సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కాగా ఇటీవలే వికీపీడియాపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించే విధంగా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో రూ. 2 కోట్ల పరువునష్టం దావా వేసింది. దీనిపై కోర్టు కూడా వికీపీడియాకి చీవాట్లు పెట్టింది. ‘కోర్టు ధిక్కార నోటీసులు’ కూడా జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారత్ తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
TG: అమోయ్‌కుమార్‌పై ఈడీకి ఫిర్యాదుల వెల్లువ
సాక్షి,హైదరాబాద్:ఐఏఎస్ అధికారి, మాజీ రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం లోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు అమోయ్‌కుమార్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా శనివారం(అక్టోబర్ 26) వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరో ఫిర్యాదు చేశారు.ధరణిని అడ్డం పెట్టుకొని అమోయ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 200ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫ్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. 40 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నా మందీ మార్బలంతో వచ్చి వెళ్లగొట్టే యత్నం చేశారన్నారు. తమ భూములపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఉదయం ఏడు గంటలకే రిజిస్ట్రేషన్ కానిచ్చి రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారన్నారు.సర్వేనెంబర్ 111 నుంచి 179 వరకు ఉన్న 460 ఎకరాల భూమిని కాజేసి సమారు 30 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఈడీకి ఫిర్యాదు చేశామని శంకర్‌హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు,పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: పదేళ్లలో అక్రమార్జన రూ.1000 కోట్లు -
KSR Live Show: అన్న వద్దు ఆస్తి కావాలి.. షర్మిల ఫిర్యాదులో.. పొలిటికల్ యాంగిల్
-
99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వచ్చిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ గతంలో తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజులు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అందిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తాజాగా కంపెనీ పేర్కొంది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
HYD: మల్కాజ్‌గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్‌బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు పెట్టొచ్చా..!
ప్రశ్న: మేము లోన్ ద్వారా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వద్దనుంచి నిర్మాణదశలోనే ఫ్లాట్ కొన్నాము. ఒప్పందం ప్రకారం పది నెలల లోగా ఫ్లాటు మాకు పూర్తి చేసి ఇవ్వాలి. కానీ సంవత్సరం అయినా ఇంకా పూర్తి చేయలేదు. లోను నెలవారీ వాయిదాలు కట్టడం కూడా మొదలైంది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? పరిష్కారం చెప్పగలరు. – టి.ఆర్. రాజేశ్వరి, హైదరాబాద్సర్వసాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థ వారు, మీరు రాసుకునే ఒప్పంద పత్రం అంటే అగ్రిమెంట్లో సమయానికి ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేసి, మీకు అందజేయక΄ోతే అందుకుగాను తాత్కాలిక పరిహారం/ఉపశమనం ఏం చేస్తారో రాసుకుంటారు. కొన్ని సందర్భాలలో ఫ్లాట్ అప్పగించేంతవరకు అద్దె ఇవ్వటం లేదా మీ తరఫున నెలవారీ లోను డబ్బులు సదరు కంపెనీ వారే కట్టేలా ఒప్పందాలు కూడా రాసుకుంటారు. మీ ఒప్పందపత్రంలో కూడా అటువంటి కండిషన్ ఏమైనా ఉందేమో చూసుకోండి.ఏది ఏమైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మీరు సదరు రియల్ ఎస్టేట్ సంస్థపై వినియోగదారుల రక్షణ చట్టం కింద కేసు వేయవచ్చు. మీకు జరిగిన ప్రతి నష్టాన్ని లెక్కగట్టి దానికి తోడు మీకు కలిగిన మానసిక క్షోభకి కూడా అదనంగా పరిహారం కోరవచ్చు, పొందవచ్చు. అదనంగా... ఒకవేళ మీరు కొన్న ఫ్లాట్ ్ర΄ాజెక్టు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) లో రిజిస్టర్ అయి ఉంటే అదనంగా రెరాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ అగ్రిమెంటు, ఆస్తి కొనుగోలు పత్రాలు తీసుకొని దగ్గర్లోని లాయర్ని కలవండి. మొదటగా ఒక నోటీసు పంపి, అప్పటికీ కూడా మీకు పరిష్కారం దొరకకపోతే, పైన తెలిపిన విధంగా దావా వేసి న్యాయం పొందవచ్చు. వినియోగదారుల చట్టం ప్రకారం మీ కేసు మీరు కూడా వాదించుకోవచ్చు లేదా మీ తరఫున మరెవరినైనా ‘ఆథరైజ్డ్ పర్సన్’గా నియమించుకోవచ్చు. 50 లక్షల దావా వరకు జిల్లా వినియోగదారుల ఫోరంలో, 50 లక్షల నుంచి రెండు కోట్ల వరకు రాష్ట్ర ఫోరంలో అలాగే రెండు కోట్ల పైన విలువ గల దావాకి జాతీయ వినియోగదారుల ఫోరంలో మీ ఫిర్యాదును నమోదు చేయాల్సి ఉంటుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (చదవండి: జాబ్‌కి అప్లై చేసిన 48 ఏళ్లకు కాల్ లెటర్..ఐతే..!) -
అతీగతీలేని ‘వినతి’
సాక్షి, అమరావతి :ప్రజల నుంచి భారీఎత్తున విజ్ఞాపనలు తీసుకుంటున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వాటి పరిష్కారానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు జనం వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రతి శనివారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ వినతులు స్వీకరిస్తున్నారు. ప్రతిరోజూ కొందరు మంత్రులు కూడా అక్కడ విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలను చూసి జనసేన, బీజేపీ ఆఫీసుల్లోనూ ఈ తంతు సాగిస్తున్నారు. అలాగే, ప్రతి సోమవారం ఎప్పటిమాదిరిగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా టీడీపీ ప్రభుత్వం మార్చింది. జనం గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలోనూ పెద్దఎత్తున తమ సమస్యలను మొర పెట్టుకుంటున్నా వాటికి పరిష్కారం మాత్రం దొరకడంలేదు. సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న వారికి సైతం ఎటువంటి ఊరట లభించడంలేదు. ఉదా.. నెలరోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన నబీల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి టీడీపీ ఆఫీసులో తన సమస్యపై సీఎంకు వినతిపత్రం ఇచ్చాడు.కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి పురోగతిలేదు. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వస్తుండడంతో వాటిపై ఏంచేయాలో తెలీడంలేదని అధికారులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల గురించే ఎక్కువ మంది ఫిర్యాదుల చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నా అవి ఎప్పుడూ రొటీన్‌గా వచ్చే రెవెన్యూ సమస్యలేనని అధికారులు చెబుతున్నారు. వచ్చిన విజ్ఞాపనలను పరిష్కరించే పరిస్థితి లేకపోవడంతో అధికారులు కిందా మీదా పడుతున్నారు. దీంతో చేసేదిలేక 60 రోజుల్లో వినతిని పరిష్కరించాలి కాబట్టి ఈలోపే ఏదో ఒక కారణంతో దాన్ని మూసేసి అది పరిష్కారమైపోయినట్లు నమోదు చేస్తున్నారు. మరోవైపు.. అసలేమీ జరగకుండానే వినతిపత్రం ఇచ్చిన వారికి అది క్లియర్ అయిపోయినట్లు ఎస్ఎంఎస్లు వస్తుండడంతో వారు బిత్తరపోతున్నారు.కోర్టు కేసు లేకుండా ఉన్నట్లు చెప్పి మూసేశారు..తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అల్లవరం గ్రామానికి చెందిన భీమవరపు కటుమస్వామి జులై 15న ఆర్డీఓ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (ఎఫ్ఎంసీ) లేకుండానే తమ కుటుంబానికి చెందిన భూమిని మ్యుటేషన్ చేశారని విజ్ఞాపన ఇచ్చాడు. తన అమ్మమ్మ నూకాలమ్మ 2016లో చనిపోయిందని, ఆమెకు వారసత్వంగా ఉన్న భూమిని ఆమె చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా రెవెన్యూ అధికారులు వేరే కొందరికి మ్యుటేషన్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. అడుగుతుంటే పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు.ఆర్డీఓ ఈ వినతిని తీసుకుని ఎఫ్ఎంసీ లేకుండా మ్యుటేషన్ ఎలా చేస్తారని ఫిర్యాదు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వీఆర్ఓ విచారణకు వెళ్లాడు. కానీ, కొద్దిరోజులకు మీ సమస్య పరిష్కారమైందంటూ కటుమస్వామికి ఎస్ఎంఎస్ రావడంతో అతను విస్తుపోయాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అడిగితే కోర్టులో కేసు ఉందని తహశీల్దార్ రిపోర్టు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందని ఫిర్యాదును మూసివేసినట్లు చెప్పారు. అతను ఈ కేసు కోర్టు పరిధిలో లేదని అన్ని ఆధారాలు చూపడంతో నిజమేనని ఒప్పుకున్నా తాము చేసేదేంలేదని ఆర్డీఓ చేతులెత్తేశారు. 60 రోజుల్లోపు వినతిని పరిష్కరించాల్సి వుండడంతో కోర్టు వంకతో వినతిని తహశీల్దార్ క్లియర్ చేసినట్లు తేలింది.65 వేల సమస్యలు పరిష్కారమయ్యాయటఇలా ఇప్పటివరకు 65,211 సమస్యలను పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్) వెబ్సైట్లో జూన్ 15 నుంచి ఇప్పటివరకు 88,761 విజ్ఞాపనలు అందగా, 65,211 విజ్ఞాపనలను పరిష్కరించినట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది. అయితే, ఇవన్నీ గోకవరం కేసు మాదిరిగానే ఏమీ అవకుండానే కాగితాల్లోనే పరిష్కారమైనట్లు రాసుకున్నారని బాధితులు వాపోతున్నారు. -
పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులెందుకు?
