breaking news
husband
-
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్‌ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్‌కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026 -
ఖమ్మంలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. భార్య రేణుకను భర్త విద్యాసాగర్ గొంతు నులిపి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో దారిలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగ్గా.. రఘునాథపాలెం సమీపంలో కారులోనే భార్యను భర్త హత్య చేశాడు.భార్యను హతమార్చిన అనంతరం ఇల్లెందులోని బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానంటూ విద్యాసాగర్ చెప్పినట్లు సమాచారం. ప్రగతి స్కూల్ సమీపంలో కారును పక్కకు ఆపిన విద్యాసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు విద్యాసాగర్‌కు ఇది రెండో వివాహం కాగా, మృతురాలు రేణుకతో కేవలం నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. సంచలనం సృష్టించిన ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సినిమాకు తీసుకెళ్లి భార్య గొంతు కోసిన భర్త
నెల్లూరు జిల్లా: పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అంతలోనే వివాదాలు నెలకొని భార్య గొంతు, రెండు చేతుల మణికట్టు వద్ద భర్త కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై జంపానికుమార్ వివరాల మేరకు.. ఏఎస్‌పేట మండలం పందిపాడుకు చెందిన బద్దుకూరి మహాలక్ష్మి, హేమసాయి దగ్గరి బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు గత నెల చివర్లో వివాహం చేశారు. వారు బైక్‌పై శనివారం సినిమాకి వెళ్లి ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాపురం సమీపంలో ఏఎస్‌పేట ఆర్చి వద్ద రోడ్డు పక్కనున్న నిమ్మతోట వద్ద బైక్‌ను నిలిపి దంపతులు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త హేమసాయి ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు, మణికట్టు వద్ద కోసి తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏఎస్‌పేట ఎస్సై జిలానీ గుర్తించి తన వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి! -
ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర
-
భార్య, అత్తలపై కత్తితో దాడి.. భార్య మృతి
సాక్షి, సిరిసిల్ల : ఎల్లారెడ్డి పేట మండలం పదిరలో దారుణం జరిగింది. ఈ రోజు ( బుధవారం)కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన అత్తపైన దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రగాయాలైన అత్తను ఆసుపత్రికి తరలించారు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
'మొదటి భర్త టార్చర్.. గాయాలకు మేకప్ వేసుకునేదాన్ని': బుల్లితెర నటి
సినీరంగంలో వారి జీవితాలు ఫుల్ కలర్పుల్గా ఉంటాయని అనుకుంటాం. కానీ అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపు కూడా చూస్తేనే అసలు జీవితం గురించి తెలుస్తుంది. వర్క్ లైఫ్ బాగానే ఉన్నా.. పర్సనల్ విషయానికి వచ్చేసరికి అదంతా మారిపోయే అవకాశముంది. అలా బాలీవుడ్ బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ మెప్పించిన నటి కామ్యా పంజాబీ జీవితమే ఇందుకు ఉదాహరణ. హిందీలో పలు సీరియల్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది.అయితే సినిమాల్లో ఆకట్టుకున్న ఈమె.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తన మొదటి భర్తతో తాను పడిన ఇబ్బందులను పంచుకుంది. గృహ హింసతో పాటు మానసిక క్షోభ అనుభవించానని తెలిపింది. గాయాలను మేకప్‌తో దాచుకోవడం అలవాటు చేసుకున్నానని కామ్యా వెల్లడించింది. ఆ టాక్సిక్ బంధం నుంచి బయటపడటానికి పడిన ఇబ్బందిని ఆమె గుర్తుచేసుకున్నారు. మా ఇద్దరి గొడవను కుమార్తె ఆరా చూడటంతో.. ఇకపై అతనితో జీవించలేనని డిసైడ్ అయ్యానని కామ్యా వెల్లడించారు.కామ్యా పంజాబీ మాట్లాడుతూ..'మేమిద్దరం పెళ్లికి ముందే మేము గొడవపడేవాళ్లం. అతను నాకు సరైనవాడు కాదని నిర్ణయించుకోవాల్సిన స్థాయికి పరిస్థితులు వచ్చాయి. కానీ మాది తొలిప్రేమ కావడంతో ఇతనే సరైన వ్యక్తి అనిపించింది. మా ఇద్దరికీ సెట్ కాదని మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. కానీ నేను వారి మాట వినలేదు. పెళ్లి తర్వాత ఆయన నన్ను పని మానేయమన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. నేను నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని పోషించాలని చెప్పా. అప్పుడు అతని ఆలోచనా విధానం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను ప్రతి విషయాన్ని అనుమానించేవాడు. అతను ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ ఎత్తలేదు?' అని ప్రశ్నలు వేసేవాడు. ఏంటి సంగతి? ఎవరితో ఉన్నావు? అని కూడా ప్రశ్నలు అడిగేవాడు. బాత్రూంలో నన్ను నేను బంధించుకుని గంటల తరబడి బాధపడ్డా. కొన్నిసార్లు రాత్రంతా ఏడ్చేదాన్ని" అని తన బాధను వ్యక్తం చేసింది.కాగా.. కామ్యా మొదట వ్యాపారవేత్త బంటీ నేగీని వివాహం చేసుకున్నారు. వీరికి ఆరా అనే కుమార్తె జన్మించారు. దాదాపు 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయారు. 2020లో కామ్యా.. శలభ్ డాంగ్‌ను వివాహం చేసుకున్నారు. -
రామచంద్రపురంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురంలో దారుణం జరిగింది. భర్తను భార్య పొత్రం రాయితో కొట్టి హత్య చేసింది. భార్య తంగేటి ఉమాదేవి చేతిలో భర్త తంగేటి ఎల్లారావు హత్యకు గురయ్యాడు. భార్యపై భర్త అనుమానం పెంచుకోవడంతో భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.నిందితురాలు ఉమాదేవిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి భార్య మృతి చెందడంతో ఉమాదేవిని ఎల్లారావు రెండో వివాహం చేసుకున్నాడు. వృత్తి రీత్యా వంట పనులు చేసుకుని జీవించే ఎల్లారావుకు భార్యపై అనుమానం కలగడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 25న మద్యం సేవించి వచ్చి భార్యతో ఎల్లారావు ఘర్షణకు దిగాడు.దీంతో భార్య పొత్రం రాయితో కొట్టడంతో భర్త మృతి చెందాడు. హతుడు సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు ఉమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారావు హత్యలో ఇతరుల ప్రమేయం ఉందా? అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మొగుడ్ని చంపి పేగుల్లాగేసింది: కిడ్నీ, లివర్ మాయం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ భర్తను అత్యంత అమానుషంగా హత్య చేసింది. పొట్టలో కత్తితో దారుణంగా పొడవడంతో పేగులు బయటకొచ్చిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు మృతుడి కాలేయం, కిడ్నీ అదృశ్యం కావడంపై మరింత ఆందోళన రేపింది. దీనిపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.యూపీలోని ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, విమలా దేవి భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో భర్తను పొడిచిన తర్వాత, ఆ మహిళ అతని ప్రేగులను భవనం పైకప్పుపై ఉన్న ప్లాస్టిక్ సంచిలో కుక్కుతుండగా,ఇంటి యజమాని కంట్లోపడింది. ఇంటి యజమాని రింకు అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించినప్పుడు, నిందితురాలు విమలా దేవి భవనం పైకప్పు పైనుంచి దూకేసింది. రాజేష్ పొట్టలో తీవ్రమైన గాయాలు అయ్యాయని, బయటకు వచ్చిన ప్రేగులను విమల ఒక ప్లాస్టిక్ సంచిలో పెడుతోందని రింకు పోలీసులకు తెలిపింది. మరోవైపు నిందితురాలు దేవి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు పోలీసులు.భర్త కాలేయం, మూత్రపిండం అదృశ్యంపోస్ట్-మార్టం నివేదిక ప్రకారం, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ గౌరవ్ కౌశిక్ వివరాల ప్రకారం భర్త రైట్ కిడ్నీ,కాలేయంలోకొంత భాగం కనిపించకుండా పోయాయి. అలాగే పొట్ట భాగంలో సుమారు 37 సెంటీమీటర్ల పొడవైన లోతైన గాటు, ప్రేగులు బయటకు వచ్చి పడి ఉన్నాయి. ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బువిమల, రాజేష్ దంపతులు సుమారు ఏడాది కాలంగా కురుక్షేత్రలో నివసిస్తుండగా, భర్త ఒక కంపెనీలో నీటి సరఫరా విభాగంలో పనిచేసేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే విమలాదేవి చేతబడి, దుష్టశక్తులను వదిలించే ప్రక్రియవంటి పనుల్లో నిమగ్నమై ఉండేదని, వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఇంటి యజమాని తెలిపారు.ఇదీ చదవండి: 25 ఏళ్లకే కోట్లు సంపాదించా : ఫ్యూచర్లో ఏం చేయాలి?ఘటనా స్థలం నుండి పోలీసులు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. విచారణకు సహకరించేంతగా ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమెను విచారిస్తామని ఆదర్శ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సురేందర్ సంధు వెల్లడించారు. ఈ అవయవాలు అదృశ్యం కావడానికి, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ -
వేరే వ్యక్తితో భార్య చాట్.. అనుమానంతో చంపేసిన భర్త
-
యానాంలో దారుణం.. భార్య పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందని..
సాక్షి, కాకినాడ జిల్లా: కేంద్రపాలిత యానాం కనకాల పేటలో దారుణం ఘటన చోటుచేసుకుంది. పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందన్న అనుమానంతో భర్త.. భార్యను హత్య చేసి గోదావరి నది పాయలో పడేశాడు. ఆరేళ్ల కిందట చెక్కా అప్పారావు, పువ్వల రేఖ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం రేఖ ఫోన్లో మరోకరితో చాటింగ్ చేస్తుండగా చూసిన భర్త... గొడవకు దిగాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యను భర్త పిడిగుద్దులు గుద్ది.. గొంతు నులిమి చంపేశాడు.అనంతరం భార్య మృతదేహన్ని గోదావరి నది పాయలో పడేసి.. తన భార్య కనిపించడం లేదంటూ భర్త అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అప్పారావును విచారించారు. విచారణలో అప్పారావు నేరం ఒప్పుకున్నాడు. నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. రేఖ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఆ ఒక్క కారణం వల్లే మా ఆయన దూరమయ్యారు: మీనా
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మీనా ముందు వరుసలో ఉంటుంది. సౌత్ స్టార్ హీరోలైనా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌లాల్, మమ్ముట్టిల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ సొంతం చేసుకుంది.అయితే కొన్నేళ్ల క్రితం ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు తీవ్రమైన డిప్రెషన్లో ఉంది. ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె.. తన భర్త మరణానికి గల కారణాలను వివరించింది. ఆ ఓక్క కారణం వల్లే విద్యాసాగర్‌ను కాపాడుకోలేకపోయానని తెలిపింది.( ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)మా ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైందని మీనా వెల్లడించింది. ఆ సమయంలో డోనర్ దొరకలేదని తెలిపింది. ఇందులో ఉండే మెడికల్ ప్రాసెస్ చూసి నేనే చాలా ఆశ్చర్యపోయా.. చాలా రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగడంతో మా ఆయన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. లంగ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేశానని..కానీ దాతలు దొరక్కపోవడంతో అమెరికా వెళ్లేందుకు ట్రై చేశానని తెలిపింది. కానీ ఇలాంటి సమయంలో అమెరికా తరలించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారని గుర్తు చేసుకుంది. ఆయనను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ మాకు దూరమయ్యారని వెల్లడించింది. నా భర్త మరణించాక కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అయితే నా ఫ్రెండ్స్, సినిమాలతో ఈ విషాదం నుంచి కోలుకుంటున్నట్లు మీనా చెప్పుకొచ్చింది. -
పవిత్రగౌడ మాజీ భర్త మృతి!
యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో మొదటి ముద్దాయిగా పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ మాజీ భర్త సంజయ్‌సింగ్ మరణించాడు. అతడు 8 నెలల క్రితం చనిపోగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్ల నుంచి సంజయ్‌సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ రాజస్థాన్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిసింది. చామరాజపేటెలో పవిత్రగౌడ సాధారణ యువతిగా ఉన్నప్పుడు సంజయ్‌సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడు స్థానికంగా వ్యాపారం చేసేవాడు. వీరికి ఒక కూతురు ఉంది. తరువాత పవిత్రగౌడ టీవీ సీరియళ్లు, సినిమాల ద్వారా పేరు పొందగానే అతనికి విడాకులు ఇచ్చింది. ఆపై అతడు తాగుడుకు బానిసయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసు తరువాత ఆమె గురించి మాట్లాడాడు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. సాక్షిగా మారుతాడని కొడుకుని..?
-
భర్త, అతడి స్నేహితుల నుంచి ప్రాణహాని
అన్నమయ్య జిలా: భర్త, అతడి స్నేహితుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఓ యువతి మదనపల్లెలో ఎస్పీ ధీరజ్ కునిబిల్లికి పిజిఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. లక్కిరెడ్డిపల్లి మండలంలోని మద్దిరేవులు అప్పలరాజుగారిపల్లికి చెందిన రామరాజు కాంట్రాక్టు లైన్మెన్గా పని చేస్తున్నాడు. అతడి భార్య లలిత 2014లో ఇద్దరు పిల్లలను పుట్టింటిలో వదిలి బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లి తిరిగి వచ్చింది. విదేశాల నుంచి తెచ్చిన డబ్బు, బంగారం కోసం భర్త తనను చంపాలని చూస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తతో పాటు అతడి స్నేహితులు కూడా తనపై దాడులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకున్నారు. బాధితురాలి ఫిర్యాదును ఎస్పీ స్వీకరించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య
సాక్షి, బెంగళూరు: దుర్మార్గురాలైన ఒక భార్య చేతిలో భర్త, ఒక చిన్నారి బలైపోయిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను, నాలుగేళ్ల కుమారుడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులోని చిక్కబానావర ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ ఘటన. తండ్రీ కొడుకుల మరణంపై అభినందన్ మృతదేహంపై గాయాలుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం హరిణి అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్త, కుమారుడు స్పందించడం లేదంటూ హరిణే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అయితే ప్రేమికుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.తమ రహస్య బంధం తెలిసిందని హత్యకు ప్లాన్2021లో వీరు వివాహం చేసుకున్నారు. విబేధాల దాదాపు రెండేళ్లుగా వారు వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారు. అయితే 2024 డిసెంబరులో హరిణికి వినయ్ స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా పరిచయయ్యాడు. ఆ పరిచయం కాలక్రమంలో సన్నిహితంగా మారింది. తన భార్య మరో వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానం వచ్చింది అభినందన్‌కు. ఈ విషయంపై ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో హత్యలకు సుమారు 15 రోజుల ముందు, ఆమె కాల్ వివరాల రికార్డులను (CDR) కోరుతూ అతను పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడే వినయ్ సహాయంతో అతన్ని చంపాలని హరిణి నిర్ణయించుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.సమయంకోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్వల్ప విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో హరిణి గరిటెతో అభినందన్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఎవరి గదుల్లో వాళ్లు నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన ఆమె వినయ్‌ను ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలసి అభినందన్‌పై దాడి చేసి ఊపిరి ఆడకుండా చేసి చంసేశాడు. ఈ దాడి సమయంలో నిద్రలేచిన వారి కుమారుడు యదువీర్ను కూడా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి మట్టుబెట్టారు. హరిణిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ వివరాలు వెలుగు చూశాయి. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లోని రక్తం మరకలను శుభ్రం చేశారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వినయ్ ఇంటికి వచ్చిన సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆపివేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇదీ చదవండి: ‘‘మా శవాలను తీసుకెళ్లండి’’ : భార్యాబిడ్డల్ని హతమార్చి, నావికుడు సూసైడ్కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడు వినయ్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. వినయ్ ఆచూకీ లభ్యమైన తరువాత అతని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే! -
చీరతో కట్టేసి.. కర్రతో కొట్టి..
