హైదరాబాద్ నగరం క్రిస్మస్ శోభను సంతరించుకుంది.గురువారం ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండగ నేపథ్యంలో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో చర్చిలను అందంగా అలంకరించారు.
రంగురంగుల విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాత ఫొటోలతో సిటీ అంతటా కోలాహలం నెలకొంది. ఇక ఆయా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
అర్థరాత్రి నుంచే కల్వరి టెంపుల్,సికింద్రాబాద్, అబిడ్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.