శాయంపేట: ఆస్తులు సంపాదించి ముగ్గురు కుమారులకు ఇచ్చాం. ఇళ్లు కట్టి ఇచ్చాం. వృద్ధాప్యంలో పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తులు మాకు ఇప్పించండి.. అంటూ ఓ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో విలేకర్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రయ్య హమాలీ పనిచేసి గ్రామంలో 10 ఎకరాల భూమి, పరకాల పట్టణంలో మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ముగ్గురు కుమారులకు 2002లో మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. పరకాలలో మూడు గుంటల్లో కట్టిన ఇంటిని 2012లో సమానంగా పంచాడు. వృద్ధ దంపతులిద్దరు గ్రామంలో ఓ షెడ్డు వేసుకొని అందులో ఉంటున్నారు. వృద్ధాప్యం మీద పడడంతో తమ ఆరోగ్యాలు సరిగ్గా లేవని, ఏ కుమారుడు కూడా పట్టించుకోవడం లేదని చెక్క చంద్రయ్య, సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జూలై 7న పోలీస్‌స్టేషన్‌లో, 8న పరకాల ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి చేతుల్లో డబ్బు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930కు వస్తున్న ఫిర్యాదు కాల్సే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు రోజుకు సరాసరిన 1600 ఫోన్‌కాల్స్ వచ్చి నట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా ఆర్థిక మోసా లకు సంబంధించినవి 50 శాతం కాగా, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు 50 శాతం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మొత్తం 460 మంది సైబర్ నేరగాళ్లను 351 కేసుల్లో అరెస్టు చేసినట్టు అధికారులు చెప్పారు.⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతి రోజూ సరాసరిన 330 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఫిర్యాదులకు 1930 కాల్ సెంటర్ సిబ్బంది సమాధానాలు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఆగస్టు 31 వరకు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వారు పోగొట్టుకున్న సొమ్ములో 13 శాతం సొమ్మును సకాలంలో ఫిర్యాదు చేయడంతో టీజీసీఎస్బీ అధికారులు కాపాడారు. ఇలా మొత్తం రూ.163 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా చేశారు. -
పవన్ పై పార్వతి మిల్టన్ ఫిర్యాదు
-
రోహిణి ఫిర్యాదుతో డా. కాంతరాజ్‌పై కేసు
కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిషన్ చిత్ర పరిశ్రమల్లో సంచలనం అయిన నేపథ్యంలో నటి రోహిణి అధ్యక్షతన ఇటీవల కోలీవుడ్‌లో ఈ తరహా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తాజాగా డా. కాంతరాజ్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన భేటీలో సినీ పరిశ్రమలో అవకాశాల కోసం నటీమణులు అడ్జెస్ట్ అవుతారనే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు స్పందించి... ‘‘సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఆయన ఈ విధంగా మాట్లాడారు.ఎలాంటి ఆధారాలు లేకుండా నటీమణుల గురించి వైరల్ కంటెంట్‌ని విడుదల చేశారు’’ అంటూ చెన్నైపోలీస్ కార్యాలయంలో కాంతరాజ్‌పై రోహిణి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. కాంతరాజ్‌పై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. – సాక్షి సినిమా ప్రతినిధి, చెన్నై -
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతకుముందు కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆందోళన చేశారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు -
హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు పోటెత్తుతున్న ఫిర్యాదులు
-
మా డాడీ మీద కేసు పెట్టమన్న బుడ్డోడు
-
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్‌ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్‌తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్‌ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. ఎస్సీకమిషన్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం బుధవారం(ఆగస్టు14) ఢిల్లీలో కలిసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద టీడీపీ శ్రేణుల దాడిపై నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు నేతలు కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు, సీసీ కెమెరాలు ఆపేసి అంబేద్కర్ విగ్రహంపై దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీకమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఏ. సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎంఎల్సీ అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులున్నారు. కమిషన్ చైర్మన్‌ను కలిసి బయటికి వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ సిద్ధాంతాలపై దాడి: గురుమూర్తి,ఎంపీజాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానను కలిశాంఅంబేద్కర్ విగ్రహం పై దాడి అంటే ఆయన సిద్ధాంతాలపై దాడిఇది దళిత సమాజాన్ని అవమనపరచడమేఈ ఘటనపై ఎస్సీ కమిషన్ దర్యాప్తు చేయాలిఓర్వలేకపోతున్నారు: మేరుగ నాగార్జున, మాజీ మంత్రిఅంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఓర్వ లేక పోయారుపలుగులు, గుణపాలతో పొడిచి దాడి చేశారు.దీనిపై చర్యలు తీసుకోవాలని ధర్నాలు, నిరసనలు చేశాం.కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.ఎవరిపైనా కేసు పెట్టలేదు.పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు.అందుకే ఎస్సీ కమిషన్ ను కలిసి పరిస్థితి వివరించాం.చంద్రబాబు ప్రభుత్వం పై నమ్మకం లేదు.కేంద్ర బలగాలతో అంబేద్కర్ విగ్రహానికి భద్రత కల్పించాలి.రెండు నెలల నుంచి రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి.వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంబేద్కర్ విగ్రహం నిలబెట్టిన వేదికను పగలగొడితే దాడి కాదా ?త్వరలో ఏపీకి ఎస్సీ కమిషన్: ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రిటీడీపీ నాయకుల ప్రోద్బలంతో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది.దాడిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.వైఎస్ జగన్ పేరు తీసేస్తే.. చెరిగిపోయే పేరు జగన్‌ది కాదు.ఏపీ ప్రజల గుండె చప్పుడు వైఎస్ జగన్.రెండునెలల నుంచి జరుగుతున్న దాడులకు పరాకాష్ట అంబేద్కర్ విగ్రహం పై దాడిత్వరలోనే ఎస్సీ కమిషన్ ఏపీకి వస్తుంది.విగ్రహానికి కేంద్ర బలగాల భద్రత కల్పించాలి.పోలీసుల నిర్లక్ష్యం పై విచారణ జరపాలి.ప్రాణాలు అడ్డుపెట్టి విగ్రహాన్ని కాపాడుతాం.ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు: నందిగం సురేష్, మాజీ ఎంపీఅంబేద్కర్ విగ్రహం దాడి చేస్తే టీడీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.ఎస్సీ కమిషన్ కు అన్ని వివరించాం.దాడులు చూస్తే ఏపీ అంటేనే జనం హడలిపోతున్నారు.ఏపీని చంద్రబాబు అరాచకం వైపు నడిపిస్తున్నారు.బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలెక, దాడులకు పాల్పడుతున్నారు.దాడులకు భయపడేది లేదు.రెండు నెలలో టీడీపీ ఓటు బ్యాంకు అయిదు శాతం పడిపోయింది.దాడులు జరిగితే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి? -
ప్రజావాణిలో పెట్రోల్ సీసాల కలకలం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ మంచిర్యాల అగ్రికల్చర్/ పెద్దకొడప్గల్ (జుక్కల్): భూ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ సోమవారం మహబూబ్‌నగర్, మంచిర్యాల, కలెక్టరేట్లకు కొందరు పెట్రోల్ సీసాలతో రావడం సంచలనం రేపింది. పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకున్న ఎకరం భూమి తనకు కాకుండా చేస్తున్నారంటూ మనస్తాపంతో ఓ రైతు మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హన్వాడ మండలం హనుమాన్ టెంపుల్ తండాకు చెందిన కేతావత్ రాములు సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై చల్లుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఏఎస్, పోలీసులు ఆయన చేతిలో ఉన్న సీసాను లాక్కున్నారు. రైతు మాట్లాడుతూ తన తండ్రి రేఖ్యానాయక్ పేరుతో సర్వే నం.108లో లావణి పట్టా ఎకరం వ్యవసాయ భూమి ఉందని, అయితే ఇటీవల తన చిన్నాన్న కుమారులు రమేశ్, లచ్యానాయక్, రవి, గోపాల్ తనతో గొడవ పెట్టుకుంటూ పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సైతం తనపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కలెక్టర్ స్పందించి తన భూమి ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ విజయేందిరకు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మరోఘటనలో... కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన శీలం బానక్క, శీలం పోశయ్య, శీలం సత్తయ్య ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌కు వచ్చారు. టేకులపల్లి గ్రామ శివారులో తమకు ఉన్న భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అర్జీ సమర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో కాసేపు కూర్చున్న వాళ్లు.. తర్వాత పెట్రోల్ బాటిల్ తీసేందుకు యత్నించారు.గమనించిన కలెక్టర్ గన్‌మెన్ పెట్రోల్ బాటిల్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా బానక్క, పోశయ్య, సత్తయ్య మాట్లాడుతూ బానక్క పేరుమీద ఉన్న 12 ఎకరాల భూమి నలుగురు అన్నదమ్ములకు చెందాల్సి ఉండగా భూమిని శీలం కిష్టయ్య కొడుకు శీలం శ్రీనివాస్ పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికి కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నాడని వివరించారు. ఈ విషయమై కలెక్టర్‌కు, ఆర్డీవోకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, పట్టా రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. మా చావుతోనైనా అక్రమ పట్టాదారుపై చర్యలు తీసుకుంటారని పెట్రోల్ బాటిల్‌తో వచ్చామని పేర్కొన్నారు. వారిని నస్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. లంచం ఇచ్చినా పనికాలేదంటూ... కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన గైని అంజయ్య, అన్నదమ్ముల పేరిట గ్రామ శివారులో మూడెకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ భూమిని తమ పేరిట రిజి్రస్టేషన్ చేయాలని కోరుతూ ఆర్ఐ పండరి వద్దకు ఆరు నెలల క్రితం వెళ్లారు. ఈ భూమి పార్ట్ ‘బి’లో ఉందని, రూ. 20 వేలు ఇస్తే పార్ట్ ‘బి’నుంచి తొలగించి పట్టా చేసి పాస్ బుక్ ఇస్తానని పండరి చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఆర్ఐకి ఫిబ్రవరిలో రూ. 19 వేల నగదు, రూ. 1000 ఫోన్ పే ఇతరుల ఫోన్‌కు చెల్లించామన్నారు. అయితే ఆరు నెలల నుంచి తిరుగుతున్నా పనికాకపోవడంతో విసుగు చెందిన అంజయ్య తహసీల్దార్ చాంబర్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్నవారు రైతును చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ దశరథ్ను సంప్రదించగా అంజయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని, ఆర్ఐ పండరి డబ్బులు తీసుకున్న విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. -
‘గోల్డెన్ అవర్‘ను మరవద్దు