మేడిపల్లి: భర్తను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య ను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ (51) సునీత దంపతులు. రాత్రి విధులు ముగించుకొని ఆగస్టు 6న మధ్యాహ్నం సత్యనారాయణ ఇంటికి వచ్చాడు. రోజువారీ పనులకు వెళ్లిన సునీత కూడా మధ్యాహ్నం 1.30కు ఇంటికి వచ్చింది. సత్యనారాయణ మద్యం సేవించి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.భర్త ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత.. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను చీరతో కట్టేసి సెంట్రింగ్ కర్రతో తలపై, ఇతర భాగాలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. కాగా, దాడి అనంతరం సునీత కుమారుడికి ఫోన్ చేసి సత్యనారాయణ వాహనంనుంచి కింద పడినట్లు చెప్పింది. మొదట బోడుప్పల్‌లోని ఓ ఆసుపత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 10.18 గంటలకు సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసును మొదట రోడ్డు ప్రమాదంగా నమోదు చేసినప్పటికీ అనంతరం దర్యాప్తులో సత్యనారాయణను భార్య హత్యచేసినట్లు గుర్తించారు. తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే హత్యచేసినట్లు సునీత అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం సునీతను కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. -
భార్య,భర్తల ప్రాణం తీసిన ‘ఈ ఇల్లు నాది’
బెంగళూరు రాజేశ్వరి నగర్లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. సుమంత్ జైన్ (32), పద్మావతి (29) నగరంలోని రాజేశ్వరి నగర్లో నాలుగు నెలలుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. సుమంత్ నందిని లేఅవుట్లోని ఒక సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, పద్మావతి వైట్‌ఫీల్డ్‌లోని ఒక టెక్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ వివాహమై నాలుగేళ్లు అవుతోంది, వీరికి సంతానం లేదు.గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో సుమంత్ తన తల్లికి వాట్సాప్‌లో ఒక వాయిస్ మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ ఈ కేసులో కీలకంగా మారింది. ‘ఈ ఇల్లు నాది’ అని పద్మావతి అనడంతో తమ మధ్య గొడవ జరిగిందని, ఆవేశంలో తాను తన జీవితాన్ని ముగించుకుంటున్నానని సుమంత్ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అలాగే తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు, ఇంట్లో ఉన్న వస్తువులను చూసుకోవాలని తల్లికి సూచించారు.పోలీసుల దర్యాప్తువాయిస్ మెసేజ్ విన్న సుమంత్ కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, వెంటనే వారికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో, ఇంటికి వెళ్లి చూడగా వారు మరణించి ఉన్నారు. పద్మావతి మృతదేహం నేలపై ఉండగా, సుమంత్ ఉరివేసుకుని కనిపించారు. పద్మావతిని తన భర్తే చంపాడని, ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగేష్ డి.ఎల్ మాట్లాడుతూ, పద్మావతిది హత్యేనా లేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుందా అనే అంశంపై విచారణ చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
రూ.90 లక్షల ఇంటి అప్పులు.. దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన శేషాల నరేశ్(33) విద్యుత్ శాఖలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి 2014లో మేఘన(30)తో వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న ఆయాన్ష , ఆరేళ్ల వయసున్న మిథున్ ఉన్నారు. నరేశ్ గతేడాది రూ.90 లక్షలతో ఇల్లు కొనుగోలు చేశాడు. హోమ్ లోన్ కోసం ప్రయత్నించగా మంజూరు కాలేదు. దీంతో అప్పులు పెరిగి ఇంటిని అమ్మే శాడు. ప్రస్తుతం వినాయక్‌నగర్‌లోని పంచము ఖి హనుమాన్ టెంపుల్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. ఇంటి కోసం చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైన నరేశ్.. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత అతడి భార్య మేఘన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మేఘనకు తల్లి లావణ్య ఫోన్‌చేయగా ఆమె సరిగా మాట్లాడకపోవడంతో అనుమానించి భర్త మోహన్‌కు విషయం చెప్పింది. దీంతో ఆయన ఇంటికి చేరుకుని, కిటికీ చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా.. మేఘన పురుగుల మందు సేవించి పడిపోయి ఉంది. నరేశ్ ఉరివేసుకొని వేలాడుతున్నాడు. హుటాహుటిన నరేశ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ‘భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం. మానసిక ఒత్తిడి ఉంది’ అని నరేశ్ రాసిన సూసైడ్ నోట్ ఇంట్లో లభించింది. మృతురాలి తండ్రి మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
కుమార్తె ప్రేమ కోసం.. బండ రాయితో మోది భర్త హత్య
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అతని భార్య, కూతురు, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ సోని అనే వ్యక్తిని అతని భార్య నైనా, చిన్న కూతురు భక్తి, ఆమె ప్రియుడు విమల్ చౌదరి కలిసి హత్య చేశారు. కూతురి ప్రేమ వ్యవహారాన్ని మనోజ్ వ్యతిరేకించడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో నిందితులు పథకం ప్రకారం ఏప్రిల్ 18న మనోజ్‌కు మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి, బండరాయితో తల పగులగొట్టి హత్య చేశారు. అనంతరం యమునా నది సమీపంలోని అడవికి శవాన్ని తరలించి, దహనం చేసి పూడ్చిపెట్టారు.బాధితుడి అన్న రాంబాబు ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితురాలు నైనా తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అయితే, మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు అధికారికంగా హత్యను ఇంకా నిర్ధారించలేదు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ తెలిపారు.ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు -
భార్యాపిల్లలను కాదని మరో మహిళతో కాపురం..!
రాజన్న సిరిసిల్ల జిల్లా: భార్య, పిల్లలను కాదని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వేములవాడలోని న్యూఅర్బన్‌కాలనీలో ఉంటున్న వావిలాల శంకర్ ఆటో డ్రైవర్. శంకర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం మొదటి భార్య బంధువులు శంకర్ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో మాటమాట పెరిగి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే పోలీసుల అక్కడికి చేరుకుని శంకర్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకర్ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉండగా కత్తులు, కర్రలతో వచ్చి దాడి చేశారన్నారు. మొదటి భార్య బంధువులు మాత్రం తాము ఏమీ అనకుండానే గోడకు ఉన్న గ్లాస్ అద్దానికి తలబాదుకుని తనకుతానే తల పగులగొట్టుకున్నాడని వెల్లడిస్తున్నారు. ఇరుపక్షాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
ఏపీ విద్యాశాఖలో రెడ్‌బుక్ అరాచకం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను...మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. -
ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు స్కెచ్
-
అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లు, ప్రైవేట్ ఫొటోలు..!
బెంగళూరు: భర్త వేధింపులను భరించలేక అతనికి విడాకులు ఇచ్చి ప్రశాంతంగా బతుకుదామనుకున్న మహిళకు పీడకలలా మారాడు. వేరుగా జీవిస్తున్న మాజీ భార్యను నానా రకాలుగా వేధిస్తున్న సైకో బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూశాడు. వైట్‌ఫీల్డ్ నివాసి అయిన మహిళ (36)ను ఆమె మాజీ భర్త నితిన్ గుప్త నానా రకాలుగా సతాయిస్తున్నాడు. వీరికి 2013లో ఢిల్లీలో పెళ్లయింది. అయితే నితిన్ ఆమెకు నరకం చూపించాడు. దీంతో విడాకులు తీసుకుని 2022లో బెంగళూరుకు వచ్చి జీవిస్తోంది. ఆమె ఇంటికి అర్ధరాత్రిళ్లు ఫుడ్ ఆర్డర్ పెట్టడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పోస్టు చేశాడు. పలుమార్లు ఇంటికి వచ్చి హత్యాయత్నం చేసినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్య విడాకులు కోరిందని.. కొడుకు వీడియో తీస్తుండగానే..
గురుగ్రామ్‌లోని సూరత్ నగర్లో ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. భార్య విడాకులు కోరడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తుండగా, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సంజీవ్ యాదవ్ (36) ఓ కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.ఘటన సమయంలో ఇంట్లో అతడి భార్య మన్‌ప్రీత్ కౌర్, ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. సంజీవ్ ఉరివేసుకున్న దృశ్యాలను కుమారుడు మొబైల్ ఫోన్లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్తను రక్షించేందుకు మన్‌ప్రీత్ సహాయం కోసం కేకలు వేసిందని, అనంతరం తన కుటుంబ సభ్యులతో పాటు సంజీవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించిందని పోలీసులు చెప్పారు.అయితే సంజీవ్ కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య విడాకులు కోరడంతో ఇద్దరి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతుందని.. సంజీవ్ సోదరి కిరణ్ తెలిపారు. తన సోదరుడి మరణంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. సంజీవ్ తండ్రి రామ్‌సేవక్ యాదవ్ కూడా తన కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడిని కుట్ర పన్ని హత్య చేసి ఉండవచ్చని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మన్‌ప్రీత్ కౌర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంజీవ్, మన్‌ప్రీత్‌లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని డెన్సో కంపెనీలో పనిచేసే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2019లో వారికి కుమారుడు జన్మించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ సింగ్ తెలిపారు. -
మాజీ ప్రియురాలి పేరుతో పచ్చబొట్టు
తమిళనాడు: మాజీ ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేసుకున్న భర్తను భార్యతో పాటు ఆమె బంధువులు చితకబాదిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. తేని జిల్లా బోడినాయక్కనూరు ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్(36) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య అర్చన, కుమారుడు వున్నారు. ప్రస్తుతం వీరు తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో నివాసం వుంటున్నారు. రెండు రోజుల క్రితం వినోద్‌కుమార్ తన మొదటి ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయాన్ని భార్య అర్చన గుర్తించి అతడితో ఘర్షణపడింది. అనంతరం అర్చన తన అక్క వనతి, భావ శరవణన్, సోదరుడు మహేష్‌ను పిలిపించింది. వారు వినోద్‌కుమార్‌ను చితకబాదారు. తీ వ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు రక్షించి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
భర్తతో 'జబర్దస్త్' ఫైమా.. హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
-
భార్య వంటకు రూ.1000 ఫీజు!
ఇంట్లో భార్య వండిపెట్టే వంటలకు భర్త రూ.1000 చెల్లించడమా? వినడానికి కాస్త వింతగా అనిపించినా గుర్గావ్కు చెందిన ఫుడ్ కంటెంట్ క్రియేటర్ ప్రియ, ఆమె భర్త మధ్య నడుస్తున్న విధానం ఇది. సోషల్ మీడియాలో ప్రియ పంచుకున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.సరదాగా మొదలై.. అలవాటుగా..మాజీ ఫ్యాషన్ డిజైనర్, ప్రస్తుతం ఫుడ్ క్రియేటర్‌గా ఉన్న ప్రియ కేఫ్/రెస్టారెంట్ స్టైల్ వంటకాలను ఇంట్లో తయారు చేసిన ప్రతిసారీ ఆమె భర్త రూ.1,000 ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిపింది. ‘ఇంటి బాధ్యతలు, శ్రమ గురించి ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సరదాగా మొదలైన ప్రతిపాదన ఇది. బయట కేఫ్‌లలో రూ.1,000 పెట్టి తినే బదులు అంతకంటే నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంట్లోనే తింటున్నప్పుడు ఆ శ్రమకు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వకూడదని నా భర్త భావించారు’ అని ఆమె స్పష్టం చేసింది.శ్రమకు గుర్తింపుఈ అలవాటును వ్యాపారాత్మక ధోరణి లేదా భార్యాభర్తల బంధానికి వ్యాపారాన్ని జోడించడం అని నెటిజన్లు విమర్శించినప్పటికీ ప్రియ దీన్ని సమర్థించుకుంది. దీని ముఖ్య ఉద్దేశం భర్త నుంచి డబ్బులు గుంజడం కాదని, కంటికి కనిపించని గృహిణులు శ్రమను గౌరవించడమేనని వెల్లడించింది. ఈ విధంగా వచ్చే నెలవారీ రూ.15,000 నుంచి రూ.20,000ల మొత్తాన్ని దాచిపెట్టి భవిష్యత్తులో స్వయంగా ఒక ఫుడ్ బ్రాండ్ ప్రారంభించడానికి పెట్టుబడిగా ఉపయోగిస్తున్నట్లు వివరించింది.మారుతున్న దాంపత్య ధోరణులుఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తూ.. డబ్బు కుటుంబం లోపలే ఉంటుందని, బయట రెస్టారెంట్లకు తగలేసే సొమ్ము పొదుపై భార్య ఆత్మగౌరవానికి, సొంత వ్యాపార ఆశయానికి ఊతమిస్తుందని కొందరు మద్దతు తెలపారు. మరికొందరు మాత్రం కుటుంబంలో ప్రేమానురాగాలకు వెలకట్టలేమని అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Priya | Food & Wellness (@priya_whatscooking)ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు -
భర్తను నేల కింద పాతిపెట్టి.. రెండేళ్ల పాటు డ్రామా!
జామ్‌నగర్: సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను తలపించే ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యానికి సంబంధించి పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి తెచ్చారు. భర్తను హత్య చేసి, రెండేళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఓ పారిశ్రామిక యూనిట్ నేలలో మృతదేహాన్ని పాతిపెట్టిన భార్య, ఆమె ప్రియుడి ఉదంతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిగ్నేష్ మావడియా అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చారు. కానీ, అతన్ని హత్య చేసి.. దారెద్ జీఐడీసీ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో దాదాపు 12 అడుగుల లోతున పూడ్చిపెట్టినట్లు పోలీసులు తేల్చారు.కుటుంబ సభ్యులలో ఒకరు ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతూ.. అక్కడ జిగ్నేష్‌కు సంబంధించి స్థానిక కాంటాక్ట్ వివరాలు అడగడంతో ఈ హత్య సంగతి బయటపడింది. జిగ్నేష్ భార్య పృథ్వి, ఆమె ప్రియుడు నిలేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలం నుంచి వెలికితీసిన అస్థిపంజర అవశేషాలను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. అస్థిపంజరం ఎవరిదనే నిర్ధారణ అయిన తర్వాత హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.విచారణ వివరాల ప్రకారం.. పృథ్వి, నిలేశ్లకు ఆమె వివాహానికి ముందే సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా వారు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. జిగ్నేష్‌ను మద్యంలో సైనేడ్ కలిపి హత్య చేశారని.. అనంతరం అతని మృతదేహాన్ని దారెద్ జీఐడీసీలోని ఒక ఫ్యాక్టరీకి తరలించి, సుమారు 12 అడుగుల లోతు గుంట తవ్వి నేల కింద పాతిపెట్టారు. జిగ్నేష్ ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు పృథ్వి కుటుంబ సభ్యులకు నమ్మబలికిందని.. దీంతో దాదాపు రెండేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు.జిగ్నేష్ సోదరుడు అశోక్ మావడియా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ జిగ్నేష్ ఆచూకీ ఏమాత్రం లభించకపోవడంతో సిటీ బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పృథ్వి తన నేరాన్ని అంగీకరించిందని.. మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో ఆ ప్రాంతాన్ని తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిభ నేతృత్వంలో సిటీ బి పోలీసులు దారెద్ జీఐడీసీలోని ఫ్యాక్టరీ ప్రాంగణంలో తవ్వకాలు జరిపి.. జిగ్నేష్దిగా భావిస్తున్న అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు. ఈ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించగా.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. -
భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్
టెక్ ప్రపంచం రోజురోజుకి ఎలా మారిపోతోందో తెలిస్తే విస్తుపోతారు. ఏ ప్రపంచంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుందని అంటున్నారు నెటిజన్లు. వృత్తి బాధ్యతల్లో నిష్టాతులు అవ్వడం కోసం వ్యక్తిగత జీవితమే చిక్కుల్లోకి వెళ్లిపోవాల్సిందేనా అనే ఆందోళలను మొదలవ్వుతున్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు..కెరీర్‌నే ముఖ్యమా అనే సందేహాలు లేవనెత్తాయి. ఏఐ సాంకేతికత అన్నింటిని సులువు చేసిందా..లేక టెకీలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసి..ఆనందానికే దూరం చేసిందా అంటే అవుననే అంటున్నారు పలువురు. ఎందుకంటే నెట్టంట వైరల్ అవుతున్న పోస్ట్ ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ఏఐ టెకీల వృత్తి జీవితాన్ని ఇంతలా మార్చేసిందా అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అసలేం జరిగిందంటే..2008 ఆర్థిక సంక్షోభం తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు, మెటా, గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో ఉద్యోగం సంపాదించడం అత్యంత సురక్షితమైన, ప్రతిష్టాత్మకమైన కెరీర్ మార్గాలలో ఒకటిగా పరిగణించారు. టెక్ రంగం అధిక జీతాలు, స్థిరత్వాన్ని అందించడం తోపాటు కంప్యూటర్ సైన్స్ రంగం బాగా అభివృద్ధి చెందింది. అయితే గత కొన్నేళ్లుగా ఏఐ కారణంగా జరిగిన ఉద్యోగకోతలు అవకాశాల గనిగా ఉన్న సిలికాన్ వ్యాలీకి ఉన్న పేరు ఎలా దెబ్బతిందో తెలిసిందే. ఆ నేపథ్యంలో ఓ టెకీ తీసుకున్న నిర్ణయం కుటుంబంపైన, వ్యక్తిగతంగానూ ఎంత ప్రభావం చూపిందో తెలిస్తే..వామ్మో అంటారు. నెట్టింట వైరల్ అవుతున్న వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం..శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన 31 ఏళ్ల టెక్ ఉద్యోగి అయిన ఒక భార్య, తన భర్త ‘AI నేటివ్’ ఉద్యోగిగా మారాలనే తపన వల్ల పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తన భుజాలపై మోయాల్సి వచ్చిందంటూ పోస్ట్‌లో తన గోడుని వెళ్లబోసుకున్నారు. పేరు చెప్పాడానికి ఇష్టపడని ఆమె తన భర్త ఆశయం తనపై కుటుబం నిర్వహణ భారం ఎలా మోయాల్సి వచ్చిందో వివరించారు. తన భర్త కొన్ని నెలలు క్రితం ఏఐ నేటివ్‌గా మారడంపై ఫోకస్ పెట్టడం కోసం పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తననే చూసుకోమని కోరారని పోస్ట్‌లో పేర్కొందామె. ఏఐ నేటివ్ ఉద్యోగి అంటే..ఆటోమేషన్ సాధనాల ఆధారంగా తమ పని విధానాన్ని పూర్తిగా పునఃరూపకల్పన చేసుకున్న వ్యక్తి అని అర్థం. అప్పుడప్పుడు చేసే పనుల కోసం చాట్బాట్లను ఉపయోగించే సాంప్రదాయ నిపుణుడు లేదా AI-ఆసక్తి గల ఉద్యోగిలా కాకుండా, ఒక AI నేటివ్ కృత్రిమ మేధను ఒక ప్రధాన భాగస్వామిగా ఉపయోగిస్తారు.ఇక ఆమె తన భర్త AI ప్రాజెక్టులపై పనిచేస్తూ తన ఆఫీసులోనే తనను తాను బంధించుకున్నప్పుడు ఆ అనుభవం తనకు ఏదోలా అనిపించిందని తెలిపింది. అయితే ఆయన కోరుకున్నట్లుగా తన కంపెనీలో తానే అగ్రశ్రేణి ఏఐ వినియోగదారుడిగా మారాడు, అందుకు తనకు కృతజ్ఞతలు కూడా చెప్పారంటూ పోస్ట్‌ని ముగించింది. ఈ పోస్ట్ తల్లిదండ్రుల బాధ్యతలు వర్సెస్ వృత్తిపరమైన బాధ్యతలపై చర్చలు లేవెనెత్తి హాట్‌టాపిక్‌గా మారింది. నిజంగా ఇక్కడ మానవత్వం పూర్తిగా కోల్పోతున్నాం, చిన్న చిన్న ఆనందాలన్నీ వదులుకుంటూ గడుపుతున్నాం. ఇదేం జీవింతం అంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.This is pretty bleak. pic.twitter.com/dr0BYzr3NO— Alec MacGillis (@AlecMacGillis) July 20, 2026 (చదవండి: నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..) -
పశ్చాత్తాపం లేని ‘విషపు దామిని’?
