
సాక్షి,విశాఖ: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట ముఠా గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
గత కొంత కాలంగా పేకాట ఆడుతున్న మహిళలు స్థానికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆగడాల్ని తట్టుకోలేని పేకాట ఆడుతున్న ఓ మహిళ భర్త సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయారు. పేకాట ఆడటం.వాగ్వాదానికి దిగడం.. అడ్డు చెప్పిన వారిపై దాడులకు తెగబడ్డారు.
ఈ క్రమంలో స్థానికులు వరుస ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.