⇒ నాచారంలో ఉండే హర్‡్ష అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 27న సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి మూడు దఫాల్లో రూ.కోటి 10 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు పంపారు. తాను మోసపోయినట్టు గ్రహించిన వెంటనే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ (సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం) పోర్టల్‌లో వివరాలు అప్డేట్ చేశారు. కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటిని హోల్డ్ చేశారు. పెద్దమొత్తంలో డబ్బు లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆపగలిగారు. – సాక్షి, హైదరాబాద్‘‘గోల్డెన్ అవర్..’’సాధారణంగా ఈ పదం వైద్యం విషయంలో ఎక్కువగా వింటుంటాం. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటలో రోగికి అందే చికిత్స అనేది వారి ప్రాణాన్ని కాపాడడంలో కీలకం. అదే మా దిరిగా సైబర్‌నేరం జరిగిన తర్వాత కూడా వెనువెంటనే పోలీస్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల సొమ్ము సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. డబ్బు పోగొ ట్టుకున్న తర్వాత వెనువెంటనే సైబర్ క్రైం పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వడంతో తగిన పరిష్కా రం దక్కుతుందని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా సైబర్ క్రైం పోర్టల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు.కంగారు వద్దు.. 1930కు డయల్ చేయండి సైబర్ నేరగాళ్ల చేతిలో వివిధ రూపాల్లో మోసపోతున్న బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కట్ కాగానే ఎంతో కంగారు పడుతుంటా రు. ఈ కంగారులో వారు వెంటనే బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. బ్యాంకు అధికారులు ఈ విషయం పోలీసులకు చెప్పాలనడంతో అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు. అక్కడ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం.. పోగోట్టుకున్న డబ్బు మొత్తాన్ని బట్టి ఆ కేసు ఎవరి పరిధిలోకి వస్తుందన్న వివరాలు సేకరించేటప్పటికే ఎంతో సమయం వృథా అవుతోంది.సైబర్ నేరగాళ్లు గురి చూసి మరీ సెలవులు, వారాంతాల్లోనే ఎక్కువ కొల్లగొడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అయితే విషయం పోలీసుల వరకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. కానీ, ఇన్ని ప్రయాసలు, అనవసర కంగారు పక్కన పెట్టి.. వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ఉత్తమమని సైబర్‌సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు.24 గంటల పాటు అందుబాటులో ఉండే సిబ్బంది.. వెనువెంటనేడబ్బును కాపాడేందుకు చర్యలు తీసుకుంటారని వారు చెబుతున్నారు. అదేవిధంగా కొన్ని సార్లు నంబర్ వెంట నే కలవకపోతే నేరుగా సైబర్ క్రైం పోర్టల్ https:// cybercrime.gov.in లోనూ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతోనూ ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు.⇒ ఈ ఏడాది మే 14న ‘మేం మహారాష్ట్ర పోలీస్ శాఖ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై పెద్ద మనీలాండరింగ్ కేసు నమోదైంది. వెంటనే మేం చెప్పినట్టు డబ్బులు పంపకపోతే మీపై కేసు నమో దు చేస్తాం..’’అని సైబరాబాద్‌లోని ఓ మహిళకు సైబర్ నేరగాడు ఫోన్‌కాల్ చేసి బెదిరించాడు. భయంతో వణికిపోయిన సదరు బాధితురాలు రూ.60 లక్షలు నేరగాళ్ల ఖాతాలో జమ చేసింది. తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసింది. క్షణాల్లోనే స్పందించిన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది బాధితురాలు పోగొట్టుకున్న రూ.60 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా కేవలం గంట వ్యవధిలోనే కాపాడటం జరిగింది.సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ అంటే?⇒ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంనే సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్గా చెబుతారు. ఇందులో పోలీసులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోల సిబ్బంది, బ్యాంకులు, ఆర్బీఐ, పేమెంట్ వాలెట్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర వ్యవస్థలన్నింటికీ ఒక ఉమ్మడి వేదికగా ఈ పోర్టల్ పనిచేస్తుంది.1930 టోల్ ఫ్రీ నంబర్ నుంచి లేదా సైబర్ క్రైం పోర్టల్‌కు బాధితులు డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం ఇవ్వ గానే ఆ సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలు, సమయం, ట్రాన్సాక్షన్ చేసి న విధానం (ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్‌కార్డు లేదా డెబిట్‌కార్డు ద్వారా) ఏ ఖాతా నంబర్‌కు డబ్బులు బదిలీ చేశా>రు..? ఏ సమయంలో చేశారు..? అన్నీ నమోదు చేయగానే సంబంధిత బ్యాంకు వాళ్లకు ఆ వివరాలు వెళతాయి. వెంటనే ఆ డబ్బు అనుమానాస్పద లావాదేవీ కింద గుర్తించి డబ్బులు హోల్డ్ చేస్తారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే.. అంత ఫలితంసైబర్ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేదా సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే సమాచారమివ్వడం వల్ల డబ్బులు బ్యాంకులోనే ఫ్రీజ్ చేయవచ్చు. దీని వల్ల బాధితులు పోగొ ట్టుకున్న డబ్బును కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెనువెంటనే సమాచారం ఇచి్చన బాధితుల సొమ్మును చాలా వరకు టీజీసీఎస్బీ కాపాడింది. – శిఖాగోయెల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో -
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
ఈవీఎంలపై YSRCP ఫిర్యాదు.. ఈసీ ఎందుకు కంగారుపడుతుంది?
-
నిబంధనలకు విరుద్ధంగా బదిలీల నుంచి కొందరి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీల నుంచి కొంతమంది డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు పొందారని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబూరావు మంగళవారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లాలూప్రసాద్ తదితరులు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీజీడీఏ) ఆఫీస్ బేరర్లమని చెప్పుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందారని, ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వుల ప్రకారం వీరు మినహాయింపులకు అర్హులు కారని బాబూరావు తెలిపారు.పల్లం ప్రవీణ్ 19 ఏళ్లుగా, లాలూప్రసాద్ 12 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆరేళ్లకు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉన్నా.. అధికారులు వీరిని హైదరాబాద్ నుంచి కదపడం లేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. కాగా, ఆయుష్ డిపార్ట్మెంట్లో బదిలీలు చాలా అన్యాయంగా జరిగాయని పలువురు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకొని ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని పలువురు అభ్యర్థులు మండిపడుతున్నారు. ఒక డాక్టర్ తన భర్త చనిపోయినట్లు విడో ఆప్షన్ కింద దరఖాస్తు చేస్తే, విడో సరి్టఫికెట్ చింపేసి ఆమెను బదిలీ చేయకుండా నిలిపివేశారు. దీంతో ఆమె ఆయుష్ అధికారులను నిలదీయగా అసలు ఆ సర్టిఫికెట్ పెట్టలేదని బుకాయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్షలాది రూపాయలు లంచంగా తీసుకొని ఇష్టమైన వారికి నచి్చన చోట బదిలీ చేపట్టారని చెబుతున్నారు. అలాగే రీజనల్ డైరెక్టర్ పోస్టును అర్హులకు కాకుండా ఇతరులకు ఇచి్చనట్లు ఒక డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతు రుణమాఫీపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో స్థాయి అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచి్చనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేకచోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ జరగలేదంటూ నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గానీ, బ్యాంకర్ల నుంచి గానీ సరైన సమాధానం రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఎందుకు రాలేదో తమకు తెలియదంటున్నారని వాపోతున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో తమకూ అంతుబట్టడం లేదని అధికారులంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్‌కార్డు లేకపోవడం వంటివే అనేకమంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతుండగా, దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. దాదాపు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే.. ఖమ్మం జిల్లాలో 20 శాతం నుంచి 30 శాతం లోపుగానే లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా లక్ష మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను అడిగారు. టోల్‌ప్రీ నంబర్లు ఏర్పాటు ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ఖమ్మం కలెక్టరేట్లో 1950తో పాటు 90632 11298 టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఐటీ పోర్టల్, మండల స్థాయిలో సహాయ కేంద్రాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదు నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్‌లో మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.70 వేల పంట రుణం తీసుకున్నా. దానిని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంకు అధికారులు తిరిగి రూ.85 వేల రుణం ఇచ్చారు. ఈ రూ.85 వేల రుణం మాఫీ కాలేదు. నాక్కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – అజీ్మర వెంకన్న, దామ్యతండా, మహబూబాబాద్ మండలం నాతోటి వ్యక్తికయ్యింది..నాకు కాలేదు నాకు తడ్కల్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.42 వేల పంట రుణం ఉంది. ఏటా లోన్‌ను రెన్యువల్ చేస్తున్నా. ఈసారి నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకొన్న వారి పేరు రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయాధికారులను అడిగినా ఏమీ చెప్పడం లేదు. – కొండాపురం పెద్దగోవింద్రావు, బాన్సువాడ, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో సుమారు 42 వేల మంది రైతులు లక్ష లోపు రుణమాఫీ అర్హులు. వీరికి రూ.162 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 19,542 మంది రైతులకు రూ.75 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే కేవలం 45 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 51,417 మంది ఉండగా.. వీరికి రూ.236.54 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.కానీ 20,130 మంది రైతులకు రూ.92.02 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. దీంతో మాఫీకాని వారు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా, 33,913 మందికి సంబంధించిన రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారికి మాఫీ జరగలేదు. ఇక వరంగల్ డీసీసీబీ పరిధిలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 57,129 మంది కాగా 23,841 మంది రైతుల ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమైంది. దీంతో మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మర్యాదతో మన్నన పొందండి
సాక్షి, హైదరాబాద్: పోలీస్స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తని ఖీల చేయాలని, తాను సైతం త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు చేపడతానని వెల్ల డించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిష నర్లతో డీజీపీ జితేందర్ పోలీస్ కేంద్ర కార్యా లయంలో సమావేశమయ్యారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రంలోని అన్నియూనిట్ల ఉన్నతాధికారు లతో నిర్వ హించిన ఈ సమీక్షలో జితేందర్ పలు కీలక సూచనలు ఇచ్చారు. ప్రజావాణి దరఖాస్తుల్లోని ప్రజాసమస్యల పరిష్కారా నికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవ సరాన్ని నొక్కిచెప్పిన డీజీపీ, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించా లని ప్రతిపాదించారు. ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. సమావేశంలో శాంతి భద్రతల అడిషన ల్ డీజీ మహేశ్‌భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీజీలు శిఖా గోయెల్, అభిలాష బిస్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబుతో పాటు జోనల్ ఐజీలు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఇంట్లోనే నన్ను తీవ్రంగా కొట్టారు
గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు గృహంలోనే తనపై మారణాయుధాలతో దాడిచేశారని ఆ పార్టీ కార్యకర్త అల్లూరి హరికృష్ణ తెలిపారు. తీవ్రంగా గాయపడిన తనకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే బయటకు నెట్టేశారని చెప్పారు. 4న నరసరావుపేటలోని ఎమ్మెల్యే అరవింద్‌బాబు గృహంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నుంచి శుక్రవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి 43మందిపై కేసు నమోదు చేశారు.హరికృష్ణ శనివారం ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘నా సొంత ఊరు నరసరావుపేట మండలం ఇసప్పాలెం. నరసరావుపేట శ్రీనివాసనగర్‌లో ఉంటూ పల్నాడు రోడ్డులో బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తున్నాను. 4న సాయంత్రం ఎమ్మెల్యేతో డీఎంహెచ్‌వోకు ఒక ఫోన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాష్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా... ప్రసాద్, సురేష్, సాయి, రాజేష్, అంకమ్మరాజు, కాళీ, ప్రేమ్‌కుమార్, నవీన్, బొట్టు సాయితోపాటు మరో 40మంది కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు పట్టుకుని బైక్‌లపై ఎమ్మెల్యే గృహంలోకి వచ్చి పూలకుండీలు, కురీ్చలు పగలగొట్టారు.అక్కడే నిలబడి ఉన్న నాపై మారణాయుధాలతో దాడి చేయడంతో నా ఎడమ చేయి మోచేతి కిందభాగంలో ఎముక విరిగింది. తల, వీపుపై గాయాలయ్యాయి. అక్కడకు వచ్చిన వారిలో సురేష్ అనే వ్యక్తి నన్ను గుర్తుపట్టి తెలిసినవాడే అనడంతో వదిలేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను తీవ్రంగా గాయపడిన నేను తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగితే బయటకు నెట్టివేసి లోపలికి వెళ్లిపోయారు. మా గ్రామం టీడీపీకి కంచుకోట. నేను కూడా అరవిందబాబు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశా. అయినా నాకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేదు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా పరామర్శించేందుకు కూడా ఎమ్మెల్యే రాలేదు.’ అని చెప్పారు. -
పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా?