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకున్న స్నేక్ మర్డర్ కేసులో భర్తను పాముతో కాటు వేయించి, హత్య చేసిన కేసులో నిందితురాలు దామినిని పోలీసులు విచారిస్తున్నారు. ‘నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపం లేదా?’ అని పోలీసులు అని ప్రశ్నించగా, ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించింది. అయితే, తాను అతుల్‌తో కలిసి ఉండలేనని, తన జీవితం నరకప్రాయంగా మారిందని విచారణలో తెలిపింది. అతుల్, దామినిలకు 2019లో ప్రేమ వివాహం జరిగింది. ఆ తర్వాత పాఠశాల డ్రైవర్ తుషార్‌తో దామినికి సాన్నిహిత్యం పెరిగింది.సుమారు 20 లక్షల రూపాయల బీమా సొమ్ము, వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. అతుల్‌ను అడ్డు తొలగించుకునేందుకు తొలుత కారుతో ఢీకొట్టి హత్య చేయాలని ప్రయత్నించగా, హెల్మెట్ ధరించడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో పథకం మార్చిన నిందితులు ఇంటర్నెట్లో అత్యంత విషపూరితమైన పాము గురించి వెతికి, రూ. 15,000 అడ్వాన్స్ ఇచ్చి, పాములు పట్టేవారి సాయంతో పామును తెప్పించి, అతుల్ హత్యకు కుట్ర పన్నారు. ప్రస్తుతం పోలీసులు కాల్ డేటా, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: రాకెట్ సక్సెస్ కాల్లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్! -
6 నెలల్లో 554 మంది భర్తల మరణాలు : షాకింగ్ సర్వే
గురుగ్రామ్‌కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' (Ekam Nyaay Foundation) అనే స్వచ్ఛంద సంస్థ (NGO) సంచలన నివేదకను వెల్లడించింది. జెండర్ సమానత్వం కోసం, ముఖ్యంగా సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు పనిచేసే ఈ ఎన్జీవో 2026 తొలి ఆరు నెలల్లో (జులై 14 వరకు) దేశవ్యాప్తంగా 554 మంది భర్తల హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలిందని ఈ నివేదిక పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలు, తాము సేకరించిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్టు తెలిపింది.ఇటీవలి కాలంలో ప్రియులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేస్తున్న దారుణ ఉదంతాలు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాబోయే భార్య చేతిలో పుణే రియల్టర్ హత్య సంచలనంగా మారింది. అయితే ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నాయని ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఫిలిం మేకర్, దీపికా నారాయణ్ భరద్వాజ్ వెల్లడించారు. అధికారిక నేరాల డేటాలో పురుషులపై జరిగే గృహహింసకు లేదా భర్తల హత్యలకు ప్రత్యేక వర్గీకరణ (classification) లేకపోవడం వల్ల ఈ సమస్య తీవ్రతను అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2026 మొదటి ఆరు నెలల్లో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఫౌండేషన్ తెలిపింది. అయితే ఇవి కేవలం మీడియా నివేదికల ఆధారంగా సేకరించినవేనని, ప్రభుత్వ అధికారిక గణాంకాలు కావని స్పష్టం చేసింది. పురుషులపై జరిగే గృహహింసను ట్రాక్ చేయడానికి ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేనందున, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చన్నారు. ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీభార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైన భర్తల కేసులు: 322వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భర్తల కేసులు: 232హత్యలకు ప్రధాన కారణాలు322 హత్య కేసుల్లో 194 కేసులు (60.2%) వివాహేతర సంబంధాల వల్లే జరిగాయి. వివాహేతర సంబంధాన్ని భర్త వ్యతిరేకించడంతో, భార్యలు తమ ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నినట్లు నివేదిక పేర్కొంది. 88 కేసులు పాత గృహ వివాదాల కారణంగా జరిగాయి. మిగిలిన హత్యలు డబ్బు గొడవలు, కుటుంబ కుట్రలు మొదలైన కారణాలతో సంభవించాయి.ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీవణికిస్తున్న హత్యా పద్దతులువిషం పెట్టడం, సజీవ దహనం, కరెంట్ షాక్ ఇవ్వడం, గొంతు నులమడం, మృతదేహాలను ముక్కలుగా నరకడం, పూడ్చిపెట్టడం, హత్యలను ప్రమాదాలు లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటివి ఉన్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఈ కాలంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 93 భర్తల హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారిందిఫౌండేషన్ ఈ ఏడాది జరిగిన 25 అత్యంత ఘోరమైన కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో భర్తల తలలు నరకడం, ముక్కలుగా కోయడం, ఇళ్లల్లోనే పూడ్చిపెట్టడం వంటి ఘటనలు ఉన్నాయి. మరికొన్ని ఆత్మహత్య కేసుల్లో బాధితులు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లు లేదా రికార్డ్ చేసిన వీడియోలలో... తాము ఎదుర్కొన్న మానసిక క్షోభ, పిల్లలను చూడనివ్వకపోవడం, తప్పుడు కేసుల వేధింపులు ఉన్నాయని దీపికా నారాయణ్ భరద్వాజ్ వివరించారు.ఇదీ చదవండి: రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్ -
ప్రియుని సహకారంతో భర్తకు పాము కాటు వేయించి..
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ నిర్వాహకుడు అతుల్ పవార్ (35) మృతి వెనుక అతని భార్య దామిని కుట్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలు తన ప్రియుడు, స్కూల్ డ్రైవర్ తుషార్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.పోలీసుల కథనం ప్రకారం, 2019లో ప్రేమ వివాహం చేసుకున్న అతుల్, దామిని దంపతులు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే అతుల్ పేరుపై ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును కాజేయాలని, ప్రియుడితో కలిసి జీవించాలని దామిని పథకం పన్నింది. ఇందులో భాగంగా గురువారం రాత్రి అతుల్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపి, అతను గాఢనిద్రలో ఉన్నప్పుడు గదిలోకి విషపూరితమైన పామును వదిలారు. ఆ పాము కాటుకు అతుల్ మరణించాడు.సందేహం రాకుండా ఉండేందుకు భర్త పాము కాటుకు గురయ్యాడని ఆమె నాటకం ఆడింది. అయితే ఘటనా స్థలంలోని పరిస్థితులపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. నిందితుల ఫోన్లలో పాము ఫొటోలు లభ్యమయ్యాయి. తాము పామును కొనుగోలు చేసినట్లు డ్రైవర్ తుషార్ అంగీకరించాడు. 20 రోజుల క్రితం కూడా కారుతో ఢీకొట్టి అతుల్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: శరీరంలోకి సర్రున దూసుకెళ్లిన ఇనుప రాడ్లు.. ఆ తర్వాత? -
భర్తల ఉద్యోగాలను ఊడగొడుతున్నారు..!
సాక్షి, న్యూఢిల్లీ: వైవాహిక వివాదాల నేపథ్యంలో భర్తలు పనిచేసే సంస్థల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు భార్యలు నేరుగా ఫిర్యాదు చేసే ధోరణిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసోంలో తన భర్త స్నేహితుడు తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఘజియాబాద్‌లో తన భర్తపై ఇప్పటికే పలు కేసులు పెట్టి న్యాయపోరాటం చేస్తున్నానని, అందువల్ల ఈ కేసును కూడా అక్కడికే బదిలీ చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘చాలా మంది భార్యలు ఇదే చేస్తున్నారు. భర్తపై యజమానులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. విడాకులు కోరడం వేరు. కానీ, వారి జీవనాధారాన్ని దెబ్బతీయడం వేరు. ఇది మరీ దారుణం‘అని పేర్కొన్నారు. పిటిషనర్ భర్త ఎయిర్ ఫోర్స్ అధికారి. నిబంధనలకు విరుద్ధంగా ఆయన సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడని ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు పిటిషనర్ (భార్య) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా భర్త సన్నిహితుడైన సహోద్యోగి ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై జస్టిస్ నాగరత్న కల్పించుకుని.. ‘మీరు ఎయిర్ ఫోర్స్ అధికారులు కారు. మీరెందుకు ఫిర్యాదు చేశారు? వైవాహిక వివాదాలు ఉన్నంత మాత్రాన యజమానికి ఫిర్యాదు చేయడం భార్యలు చేయగలిగే అత్యంత దారుణమైన పని. ఆ ఫిర్యాదులతో వారు ఉద్యోగాలు కోల్పోతారు. ఆ తర్వాత మీరు ఎంత భరణం కోరగలరు?‘అని ప్రశ్నించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెల్మెట్‌ను భార్య, ఆమె సోదరుడు దొంగిలించారని భర్త మొదట తప్పుడు ఫిర్యాదు చేశాడని కోర్టుకు తెలిపారు. ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికే తాము ఎయిర్‌ఫోర్స్ అధికారులకు వినతిపత్రం ఇచ్చామని వివరించారు. పరువు నష్టం దావాను భర్త దాఖలు చేయలేదని, అతని స్నేహితుడు దాఖలు చేశాడని న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఈ కేసును మధ్యవర్తిత్వ కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని, ఆరోపణలను వెనక్కి తీసుకునేలా భార్యకు తగిన సలహా ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి జస్టిస్ నాగరత్న సూచించారు. -
భర్తను చంపి.. కొడుకుని కత్తితో పొడిచి పక్కనే రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్
-
ఇల్లు పొమ్మంది.. ఊరు రమ్మంది
మహబూబ్‌నగర్ రూరల్: కులాంతర వివాహం చేసుకోవడం.. కన్న తల్లిదంద్రులే కూతురును కాదనుకున్నారు. ఆమెకు చెందిన సామాజికవర్గం కూడా దగ్గరకు రానివ్వలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా కరుణించలేదు. అయితేనేం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని మురిసిపోయింది.. ఆ ఆశలు కానీ, ఇంతలోనే విధి వక్రీకరించింది. ప్రాణానికి ప్రాణమైన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆ యువతి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భర్త తరపు వారు కూడా వేధింపులకు గురిచేయడంతో ఆమె వేదన.. అరణ్యరోదనగా మారిపోయింది. 2017లో కులాంతర వివాహం.. వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రేణుక, అదే గ్రామానికి చెందిన విజయ్ ప్రేమించుకొని.. 2017లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యువతి అమ్మానాన్నలు ఆమెను కుటంబం నుంచి వెలివేశారు. కనీసం ఇంటి దగ్గరకు కూడా రానివ్వకపోగా.. ఫోన్లో సైతం మాట్లాడటం లేదు. అయితే అప్పటికే జీవితంలో స్థిరపడిన భర్త విజయ్ 2012లోనే రామాపురంలో విజ్ఞాన్ కాన్సె ప్ట్ స్కూల్‌ను స్థాపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులతో పాఠశాల బాగా నడిచేది. అయితే అప్పటికే విజయ్ సోదరుడు, కుటుంబ సభ్యులకు ఆ స్కూల్‌పై కన్ను పడింది. ఈ క్రమంలోనే 2019 మే 11న గ్రామానికి చెందిన ఓ యువకుడి శుభకార్యానికి వెళ్లగా అప్పట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్‌తో సహా 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో భర్త తరపున బంధువులు వేధింపులు మొదలయ్యాయి. విజయ్ మృతితో భార్య రేణుకకు రావాల్సిన పథకాలేవి భర్త ఇంటి సభ్యులు ఆమెకు దక్కనివ్వలేదు. భర్త స్థాపించిన స్కూల్‌ను సైతం లాక్కొని వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారు. పాఠశాల లైసెన్స్, రిజి్రస్టేషన్ సైతం రేణుక పిల్లల పేరు మీదనే ఉన్నప్పటికీ ఆమెను దరిదాపుల్లోకి రానివ్వ లేదు. అయినప్పటికీ రేణుక తల్లిదండ్రులు ఆమెకు తోడుగా నిలవలేకపోయారు.ఇద్దరూ చదువుకున్నోళ్లే.. ఆ అమ్మాయిని చూసే గ్రామంలో పిల్లల ను బడికి పంపాం. ఆమె భర్త విజయ్, అమ్మాయి రేణుక ఇద్దరూ చదువుకున్న వా ళ్లే. ఇతర గ్రామాలకు పంపి ఆలోచన చేసేంటే, తమ కళ్లెదురుగా పిల్లలు చదువుకుంటున్నారని ఆశపడ్డాం. విజయ్ చనిపోయాక అమ్మాయికి పాఠశాల రాకుండా ఎలాంటి అనుభవం లేని వ్యక్తి నడిపి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి నుంచి ఒంటరి యువతకి న్యాయం చేయాలని గ్రామస్తులం నిర్ణయించుకొని అండగా నిలబడ్డాం. – లక్ష్మీరెడ్డి, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్,వడ్డేపల్లిఎన్నో అవమానాలు భరించా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నా నని ఇంట్లో వాళ్లు దగ్గరకు రానివ్వలేదు. భర్త స్థాపించిన స్కూల్‌తో సంతోషంగా ఉండేవాళ్లం. ఇద్దరు పిల్లలు అయ్యాక నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వాళ్ల అన్న నన్ను మానసికంగా వేధింపులకు గురిచేశాడు. స్కూల్‌కు రాని్వకుండా, అందులో కనీసం పని కూడా చేయనివ్వకుండా ఇబ్బందిపెట్టాడు. పిల్లల ఆకలి తీర్చేందుకు కూలీ పనులకు వెళ్లాను. నన్ను చూసి గ్రామస్తులు చలించిపోయి.. అండగా నిలిచారు. ఈ రోజు మా స్థలంలో ఉన్న స్కూల్ లైసెన్సును అధికారులు రద్దు చేశారు. మళ్లీ నా పేరు మీద ఇస్తే విద్యార్థుల భవిష్యత్‌ను బంగారుమయం చేస్తాను. – రేణుక, బాధితురాలు -
వేరే మహిళతో భర్త ఎంజాయ్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
-
అనుమానంతో భార్య గొంతు కోసి...
-
అన్షులా-రోహన్ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే!
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత మోనా శౌరిల కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడి రోహన్ థక్కర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సన్నితుల సమక్షంలో పంజాబీ, గుజరాతీ సంప్రదాయాల మేళవింపుతో వైభవంగా ఈ వీరి వివాహ వేడుకు ముగిసింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులను అలరించాయి. అదే సందర్భంలో అన్షులా మనసు దోచుకున్నరోహన్ ఎవరు? అతని ఆస్తిపాస్తులేంటి అనే వివరాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.అన్షులా-రోహన్ లవ్ స్టోరీఅన్షులా-రోహన్ దాదాపు మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే సమయానికి ఆమెకు అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. జూలై 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 2025లో గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో జూన్‌లో వీరిద్దరూ దంపతులుగా మారాయి. మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక మంగళవారం తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే సమయానికి రోహన్ అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2025 జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో జూన్‌లో వీరిద్దరూ దంపతులుగా మారాయి. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)ఎవరీ రోహన్ థక్కర్రోహన్ బహిరంగంగా కనిపించే సెలబ్రిటీ కానప్పటికీ రోహన్ స్క్రీన్‌రైటర్‌గా పాపులయ్యారు. ఆయన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన డిజిటల్ కంటెంట్ సంస్థ 'ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్' (Dharmatic Entertainment) లో ఫ్రీలాన్స్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో 1993 అక్టోబర్ 12న పుట్టాడు. తల్లితండ్రులలు, సోదరుడు హృదయ్ ఠక్కర్ ఉన్నారు. కానీ రోహన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి 'ప్లేరైటింగ్ అండ్ స్క్రీన్‌రైటింగ్'లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే యూసీఎల్ఏ (UCLA) లో కూడా స్క్రీన్‌రైటింగ్ కోర్సు చేశారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఆయన అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా రంగాలలో పనిచేశారు. ప్రస్తుతం ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలకు కథలు రాస్తున్నారు 'ది నవలిస్ట్' (2016), 'నెవర్ టూ లేట్' (2016), 'నింబస్' (2018) వంటి లఘు చిత్రాలకు రచయితగా , స్క్రిప్ట్ సూపర్వైజర్గా అతనికి క్రెడిట్ లభించింది. రోహన్ థక్కర్ నికర ఆస్తి విలువ సుమారు 8.5 కోట్ల రూపాయలు పై మాటేనని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.అన్షులా కపూర్ గురించి..బాలీవుడ్లో పాపులర్ ఫ్యామిలీ కపూర్ కుటుంబానికి చెందిన అన్షులా, సెలబ్రిటీలను అభిమానులతో కలుపుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేసే 'ఫ్యాన్‌కైండ్' (Fankind) అనే సంస్థను నడుపుతున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన 'ది ట్రెయిటర్స్' (The Traitors) అనే రియాలిటీ షోలో కూడా ఆమె పాల్గొన్నారు.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి ప్రాణం తీసిన భార్య!