గుంటూరు/భీమవరం: ‘పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా?’ అంటూ టీడీపీ నాయకత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరగటిచర్లలో ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వేయించారు.దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామారావు పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్రవారం మూకుమ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి.. దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయç³డ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామారావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి శ్రీనివాసరావు వినతిపత్రమిచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామారావుపై దాడి చేయడం దారుణం. అడ్డువచ్చిన ఆయన తల్లి(90)ని కూడా పక్కకు నెట్టేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలి. దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించట్లేదు?రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు. -
టీడీపీ నేతల అరాచకాలపై రాష్ట్రపతికి వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
-
కొడుకులు బువ్వ పెడ్తలేరు
నెన్నెల: నవ మాసాలు మోసి ముగ్గురు కుమారులకు ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేసింది. కానీ వృద్ధాప్యంలో ఆ మాతృమూర్తి కన్న పేగులకే బరువైంది. 13 ఎకరాల భూమి పంచుకున్న కుమారులు తల్లికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిని చేసి ఓ గుడిసెలో వదిలేశారు. దీంతో కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మంగళవారం పోలీసుస్టేషన్ మెట్లెక్కింది.ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన చిన్నక్క, రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. చీటికి మాటికి కొడుకులు కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తుండడంతో విసిగి వేసారి ఆ తల్లి న్యాయం చేయాలని నెన్నెల ఎస్సై ప్రసాద్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.పోలీసులు స్పందించి తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. ఎస్సై స్పందించి ఆమె ముగ్గురు కొడుకులతో ఫోన్లో మాట్లాడి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై చెప్పారు. కాగా, కుమారుల్లో ఒకరు సింగరేణి రిటైర్డు ఉద్యోగి కాగా, మరో ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు. -
4,800 మంది బాధితులు.. ఆ ఐటీ కంపెనీపై చర్యలు తీసుకోండి
ఐటీ కంపెనీ డీఎక్స్‌సీ టెక్నాలజీపై ఐటీ ఉద్యోగుల యూనియన్ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. 4,800 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేసిన డీఎక్స్‌సీ టెక్నాలజీపై చర్యలు తీసుకోవాలని పుణెకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ యూనియన్ నాన్యూసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది.రెండేళ్లకు పైగా కొనసాగిన ఈ జాప్యం ఫ్రెషర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ హామీలను నమ్మిన ఫ్రెషర్లలో చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారని యూనియన్ తెలిపింది. ప్రస్తుతం ఈ అభ్యర్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా ఉద్యోగంలోకి చేర్చుకోకపోవడంతో భవిష్యత్తుపై స్పష్టత లేదని యూనియన్ పేర్కొంది.ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఐటీ ఎంప్లాయీస్ గతంలోనూ పలు కంపెనీలపై కార్మికశాఖకు ఫిర్యాదు చేసింది. 2,000 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్మెంట్లను ఆన్‌బోర్డ్ చేయడంలో పదేపదే జాప్యం చేస్తోందంటూ ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు జరపాలని గత జూన్ నెల ప్రారంభంలో కోరింది. అంతకు ముందు 2023 జూలైలో టీసీఎస్ 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేస్తోందని కార్మిక శాఖకు యూనియన్ ఫిర్యాదు చేసింది. -
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి శ్రేణులు చేస్తున్న దాడులు, విధ్వంసాలను అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరింది. వైఎస్సార్సీపీ నేతలు, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి, ఈమేరకు వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, అస్థిరత నెలకొందని వివరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపింది. తక్షణమే జోక్యం చేసుకొని టీడీపీ అరాచకాలకు అడ్డకట్ట వేయాలని గవర్నర్‌ను వైఎస్సార్సీపీ బృందం కోరింది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల ధ్వంసం జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం : వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులుగా టీడీపీ, జనసేన శ్రేణులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన, ఇళ్లపైన దాడులు చేస్తున్నారని, దారుణంగా అవమానిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తున్నారని, పారీ్టకి చెందిన, వైఎస్సార్ పేరు ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. కనీసం కేసులు కూడా నమోదు చేయడంలేదని అన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. అయినా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదన్నారు. దాడులు, విధ్వంసం కొనసాగుతూనే ఉందని అన్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా తగలబెడుతున్నారని అన్నారు. పరిస్థితులు దారుణంగా ఉండటంతో తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. హింసాత్మక ధోరణి కొనసాగరాదు : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తూ ఒక పద్ధతిలో ఓడిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఉండాలని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2014 –19లో చంద్రబాబు తెచ్చిన జీవో, నిబంధనల ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని తెలిపారు. నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని, ఇవి అక్రమ నిర్మాణాలు కాదని స్పష్టం చేశారు. అయినా వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ దు్రష్పచారం చేస్తున్నారన్నారు. ఒక్కో ఆఫీసు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, ఈరోజు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ఉందన్నారు. అంటే ఒక్కో ఆఫీసు నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇలా ఇప్పటి వరకు 18 ఆఫీసులకు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. కానీ రూ.500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లు ప్రజాధనం దురి్వనియోగమైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్,, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ ఆఫీసుల్లోకి ప్రవేశించి బెదిరింపులు గతంలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ల పార్టీ భవనాలకు, బీజేపీ ఆఫీసులకు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు స్థలాలు మంజూరు చేసిన విధంగానే, ఆ నిబంధనల ప్రకారమే వైఎస్సార్సీపీ ఆఫీసులకు స్థలాలు తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నాక భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణం పూర్తయ్యే వాటి వద్దకు వెళ్లి టీడీపీ, జనసేన కార్యకర్తలు అక్కడున్న తమ కార్యకర్తలు, సిబ్బందిని బెదిరించి భవనాలను కూలగొడతామంటున్నారని, వీటన్నింటినీ అడ్డుకోవాలని గవర్నర్‌ని కోరామని తెలిపారు. వీటికి సంబంధించి ఫొటోలను కూడా గవర్నర్‌కు చూపించామన్నారు. కొన్ని ఫొటోలను చూసి ‘ఇంత దారుణంగా పరిస్థితి ఉందా’ అని గవర్నర్ చాలా ఆశ్చర్యపోయారని తెలిపారు. -
పోచారం, సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్‌కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
నినాదాల వివాదం.. ఒవైసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద నినాదాలపై ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.పార్లమెంటులో ఇతర దేశానికి జై కొట్టినందుకు ఆయను డిస్క్వాలిఫై చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. మంగళవారం(జూన్25) లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేసి ఒవైసీ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే.ఒవైసీ చేసిన నినాదాలను లోక్‌సభ రికార్డుల నుంచి ప్రొటెం స్పీకర్ ఇప్పటికే తొలగించారు. అయితే పాలస్తీనాలో ప్రజలు అణచివేతకు గురవుతున్నందునే తాను ఆ నినాదం చేశానని ఒవైసీ మీడియాకు తెలిపారు. -
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు!