సాక్షి,నిజామాబాద్: ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవాళ్లు. కట్టుకున్న భార్యే ఆ ఇంటికి మహాలక్ష్మి అనుకునేవాళ్లు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు దారి తప్పుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి, కన్న బిడ్డలను, కట్టుకున్న భర్తలను కూడా మరిచిపోతున్నారు. తమ చీకటి బంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రాణంగా చూసుకోవాల్సిన భర్తనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు.ప్రియుడితో కలిసి మొగుడిని చంపి, శవాన్ని బ్లూ డ్రమ్‌లో పెట్టి సిమెంట్ పోసిన మీరట్ దారుణం, పూణే లోహ్‌గఢ్ కోట నుంచి కాబోయే భర్త కేతన్ అర్వాల్ను తోసేసి ప్రాణం తీసిన ఘటన మరువకముందే.. నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. బిల్డింగ్ పైనుంచి తోసేసినా చావలేదని, ఆస్పత్రిలో సెలైన్ బాటిల్లో ఏకంగా ‘హార్పిక్’ ఎక్కించి భర్తను చంపేసింది. దీంతో మన ఇంట్లోప్రాణం తీసే ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్, సంధ్య దంపతులు. కుటుంబ పోషణ కోసం, భార్యాపిల్లల భవిష్యత్తు కోసం ప్రశాంత్ కన్నవారిని, కట్టుకున్న దేశాన్ని వదిలి సౌదీ అరేబియా (గల్ఫ్) వెళ్లాడు. అక్కడ పగలు రాత్రి కష్టపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. అయితే, ఇక్కడ నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న భార్య సంధ్య మనసు మాత్రం పక్కదారి పట్టింది. ఇంద్రాపూర్ కాలనీకి చెందిన మిరుగూరి అనిల్ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త దూరంగా ఉండటంతో వీరి చీకటి బంధం అడ్డూఅదుపూ లేకుండా సాగింది. ఈ విషయం కాస్తా గల్ఫ్‌లో ఉన్న ప్రశాంత్‌కు తెలియడంతో, అతడు ఫోన్ చేసి భార్యను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఫోన్లలోనే గొడవలు మొదలయ్యాయి.గల్ఫ్ నుంచి రాక... మృత్యుపాశమై నిలిచిన భార్యతమ మధ్య గొడవలు సర్దుమణిగించుకుందామనో ఏమో గానీ, జూన్ 27వ తేదీన ప్రశాంత్ గల్ఫ్ నుంచి తన సొంతూరికి తిరిగి వచ్చాడు. భర్త ఇండియాకు రావడంతో తన అక్రమ బంధానికి అడ్డుకట్ట పడుతుందని సంధ్య భావించింది. అతడిని శాశ్వతంగా వదిలించుకుంటేనే తాను, తన ప్రియుడు హ్యాపీగా ఉండొచ్చని క్రూరమైన పథకం రచించింది. ఇందుకోసం తనకు పరిచయమున్న న్యాల్కల్ గ్రామానికే చెందిన వెంకట సాయి అలియాస్ బంటి అనే యువకుడిని పురమాయించింది. దాబా పైనుంచి తోసేసినా తప్పిన ముప్పుపథకం ప్రకారం... జూన్ 29వ తేదీ రాత్రి ప్రశాంత్, బంటి కలిసి ఇంటి దాబాపై కూర్చుని మద్యం తాగేలా సంధ్య ఏర్పాట్లు చేసింది. ప్రశాంత్ ఫుల్లుగా మద్యం మత్తులోకి జారుకోగానే... సంధ్య, బంటి కలిసి అతడిని బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారు. కింద పడిన ప్రశాంత్ రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ, ఒళ్లంతా తీవ్ర గాయాలవ్వడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నర్సు బుద్ధి పోనిచ్చుకోలేదు... సెలైన్‌లో హార్పిక్!పైనుంచి పడినా భర్త బతికాడే అని సంధ్య కళ్లల్లో భయం, కసి పెరిగాయి. ఆస్పత్రిలో కోలుకుంటే తన గుట్టు రట్టవుతుందని భావించింది. తను నర్సు అన్న విషయాన్ని, ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిని దారుణంగా వాడుకుంది. ఆస్పత్రిలో భర్తకు ఎక్కుతున్న సెలైన్ బాటిల్‌ను గమనించిన సంధ్య... ఎవరూ లేని సమయం చూసి టాయిలెట్ క్లీన్ చేసే ‘హార్పిక్’ను సిరంజి ద్వారా సెలైన్ బాటిల్లోకి ఎక్కించింది. ఆ విషపూరిత కెమికల్ ప్రశాంత్ శరీరంలోకి పాకడంతో పరిస్థితి విషమించి అతడు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు.పోలీసుల స్టైల్ విచారణ... కటకటాల వెనక్కి కిరాతకులుప్రశాంత్ హఠాన్మరణంతో అనుమానం వచ్చిన అతడి తల్లి... కోడలు సంధ్యతో పాటు మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. సంధ్య, బంటి, అనిల్‌ను అదుపులోకి తీసుకుని గట్టిగా నిలదీసేసరికి పాపం పండింది. తామే పక్కా ప్లాన్‌తో ప్రశాంత్‌ను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో భార్య సంధ్య, ఆమెకు సహకరించిన బంటి, ప్రియుడు అనిల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ దారుణ హత్య కేసులో భర్త ప్రశాంత్‌ను చంపడానికి భార్య సంధ్య ఎంతలా దిగజారిందో చెప్పే ఆడియో సంభాషణ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె తన ప్రియుడు అనిల్‌తో మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. వాడికి ఫుల్లుగా మందు తాగించి ప్రాణం తీసేయ్.. మేడ మీద నుంచి కిందకి తోసేయ్ అంటూ సంధ్య ఆ ఆడియోలో ప్రియుడికి స్కెచ్ చెప్పింది. దానికి అనిల్ భయపడుతూ.. నా వల్ల కాదు.. నేను చేయలేను అంటూ తప్పుకోవాలని చూశాడు.కానీ, మోహంతో కళ్లు మూసుకుపోయిన సంధ్య మాత్రం వదలకుండా.. ప్లీజ్‌రా.. నా మొగుణ్ని చంపేయ్ అంటూ ప్రియుడిపై పదే పదే ఒత్తిడి తెచ్చింది. చివరికి ప్రియురాలి కోరిక తీర్చడానికి అనిల్ సరేనన్నాడు.అయితే, హత్య చేయాల్సిన రోజు రాత్రి ఇంకొక ఊహించని ట్విస్ట్ జరిగింది. ప్లాన్ ప్రకారం ప్రశాంత్‌తో కలిసి మద్యం తాగిన ప్రియుడు అనిల్,హత్యకు సహకరించిన బంటి ఆ మత్తు తట్టుకోలేక తనే స్పృహ కోల్పోయాడు. దీంతో అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుందని భయపడిన ఆ రాక్షస భార్య.. స్వయంగా రంగంలోకి దిగింది. భర్త ప్రశాంత్ మద్యం మత్తులో మేడ అంచున నిలబడి ఉన్న సమయంలో.. వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా అతడి రెండు కాళ్లను పైకి పట్టుకుని బిల్డింగ్ పైనుంచి కిందకు నెట్టేసింది. ఈ కుట్రకు సహకరించిన బంటి పోలీసుల విచారణలో ఈ షాకింగ్ నిజాలన్నింటినీ పూసగుచ్చినట్లు ఒప్పుకున్నాడు. -
నిజామాబాద్ లో దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి
-
భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టి..
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికంద్రా పరిధిలోని దహతోరా ప్రాంతంలో సురేంద్ర శర్మ (44) తన భార్య రూబీ శర్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి వివాహమై 16 ఏళ్లు పూర్తయింది. కాగా గత మే 26న సురేంద్ర శర్మ కనిపించకుండా పోయాడంటూ సికంద్రా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.పోలీసుల దర్యాప్తులో రూబీ శర్మ ఒక పథకం ప్రకారం భర్తను హత్య చేసిందని తేలింది. ఘటన జరిగిన రోజున ఆమె తన ఇద్దరు కుమార్తెలను సురేంద్ర శర్మ పెద్దన్నయ్య ఇంటికి పంపించివేసింది. ఆ తర్వాత భర్తకు నిద్రమాత్రలు కలిపిన ఖీర్‌ను ఇచ్చింది. అది తిన్న సురేంద్ర శర్మ స్పృహ కోల్పోగానే, ఆమె అతడి గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం, బాత్రూమ్లో ఒక గొయ్యి తవ్వి, అందులో భర్త శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ప్రదేశాన్ని సిమెంట్ ఫ్లోరింగ్‌తో పూర్తిగా కప్పివేసింది.తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని బంధువులను, పొరుగువారిని 45 రోజులుగా రూబీ నమ్మిస్తూ వచ్చింది. అయితే, సురేంద్ర శర్మకు సంబంధించిన ఒక పాత కేసుకు సంబంధించి రొటీన్ వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇటీవల అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రూబీ శర్మ కంగారుపడుతూ, తన బావను (భర్త అన్నయ్యను) ఇంటికి పిలిపించింది. పోలీసులు రూబీ శర్మను తమదైన శైలిలో విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించి శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించింది. పోలీసులు వెంటనే బాత్రూమ్ ఫ్లోరింగ్‌ను పగలగొట్టి, సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఆగ్రా హరిపర్వత్ సర్కిల్ ఏసీపీ అమీషా మీడియాతో మాట్లాడుతూ.. మే 26న సురేంద్ర మిస్సింగ్ కేసు నమోదైందని, విచారణలో భార్యే అతడిని హత్య చేసి బాత్రూమ్లో పూడ్చిపెట్టినట్లు తేలిందన్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: పాక్‌లో కలకలం: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కోసం ‘మాయ’ స్మగ్లింగ్ -
భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ మెహరీన్ (ఫొటోలు)
-
ఇల్లు ఊడ్చా.. అంట్లు తోమా.. అయినా కొట్టేవారు!
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు. భార్య చెప్పిందని తల్లిదండ్రుల్ని వదిలేసి.. వేరు కాపురం పెట్టాడు. అత్తింటి వారినే తన సొంత తల్లిదండ్రులుగా భావించాడు. వాళ్లు చెప్పిన ప్రతి మాటను కాదనకుండా పాటించాడు. ఆ కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. కానీ చివరికి అతని జీవితమే విషాదాంతమైంది. మరణానికి ముందు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ కేసు గుర్తుందా?. మరణానికి ముందు ఆయన విడుదల చేసిన దాదాపు 81 నిమిషాల వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. భార్య, అత్తింటి వేధింపుల ఆరోపణలతో ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన లేఖలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా. భార్య, అత్తింటి వాళ్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డ మరో భర్త దీనగాథే ఇది.హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యాపారి రాహుల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులే ఈ నిర్ణయానికి కారణమని వీడియోలో ఆరోపించాడు.బల్లభ్‌గఢ్‌లో నివసించే రాహుల్‌కు రెండేళ్ల క్రితం జ్యోతితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య ఒత్తిడితో.. తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టాడు. ఆమె అమ్మానాన్నల బాగోగులు కూడా అతనే చూసుకుంటున్నాడు. అయితేవలే గార్మెంట్స్ షాపు ప్రారంభించిన రాహుల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు.మరణానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతూ పేర్లను ప్రస్తావించిన రాహుల్.. దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. వాళ్ల కోసం తాను అడ్డమైన పనులు చేసేవాడినని చెప్పాడా భర్త. ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసేవాడినని.. అయినా వాళ్లు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆపై సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే.. డబ్బు కోసం, అందులో భాగస్వామ్యం కోసం వేధించడం మొదలుపెట్టారని చెప్పాడు. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేశారని, తన మరణానికి వారే బాధ్యులని పేర్కొంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆస్తిని తల్లి, సోదరులు, సోదరికి ఇవ్వాలని కూడా వీడియోలో విజ్ఞప్తి చేశాడు.ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన దుకాణానికి వెళ్లిన రాహుల్.. కొద్దిసేపటికే అక్కడ మృతిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతదేహం చూసి రాహుల్ తల్లిదండ్రులు కంటతడి పెట్టిన తీరు పలువురిని కదిలించింది.Faridabad News: सेक्टर-3 फरीदाबाद में राहुल की मौत के बाद मर्चरी के बाहर पिता का दर्द छलक पड़ा। परिजनों ने निष्पक्ष जांच और न्याय की मांग की। पुलिस पूरे मामले की जांच में जुटी है।#FaridabadNews #BreakingNews #HaryanaNews #CrimeNews #ViralNews #HindiNews #HindustanTehelka pic.twitter.com/XWn71XZ7FO— Hindustan Tehelka News (@htehelkanews) June 28, 2026అయితే వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరపకుండా.. ఆ ఆరోపణలు నిజమని చెప్పలేమని అంటున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు.. భర్త మృతి, కేసు గురించి స్పందించేందుకు జ్యోతి కుటుంబం మీడియాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
వేరు కాపురం పెడితేనే సంసారానికి వస్తా..!
ఆదోనికి చెందిన దుస్తుల వ్యాపారి రవిచంద్రకు ఇటీవలే వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వేరుకాపురం పెట్టాలని భార్య పోరు పెట్టసాగింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టేందుకు రవిచంద్రకు ఇష్టం లేదు. అలాగని ప్రేమగా చూసుకునే భార్య మాటను కాదనలేక లోలోపల సతమతమవుతూ నిద్రలేని రాత్రిళ్లు గడపసాగాడు. ఈ క్రమంలో అతనికి యాంగ్జైటీ, డిప్రెషన్ చుట్టుముట్టాయి. చికిత్స నిమిత్తం వైద్యుని వద్దకు అతన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అతని గురించి తెలుసుకున్న డాక్టర్ కుటుంబసభ్యులందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రవిచంద్రకు కొన్ని మందులు సూచించి పంపించాడు. కర్నూలు నగరంలోని గణేష్‌నగర్‌కు చెందిన శివకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగంలో ఇస్తున్న లక్ష్యాలు చేరుకోవడానికి అతను నిత్యం శ్రమించేవాడు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. అది కాస్తా పానిక్ అటాక్‌గా మారడంతో కుటుంబసభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పని ఒత్తిడి అన్ని చోట్లా ఉంటుందని, ప్రణాళికతో పని చేసుకుంటే ఏ పనైనా సులభమవుతుందని డాక్టర్ కౌన్సెలింగ్ చేసి పంపించాడు. మానసిక ఒత్తిళ్లతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆధునిక జీవితం లేదు. ఖర్చులు తక్కువగా ఉన్నా ఇంట్లో ఒకరు సంపాదించినా కుటుంబమంతా హాయిగా జీవించేది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ సంపాదించినా ఖర్చులకు సరిపోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడంతా ఆధునిక సమాజం. పక్కవారిని చూసి ఆధునికతను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. పక్కవారితో పోల్చుకోవడంతో దానిని అందుకోలేక ఒత్తిడికి గురవుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీ చికిత్సకు ప్రతి రోజూ 100 నుంచి 120 మంది దాకా వివిధ మానసిక వ్యాధులతో బాధపడే వారు వస్తున్నారు. అందులో 40 శాతం కొత్తవారు ఉంటున్నారు. చికిత్సకు వచ్చిన వారిలో అధిక శాతం బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకునేవారు ఉంటున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చేసి పంపిస్తున్నారు. ఈ సమయంలో రోగితో మసలుకోవాల్సిన తీరు గురించి కుటుంబసభ్యులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ 25 మంది దాకా మానసిక వైద్యులు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది దాకా చికిత్స కోసం వెళ్తున్నారు. వీరే గాక జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టుల వద్దకు వెళ్లే వారిలోనూ 20 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉంటున్నారు. చికిత్సకు వెళ్లేవారిలో 30 శాతం మంది వృద్ధులు, 5 శాతం మంది పిల్లలు ఉండగా మిగిలిన వారిలో యువత, మధ్యవయస్సు వారు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. నిద్ర పట్టక..నిద్ర సరిపోక! పలు రకాల కారణాలతో మానవుని శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా మెదడులో కలిగే పలు రసాయన చర్యల ఫలితంగా పలు వ్యాధులకు ఆహ్వానం లభిస్తోంది. ఇందులో బీపీ, షుగర్, గుండెజబ్బులు, థైరాయిడ్ ప్రధానమైనవి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే షుగర్, థైరాయిడ్ సమస్యలున్న వారి శరీరం తీవ్ర ఒడిదుడుగులకు లోనవుతూ ఉంటుంది. ఒక సమస్యను తగ్గించుకుంటే మరో సమస్య లేచి కూర్చుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు సమస్యలున్న వారు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ క్రమంలో సరైన నిద్రపట్టక, నిద్రసరిపోక, వ్యాధులు నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. ఈ సమస్యలకు మూలం శారీరక శ్రమ లేకపోవడం, నియంత్రణలేని ఆహారం, ఎక్కువసేపు టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లను చూడటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసిక రోగుల సంఖ్య పెరుగుతోంది గతంతో పోలిస్తే ప్రస్తుతం మానసిక జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. వివిధ రకాల కారణాలతో మానసిక సమస్యలు అధికం కావడంతో పాటు ఆసుపత్రిలో మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగా మానసిక పరివర్తనలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాలు, మత్తు పదార్థాలకు అడిక్షన్ అయిన వారు, బెట్టింగ్‌లకు బానిసైన వారు తమ వద్దకు ఎక్కువగా వస్తున్నారు. అన్ని రకాల మానసిక సమస్యలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్ఓడీ, మానసిక జబ్బుల విభాగం, జీజీహెచ్, కర్నూలుయువత..పెడదోవ ఇటీవల కాలంలో యువతలో మానసిక సమస్యలు ఎక్కువైనట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువ మంది గాంబ్లింగ్, బెట్టింగ్, మొబైల్ నెట్ అడిక్షన్తో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా యువతలో మొబైల్ గేమింగ్ దురలవాటు ఎక్కువైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో సొమటోఫామ్ డిజార్డర్ వేధిస్తున్నట్లు వారు గుర్తించారు. వివిధ రకాల ఆన్లైన్ బెట్టింగ్‌లలో డబ్బు పోగొట్టుకుని, దానివల్ల అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. -
వరలక్ష్మీ శరత్‌కుమార్.. భర్తతో ఆ సాహసం చేయనుందా?
కోలీవుడ్ భామ వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ ఏడాది సరస్వతి మూవీతో అభిమానలను అలరించింది. అంతేకాకుండా ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. వరలక్ష్మీ ఇటీవలే పోలీస్ కంప్లైంట్ అనే తెలుగు మూవీలో కనిపించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందుకు వివాదంలో నిలిచింది. వరలక్ష్మీ డబ్బులు తీసుకుని కూడా ప్రమోషన్లకు రావడం లేదని డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఆమెను విమర్శించారు. మూవీ రిలీజ్ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.ఇదిలా ఉండగా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ.. మరో సాహసానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన భర్త నికోలాయ్ సచ్దేవ్ను ఏకంగా విలన్‌గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోందట. కోలీవుడ్‌లో ఆమె భర్త గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఇప్పటికే సినిమాల్లో లేడీ విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ.. భర్తను కూడా నెగెటివ్ రోల్లోనే తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.నికోలయ్ లుక్ వల్లే..వరలక్ష్మీ భర్తను చూస్తే అచ్చం విలన్‌లాగే కనిపిస్తారు. భారీ దేహంతో పాటు విలన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అతని లుక్ ఉంటుంది. అందువల్లే వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా భర్తను విలన్‌గా పరిచయం చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అతని లుక్, పర్సనాలిటీ విలన్‌గా సెట్ అవుతుందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. -
పెద్ద సైకో... వాడు మళ్లీ బయట తిరగకూడదు రాధా గాయత్రి తండ్రి, పిన్ని
-
నా భర్తను ఈ వ్యసనం నుంచి బయట పడేయగలరా?
నా భర్తకు 35 సంవత్సరాలు, అతను ఈ మధ్య పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటు పడ్డాడు. తన మొౖబైల్లో పోర్న్ స్క్రోల్ చేయటంలో గంటల తరబడి గడుపుతూ నన్ను, మా పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆన్లైన్ వీడియో చాటింగ్‌కు డబ్బు చెల్లిస్తున్నాడని కూడా తెలిసింది. ఆఫీస్‌లోనూ అతని పనితీరుపై తన బాస్‌తో తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అతను నాతో శారీరక సాన్నిహిత్యంపై ఆసక్తి చూపటం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో... మా వివాహ బంధాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియటం లేదు. నేను ఏమి చేయాలో చెప్పండి.– కృష్ణ్ణవేణి, బెంగళూరుమీ ఆందోళన అర్థమవుతోంది. ఈ సున్నితమైన పరిస్థితి గురించి మాట్లాడే ధైర్యం చేసినందుకు ముందుగా మీకు అభినందనలు. పోర్నోగ్రఫీ వ్యసనం అనేది కుటుంబ జీవితం, వృత్తిపరమైన పనితీరుపై తీవ్రమైన ప్రభావాలను కలిగి ఉండే సంక్లిష్టమైన సమస్య. అతని ప్రవర్తన, మీ కుటుంబంపై దాని ప్రభావం గురించి అతన్ని నిందించేటట్లు కాకుండా నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ ఆందోళనలు, భావాలను ప్రశాంతంగా వ్యక్తపరుస్తూ, అతని చర్యలు మీపై, మీ పిల్లలపై ఎంత ప్రభావం చూపుతున్నాయో డిస్కస్ చేయండి. ఒక మంచి సైకియాట్రిస్టు సలహాలతో (కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ) ఇతర చికిత్స విధానాలతో, అతన్ని ఈ వ్యసనానికి దూరం చేయవచ్చు. ఇద్దరూ కలిసి కపుల్ థెరపీకి హాజరు కావడానికి కూడా ప్రయత్నించండి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి మీ మధ్య సాన్నిహిత్యం పెంచడానికి కూడా దోహదపడుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ వినియోగం గురించి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోండి. మీకు వ్యక్తిగత కౌన్సెలింగ్, ఈ సమస్యల నుంచి ధైర్యంగా సమర్థంగా బయటకుపడేందుకు సహాయపడుతుంది. అయితే ఏదైనా వ్యసనం నుంచి కోలుకోవటం అనేది చాలా సమయం, ఓర్పు, క్రమశిక్షణతో కూడుకున్న ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. ఈ క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడటానికి నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల నుంచి మద్దతు పొందడానికి వెనుకాడకండి. ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్
-
రాధా గాయత్రి కేసుపై వివరణ ఇచ్చిన శ్రీచరణ్ తండ్రి
-
భార్యకు సర్ప్రైజ్.. భర్తకేమో బిగ్ షాక్!