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు నమోదైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఆయనపై కంప్లెంట్ చేశారు. జానీ మాస్టర్‌పై డ్యాన్సర్ సతీశ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన అరాచకాలపై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొరియర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. షూటింగ్స్‌కు సతీష్‌ను పిలవవద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్లు చేయిస్తున్నాడని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నానని వెల్లడించారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ సమస్యలపై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని కంప్లైంట్లో సతీశ్ వివరించారు. కాగా.. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతం జానీ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. -
గ్రామాల్లో ఉండాలంటే మేము చెప్పినట్లు చెయ్యాలి
చంద్రగిరి (తిరుపతి జిల్లా): ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలు తెలిసిందే. కూచువారిపల్లి, రామిరెడ్డిపల్లిలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే స్థానిక టీడీపీ నేత రామిరెడ్డిపల్లి గ్రామస్తులకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులైన పలువురు మహిళలు శనివారం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.తమకు రక్షణ కల్పించాలని, ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి నుంచి తమను కాపాడాలని రామిరెడ్డిపల్లి మహిళలు స్టేషన్‌కు వెళ్లారు. అయితే పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రామిరెడ్డిపల్లి గ్రామస్తులందరూ కూచువారిపల్లి భజన మందిరం వద్దకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మహిళలు వాపోయారు.లేకపోతే ఒక్కొక్కరిపై కేసులు పెట్టి మీ అంతు చూస్తామంటున్నారని, దీంతో గ్రామంలో పలువురు యువకులు ప్రాణభయంతో పారిపోయారని తెలిపారు. కూచువారిపలి్లకి చెందిన ఓ వ్యక్తి తమను బెదిరిస్తున్నాడంటూ, కాల్ రికారి్డంగ్‌ను పోలీసులకు వినిపించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు తమ ఫిర్యాదులు తీసుకోలేదని మహిళలు తెలిపారు. ఎవరిని బెదిరించారో వారే ఫిర్యాదు చేయాలే తప్ప, కుటుంబ సభ్యులు రాకూడదని పోలీసులు అంటున్నారని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహిళలు అంటున్నారు. -
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్ కి ఫిర్యాదు
-
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత.. ట్రాయ్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సాక్షితో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోంది.సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది.మీడియాకు ఆంక్షలు.. కొత్త సర్కార్ విపరీత పోకడఏపీ సీఎం ప్రమాణస్వీకారానికి మీడియా, జర్నలిస్టులకు కొత్త ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాతో పాటు మరో రెండు ఛానళ్లకు అనుమతి నిరాకరించింది. కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వని అధికారులు.. ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి మీడియా కవరేజ్‌కు ఆంక్షలు విధించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాని పర్యటన వార్తలు కవర్ చేయొద్దన్న ఆంక్షలపై పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూలేని విపరీత పోకడలపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎల్లో మీడియాకు ఆహ్వానాలు అందగా, బాబు ప్రభుత్వం కొలువు దీరకముందే ఆంక్షలు విధించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, రాష్ట్రంలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.. -
ఇన్ఫోసిస్‌పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా..
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మీద ఐటీ యూనియన్ ''నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'' (NITES) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దాదాపు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్లకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని ఆరోపించింది.ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో రెండేళ్లకు పైగా జాప్యం జరుగుతోంది. దీనివల్ల బాధిత ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపైన ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.చాలా మంది ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై నమ్మకంతో ఇతర జాబ్ ఆఫర్లను తిరస్కరించారు. దీనివల్ల ఆదాయం లేకపోవడం మాత్రమే కాకుండా.. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ చేసుకుంటారనే విషయం మీద స్పష్టత లేకుండా ఉన్నారు. చాలామంది తమ కెరీర్ సాఫీగా ముందుకు సాగటానికి ఇన్ఫోసిస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఇన్ఫోసిస్ ఆలస్యం వల్ల ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి.. కంపెనీ రిక్రూట్లకు జీతం చెల్లించాలని యూనియన్ కోరింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఐటీ యూనియన్ కోరింది.ఐటీ సంస్థల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీసీఎస్ 200 రిక్రూట్ల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేసింది. ఈ కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. -
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి. -
కేసీఆర్‌పై ఏబీఎన్ తప్పుడు కథనాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యక్తిత్వాన్ని దిగ జార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు మరో ఎనిమిది మందిపై పార్టీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఆంధ్ర జ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసిన ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై కూడా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీసు స్టేషన్లో, ఇతర చానళ్లపై బంజా రాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మే 28న జరిగిన వాదనల్లో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్‌లు, వార్తలు ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ‘మార్గదర్శి మా నాన్న.. మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు’ అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేస్తున్న ట్లు ఈడీ తేల్చిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసిందని వివరించారు.ఈ వార్తకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదును పెన్‌డ్రైవ్ ద్వారా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు అందజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వార్త పూర్తి సారాంశాన్ని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు. వార్తను ప్రసారం చేసే సమ యంలో కేసీఆర్, కవిత ఫొటోలతో పాటు ఈడీ, మద్యం సీసాల క్లిప్పింగులను జత చేశారని తెలి పారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహిత్‌రావు.. కోర్టులో జరిగిన వాస్తవ విషయాలపై ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నింది తుడు మాగుంట రాఘవ చేసిన వ్యాఖ్యలను కవిత, కేసీఆర్‌కు ఆపాదిస్తూ ఏబీఎన్ వార్తను ప్రసారం చేసిందన్నారు.కేసీఆర్, కవిత, బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. న్యాయవిచారణ అంశాల ను కూడా ఏబీఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యా నాలతో తప్పుదోవ పట్టించారని తెలిపారు. తప్పుడు కథనాలతో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశా రని పేర్కొన్నారు. దీంతో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరక్టర్ భానుకృష్ణ, ఈడీ పి.వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణ కు మార్, కస్తూరి శ్రీనివాస్, నవీన్‌తో పాటు మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.కేసీఆర్ ఇమేజీని దెబ్బ తీసేందుకే..వాస్తవాలను నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ స్థాయి, ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను ప్రసారం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన తెలంగాణ భవన్లో శుక్రవారం పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీ 6, ఎన్టీవీ, ఐ న్యూస్, అమ్మ టీవీ, బీఆర్కే, డైలీ న్యూస్, జర్నలిస్టు సాయి చాన ల్, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్, ఆర్ టీవీ, రాజ్‌న్యూస్, రెడ్ టీవీ, వైల్డ్ ఓల్ప్.. తది తర 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై పోలీసు లకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కేసీఆర్ ఔన్నత్యాన్ని తక్కువ చేసి చూపడం సరికాదన్నారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. -
రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్లు కొనుగోలు చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారికి బీజేపీ నేత రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అక్రమాలకు పాల్పడిందని ఆరో ³ంచారు. మంగళవారం ఈ మేరకు సీఈఓను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు పత్రం అంద జేశా రు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియా తో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ద్వారా డబ్బు పంపించిన అకౌంట్, పాన్ కార్డు వివరాలు అందజేసినట్టు తెలిపారు.వాటి ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరినట్టు తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఆదాయపన్ను మినహాయింపు పొందిన బీఆర్ఎస్ బ్యాంక్ ఖాతా ద్వారా రూ.30 కోట్లు పలువురు నాయకులకు బదిలీ చేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందన్నారు. డబ్బు పంచి ఓట్ల కొనుగోలుతో ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎమ్మె ల్యేలపై చర్యలతోపాటు బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ తరఫున కోరినట్టు తెలిపారు. ఏ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించారో, తిరిగి ఓట్లు కొనుగోలుకు ప్రయత్నించారో ఆ అకౌంట్ వివరాలు సీఈఓకు అందజేశామ న్నారు. తాను అందజేసిన వివరాలు, సమాచారాని కి అనుగుణంగా చర్యలు తీసుకోక పోతే ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి బీఆర్ఎస్ అకౌంట్ డిటైల్స్, ఆదాయపు పన్ను మినహాయింపు పొందిన ఆ పార్టీ పాన్ కార్డు వివరాలు అందజేస్తామన్నారు. -
బ్యాంక్‌ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
మీరు బ్యాంక్ బ్రాంచ్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి అని అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). బ్యాంక్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దానిని బ్యాంక్ బ్రాంచ్ అధికారులు లేదా దాని ప్రధాన కార్యాలయం పరిష్కరించలేకపోతే, మీరు ఆర్బీఐలో బ్యాంక్‌పై ఫిర్యాదు చేయడానికి ఈ పద్దతిని ఎంపిక చేసుకోవచ్చు.ఫిర్యాదులను స్వీకరించేందుకుఅటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం బ్యాంకులు అందించే కొన్ని సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంక్ కస్టమర్ల కోసం ఒక వేగంగా చర్యలు తీసుకునే వేదిక.ఎటువంటి రుసుము లేకుండాబ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006లోని క్లాజ్ 8 ప్రకారం (జూలై 1, 2017 వరకు సవరించిన ప్రకారం) ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి, పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు అని ఆర్బీఐ తరచుగా పేర్కొంది.ఆర్బీఐ అంబుడ్స్‌మన్ బ్యాంక్ ఖాతాదారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా.. బ్యాంక్ తరుపు లోపాలుంటే ఖచ్చితంగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. సమస్య ఉందని పరిష్కారం కోరినా బ్యాంకులు పట్టించుకోకపోతే, సంబంధిత బ్యాంకు మీ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక నెలలోపు బ్యాంకు నుండి ప్రత్యుత్తరం రాకుంటే, బ్యాంక్ ఫిర్యాదును తిరస్కరించినట్లయితే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు https://rbi.org.in/Scripts/Complaints.aspx ఈ లింక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. -
పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