ఆయనకు భార్య అంటే ఎంతో ఇష్టమట!. అందుకే ఈసారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా జరపాలని డిసైడ్ అయ్యాడు. అర్థరాత్రి వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రాజసంగా కనిపించే వేదికను సిద్ధం చేశాడు. ఆపైనే.. ఏదైతే చేయకూడదో ఆ పనే చేసి చిక్కుల్లో పడ్డాడు!. ప్రేమతో ప్లాన్ చేసిన వేడుక చివరకు ఆ కుటుంబానికే పెద్ద తలనొప్పిగా మారింది.అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ బరువా తన భార్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 22 అర్థరాత్రి ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకను ఇంట్లో గానీ, ఫంక్షన్ హాల్లో గానీ కాకుండా నగరంలోని కుమార్ భాస్కర్ వర్మ ఫ్లైఓవర్‌పై నిర్వహించడం వివాదానికి దారి తీసింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఫ్లైఓవర్‌పై బెలూన్లతో అలంకరణలు చేశారు. రోడ్డుపై రెడ్‌కార్పెట్ పరిచారు. పలువురు స్నేహితులు, బంధువులు అక్కడికి చేరుకుని పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కొన్ని కార్లను ఫ్లైఓవర్‌పైనే నిలిపివేసి వేడుక నిర్వహించారు. ఇక్కడే అసలు చేయకూడని పని చేశాడాయన.భార్యను ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నా.. ఫ్లైఓవర్‌ను పార్టీ హాల్‌గా మార్చేయడం మాత్రం పోలీసులను ఇంప్రెస్ చేయలేదు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం నిర్మించిన ఫ్లైఓవర్‌ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఏంటని ప్రశ్నించారు. ట్రాఫిక్, ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. దీంతో గువాహటి పోలీసులు రంగంలోకి దిగారు.14 మంది అదుపులోకిదర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గౌతమ్ బరువాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడితో పాటు వేడుకలో పాల్గొన్న భార్య సహా మొత్తం 14 మందిని ప్రశ్నల కోసం అదుపులోకి తీసుకున్నారు. వేడుకలో ఉపయోగించిన నాలుగు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.Businessman Gautam Baruah was detained by Bharalumukh Police on Monday after a video showing a birthday celebration atop the Kumar Bhaskar Varma Flyover in Guwahati went viral on social media.According to police officials, Baruah was summoned for questioning in connection with… pic.twitter.com/TSRHU8nZ2t— Hate Detector 🔍 (@HateDetectors) June 23, 2026కేసులు నమోదుగౌతమ్ బరువాపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఇదంతా చూసిన వాళ్లు.. ఇంత ప్రేమ చూపించాలా బాస్!" అని కొందరు, ఇలాంటి ఐడియాలు మాకెందుకు రావు? అని కొందరు భర్తలు లోలోపల కుళ్లుకుని ఉండొచ్చనే జోకులు పేలుతున్నాయి. -
మొగుడే కాలయముడు!
-
టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం
ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హిల్ స్టేషన్లో గల ఒక హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి మృతిపై ఆమె తండ్రి ముస్సోరీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మృతురాలి భర్త శ్రీచరణ్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తన కుమార్తె మరణం వెనుక బలమైన అనుమానాలు ఉన్నాయని, దీనిని హత్యగా పరిగణించి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.తన ఫిర్యాదులో శ్రీచరణ్ ప్రవర్తనపై రాధా గాయత్రి తండ్రి పలు సంచలన ఆరోపణలు చేశారు.పెళ్లయినప్పటి నుంచి శ్రీచరణ్ తన కుమార్తెతో సరిగ్గా కలిసి ఉండేవాడు కాదని, ఆమెను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడని పేర్కొన్నారు. శ్రీచరణ్ ఒక సైకోలా ప్రవర్తించేవాడని, నిరంతరం నిఘా ఉంచేందుకు గాయత్రి బ్యాగులో ట్రాకర్ కూడా పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త పెట్టే వేధింపుల గురించి గాయత్రి గతంలో తమతో పలుమార్లు చెప్పి ఏడ్చిందని ఆయన ఫిర్యాదులో వివరించారు. కుమార్తె మరణంపై భర్త శ్రీచరణ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాధా గాయత్రికి లోబీపీ ఉందని శ్రీచరణ్ అబద్ధాలు చెబుతున్నాడని, కానీ ఆమె ఆరోగ్య చరిత్రలో ఎప్పుడూ బీపీ సమస్యే లేదని స్పష్టం చేశారు. భార్య చనిపోతే శ్రీచరణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. అలాగే, హోటల్లో బీరులో మత్తు పదార్థాలు కలిపారనే వార్తలు మీడియాలో వస్తున్నాయని, ఈ కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరపాలని కోరారు.ఈ కేసులో పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించడంలో నిర్లక్ష్యం వహించారని రాధా గాయత్రి తండ్రి ఆరోపించారు.ఘటన జరిగిన రోజున భర్త శ్రీచరణ్ రక్త నమూనాలను ఎందుకు సేకరించలేదని ఆయన నిలదీశారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు జరిగిన 48 గంటల ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని, రాధకు నిజంగానే మత్తు పదార్థాలు ఇచ్చారా లేదా అనేది తేల్చాలన్నారు. దీంతో పాటు హోటల్ రికార్డులు, ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలను తక్షణమే భద్రపరచాలని ముస్సోరీ పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. -
భార్య గాయత్రి ఘటనపై భర్త ఫస్ట్ రియాక్షన్..!
-
తప్పు చేస్తే ఇక్కడే ఎందుకుంటాను: రాధా గాయత్రి భర్త
సాక్షి, విశాఖపట్నం: భార్య రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ స్పందించారు. నా భార్య రాధా గాయత్రి మరణానికి, నాకు ఎలాంటి సంబంధం లేదని.. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు వెల్లడవుతాయని శ్రీచరణ్ అన్నారు. ‘‘మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుంటే, విబేధాలు ఉన్నట్టయితే ముస్సోరి ఎలా వెళ్తాం. హోటల్ ప్యాకేజ్‌లో భాగంగానే మద్యం సప్లయ్ చేశారు’’ అని శ్రీచరణ్ పేర్కొన్నారు.‘‘ఆమె తల్లిదండ్రులు బాధలో ఇలాంటి మాటలు ఆడుతున్నారు. ఇప్పటికీ గాయత్రీ నా భార్య. గాయత్రీ తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులతో సమానం. ఇది నా ఒక్కడి సమస్య కాదు. మూడు గ్రామాల సమస్య. నాకు బాధ్యత లేకపోతే సంప్రదాయాలు ఎందుకు పాటిస్తాను. నేను తప్పు చేస్తే ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటాను’’ అంటూ శ్రీచరణ్ పేర్కొన్నారు.ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని.. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
షాకింగ్ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్
ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లా పాండోపారా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య, నలుగురు బిడ్డల తల్లిపై అనుమానంతో భర్త అతి దారుణంగా ప్రవర్తించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాయ్‌పూర్‌కు ఉత్తరాన సుమారు 350 కి.మీ దూరంలో ఈ ఘటనచోటు చేసుకుంది. బాధితురాలు తారా బాయి (32)కు నిందితుడు జితేంద్ర ఘసియాతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. విబేధాలతో భార్యాభర్త లిద్దరు విడిగా ఉంటున్నారు. అయితే పిల్లలు మాత్రం తండ్రి వద్దే ఉంటున్నారు.భార్యపై అనుమానంతో అత్యంత అమానుషంగా దాడి చేశాడు జితేంద్ర. చేతులు కాళ్లు, కట్టేసి ఆమె పదే పదే దాడి చేశాడు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి తీవ్ర అవమానానికి గురిచేశాడు .ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి, మరో మహిళకూడా ఆమెపై చేయి చేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఘాతుకాన్ని రికార్డ్ కూడా చేశాడు. 💔 #DalitWoman Tara Bai was brutally assaulted by her estranged husband in Chhattisgarh: tied up, beaten, head shaved, smeared with black substance & forced to drink urine. Caste & gender violence continue. Justice for Tara Bai! #StopViolence #ShotOnPaPhone #ApolloTyres pic.twitter.com/zCBduhT2oS— Kavita Kumari (@KavitaDevi5252) June 19, 2026అసలేం జరిగింది? అయితే, ఏడాది క్రితం భర్త ఆమెను వదిలేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె, తన సామాజిక వర్గానికి చెందిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. నిందితుడు ఆమెను ఇంటి బయటకు రప్పించి, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత రాక్షసుడిలా మారిపోయాడు. దారుణంగా కొట్టి అమానుషంగా ప్రవర్తించడంతోపాటు, మూత్రం తాగించాడు. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లుబాధితురాలు ఫిర్యాదు చేయడంతో, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తనపై పిడిగుద్దులు కురిపించి, తన జుట్టును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఆమె భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు, వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
నాకు పెళ్లైంది.. ఇలాంటి మెసేజ్‌లు పంపవద్దు..!
తమిళనాడు దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని వేలాయుధంపట్టికి చెందిన అరవిందన్ (22) కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మితో అతడు గతంలో సన్నిహితంగా మాట్లాడేవాడు. అయితే మూడు నెలల క్రితం నాగలక్ష్మికి సిరుమలై తాళకడై ప్రాంతానికి చెందిన వీరమణి (24)తో వివాహమైంది. వివాహం అనంతరం కూడా అరవిందన్ నాగలక్ష్మికి తరచూ ఫోన్ సందేశాలు పంపుతూ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నాగలక్ష్మి, తనకు పెళ్లైందని, ఇకపై ఇలాంటి సందేశాలు పంపవద్దని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆమె తన భర్త వీరమణికి కూడా తెలిపింది. అయినప్పటికీ అరవిందన్ తన ప్రవర్తన మార్చుకోలేదు.దీంతో నాగలక్ష్మి పేరుతో వీరమణి అరవిందన్‌కు సిరుమలైకి రావాలని సందేశం పంపినట్లు సమాచారం. నాగలక్ష్మిని కలుసుకోవచ్చన్న ఉద్దేశంతో అరవిందన్ అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా వీరమణి, "నా భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు" అంటూ అరవిందన్‌తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో వీరమణి కత్తితో దాడి చేసి అరవిందన్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్య అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వీరమణి మృతదేహాన్ని ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. అనంతరం చెత్తతో కప్పి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని వీరమణి తన స్నేహితుడికి చెప్పగా, అతడు గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ డీఎస్పీ శంకర్, ఇన్స్పెక్టర్ ఉలగనాథన్ నేతృత్వంలోని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.అరవిందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇన్ స్టాలో పరిచయం అయిన యువకుడి కోసం భర్తను హతమార్చిన భార్య
-
ఆ భర్త బాత్రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు!
అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా మారింది. చివరకు ఆ మానసిక వేదనను తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.పుణే వైష్ణవి హగ్వానే కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అరకేజీ బంగారం, నగదు, కాస్ట్లీ కారు కట్నంగా ఇచ్చినప్పటికీ.. సరిపోలేదంటూ అత్తింటి కుటుంబం వైష్ణవిని బలి తీసుకుంది. ఈ ఘటన తర్వాత.. వరకట్నం విషయంలో కొన్ని కులాల పెద్దలు ‘తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే వివాహం చేయాలి’ అని తీర్మానాలు కూడా చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే.. అదే తరహాలో మహారాష్ట్రంలోనే మరో వరకట్న వేధింపులకు నవవధువు బలైన ఘటన చోటు చేసుకుంది. అంబర్‌నాథ్‌లో పెళ్లైన 48 రోజుల్లోనే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. దీనికి తోడు ప్రతీ చిన్న విషయానికి భర్త అనుమానించడం విశాఖ తిల్కర్(26)ను దారుణంగా కుంగదీశాయి. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు చెబుతోంది ఏంటంటే.. విశాఖకు ఈ ఏడాది ఏప్రిల్ 30న వైద్యుడు నితిన్ తిల్కర్‌తో వివాహమైంది. అడిగినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే అత్తింట అడుగు పెట్టిన మరుసటి రోజు నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తాము అనుకున్నంత కట్నకానుకలు రాలేదని తల్లి, మరిది సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇటు నితిన్ కూడా చీటికి మాటికి విశాఖను అనుమానించడం మొదలుపెట్టాడు. ఇంటి లోపల, బయట.. ఆఖరికి బాత్రూమ్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విశాఖ ప్రతి కదలికను గమనించాడట.... ఎవరితో మాట్లాడినా ప్రశ్నించడం, అనుమానించడం, దాడి చేయడం తరచూ జరిగేది. విశాఖ బలవన్మరణానికి పాల్పడే రెండు రోజుల ముందు పొరుగును ఉన్నవాళ్లతో మాట్లాడిందని నితిన్ తీవ్రంగా కొట్టాడు. అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన ఆమె.. పుట్టింటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. దీంతో ఆమెను ఆ నరకం నుంచి బయటపడేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈలోపే.. ఏం జరిగిందో ఏమోగానీ జూన్ 16న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త నితిన్ తిల్కర్‌తో పాటు అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌పై మానసిక, శారీరక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాల కింద కేసులు పెట్టారు. నితిన్‌ను అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తికాకముందే అనుమానం, నిఘా, వేధింపుల మధ్య తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిందంటూ ఆ తల్లిదండ్రులు పెట్టిన కన్నీళ్లు పలువురిని కదిలించాయి. -
ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి
బిహార్‌లోని నలంద జిల్లా, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్రమైన పెళ్లి నెట్టింట సందడి చేస్తోంది. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న 36 ఏళ్ల వివాహిత మహిళ., తనకంటే 12 ఏళ్ల చిన్నోడు, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమాయణం. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో అనుకోని ట్విస్ట్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలేమైంది?కట్వా రసూల్పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన వివరాలు...శుక్రవారం రాత్రి ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది,సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను, ఆమె ప్రియుడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు మహిళ భర్తను, ఆమె ప్రియుడి తండ్రిని కూడా విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను వెల్లడించింది. దీని తరువాత, ఇరు పక్షాల మధ్య చర్చోప చర్చలు జరిగాయి. View this post on Instagram A post shared by tvn99urdu News 24/7 (@tvn99urdu)ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!చివరికి మరుసటి రోజు, శనివారం, ఆ మహిళ భర్త వీరి పెళ్లిక అంగీకరించి, స్థానిక గుడిలో ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి ఆ వారి ముగ్గురు పిల్లలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పిల్లలు తమ తల్లితో వెళ్ళడానికి నిరాకరించి, తమ తండ్రితోనే ఉండాలని కోరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం, పెళ్లి తర్వాత ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి, తన కొత్త భర్తతో కలిసి పంజాబ్‌లోని లూథియానాకు వెళ్లిపోయింది. ఇది కులాంతర వివాహంగా నివేదించబడుతున్నందున, ఈ సంఘటన ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
వాట్సాప్ స్టేటస్ విప్పిన గుట్టు!
ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ బంధం చివరికి ఓ ఊహించని క్రైమ్ కథగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స.. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కన్నీళ్లతో కుప్పకూలిన ఆమె… ఆ క్షణం అది ముగింపు అనుకుంది. కానీ అదే ముగింపు కాదు. అసలు కథ మొదలు.ఈ కేసులో మలుపు తిప్పింది ఒక వాట్సాప్ స్టేటస్. సాధారణంగా కనిపించిన ఆ ఒక్క మెసేజ్ పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఆధారంగా సాగిన దర్యాప్తు… చివరికి ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా అని బయటపెట్టింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు.. సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని.. అదీ ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ.. తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత.. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే.. శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం.. అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్ దొంబార్ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్ కాల్ డాటా ఆధారంగా.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ‘‘యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?’’ అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. శాండీప్ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్‌లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది.ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సిరింజ్‌లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఓ భార్య తన పప్రియుడితో కలిసి భర్తకు రాసిన మరణశాసనమే కాదు.. వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ పెద్ద చర్చకు దారి తీసింది. అన్నట్లు తెలంగాణలోని కామారెడ్డిలోనూ ఈ తరహా నేరమే ఒకటి బయటపడడం తెలిసిందే. కామారెడ్డి కేసులో ఓ వ్యక్తి హత్యను మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అది యాక్సిడెంట్ కాదని పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా తేలింది. భార్యకు తన భర్తను తొలగించాలనే ఉద్దేశం ఉండగా, ఆమెకు సహకరించిన ప్రియుడి పాత్ర కూడా బయటపడింది. ఇద్దరూ కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అసలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!