సాక్షి, అమరావతి: ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్‌పై మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలు ఫిర్యాదు చేసినా జిల్లా ఎస్పీ బేఖాతర్ చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను గురువారం కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకుంటే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయన్నారు.ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిందని, 60కి పైగా కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై టీడీపీ మూకలు దాడులకు తెగబడటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికల ముందు పోలీస్ అధికారులను ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని చెప్పారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బదిలీలతో చెలరేగిన హింస.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి ముందుగానే ఈసీ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తగిన భద్రత కలి్పంచాలని కోరామన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో టీడీపీ బరి తెగించి రిగ్గింగ్, దాడులకు తెగబడిందన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో ఈసీ అధికారులను బదిలీ చేసిన చోట్ల హింస చెలరేగిందన్నారు. రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం, బూత్‌ల క్యాప్చరింగ్ తదితరాలపై పోలింగ్ రోజే టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.16 నియోజకవర్గాలకు సంబంధించి 60 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ జరపాలని కోరామన్నారు. రీ పోలింగ్ కోరుతున్న బూత్‌లలో లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పాల్వాయి గేట్, తుమృకోట, చింతపల్లి, ఒప్పిచర్ల, జెట్టిపాలెం, వెల్దుర్తిలో టీడీపీ విధ్వంసకాండపై ఈసీకి పోలింగ్ రోజే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పారు. వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇతర అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి, పానుగంటి చైతన్య పాల్గొన్నారు. -
మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
దర్శి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో ఈసీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్న ఆరోపణలకు దర్శి ఘటన బలం చేకూరుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై 10 రకాల సెక్షన్లు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది.ఈ విషయంపై పచ్చ మీడియా చిలువలుపలువలుగా కథనాలు ప్రచురిస్తోంది. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు ఈవీఎంను ధ్వంసం చేశారు. దానిని పగులగొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డిపై తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రం. 13వ తేదీ పోలింగ్ జరుగుతున్న సందర్భంగా దర్శి ఎంఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఎంపీ అభ్యర్థికి చెందిన ఈవీఎంను టీడీపీ నేత వేమిరెడ్డి చెన్నారెడ్డి(వీసీ రెడ్డి) పగులగొట్టాడు. ఇదే బూత్ సమీపంలో టీడీపీ నేతలు వీరంగం చేయడంతో కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.నిందితుడికి 41ఏ నోటీసులతో సరి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వీసీ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా వీసీ రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి వీసీ రెడ్డి పరారయ్యాడు. 41ఏ నోటీసులు తీసుకున్న వ్యక్తి పోలీసుల అనుమతి లేకుండా గ్రామం విడిచి వెళ్లకూడదు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నిందితుడు ఒంగోలు రామ్‌నగర్‌లో నివాసముంటున్న టీడీపీ కీలక నేత కుమారుడి వద్ద ఆశ్రయం పొందినట్లు గత పది రోజులుగా ప్రచారం జరిగింది. సదరు నాయకుడి ఒత్తిడి మేరకే వీసీ రెడ్డిపై పోలీస్ అధికారులు ఉదాశీన వైఖరిని అవలంబిస్తున్నారని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా.. బుధవారం వీసీ రెడ్డి దర్శిలోని ఓ రెస్టారెంట్లో ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతుండటం గమనార్హం. ఈవీఎం ధ్వంసం చేసిన విషయం, నరసరావుపేట నుంచి వచ్చిన 150 మంది టీడీపీ గూండాలు దర్శి నియోజకవర్గంలో చేసిన రచ్చను ఉద్దేశపూర్వకంగా దాచేసిన ఎల్లో మీడియా.. వైఎస్సార్సీపీ నాయకులపై మాత్రం విషం చిమ్మడాన్ని ఆపడం లేదు. -
TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్ వీడియో వైరల్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ‘ఎక్స్’ఖాతాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ వెలుగులో వైద్యసేవలు అందించారని, ఈ క్రమంలో ఓ బాలుడు మృతి చెందాడని, గొప్పులు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు దరిద్రంగా ఉందని, గుంపు మేస్త్రీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వీడియోను పెట్టారు. ఓ తెలుగు చానల్ లోగోతో ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ ‘బీఆర్ఎస్ యూఎస్ఏ’ఎక్స్ ఖాతాలో ఇది పోస్ట్ అయింది. దీనిపై సీఎం కార్యాలయం విచారణ చేపట్టగా అంతా ఉత్తదే అని తేలింది. పాత క్లిప్పింగ్‌తో డీప్‌ఫేక్ ద్వారా తప్పుడు వీడియోను సృష్టించారని విచా రణలో వెల్లడైంది. సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు చిలకలగూడ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ యూఎస్ఏ ఎక్స్ ఖాతాలో హరీశ్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్ వీడియోను అప్లోడ్ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఐటీ, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ తెలిపారు. వైద్యులు, సిబ్బందిపై నిందలు వే యడం తగదని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?
సాక్షి, అమరావతి/మాచవరం: రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై టీడీపీ నేతలు చేసిన దాడులపై సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన చైర్పర్సన్ వెంకటలక్ష్మి తక్షణం బాధితులకు రక్షణ కలి్పంచి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గమన్నారు.ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలను దాదాపు 24 గంటలపాటు బంధించి కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేయడం అత్యంత పాశవికమని ఆందోళన వ్యక్తంచేశారు. చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వారు స్వేచ్ఛగా నచి్చన వారికి ఓటు వేసే హక్కు లేదా అని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లేసినంత మాత్రాన అదే పాపమని చంపేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళల పట్ల చిన్నచూపుతో వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతున్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత మహిళలకు ఏపీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. -
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈసీని కోరిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం
-
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు.చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. -
అల్లర్లు, దౌర్జన్యాలు, హింస
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిరాశ, నిస్పృహలతో తెలుగుదేశం పార్టీ పలుచోట్ల అల్లర్లు, దౌర్జన్యాలు, హింసకు పాల్పడిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూనే ఉందని చెప్పారు. ఈ ఘటనలపై ఎన్నికల అధికారులకు సోమవారం ఒక్క రోజే 58 ఫిర్యాదులు చేశామని, వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రెండుసార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీ ఆర్పీ ఠాకూర్ మరి కొందరు పోలీస్ అధికారులు మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు దిగారని చెప్పారు. వీరి ప్రభావంతో పలు చోట్ల పోలీసు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. బాపట్లలో నందిగం సురేష్ ఎన్నికల ఏజెంట్లు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, కారును ధ్వంసం చేసి వారిని భయభ్రాంతులకు గురిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు.ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్లు మరి కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కూర్చుని జిల్లాల్లోని పోలీసు అధికారులకు ఫోన్లు చేసి రానుంది టీడీపీ ప్రభుత్వమని.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ బెదిరింపులకు దిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఓటు వేసేటప్పుడు ఆయన భార్య కూడా పోలింగ్ బూత్‌లోకి రావడం నిబంధనలకు విరుద్ధమని, సిబ్బంది ఆమెను ఎలా అనుమతించారని మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 255, 217, 218 పోలింగ్ బూత్‌లలో వృద్ధులను పోలింగ్ అధికారి తీసుకువెళ్లి తప్పుగా ఓటు వేయించారన్నారు. ఇదే నియోజకవర్గంలో 194, 195, 233 పోలింగ్ బూత్‌లలోకి వృద్ధులతో పాటు వచ్చే అటెండెంట్స్ను పోలీసులు అనుమతించక పోవడం నియమావళికి విరుద్ధమని చెప్పారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టి పాలెంలో 215 పోలింగ్ బూత్‌లో ఈవీఎంను టీడీపీ కార్యకర్తలు పగులగొట్టారని తెలిపారు. వైఎస్సార్సీపీ విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకోకుండా, ఏజెంట్లు లేకుండానే అధికారులు మరో ఈవీఎంతో పోలింగ్ నిర్వహించడం దారుణం అన్నారు. కలెక్టర్, ఎస్పీలు సైతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలు⇒ దర్శి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 145లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడ్ని తలపగులగొట్టారు.⇒రాయచోటి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ 32లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు.⇒ పెదకూరపాడులో పోలింగ్ బూత్ నెంబర్ 93, 94లలో కంచేటి సాయి అనే టీడీపీ నేత వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడి చేశారు. ⇒ తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 237 వద్ద పార్టీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ⇒తెనాలిలో టీడీపీ నేత గొట్టిముక్కల సుధాకర్ ఎంఎల్ఏ అన్నాబత్తుని శివకుమార్‌ను, ఆయన భార్యను దూషించి ఘర్షణకు కారణమయ్యారు. ⇒ గంగాధర నెల్లూరులో, విశాఖ వెస్ట్ నియోజకవర్గాలలో బౌన్సర్లతో టీడీపీ నేతలు హల్ చల్ చేశారు.⇒తాడిపత్రి, చిత్తూరు, కుప్పం నియోజకవర్గాలలో సైతం టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు.⇒ కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ అభిమానులపై దాడులకు పాల్పడ్డారు.⇒ రాష్ట్రంలో పలు పోలింగ్ బూత్‌లలో ప్రిసైడింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వృద్ధులతో పాటు అటెండెంట్లను అనుమతించ లేదు. ఓటర్లను టీడీపీకి అనుకూలంగా ప్రభావితం చేశారు. వాటికి సంబంధించి ఆయా పోలింగ్ బూత్ నంబర్లతో సహా ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.⇒ జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై దాడి చేసి కొట్టారు. తలకు గాయం అయింది. ⇒ టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు ఏకంగా పోలింగ్ బూత్‌లలో ప్రభావితం చేస్తూ చొచ్చుకు వచ్చారు. ఆయా పార్టీల రంగులున్న టీ షర్టులు, కండువా లతో లోపలికి వచ్చినా, పోలింగ్ అధికారులు నిరోధించలేదు.⇒చాలాచోట్ల ఈవీఎంల దగ్గరకు వెళ్లి రిగ్గింగ్ చేయడం, వైఎస్సార్సీపీ ఏజెంట్లను భయపెట్టడం, పోలింగ్ కేంద్రాల సమీపంలోనే డబ్బులు పంచడం వంటి చర్యలకు పాల్పడ్డారు.⇒టీడీపీ దాడులు, రిగ్గింగు వంటి సంఘటనల నేపథ్యంలో పలుచోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారులను కోరాం. ఈ సంఘటనలన్నింటిపై ఈసీకి ఫిర్యాదు చేశాం. -
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్‌లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్‌తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
గుంటూరు, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్లపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీకి అనుకూలంగా పని చేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదులో పేర్కొంది.ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లు టీడీపీ ఆఫీస్ వేదికగా అధికారుల్ని బెదిరిస్తున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని జిల్లా పోలీస్ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. -