కట్టుకున్న భర్త వేధింపులకు గురిచేసి, అత్యంత దారుణంగా హింసించిన కేసు ఒకటి కలకలం రేపుతోంది. ఎర్రగా కాలిన ఇనుప రాడ్‌తో వాతలు పెట్టి హింసించాడు. మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతనైతే పోలీసుల దగ్గరకు వెళ్లమని సవాలు విసిరాడు. కట్ చేస్తే...క్రైమ్ థిల్లర్‌లా సాగిన ఈ కథలో చివరికి ఆమె పోలీసుల వద్దకు చేరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.బాధితురాలు మాంగీబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం...జూన్ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఈ హింస మొదలైంది. రాత్రి భోజనం తర్వాత తిట్టడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకించడంతో ఆమెపై క్రూరంగా దాడి చేశాడు.కర్రతో బాదాడు, చెంపదెబ్బలు కొట్టాడు, బెదిరించాడు. ఆ హింసను భరించలేక, మాంగీబాయి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చింది.మొదటిసారి దొరికిపోయిందిగంటల తరబడి నడుచుకుంటూ ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు వెడుతుండగానే, ఒక గుడి సమీపంలో ఆమె భర్త ఆమెను అడ్డుకుని, మళ్లీ దాడి చేసి, బలవంతంగా గ్రామానికి తీసుకువెళ్లాడు. మరింత క్రూరంగా మారిపోయాడు. దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసులేసి, ఇంట్లోని ఒక స్తంభానికి కట్టేసి,తాళం వేసేశాడు. ఇప్పుడు చూస్తాను నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎలా ఫిర్యాదు చేస్తావో, ఎవడితో చెప్పుకుంటావో, చెప్పుకో అంటూ బెదిరిస్తూ పదేపదే కొట్టాడు. అంతటితో ఆగకుండా, గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్‌ను వేడి చేసి, ఆమె శరీరంపై కాల్చాడు. ఆమె నడుము, నడుము కింది భాగం, కుడి తొడపై ఈ వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో కేకలు వేసినా, ఎవరూ సాయం చేసేవారే లేకపోయారు. 24 గంటలు బయటకు వెళ్ల నివ్వలేదు, ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. పోలీసుల వద్దకు వెళ్లే ఆలోచనను విరమించుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు, ఊరి పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టాలని తాళం వేసి బయటకు వెళ్లాడు. అతగాడి క్రూరత్వం, జరగబోయే హింసను ఊహించి భయంతో, రాజీకి అంగీకరించినట్లు నటించింది. కానీ మనసులో మాత్రం తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూసింది.దారి చూపిన రాయిపంచాయతీ కోసం భర్త బయటికి వెళ్లగానే చుట్టూ సాయంకోసం వెదికింది. మాంగీబాయి కళ్ళు అక్కడ ఉన్న ఒక రాయిపై పడ్డాయి. అంతే దాన్నితీసుకుని తాళంపై ఒకటి, రెండుసార్లు పదే పదే తాళం పగిలే దాకా కొడుతూనే ఉంది. చివరకు తాళం విరిగింది. గొలుసు తెగిపోయింది, బందీఖానానుంచి విముక్తి లభించింది. క్షణం కూడా వృధా చేయకుండా, ఆమె ఇంటి నుండి పరుగులు తీసి ఖిల్చిపూర్ వైపు నడవడం ప్రారంభించింది.తీవ్ర అలసట,, ఒళ్లంతా గాయాలు,, ముళ్ళు గుచ్చుకుని తెగి రక్తమోడుతున్న పాదాలు, అయినా సరే తనను బంధించడానికి వాడిన ఇనుప గొలుసు ఇంకా మెడలోనే వేలాడుతుండగానే తన విముక్తి కోసం పయనం మొదలు పెట్టింది. చివరికి పోలీసు స్టేషన్ గడప తొక్కింది. ఆమె సాహసోపేత ప్రయత్నం, తెగింపు కారణంగా చివరకు ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్ దుర్మార్గానికి తెర పడేలా చేసింది. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్ చీకట్లో ఆరు కిలోమీటర్ల ప్రయాణంచుట్టూ చీకటి.. మెడలోఇనుప గొలుసు, తెగిన తాళం అలాగే వేలాడుతుండగా.. మాంగీబాయి నిర్మానుష్యమైన ప్రాంతాలు, పొలాలు, గరుకు మార్గాల గుండా నడక మొదలు పెట్టింది. దారిలో వెళ్లేవారు ఆమె మెడలోని గొలుసును చూసి ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకున్నారు. కానీ ఎవరూ కనీసం ఆగి ప్రశ్నించలేదు. అయితే, ఒక బాటసారి ఆమె పరిస్థితిని గమనించి తినడానికి ఏదైనా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్‌కు చేదు అనుభవంషాక్కు గురైన పోలీసులురాత్రి 10 గంటల ప్రాంతంలో మాంగీబాయి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించగానే అక్కడున్న పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. మెడలో తాళం వేసిన గొలుసు, శరీరంపై వాతలు , తీవ్ర భయాందోళలో గజ గజ వణికిపోతూ స్టేషన్‌కు చేరుకున్న ఆమె కన్నీరుమున్నీరై, జరిగినదంతా వివరించింది. పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో ఆమె శరీరంపై గాయాలు, వాతలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే ఒక పోలీసు బృందం గ్రామానికి వెళ్లి నిందితుడైన భర్తను అరెస్టు చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
-
నన్ను ముట్టుకోకుండా దూరం పెట్టి, లైవ్ లో భార్య కన్నీళ్లు
-
భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్‌పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గోదావరి (38) , నేత్రపాల్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్‌పై దూకేసింది. ఆమె బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా 100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు. కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్‌ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్High drama unfolds in #Bareilly as wife catches husband with alleged girlfriend in a vehicle. She climbs onto car bonnet; gets dragged for nearly 100 meters. FIR Filed @uppolice @timesofindia pic.twitter.com/prKxvw3YvB— Sandeep Rai (@RaiSandeepTOI) June 9, 2026 భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్‌కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తభమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్ స్పందిస్తూ, నేత్రపాల్ సింగ్, సాధనలపై ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై సూట్‌కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్‌బుక్‌లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్‌కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్‌కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై -
భార్య చేతిలో దారుణ హత్యకు గురైన ఆర్మీ ఉద్యోగి
-
ఉద్యోగం లేదని కుటుంబ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోజాలడు
న్యూఢిల్లీ: కేవలం ఉద్యోగం లేదనే సాకుతో భార్య, కుమారుడి పోషణ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోజాలడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. బాలుడైన కుమారుడి పోషణ కోసం నెలకు రూ.6 వేల చొప్పున చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఓ గృహ హింస కేసులో అదనపు సెషన్స్ జడ్జి శీతల్ చౌదరి ప్రధాన్ ఈ మేరకు 2వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గృహ హింసనివారణ చట్టం కిందభర్త నుంచి తనకు సాయం మందించేలా ఆదేశాలించాలంటూ వేసిన పిటిషన్‌కు దిగువ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ వేసిన అర్జీపై న్యాయమూర్తి.. ‘తనకు వేరే బాధ్యతలున్నాయని, ఉద్యోగం లేదని కారణాలు చూపుతూ భర్త చట్టబద్ధంగా వివాహమాడిన భార్య, మైనర్ సంతానం పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేడు’అని పేర్కొన్నారు. ఉద్యోగం చేయగలిగి ఉండీ కూడా ఇలాంటి కారణాలను చూపరాదన్నారు. కుమారుడు మేజర్ అయ్యే వరకు ఈ భరణం చెల్లించాల్సిందేనన్నారు. 2013లో తమకు వివాహమైనప్పటి నుంచి కట్నం కోసం వేధిస్తూ, శారీరకంగా, మానసికంగా భర్త, అతడి కుటుంబం తన పట్ల క్రూరంగా వ్యహరించారని పిటిషన్ ఆరోపించారు. గర్భవతిగా ఉండగానే 2015లో తనను ఇంట్లోంచి గెంటి వేశారని, అప్పటి నుంచి కుమారుడితో కలిసి వేరుగా ఉంటున్నట్లు ఆమె తెలిపారు. కుటుంబ న్యాయస్థానం రాజీ కుదర్చడంతో 2015లో ఈ దంపతులు వేరు కాపురం పెట్టినా, కొద్ది నెలలపాటే కలిసి ఉన్నారు. అయితే, భర్త గృహ హింసకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు ఆమె చూపించ లేకపోయారంటూ ట్రయల్ కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఆ చిన్నారి తండ్రి నుంచి ఎటువంటి సాయం అందకుండానే తల్లి కస్టడీలో ఉంటున్నందున భరణం అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ విద్యావంతురాలైనందున ఆమెకు సాయం అవసరం లేదని కూడా పేర్కొంది. అయితే, తాజాగా విచారించిన సెషన్ జడ్జి.. పిటిషనర్ తన కుమారుడిని పోషించుకునేందుకు అవసరమైన మేర సంపాదిస్తున్నట్లు చూపించడంలో భర్త విఫలమయ్యారని తెలిపారు. విద్యావంతురాలైనందున భరణం అవసరం లేదన్న వాదనను కూడా ఆమె తోసిపుచ్చారు. దిగువ కోర్టు పలుమార్లు అవకాశమిచ్చినప్పటికీ పిటిషనర్ భర్త తన ఆదాయ ధ్రువీకరణ అఫిడవిట్‌ను సమర్పించలేకపోయిన విషయాన్ని జడ్జి ఎత్తి చూపారు. -
భార్య బడిత పూజకు భర్త బలి
ఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు నీలం కుష్వాహ తన భర్తను కర్రతో కొట్టి చంపింది. ఆపై ఎనిమిది గంటల పాటు మృతదేహం వద్దే కూర్చుంది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. నీలం గత నాలుగేళ్లుగా తన భర్త దీన్‌దయాల్ కుష్వాహకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది.జూన్ 1న దీన్‌దయాల్ మద్యం మత్తులో భార్య తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. దీన్‌దయాల్ బలవంతంగా తలుపులు తెరిచి.. తమ కొడుకును తలకిందులుగా వేలాడదీశాడని నీలం ఆరోపించింది. తన భర్త బిడ్డకు హాని తలపెడతాడేమోనని ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో ఆమె కర్రతో దీన్‌దయాల్‌పై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన దీన్‌దయాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నీలం దాదాపు ఎనిమిది గంటల పాటు భర్త మృతదేహం పక్కనే కూర్చుంది.ఆ తర్వాత స్థానిక గుడికి వెళ్లి.. దేవుడి ముందు 10 నిమిషాల పాటు కూర్చుని క్షమాపణలు వేడుకుంది. అక్కడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమె.. తానే తన భర్తను చంపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోని మంచంపై ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేధింపులు, దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని.. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బొల్లారంలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దుండగులను భర్త అడ్డుకున్నారు. దీంతో ఆయన భార్య మీనాను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేయగా.. భర్త అనిల్ కుమార్‌పై కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితులు కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్‌కు చెందిన దంపతులు బొల్లారంలో నివాసం ఉంటున్నారు. షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. -
ప్రియురాలి భర్త సడన్ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి..
వివాహేతర సంబంధాలు అనైతిక బంధాలుగా సమాజంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కొన్నిసార్లు నమ్మకాన్ని, కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సంబంధాల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు నిజాన్ని దాచేందుకు మోసం, తప్పించుకోవడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో భయంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక ఫిట్నెస్ ట్రైనర్–ఓ మహిళ మధ్య అల్లుకున్న ప్రేమ (అనైతిక) బంధం అనూహ్యంగా ముగిసింది. ఆ మహిళ భర్త అనుకోకుండా పనినుంచి ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. నమ్మకం అనే గోడలు కూలిపోతున్న ఆ క్షణంలో.. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. భయంతో అతను భవనం వెలుపల బాల్కనీ అంచున వేలాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్వేగభరిత క్షణాల ఒత్తిడిని తట్టుకోలేక చివరికి అదుపు తప్పి కిందకు జారిపోయి తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రేమ పేరుతో మొదలైన ఆ కథ, చివరికి నిశ్శబ్ద విషాదంగా ముగిసింది.. సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భవనం కిటికీ బయట వేలాడుతూ కనిపించడం, కొద్దిసేపటి తర్వాత కిందపడిపోవడం, ఆ సమయంలో రికార్డింగ్ చేస్తున్న కొందరు హాహాకారాలు చేయడం అందులో కనిపిస్తోంది. అతని పేరు "హువాంగ్ మావో". అతనొక చైనా జిమ్ ట్రైనర్. తన క్లయింట్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కిటికీ మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో 10 అంతస్తుల ఎత్తు నుంచి జారిపడి మృతి చెందాడని.. ఆ వైరల్ పోస్టుల సారాంశం. A forbidden love affair between a fitness trainer and a woman ended in tragedy. When the woman's husband returned home early from work, Huang Mao, who was hanging from a balcony outside the building, fell to his death. pic.twitter.com/Q4xjNfRD9J— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) May 28, 2026Fitness coach Huang Mao has an affair, the male homeowner returns,crouching on the window ledge he accidentally falls off the building, dying on the spot. pic.twitter.com/FiB0O3GUXv— Josh Blaq (@Josh_korn1) May 28, 2026 ప్రస్తుతం ఎక్స్, టిక్‌టాక్ తదితర వేదికల్లో వైరల్ అవుతూ ఈ స్టోరీ తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు దానిని ఏఐ వీడియో అంటే.. మరొకొందరు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేశారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహంతో ముందు వెనకా చూడకుండా ఆ ప్రచారాన్ని యధాతథంగా వార్తగా ఇచ్చేస్తున్నాయి. అయితే.. సాక్షి.కామ్ ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రయత్నించి అసలు విషయం రాబట్టగలింది. ఆ వీడియో మీద ప్రచారం అవుతున్న విషయంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. కిటీకి పట్టుకుని వేలాడి కింద పడిపోయిన ఆ ఘటన.. 2023 ఏప్రిల్‌లో చైనాలోని చెంగ్డూలో జరిగిన ఘటనది. వ్యక్తి మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా భవనం కిటికీ నుంచి వేలాడిన ఆ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునే క్రమంలోనే కింద పడిపోయాడు. పైగా అతడు జిమ్ ట్రైనర్ అని, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వైరల్ పోస్టుల్లో పేర్కొంటున్న "హువాంగ్ మావో" అనేది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదు. చైనా భాషలో "హువాంగ్ మావో" అంటే "పసుపు రంగు జుట్టు ఉన్న వ్యక్తి" అనే అర్థం. ఒకప్పుడు అలా జుట్టుకు రంగులు వేసే వ్యక్తుల కోసం ముద్దు పేరుగా సోషల్ మీడియాలో ఆ పదం వాడారు. ఇప్పుడు ఆ పేరునే వైరల్ వీడియోలో వాడేసి కట్టుకథ అల్లారు. సో.. వీడియో పాతదైనా, దానికి కొత్త కథను జోడించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని పరిశీలనలో తేలింది. జిమ్ ట్రైనర్, అక్రమ సంబంధం, భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం వంటి అంశాలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. -
భార్యను రూ. 50 వేలకు అమ్మేశాడు.. 10 రోజులు నరకం
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నూరేళ్లు తోడు ఉంటానని ప్రమాణం చేసిన కట్టుకున్న భర్తే 12 ఏళ్ల వివాహ బంధానికి తూట్లు పొడిచాడు. భార్యను స్నేహితులకు రూ. 50,000కు అమ్మేశాడు. పైగా ఏమీ తెలియనట్టు తన భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో పోలీసులే నివ్వెరపోయే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. సాధారణంగా మిస్సింగ్ ఫిర్యాదుగా మొదలై, ఉత్తర గుజరాత్‌లోని పాలన్పూర్ పోలీసులను నివ్వెరపర్చే మానవ అక్రమ రవాణా కేసును వెలికితీసేలా చేసింది. పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల ప్రారంభంలో భర్తే స్వయంగా పాలన్పూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ దర్యాప్తులో ఈ దిగ్భ్రాంతి కర విషయం వెలుగు చూసింది. డీఎస్పీ జిగ్నేష్ గమిత్ ప్రకారం, నిందితుడు నిఖేష్ తన భార్య పాలన్పూర్ నగరం నుండి అదృశ్యమైందని పేర్కొంటూ భర్త మే 11న ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదు చేసిన రెండు రోజులకే అతను కూడా అదృశ్యమయ్యాడు. అతను కనబడకపోవడంతో, అతని తండ్రి పాలన్పూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మరో అదృశ్య ఫిర్యాదును నమోదు చేశారు. ఈ వరుస ఫిర్యాదులు మరిన్ని అనుమానాలను రేకెత్తించడంతో దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు.ఆ తర్వాత భర్త ఆచూకీ గుర్తించి ఆరా తీశారు. అతను నేరాన్ని అంగీకరించాడు. అతడి సమాచారం ఆధారంగా భార్యను గుర్తించాయి.నిందితుడు భర్త . తన భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే స్నేహితులైన సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్ల సహాయంతో అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు.చివరకు నిందితుల చెర నుంచి బాధితురాలిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. తనను అమ్మేసిన తర్వాత ఒకచోట బంధించి, నిరంతరం లైంగిక దాడి చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అంతేకాకుండా, తన బంగారు ఆభరణాలను లాక్కొని అమ్మేశారని తెలిపింది. అలాగే, థరాడ్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన మరో ముగ్గిరికి ఆమెను రూ. 1.5 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్రధాన నిందితుడు నిఖేష్ పటేల్‌కు ఇదివరకే పెళ్లయిందని, ఇతర మహిళలను లోబరుచుకోవడం, కిడ్నాప్ చేయడం వంటి నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో మహిళను ఇంటికి తీసుకురావాలని చూస్తూ తనను హింసించేవాడని కూడా బాధితురాలు ఆరోపించింది. కేవలం ఈ కారణంతోనే, అతను తన స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడని పోలీసుల ముందు వాపోయింది. ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు -
భర్తను హత్య చేసిన భార్య
తగరపువలస: భర్తను భార్య హతమార్చిన ఘటన విశాఖ జిల్లా భీమిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వలందపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణి(26)కి వలందపేట రజక వీధికి చెందిన తాపీ మేస్త్రి బోర సూరితాత(35)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాగమణి నూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సూరితాత ఆమెను తరచూ నిలదీసేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి హతమార్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు..భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్ చేసింది.అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో తానే చున్నీని బిగించి సూరితాతను హతమార్చానని ఒప్పుకుంది. ఈ హత్యలో ఆమెకు ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
-
భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)
-
భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్, ఎందుకలా?
భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్తను కత్తితో పొడిచి చంపేసింది భార్య. ఈకోర్టును విచారించిన కింది కోర్టు ఆమెకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను తెలంగాణా హైకోర్టు రద్దు చేసి కేవలం రూ. 500 జరిమానాగా తగ్గిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలోకేసు నేపథ్యంకోర్టు రికార్డుల ప్రకారం.. భార్య పిల్లలు, పుట్టింట్లో ఉండగా భర్త తన పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని అత్తగారింటికి వచ్చాడు. ఇక్కడ దంపతుల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత బైటికెళ్లిపోయాడు. కాసేపటికి ఒంటిపై బట్టలు లేకుండా (దిగంబరంగా) తిరిగి వచ్చాడు. అంతేకాదు భార్యను, ఆమె కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడు. ఈ తీవ్ర ఘర్షణ మధ్యలో ఆగ్రహం తట్టుకోలేక ఆ మహిళ కత్తి తీసుకుని అతడిని పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.మొదట పోలీసులు ఈ కేసును ఐపీసీ సెక్షన్ 302 (IPC Section 302) కింద హత్యగా నమోదు చేశారు. అయితే, విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ఇది కావాలని అనుకుని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని తేల్చింది. చంపాలనే ఉద్దేశం ఆమెకు లేదని భావించి, దీనిని సెక్షన్ 304 పార్ట్-II కిందకు మార్చింది. దీని కింద ఆమెకు నాలుగేళ్ల కఠిన శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 300లోని 'ఎక్సెప్షన్ 4' (Exception 4 to Section 300 IPC) ను పరిగణనలోకి తీసుకుని ఆమె జైలు శిక్షను రద్దు చేసింది.ఎక్సెప్షన్ 4 అంటే ఏమిటి?ముందస్తు ప్రణాళిక లేకుండా, ఆవేశంలో, అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల ఒక వ్యక్తి మరణిస్తే.. అలాగే నిందితుడు ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందకుండా, క్రూరంగా లేదా అసాధారణంగా ప్రవర్తించకుండా ఉంటే, ఆ మరణాన్ని 'హత్య' (Murder) గా పరిగణించకూడదు. మహిళ పథకం ప్రకారం కాకుండా, ఆ క్షణంలో జరిగిన గొడవ వల్ల తీవ్ర ఆవేశంతో (Heat of passion) ఆ ఘర్షణలో అలా ప్రవర్తించిందని కోర్టు పేర్కొంది. కత్తితో పొడవడం వల్ల ప్రాణాలు పోతాయనే కనీస జ్ఞానం (Knowledge) ఆమెకు ఉంటుందని భావించి సెక్షన్ 304 పార్ట్-II కింద నేరాన్ని సమర్థించినప్పటికీ.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్ష విషయంలో మానవతా దృక్పథంతో ఉదారత చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది.జైలు శిక్ష పూర్తిగా ఎందుకు రద్దైంది?క్రింది కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షపై మహిళ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ సమయంలో ఘటన జరిగిన పరిస్థితులను, ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభను హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఆమెకు ఇకపై ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. క్రింది కోర్టు విధించిన రూ. 500 జరిమానాను ఆమె అప్పటికే చెల్లించి ఉండటంతో, కేవలం ఆ జరిమానానే శిక్షగా మార్చి ఆమెను విడుదల చేసింది.అంటే, గొడవలో హత్య చేయడం ఎల్లప్పుడూ క్షమించదగినదేనా? కానే కాదు... గొడవల్లో లేదా వాదనల్లో జరిగే ప్రతి హింసను భారతీయ చట్టం క్షమించదు. ఉద్దేశం, ప్రణాళిక, ఉపయోగించిన ఆయుధం యొక్క స్వభావం, దాడి తీవ్రత, నిందితుడు క్రూరంగా ప్రవర్తించాడా లేదా వంటి అంశాలను న్యాయస్థానాలు నిశితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ కోర్టుకు చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేదా ముందస్తు ఏర్పాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికితే.. అది ఐపీసీ సెక్షన్ 302 కింద 'హత్య'గానే పరిగణించబడుతుంది. దానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలు ఉంటాయి. -
భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త
సాక్షి, హైదరాబాద్: కవాడిగూడలో దారుణం జరిగింది. రత్నదీప్ నాలుగో అంతస్థులో నివసిస్తున్న భార్యను ఆమె భర్త అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు. భార్య చనిపోయిందని నిర్ణయించుకున్నాక అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్య ఎందుకు జరిగింది? భార్య, భర్త మధ్య ఏమైనా గొడవలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. -
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్‌కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్‌లో కాంతిలాల్‌కు తెలియకుండా దీపక్‌తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది. -
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
50 మందితో భర్త అక్రమ సంబంధం.. ఏకాంత వీడియోలు అడ్డుపెట్టుకొని..
-
ఏకాంత వీడియోలతో.. భర్త బ్లాక్ మెయిల్
సాక్షి, విజయవాడ: తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనని చంపడానికి యత్నిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళ.. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.‘‘నా భర్తను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాను. రెండేళ్లు నన్ను భాగానే చూసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది. వ్యాపారం పేరుతో నా దగ్గర 100 గ్రాముల బంగారం, రూ.60 లక్షలు బ్యాంకు లోన్లు, రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 50 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ..అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాతో ఉన్న వీడియోలు తీసుకుని కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మే 4 తేదీన నన్ను కొట్టాడు. నన్ను చంపుతానని బెదిరించాడు. ఆయనకు భయపడి నేను పారిపోయి వచ్చాను. నాకు నా భర్తతో ప్రాణహాని ఉంది. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను’’ ఆమె పేర్కొంది. -
మరో ‘బ్లూ డ్రమ్’ ఘోరం: భర్తతో కలిసి ప్రియుడిని..
థానే: అర్ధరాత్రి ఛాటింగులు, ప్రేమ సందేశాలతో మొదలైన ఓ ‘అక్రమ’ ప్రేమకథ చివరకు అత్యంత ఘోరమైన హత్యతో ముగిసింది. ప్రియుడు డబ్బులు ఇవ్వడం మానేశాడనే కోపంతో ఓ వివాహిత తన భర్త, ఇతరులతో కలిసి ప్రియుడిని కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కి, నిర్జన ప్రదేశంలో పడేసింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.ప్రేమ పేరిట వల.. ఆపై దారుణంథానే జిల్లాలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్ (26) డోంబివిలిలోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వసాయికి చెందిన వివాహిత మెహజబీన్ ఖాతున్ ఏక్రాన్ షేక్ (25)తో అతనికి 2021 నుండి వివాహేతర సంబంధం ఉంది. మొదట్లో వీరి వ్యవహారం బాగానే సాగింది. ఈ క్రమంలో మెహజబీన్ నుంచి తరచూ అర్బాజ్ నుండి భారీగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. అతను కూడా ప్రతి నెలా ఆమె బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపుతూ వచ్చాడు. అయితే ఇటీవలి కాలంలో అర్బాజ్ డబ్బులు ఇవ్వడం నిలిపివేయడంతో ఆమె అతనిపై కక్ష పెంచుకుంది. తన భర్త హసన్ షేక్, సోదరుడు తారిక్ షేక్, అతని స్నేహితుడు మొజ్జమ్ పఠాన్లతో కలిసి అర్బాజ్ హత్యకు ప్లాన్ చేసింది.డబ్బుల కోసం పిలిపించి హత్యఏప్రిల్ 3న ఆఫీస్ పనిమీద దాదర్ వెళ్లిన అర్బాజ్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని తండ్రి ముంబ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్బాజ్ కాల్ డేటా, మొబైల్ లొకేషన్‌ను పరిశీలించగా, అతను అదృశ్యమైన రోజు మెహజబీన్ లొకేషన్‌తో సరిపోలింది. అంతేకాకుండా అదృశ్యానికి ఒక రోజు ముందే అతను ఆమెకు రూ. 50,000 బదిలీ చేసినట్లు తేలింది. అనుమానంతో పోలీసులు మెహజబీన్‌ను అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు నిజం బయటపడింది. డబ్బుల కోసమే అతడిని వసాయిలోని తన నివాసానికి పిలిపించానని, అక్కడ అతని వద్ద ఏమీ లేకపోవడంతో తామంతా కలిసి అర్బాజ్ కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ పైపుతో తలపై తీవ్రంగా కొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది.పోలీసుల వేటహత్య అనంతరం నిందితులు అర్బాజ్ మృతదేహాన్ని ఒక డ్రమ్‌లో కుక్కి, వాలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య డ్రైనేజీ కాల్వలో పడేశారు. ఈ ఘోరానికి పాల్పడిన మెహజబీన్, ఆమె సోదరుడు తారిక్లను పోలీసులు మే ఏడున అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త హసన్, అతని స్నేహితుడు పఠాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కిడ్నాప్, హత్య, సాక్ష్యాధారాల నాశనం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్లో అర్ధరాత్రి భారీ విధ్వంసం -
బతికి ఉన్న భర్తకు రిప్ (RIP)..!
కర్ణాటక: నేటి డిజిటల్ యుగంలో కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. చిన్న కారణాలకే విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే మాదిరిగా ఓ భార్య.. భర్తను వదిలేసి అతని ఫోటో మీద రెస్ట్ ఇన్ పీస్ (ఆర్ఐపీ) అని రాసింది. వివరాలు.. 9 ఏళ్ల కిందట ఇక్కడి సాగానహళ్ళిలోని అనూజకు శిడ్లఘట్ట తాలూకా దొడ్డతేకనహళ్ళి కుమార్‌తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూజా పల్లెలో అత్తమామలను వదిలి బెంగళూరు దేవనహళ్ళిలో భర్తతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నారు. పుట్టింటికి వచ్చేసి పోస్టింగులు భర్త కారు డ్రైవర్ కాగా, భార్య విలాసవంత జీవనం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. కొన్నిరోజుల కిందట అనూజ భర్తను వదిలేసి పుట్టిల్లయిన సాగానహళ్ళికు వచ్చింది. భర్త ఫోను చేసి కాపురానికి రావాలన్నా అనూజ తిరస్కరించింది. పైగా సోషల్ మీడియాలో.. భర్త ఫోటో పెట్టి రిప్ అని రాసింది. దీంతో కోద్రిక్తుడైన కుమార్ బంధుమిత్రులతో వచ్చి భార్యను నిలదీశాడు. అనూజ, ఆమె అన్న కలిసి కారంపొడి చల్లి చితకబాదడంతో కుమార్, అతని బంధువుల గాయపడ్డారు. బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. -
దాన్ని మాత్రం వదలొద్దు భార్య వదిలేయడంతో భర్త సూసైడ్
-
భార్య రెండో పెళ్లి చిచ్చు.. భర్త ఆత్మహత్య!
హైదరాబాద్: తాను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొన్నేళ్ల కాపురం తర్వాత రెండో పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హయత్‌నగర్ పీఎస్ కోహెడ పరిధిలో చోటు చేసుకుంది. తమకు పుట్టిన బిడ్డను సైతం భార్య అమ్మేసి మరీ రెండో పెళ్లి చేసుకోవడంతోనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు భర్త గోవర్థన్ వెల్లడించాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని, తమకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆ వీడియోలో తెలిపాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆ బిడ్డను అమ్మేసి రెండో పెళ్లి చేసుకోవడాన్ని తాను భరించలేకపోతున్నానని, తనకు చావు తప్పితే మరొక మార్గం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చిన గోవర్థన్.. తనను మోసం చేసిన ఆమెను వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు విన్నవించాడు. తాను చనిపోతున్నందుకు క్షమించాలంటూ కుటుంబ సభ్యులను కోరాడు. దీనిపై గోవర్థన్ తల్లి మాట్లాడుతూ.. వారికి పెళ్లియిందనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, బాబు పుట్టిన విషయం కూడా తమకు చెప్పలేదని, ఇప్పుడు వీడియో ద్వారా మాత్రమే వారికి పెళ్లైన విషయం, బాబు పుట్టిన విషయం తెలిసిందన్నారు. -
భర్తను కత్తితో పొడిచిన భార్య.. జైలు శిక్షను రద్దు చేసిన హైకోర్టు.. తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే!
-
భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!
ఊటా (Utah)కు చెందిన రచయిత్రి కౌరీ రిచిన్స్ (Kouri Richins) కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్త ఎరిక్ రిచిన్స్‌ను విషమిచ్చి హత్య చేసిందన్న ఆరోపణలు దిగ్భ్రాంతి రేపాయి. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మే 13, 2026న కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమే ఈ హత్య చేసిందనేందుకు పూర్తి సాక్ష్యాలు లేవు. కానీ కోర్టు కొన్ని ఆధారాలు ఆర్థిక కారణాల ఆధారంగ ఈ తీర్పు చెప్పింది. మరోవైపు ముగ్గురు కొడుకులు తల్లి దగ్గరికి వెళ్లాలంటే భయపడుతుండటం ఈ కేసులో మరో కీలక అంశం. అసలు కేసు ఏంటి?2013లో కౌరీ, ఎరిక్ వివాహం చేసుకున్నారు. ఆ సమయానికి, వారికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే పెళ్లి రోజున వీరొక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆరేళ్ల తరువాత 2019లో కౌరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో లాభాలొచ్చినా, 2022 నాటికి ఆమె వ్యాపారం భారీ అప్పుల్లో మునిగిపోయిందని, ఆ అప్పులు తీర్చడానికి ఆమె భర్త అనుమతి లేకుండానే అతని ఖాతాల నుండి డబ్బు వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే 2020 నుంచే తన భార్య తన డబ్బును దుర్వినియోగం చేస్తోందని గ్రహించిన ఎరిక్, తన ఆస్తి తన పిల్లలకు చెందేలా 'ఎరిక్ రిచిన్స్ లివింగ్ ట్రస్ట్' అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన సోదరిని దానికి ట్రస్టీగా నియమించాడు. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఎరిక్ రిచిన్స్‌ను ఎందుకు చంపింది? (ఆరోపణలు మాత్రమే)2023 మే 8న సమ్మిట్ కౌంటీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే తరహా ఆరోపణలతో విచారణ జరిగిన వారం తర్వాత ఆమె అదే నేరాన్ని పునరావృతం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. భర్త పానీయంలో విషం కలిపి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌరీ తన భర్తను చంపడానికి ప్రధాన కారణం ఆర్థిక లాభం అని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.కౌరీ వ్యాపారం మిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. పెళ్లి సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎరిక్ చనిపోతే అతని కంపెనీ కౌరీకి చెందుతుంది. దీంతో ఎరిక్ పేరు మీదున్న భారీ భీమా సొమ్మును పొందేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లికోర్టు పత్రాల ప్రకారం, కౌరీ తన భర్తకు ఫెంటానిల్ (Fentanyl) అనే శక్తివంతమైన మాదకద్రవ్యాన్ని ఇచ్చి విషప్రయోగం చేసింది. 2022 వాలెంటైన్స్ డే రోజున ఆమె ఎరిక్ ఇచ్చిన శాండ్విచ్లో విషం కలిపింది. అది తిన్న తర్వాత ఎరిక్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతను అనారోగ్యంగా భావించి నిద్రపోయాడు తన భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తోందని అప్పట్లోనే ఎరిక్ తన స్నేహితుడితో చెప్పాడు. అయితే, ఆమె ఈ వాదనను ఖండించి, ఆ రోజు తాను కేవలం ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ చేశానని, కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పటికీ, మామూలే అనుకొని నిద్రపోయాడని కోర్టులో చెప్పింది.మార్చి 4, 2022న కౌరీ తన భర్తకు ఒక కాక్టెయిల్ తయారు చేసి ఇచ్చింది. అందులో భారీ మోతాదులో ఫెంటానిల్ కలిపింది. ఆ రాత్రి ఎరిక్ చనిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎరిక్ రక్తంలో సాధారణ మరణానికి కారణమయ్యే మోతాదు (3 ng/ml) కంటే ఐదు రెట్లు ఎక్కువగా అంటే 15 ng/ml ఫెంటానిల్ ఉన్నట్లు తేలింది. ఈ కేసులో విచారణలో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.నేను నిర్దోషినిఅయితే, కౌరీ ఇప్పటికీ తాను నిర్దోషినని వాదిస్తోంది. తాను చేయని నేరానికి నిందించవద్దని, తన ముగ్గురు పిల్లల కోసం తానీ పోరాటాన్ని కొనసాగిస్తానని కోర్టులో ప్రకటించింది. మరోవైపు, ఆమె ముగ్గురు కుమారులు తమ తల్లి జైలు నుండి బయటకు రావడం ఇష్టం లేదని, ఆమె వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. స్వయంగా రైటర్ అయిన కౌరీ భర్తను చంపి, ఆ తర్వాత అతని జ్ఞాపకార్థం 'Are You With Me?' అనే పుస్తకాన్ని కూడా కౌరీ రాయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. -
నడిరోడ్డుపై భార్యపై భర్త దాడి, కాపాడిన జనం, కానీ కోదాడలో
దేశంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాదాపు ఒకే సారి మహిళలపై జరిగిన హత్యా, హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలు నెట్టింట చర్చకు దారి తీసాయి. తెలంగాణ లో కోదాడలో జరిగిన ఘటనలో, మహిళ ప్రాణాలు కోల్పోగా, బెంగళూరులోని మదనాయకనహళ్లిలో పట్టపగలే నడిరోడ్డుపై మాజీ భార్యపై కత్తితో దాడిచేసిన ఘటనలో భార్య తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీంతో ప్రజలు ముఖ్యంగా స్పందించాల్సిన తీరుపై చర్చ జరుగుతోంది.ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బీహార్‌కు చెందిన 35 ఏళ్ల నిందితుడు సంజయ్, తన భార్య సోనాలి ఇంటి నుంచి బయటకు వస్తుండగా అడ్డగించాడు. అతను హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చి, గుర్తు తెలియని దుండగుడిలా నటిస్తూ సోనాలి మెడపై కత్తి పెట్టి దాడి చేయడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనను చూసిన ఒక యువకుడు వెంటనే జోక్యం చేసుకుని, సంజయ్‌ను అదుపులోకి తీసుకుని ఆ మహిళను రక్షించాడు. సోనాలి కేకలు విన్న స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై దాడి చేసి, అనంతరం అతడిని మదనాయకనహళ్లి పోలీసులకు అప్పగించారు.#Shocking incident in #Bengaluru.A man identified as Sanjay allegedly tried to #attack his ex-wife with a knife in the middle of the road. Alert youngsters overpowered him & rescued the woman. Madanayakanahalli Police are probing.@timesofindia pic.twitter.com/5rR4eo6sqa— TOI Bengaluru (@TOIBengaluru) May 7, 2026 గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం అని సమాచారం. సంజయ్‌కు మద్యపాన వ్యసనం అలవాటు కావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, తిరిగి కలవడానికి సోనాలి నిరాకరించడమే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు. కోదాడ కేసుతెలంగాణాలోని కోదాడ బస్టాండ్ దగ్గర జరిగిన అందరూ చూస్తుండగా భార్య శిరీషని కత్తితో పొడిచి చంపాడు భర్త మణిదీప్. ఈ రెండు ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయినాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని కొంతమంది అంటే, కానీ అప్రమత్తంగా ఉండాలి, మన ప్రాణాల మీదకు వస్తే ఎలా? అందుకే ముందుగా ఆయుధం చేతిలో ఉన్నవారి దృష్టిని మరలించి, కలిసికట్టుగా, చాక చక్యంగా ఎదుర్కోవాలని కొందరు సూచించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటనలు కొన్నైనా ధైర్యంగా నిలువరించే గలిగితే, ఇలాంటి ఘోరాలకు తెగబడరని అభప్రాయపడుతున్నారు. విభేదాలు ఎంత తీవ్రమైనవైనా, పరిష్కరించుకోవాలిగానీ, ఇలా హత్యలకు తెగబడకూదని హితవు పలుకుతున్నారు. ఇదీ చదవండి: క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా? -
ప్రియుడి మోజులో పడి.. రూ.12 లక్షలు ఇచ్చి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్ వేసింది.తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్‌ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
లావుగా ఉందని భార్యను చంపిన భర్త
-
దారుణం.. నలుగురు పిల్లలను, భార్యను చంపి.. ఆపై
హర్యానా: గురుగ్రామ్ వజీర్‌పూర్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో పాటు తన భార్యని చంపారు. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించగా ప్రాణాలతో బయిటపడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితేఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్‌కు ఓ వ్యక్తి కుటుంబం గత కొంతకాలంగా వజీర్‌పూర్‌లో నివాసం ఉంటుంది. ఇతను స్థానికంగా సెలూన్ నడుపుతాడు. అయితే శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో అతని సోదరుడు ఇంటికి వచ్చేసరికి కుటుంబ సభ్యులంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకెళ్లగా మహిళ మరియు నలుగురు పిల్లలు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో 35 ఏళ్ల భార్య, 14, 12, 10 ఏళ్ల వయస్సు గల ముగ్గురు కుమార్తెలు మరియు 8 ఏళ్ల కుమారుడు మృతిచెందారు. అయితే వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు తొలుతగా కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి అనంతరం కత్తితో తన మణికట్టును కోసుకున్నాడని తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులు జీవించడానికి ఇష్టపడలేదని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు.. విషం ఇచ్చారా లేక గొంతు నులిమి చంపారా అనేది దర్యాప్తులో తేలుతుందని, ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. -
భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త
-
దారి తప్పిన భార్య.. ముగ్గురితో వివాహేతర సంబంధం
-
రెండేళ్లుగా నరకం : పెళ్లంటేనే భయం భయ్యా, వైరల్ వీడియో
గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్‌టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయిఏం జరిగింది అంటే?ఒక వ్యక్తి తన భార్య చేతిలో దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్‌టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది. దీంతో హాట్ టాపిక్‌గా మారింది.నెటిజన్ల స్పందనఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు. అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్నోట్ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్‌తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి వ్యతిరేకంగా సంబంధిత చట్ట వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం. After being abused for the past two years bro recorded these clips on his laptop Think twice before getting married 🙏 pic.twitter.com/1AQLGWjooU— Vishal (@VishalMalvi_) April 23, 2026 -
అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
-
భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!