‘వుయ్ యాప్’పై కఠిన చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన ‘వుయ్ యాప్’పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. ఈ యాప్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. డేటా చౌర్యంతో ఓటర్ల భద్రతకు ముప్పు కలిగిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ‘వుయ్ యాప్’పై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకే టీడీపీ ప్రత్యేకంగా ‘వుయ్ యాప్’ను రూపొందించిందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికే టీడీపీ వుయ్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే ఆ యాప్ పేరిట టీడీపీ అక్రమాలు కొనసాగుతుండటంతో ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీకి, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ బాపట్ల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.. ⇒ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టం, ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా టీడీపీ ‘వుయ్ యాప్’ను రూపొందించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోంది. ⇒ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, వయసు, చిరునామా, కులం, మతం, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను నిబంధనలకు విరుద్ధంగా ఆ యాప్‌లో పొందుపరిచింది. తద్వారా ఓటర్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తోంది. ⇒ ఓటర్ల కదలికలను నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్ చేస్తూ వారి భద్రతకు ముప్పు తెస్తోంది. ⇒ ప్రత్యేకంగా బార్ కోడ్లను ముద్రించిన ఓటరు స్లిప్పులు, కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తోంది. అనంతరం నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెడుతోంది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతోంది. -
ఫేక్ వీడియోలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫేక్ వీడియోల సర్క్యులేషన్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, విచారణ జరుగుతోందని, నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు వచ్చిన ఫేక్ వీడియోల ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే 47 శాతం పూర్తయిందని, మరో రెండు, మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీలు, అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. తద్వారా పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అనుమానా లకు తావు ఉండదన్నారు.ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950లోక్‌సభ ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పాల్గొననున్నారని వికాస్ రాజ్ వెల్లడించారు. ఏడు లోక్‌సభస్థానాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు, 9 స్థానాల్లో 2 బ్యాలెట్ యూని ట్లు వాడాల్సి వస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనపు బ్యాలెట్ యూనిట్లు రప్పిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్‌కేంద్రాల వద్ద ఎండ తగలకుండా టెంట్లు..షెడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన టోల్ ఫ్రీ నంబరు ద్వారా 1,227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఆన్లైన్లో వివిధ రకాలుగా 18 వేల ఫిర్యాదులు వచ్చాయని.. అందులో 16 వేలు పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లురాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఉండగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,900 ఉన్నట్లు చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.పోలింగ్‌శాతం పెంచాలని..పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. 5 వేల పోలింగ్ కేంద్రాల్లో తక్కువ పోలింగ్ శాతం రికార్డు అవుతున్నట్టు గుర్తించామన్నారు. పోలింగ్ సమయంలో సెక్టార్ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియ నిదానంగా జరిగినా, తక్కువ పోలింగ్ నమోదవుతున్నా వెంటనే అలర్ట్ అయి పరిస్థితిని చక్కదిద్దు్దతారన్నారు. 5, 6 తేదీల్లో హోం ఓటింగ్ఇంటి వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు 23,248 మంది దరఖాస్తులను ఆమోదించినట్టు వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో వయోవృద్ధులు 10,362 మంది, దివ్యాంగులు 11,032 మంది, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఓటర్లు 1,854 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5, 6న వీరికి వారి ఇంటి దగ్గరే ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటికి 7,185 కేసులు7185 కేసులు నమోదు చేసినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఆబ్కారీ శాఖ 6560 కేసులు, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ కింద 287 కేసులు, ఐపీసీ కేసులు 309, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 21 కేసులు నమోదైనట్లు వివరించారు. రూ. 81 కోట్లు నగదు, రూ.46 కోట్లు విలువైన లిక్కర్, రూ. 26 కోట్లు విలువైన డ్రగ్స్, రూ.27 కోట్లు విలువ చేస్తే ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.212 కోట్ల విలువైన నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డిపై సీఈవోకు బీఆర్ఎస్ నేతలు బుధవారం(మే1) ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదాహరిస్తూ రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కాగా, కాం గ్రెస్ ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్‌పై ఇప్పటికే చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపాలని ఆదేశించింది. -
అమల్లోలేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ‘అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను అందజేశారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కోడుమూరు, మంత్రాలయంలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగిస్తూ సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఈ నెల 28న ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
గెలవలేక దుష్ప్రచారం!
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు కోసం వక్రమార్గం పడుతున్నారు. ఇందులో భాగంగా.. జనసేన అల్లరి మూకలు కొందరు వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఆమెకు సినీ నటుడు చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికొస్తే, గీత తన నామినేషన్ ఉపసంహరించుకుని జనసేనలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కుటిల రాజకీయాలకు తెరలేపారు.వంగా గీత 1990 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీలో నామినేటెడ్ పదవులు నిర్వహించిన ఆమె.. 1996 నుంచి నాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, లోక్‌సభ సభ్యురాలిగా ఓటమి ఎరుగని నాయకురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 2008 ఆగస్టు 2న ప్రకటించారు. 2013లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆ పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. అలాంటి ప్రజారాజ్యం పారీ్ట.. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వంగా గీతకు రాజకీయ భిక్ష పెట్టిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకం ప్రకారం కుట్ర కాగా, ప్రజలందరూ వైఎస్సార్సీపీ వైపు ఉన్నారని, జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారని వంగా గీత చెప్పారు. ఓటమి భయంతోనే జనసేన నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసంహరణ గడువు అయిపోయాక నామినేషన్‌ను నేనెలా విత్‌డ్రా చేసుకుంటానని, ప్రజలను అయోమయానికి గురి చేయాలని పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలే ప్రసక్తే లేదని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పిఠాపురంలో ఇప్పటికే తన గెలుపు ఖాయమైందని, దానిని ఎవరూ ఆపలేరని చెప్పారు. -
చంద్రబాబుపై ‘ఈసీ’కి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు
సాక్షి,తాడేపల్లి: సీఎంజగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు వైస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి సోమవారం సీఈవోను కలిశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంను చంపాలని మాట్లాడటం దారుణమన్నారు. ‘చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేశాం. ఐవీఆర్ఎస్ కాల్ల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేశాం.ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు వీడియోను ప్రచారం చేశారు. పృథ్విరాజ్,టీడీపీ,జనసేనపై చర్యలు తీసుకోవాలని కోరాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఆ పార్టీలు మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నాయి’ అని అన్నారు. -
జగన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు...ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
-
రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచురిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.ఈ సందర్భంగా ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధతను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
చంద్రబాబుపై చర్యలకు ఎన్నికల సంఘం సిఫార్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా బాబు తన ప్రసంగాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతూ సీఎం జగన్‌పై అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ, ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేసింది. వాటిలో 18 ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ బాబుకు నోటీసులు జారీ చేయగా.. కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన బాబు మరికొన్నింటికి అసలు స్పందించలేదు. బాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత బాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఈ 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్పులను జత చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు. తాజాగా మరో ఫిర్యాదు ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈవోకు ఫిర్యాదు అందించారు. ఈ నెల 22న జగ్గంపేట బహిరంగ సభలో బాబు ప్రసంగిస్తూ.. సీఎం జగన్, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం కాబట్టి బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగ్గంపేట సభతోపాటు నర్సంపేట, ఎస్.కోట సభల్లో కూడా చంద్రబాబు పరుష పదజాలం వాడారని, సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యను చంద్రబాబు పదే పదే కొనసాగిస్తున్నారని, పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అంటూ నిరుద్యోగులకు మళ్లీ దగా చేయాలని చూస్తున్నారని, వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. -
మేనిఫెస్టోపై తప్పుడు ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్23) ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగాల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమానత్వ అభివృద్ధి అని రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లకు తప్పుడు అర్థాలు చెబుతున్నారని తెలిపారు. ‘ఇది బీజేపీ కావాలని చేస్తోంది. మధ్య తరగతి వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు’అని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. ఈ విషయంలో బీజేపీపై కఠినన చర్యలు తీసుకోవాలని కోరారు. -
చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో సిఫార్సు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేసింది. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ 18 సార్లు ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు సీఈవో పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే కొన్ని నోటీసులకే మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు.. కొన్ని నోటీసులపై స్పందించలేదు. చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. వైఎస్సార్సీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించారు. బాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు సీఈవో మీనా లేఖ రాశారు. బాబు మాట్లాడిన వీడియో క్లిప్పులను కూడా జత చేశారు. చదవండి: పవన్ కల్యాణ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు -
TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ‘ఈసీ’కి ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి మంగళవారం(ఏప్రిల్23) ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు చేసిన అనతంరం బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సీఈవో వికాస్‌రాజ్‌కు అందించాం. ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోంది’ అని ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు దొరలే.. -
పవన్ కల్యాణ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
సాక్షి,కాకినాడ జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జర్నలిస్టు నాగార్జున రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పిఠాపురంలో జరిగిన నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని వినియోగించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ పతాకాన్ని వినియోగించడంపై అభ్యంతరం తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం(ఏప్రిల్ 23) పవన్‌కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనను కూటమి సభ్యులు ఉల్లంఘించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు కూటమి కార్యకర్తలు చొచ్చుకువచ్చారు. నామినేషన్లో ఆస్తులు వెల్లడించిన పవన్ కల్యాణ్ పవన్ కళ్యాణ్ ఆస్తులు రూ. 114 కోట్ల 76 లక్షలు అప్పులు రూ.64.26 కోట్ల రూపాయలు ఇదీ చదవండి.. కూటమి వెన్నులో వణుకు.. వైఎస్ఆర్సీపీలో భారీ చేరికలు -
ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
-
జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలి: షేక్ జలీల్
-
పవన్, బాలకృష్ణపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌కళ్యాణ్, నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశారు. సోమవారం సచివాలయంలో సీఈవో ముఖేష్ కుమార్‌మీనాను కలిసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలతో ఫిర్యాదు అందజేశారు. ఈ నెల 13న కదిరి బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఈ నెల 14న తెనాలి నియోజకవర్గంలో జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఎన్నిక కోడ్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు దినపత్రిక ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కథనాలు రాస్తోందని, దీనిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహరరెడ్డి తదితరులు ఉన్నారు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు -
చంద్రబాబుపై ఈసీకి ఎమ్మెల్యే విష్ణు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సోషల్ మీడియాపై ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ఎక్కడా ఎన్నికల నియమావళిని పాటించడం లేదని చెప్పారు. ముఖ్యంగా బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రవర్తన జుగుప్సాకరమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి బచ్చా అనడం, విషం చిమ్ముతున్నారంటూ మాట్లాడటం బాబు అనైతికతకు అద్దం పడుతోందని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఓటర్లలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారమే చేయడం చంద్రబాబు ఏకైక అజెండా అని, ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఆయనకు లేదని అన్నారు. ఎంతకాలం వైఎస్సార్సీపీపై బురదచల్లుతారని నిప్పులు చెరిగారు. కోర్టు పరిధిలో ఉన్న వివేకానందరెడ్డి కేసు గురించి చంద్రబాబు, లోకేశ్, షరి్మల, సునీత పదేపదే మాట్లాడుతున్నారని, పైగా హంతకుడంటూ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తారని ప్రశ్నించారు. పింఛన్‌దారుల మృతిపైనా టీడీపీ వెబ్సైట్లలో ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. శవ రాజకీయాలను మానుకోవాలని సూచించారు. రాయలసీమలో పర్యటిస్తున్న సీఎం జగన్ ఓ పేద ముస్లిం సోదరుడి సమస్యను పరిష్కరిస్తే, వాహనం ఆపలేదని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దిగజారుడుతనం కాదా అని ప్రశ్నించారు. మైనారీ్టలను కేబినెట్లో పక్కన కూర్చోబెట్టుకోలేని అసమర్థ నేత చంద్రబాబుకు మైనారీ్టల గూరించి మాట్లాడే అర్హత ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీటీడీపైనా రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. కలియుగ దైవం జోలికి వస్తే ఈసారి టీడీపీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. కూటమి నేతలు కులాలు, మతాల ప్రస్తావన మానుకోవాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి గుర్తింపు లేని జనసేనకు అధినేత, పోటీ చేసిన రెండు చోట్లా ఘోర పరాజయం పాలైన పవన్.. 151 స్థానాలతో అధికారంలోకి వచి్చన సీఎం జగన్‌ని దుర్భాషలాడతారా అంటూ విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన స్కాం స్టార్లు ఎవరో జనసేన నేతలే బయటకు వచ్చి చెబుతున్నారన్నారు. జనసేన అధినేత తన మాటలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఓట్లు నివాసాలలో ఉండాలనే నిబంధనకు విరుద్ధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఓ కార్యాలయంలో ఓట్లు నమోదు చేసి ఉంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, నాగ నారాయణమూర్తి, శ్రీనివాసరెడ్డి, ఒగ్గు గవాస్కర్, కొండపల్లి బుజ్జి పాల్గొన్నారు. -
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తున్న టీడీపీ, బీజేపీ నేతలు
-
ఓటర్లపై కూటమి ప్రలోభాల వల
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయంలో ఈసీని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాకు వెల్లడించిన వివరాలు.. ► రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఘటనలను ఎప్పటికప్పుడు ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నాం. కడప బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని, ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయమని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు. దీనిపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశాం. ► విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ నేత కేశినేని చిన్ని, ఓటర్లను ప్రలోభ పరుస్తూ డబ్బులు పంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆనాడు కేంద్ర కేబినెట్లో ఉండి కూడా, రాష్ట్ర ప్రయోజనాలను సుజనా పూర్తిగా పక్కన పెట్టారు. ప్రత్యేక హోదాను సమాధి చేసి ప్యాకేజీగా మార్చడంలో సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల పాత్రే కీలకం. ► సీఎస్, డీజీపీలపై నర్సీపట్నం సభలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వాడిన భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. అధికారులను తూలనాడటం, వ్యవస్థలను తేలిక చేసి మాట్లాడటం, చంద్రబాబు నుంచి అభ్యర్థుల వరకు షరా మామూలైపోయింది. – పింఛన్ దారుల విషయంలోనూ ఏవిధంగా కూటమి నేతలు చులకన చేసి మాట్లాడారో ఈసీ దృష్టికి తీసుకువెళ్లాం. మైనార్టీలపై బాబు కపట ప్రేమ ‘‘మైనార్టీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి ఏమాత్రం లేదు. ఆనాడు దివంగత మహానేత మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువస్తుంటే, కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంది టీడీపీ కాదా? అధికారంలో ఉండి కూడా ఎన్నికలకు ముందు 4 నెలల వరకు మైనార్టీలకు కేబినెట్లో స్థానం కల్పించని వ్యక్తి చంద్రబాబు. కానీ సీఎం వైఎస్ జగన్ తన తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించి, మైనార్టీల పక్షపాతిగా నిలిచారు’’ అని విష్ణు పేర్కొన్నారు. అమరావతి పేరుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆడిన డ్రామాలను ప్రజలు గ్రహించినందునే స్థానిక ఎన్నికల్లో అక్కడి ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టి అన్నదాతలకు ద్రోహం చేసిన చంద్రబాబు రైతు సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎ. నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్నిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ప్రచారంలో భాగంగా హారతి పళ్లెంలో డబ్బులు వేసిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసులో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బుల పంపిణీపై వార్తా చానల్స్, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్, హారతి పళ్లంలో డబ్బులు వేస్తున్న వీడియోలు ఎన్నికల అధికారులకు అందజేశారు. పూర్తి ఆధారాలు ఉన్నందున ఎన్నికల నియమావళిలో సూచించిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుజనా చౌదరి డబ్బుల సంచులతో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారన్నారు. తొలిరోజే ఆయన కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. -
దుష్ప్రచారాన్ని కట్టడి చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పత్రికలు, మీడియా చానళ్లు నిరాధార ఆరోపణలతో తమపై చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కీలకమైన ఎన్నికల తరుణంలో ఐపీఎస్ అధికారులతోపాటు యావత్ పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి 19 మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు కాంతిరాణా టాటా, రవీంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు శనివారం సమర్పించారు. ఆ వినతిపత్రంతో పాటు ఇటీవల ఐపీఎస్ అధికారులపై టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియాలో వచ్చిన 17 నిరాధారమైన వార్తా కథనాలను జత చేశారు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లు పక్కా కుట్రతోనే దుష్ప్రచారం సాగిస్తున్నాయి. ముందుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తారు. అనంతరం అవే ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. వారు చేసేఆరోపణలకు ఎలాంటి ఆధారాలుండవు. కానీ పదే పదే అసత్య ఆరోపణలు చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది ఆ పా ర్టీల కుట్ర. దాంతో పోలీసు వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది. అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ ఆరోపణలను పునరుద్ఘాటిస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత మొదలైన నిందలు వేస్తారు. ప్రతిపక్ష పా ర్టీల ఆరోపణలను ఆ పార్టీలకు కొమ్ముకాస్తున్న పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తాయి. మీడియా చానళ్లు పదే పదే వాటినే ప్రసారం చేస్తాయి. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఆ దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తాయి. మళ్లీ మరో అసత్య ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తాయి... మళ్లీ అదే తంతు సాగుతుంది. ఇలా ఈ దుష్ప్రచారాన్ని పదే పదే కొనసాగిస్తారు. కొన్ని ప్రధానపత్రికలు, టీవీ చానళ్లు ప్రతిపక్ష పార్టీల కుట్రలో భాగస్వాములవడం దురదృష్టకరం. ఈ దుష్ప్రచారంతో గత రెండు నెలల్లోనే 30మందికి పైగా పోలీసు అధికారులు మనోవేదనకు గురయ్యారు. ఈసీ నిర్ణయాలపైనా దుష్ప్రచారం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, వాటికి వత్తాసు పలికే మీడియా పదే పదే చేస్తున్న దుష్ప్రచారం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ఇటీవల ఓ ఐజీ, కొందరు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను ఈసీ బదిలీ చేసింది. అనంతరం వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఈ నెల 4న ఉత్తర్వులిచ్చింది. öత్తగా నియమితులైన ఆ అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే వారికి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియా మళ్లీ దుష్ప్రచారం మొదలెట్టింది. ‘వీళ్లా కొత్త ఎస్పీలు ... సగానికి పైగా వైకాపా విధేయులే’అని కథనాన్ని ప్రముఖంగా ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసే కుట్ర ఇలా రోజూ పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారం పోలీసు వ్యవస్థ మనో స్థైర్యాన్ని, చొరవను దెబ్బతీస్తోంది. వాస్తవానికి అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి విధులు నిర్వహిస్తోంది. కాబట్టి ఆ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి వస్తోంది. పోలీసు అధికారులు ఎన్నికల విధుల నుంచి పూర్తిగా వైదొలిగేలా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు, వారికి కొమ్ముకాసే మీడియా కుట్ర పన్నుతోంది. వాస్తవానికి సక్రమంగా ఎన్నికల నిర్వహణ కోసం ఈసీకి విజ్ఞప్తి చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు అందుకు విరుద్ధంగా మీడియాను అడ్డంపెట్టుకుని పోలీసు అధికారులపై దుష్ప్రచారానికే ప్రాధాన్యమిస్తోంది. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నిస్తోంది. తద్వారా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నిబద్ధతతో పని చేస్తున్న పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి క్రియాశూన్యంగా చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు కుట్ర పన్నుతున్నాయి. వారి కుట్రతో రాజ్యంగబద్ధ సంస్థలపై ప్రజల్లో సందేహాలు కలిగిస్తే సమాజంలో వైషమ్యాలు చెలరేగే ప్రమాదం ఉంది. మావోలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచి్చన నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఇంతటి కీలక తరుణంలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకూ పోలీసు యంత్రాంగం మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారం కట్టడి చేయాలి. ఆ కుట్రకు పాల్పడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.