సాక్షి, నిజామాబాద్: భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్‌పై శ్రవణ్‌కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భార్యకు ఆస్తి ఉన్నా భర్త భరణం ఇవ్వాలా?
నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నా భార్య ఇంజినీరింగ్ చేసింది కానీ కావాలనే ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉంటోంది. ఇటీవల కొంతకాలంగా నా భార్య – ఆమె కుటుంబ సభ్యులతో నాకు తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఆమె నాపై కేసులు వేస్తానని, నా ఆస్తులను, డబ్బును తీసుకుంటానని హెచ్చరిస్తోంది. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో అలాంటిదేమైనా జరిగితే, నా ఆర్థిక వనరులను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. నా సంపాదన ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు, పీఎఫ్ రూపంలో దాచుకున్నాను. కొంత భూమి కూడా కొన్నాను. స్టాక్ పెట్టుబడులను భరణం/మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారా? ముందుగా నా తల్లితండ్రులకు నగదు, స్థిరాస్తులు అన్నీ బదిలీ చేస్తే సరిపోతుందని, వీలైతే జీతం కూడా వేరే అకౌంట్లోకి తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మిత్రులు చెప్తున్నారు. నిజానికి నా భార్యకి చాలా ఆస్తి ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళ నాన్న పేరిట ఉంది. తన తదనంతరం నా భార్యకేనని రిజిస్టర్డ్ వీలునామా కూడా ఉంది. అయినా నేను భరణం ఇవ్వాలా?– రఘురామ్, విజయవాడ ఆస్తులను/నగదును దాచిపెట్టే ఉద్దేశంతో చేసే ఏ విధమైన నిధుల బదిలీలు అయినా బ్యాంకింగ్ రికార్డుల ద్వారా సులభంగా గుర్తించబడతాయి. కోర్టులకు బ్యాంకులనుండి, కంపెనీల నుండి, ఇతర సంస్థల నుండి కూడా ఆర్థిక వివరాలను సమీకరించే అధికారాలు ఉన్నాయి. వివాహ సంబంధిత కేసుల్లో, కోర్టు సాధారణంగా వివాహం జరిగిన తేదీ నుండి మీ ఆదాయం, ఆస్తులు ఆర్థిక ప్రవర్తనను పరిశీలిస్తుంది. మెయింటెనెన్స్/భరణం కోరిన తేదీ నుండి గత మూడు సంవత్సరాల ఆర్థిక వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్, ఆస్తుల వివరాలు, ఖర్చులు, ఐటీ చరిత్ర మొదలగు అంశాలు వెలువరిస్తూ ఆస్తులు– అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. జీతాన్ని ఇతరుల ఖాతాలకు మళ్లించడం వంటి ప్రయత్నాలు వంటివి చేసినా, అనవసర ఆస్తి బదిలీ చేసినా, సులభంగా దొరికి΄ోతారు. అవి దురుద్దేశపూర్వక చర్యలుగా పరిగణించబడతాయి. పీఎఫ్, పీపీఎఫ్, ఫిక్స్డ్ డి΄ాజిట్లు, స్టాక్ పెట్టుబడులు వంటి అన్ని ఆర్థిక ఆస్తులను భరణం లేదా మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు. కోర్టు మీ నిజమైన ఆర్థిక స్థితి, సంపాదన సామర్థ్యాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆస్తులను దాచడం లేదా మాయ మాటలు చెప్పడం చట్టపరంగా ప్రమాదకరం, మీ కేసులో హానికరం. ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం కోర్టు ముందు మీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా, ఒక నిపుణుడైన కుటుంబ న్యాయవాదిని సంప్రదించి చట్టబద్ధమైన వ్యూహాన్ని రూపొందించాలి. మీపై మెయింటెనెన్స్ క్లెయిమ్ వస్తే, మీరు కింది అంశాల ఆధారంగా దాన్ని వ్యతిరేకించవచ్చు.మీ భార్య విద్యార్హతలు, ఉద్యోగం చేసే సామర్థ్యం ∙ఆమె సంపాదించగలగడం, ఉద్యోగం చేయాల్సిన అవసరం కావాలని ఉద్యోగం మానేయటం గురించిన వివరాలు మీ ఆర్థిక బాధ్యతలు, అప్పులు, మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టతతో, చట్టబద్ధంగా వ్యవహరించడం ద్వారా మీ ప్రయోజనాలను మెరుగ్గా రక్షించుకోవచ్చు. మైనర్ పిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు ఉంటే మాత్రం, మీరు ఎంత ప్రయత్నించినా కాస్తో కూస్తో తగ్గవచ్చు గానీ మెయింటెనెన్స్ మాత్రం కట్టాల్సిందే. -
భార్యకు భరణం భర్త నిరంతర బాధ్యత
న్యూఢిల్లీ: భార్యకు భర్త ఇచ్చే భరణం నామమాత్రంగా ఉండరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్‌ల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇరుపక్షాల సామాజిక హోదాకు, భర్త ఆర్థిక సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని పేర్కొంది. వివాహ బంధంలో ఉండగా భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించిందో, విడిపోయిన తర్వాతా అదే స్థాయి గౌరవంతో జీవించేలా భర్త భరణం చెల్లించాలని తెలిపింది. అదే సమయంలో, భరణాన్ని నిర్ణయించడంలో ఇరుపక్షాల అవసరాలను బేరీజు వేస్తూ సమతూకం పాటించాలని సూచించింది. ఒక మహిళకు ఇస్తున్న నెలవారీ వేతనం మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ జంటకు 2023 మే 7వ తేదీన హిందూ ఆచారం ప్రకారం వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులతో ఏడాదికే పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఆ దంపతులు వేరుగానే ఉంటున్నారు. తనకు ఎటువంటి ఆదాయ వనరులు లేనందున భరణం ఇప్పించాలంటూ ఆమె చంపావత్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, న్యాయస్థానం నెలకు రూ.8 వేలు భరణంగా నిర్ణయించింది. బాధితురాలు ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. ఆ న్యాయస్థానం రూ.15 వేలకు భరణం మొత్తాన్ని పెంచింది. ఆపైన బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా పైవిధంగా తీర్పు వచ్చింది. -
ఎవరి కోసం బతకాలె కొడుకా
కరీంనగర్ జిల్లా: అనారోగ్యంతో భర్త దూరమైనా ఒక్కగానొక్క కొడుకే సర్వస్వంగా భావిస్తూ ఆ తల్లి కూలీనాలీ చేసుకుంటూ పోషించుకుంది. భర్త దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే కొడుకు వెన్నెముక వ్యాధి బారిన పడ్డాడు. ఆపరేషన్‌కు రూ.లక్షలు అవసరం కాగా.. ఎలాగోలా సొమ్ము పోగు చేసుకుంది. ఇక కొడుక్కు ఏ బాధ లేదనుకున్న సమయంలో విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. సైకిల్‌పై వెళ్తున్న బాలుడు కింద పడడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆపరేషన్ చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శంషాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొనగా.. ఆ తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు.. స్థాని కుల కథనం ప్రకారం.. శంశాబాద్ గ్రామానికి చెందిన బాకారపు రాజేశ్వరి– కుమార్ దంపతుల కొడుకు అక్షిత్(11) ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా రాజేశ్వరీ కూలీ పనులు చేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది. అక్షిత్ కొద్ది నెలల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ఆపరేషన్‌కు రూ.16 లక్షలు అవసరం కాగా.. రూ.9లక్షలు పోగు చేశారు. ఇటీవల అక్షిత్ సైకిల్ నుంచి పడగా మెదడులో రక్తం గడ్డకట్టింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజులు అక్కడ చికిత్స పొందగా.. రక్తకణాలు పెరుగుతూ, తగ్గుతున్నాయని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం బాలుడు చనిపోయాడు. ‘నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ అంత్యక్రియల్లో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. సర్పంచ్ మెరుగు కళావతి సంపత్ రూ.3,016 ఆర్థికసాయం అందించారు. -
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
-
ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!
జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్ చెప్పకనే చెప్పేసింది. ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది. వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్‌కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. భర్త నో అన్నాడు. ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్‌కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్‌లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. View this post on Instagram A post shared by History Facts & Stories (@howhistorylooks) Crazy what having someone who won't give up on you can do for you. This is will forever be a beautiful story https://t.co/UH7Jzd0TEL— Bhuti Olishayayo Ikhekhe (@BantuMthabela_) April 11, 2026 -
నల్లగా ఉన్నాడని భర్తని ప్రియుడితో చంపించిన భార్య
-
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
క్రైమ్ థ్రిల్లర్‌లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారుప్రియుడు కమలేష్‌తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్‌తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా? -
మాజీ భార్యపై లైంగిక దాడి కేసు రద్దు కాదు: హైకోర్టు తీర్పు
బెంగళూరు: భార్య నుంచి విడిపోయాక, ఆమైపె బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే ఆ కేసును రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ దంపతులు 2019లో విడిపోయారు. 2021లో ఆమె ఇంటికి వచ్చిన మాజీ భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసులో ఆ మహిళే స్వయంగా వాదించారు. తనపై దౌర్జన్యం జరిగిందని, అతని పిటిషన్‌ను తిరస్కరించాలని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న కేసు మాఫీకి తిరస్కరించారు. -
అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త
సాక్షి,నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ఐదవ వీధిలో ఓ మహిళపై భర్త దారుణ హత్య జరిపిన ఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల జర్సీ అనే యువతిని ఆమె భర్త వంశీ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో అధిక కట్నం తేవాలని వాదనలతో భార్యపై వంశీ దాడి చేశాడు.అనంతరం సాయంత్రం సమయంలో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. -
హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు
సాక్షి, అమరావతి: హిందూమహిళకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని చెప్పింది. తన సోదరి శ్రీవిరిత మరణం నేపథ్యంలో ఆమెకు వారసత్వంగా తమ నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి తాలూకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయాలని కోరుతూ దేవిక మానస దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. ఆర్డీవో ఉత్తర్వులను రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టింది. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను రద్దుచేసింది. రికార్డుల్లో దేవిక మానస పేరు చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు. మనుమరాళ్లకు ఆస్తి ఇచ్చిన నాయనమ్మ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ తన మనుమరాలు (కుమారుడు దత్తాత్రేయ కుమార్తె) శ్రీవిరితకు 1.50 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్‌డీడ్ కింద ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో శ్రీవిరిత పేరు మీద మార్పులు చేశారు. 2005లో శ్రీవిరిత మరణించడంతో ఆ గిఫ్ట్‌డీడ్‌ను వెంకాయమ్మ 2007లో రద్దుచేశారు. ఆ భూమిని 2011లో మరో మనుమరాలు దేవిక మానసకు గిఫ్ట్‌డీడ్ ద్వారా ఇచ్చిన వెంకాయమ్మ 2012లో కన్నుమూశారు. అనంతరం ఆ 1.50 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తనపేరు చేర్చాలని దేవిక మానస తహసీల్దార్‌ను కోరారు. దీనికి శ్రీవిరిత భర్త బదిరెడ్డి నాగవీరవెంకట శ్రీరామదొర అభ్యంతరం తెలిపారు.ఆ భూమి తన భార్యదని, దానిపై తనకే హక్కులున్నాయని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ దేవిక మానస రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో.. తహసీల్దార్ ఉత్తర్వులను తప్పుబట్టి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని 2017లో ఆదేశించారు. దీనిపై శ్రీరామదొర జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందు రివిజన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2017లో ఆర్డీవో జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. ఒకసారి గిఫ్ట్‌డీడ్ ఇచ్చిన తరువాత దాన్ని రద్దుచేయడానికి వీల్లేదని, సివిల్ కోర్టు ద్వారా మాత్రమే ఆ డీడ్‌ను రద్దుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేయ లేదన్న కోపంతో, ఒక భర్త తన భార్యను నడుస్తున్న బైక్ మీద నుండి నెట్టివేశాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలోరికార్డైనాయి. నిందితుడు, భార్యతో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ పడ్డారు. అక్కడ పార్టీలో డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో భార్యపై ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. వేడుక ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా దారిలో ఆమెతో మళ్లీ గొడవకు దిగాడు. బైక్ వేగంగా వెళ్తుండగాగానే భర్త భార్యను కిందకు నెట్టివేశాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకుటుంబ సభ్యుల ఆరోపణలుఅయితే ఈఘటనపై మృతురాలి పుట్టింటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కోపంతో జరిగింది కాదనీ, పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆమెను హతమార్చారని వారు కన్నీరు పెట్టుకున్నారు.ఇదీ చదవండి: పింక్ ఏనుగు ఫోటోషూట్, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్ चलती बाइक से पति ने पत्नी को दिया धक्का, महिला की हुई मौत यूपी के रामपुर में पति-पत्नी एक बर्थडे पार्टी से लौट रहे थे. पार्टी में पत्नी ने डांस नहीं किया. इससे पति नाराज हो गया. इसी बात को लेकर दोनों के बीच रास्ते में कहासुनी शुरू हो गई, गुस्से में आकर पति ने चलती बाइक से पत्नी… pic.twitter.com/TDkcZ0wY03— Priya singh (@priyarajputlive) March 30, 2026 -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అక్కసుతో భర్తనే కడతేర్చింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లానికి మెహ్రాజ్. తాపీ పనిచేసేవాడు. ఇతని భార్య రూహి. తన సొంత సోదరి బావ ఫర్మాన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ జంట కలిసి జీవించాలని కోరుకున్నారు.దీనిని మెహ్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. మెహ్రాజ్ ఆహారంలో మత్తుమందు కలిపి, ఆ తర్వాత రాత్రి సమయంలో ఫర్మాన్, అతని స్నేహితుడు అద్నాన్‌లను ఇంటికి పిలిపించింది.అందరూ కలిసి మెహ్రాజ్ కాళ్లను తాడుతో కట్టివేసి, పదునైన కత్తితో అతని గొంతు కోసి హత్య చేశారు. ఆ ఘోరమైన కృత్యం చేసిన తర్వాత, రూహి తన భర్త శవం పక్కనే ఉన్న మంచం మీద రాత్రంతా నిద్రపోయింది. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ జరిగిందని కట్టుకథ అల్లింది.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మరుసటి రోజు ఉదయం మెహ్రాజ్ తండ్రి తన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, అతని చేతులు, కాళ్లు ఇంకా కట్టేసి ఉన్న స్థితిలో, వరండాలోని మంచం మీద పడి ఉండటాన్ని చూశాడు. దీంతో ఇదంతా దొంగల పని అని, ఎవరో దుండగులు వచ్చి తనపై దాడి చేశారని మొసలి కన్నీళ్లు కార్చింది. కానీ కోడలి మాటలపై అనుమానం వచ్చిన మెహ్రాజ్ తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది.పోలీసులు నిందితులైన రూహి, ఫర్మాన్ , అద్నాన్‌ను అరెస్ట్ చేశారు. హత్యకు పయోగించిన రెండు కత్తులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ జైలుకు పంపారు, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి : ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం -
భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
యూట్యూబర్ వైష్ణవి భర్తకు తీవ్ర అస్వస్థత
-
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. -
లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
సాక్షి, హైదరాబాద్: వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడీ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష.. వివిధ ఆసుపత్రులలో వైద్యరాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుంటోంది. ఆమెకు సహకరిస్తున్న భర్త ఎడులపల్లి సాయి కుమార్‌ను కూడా సికిందరాబాద్ జోన్ టాస్క్ఫోర్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ (Apron) ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్' (Diazepam) అనే మత్తు ఇంజక్షన్‌ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది.గత మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్‌కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి సుమారు 11 తులాల బంగారం, మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్ శ్రీరాం శ్రీనివాస్ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ఫోన్లోనే వీడియో తీశాడు. ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 108 బీఎన్ఎస్ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కృష్ణవేణి మరణం వెనుక దారుణాలు!
వైఎస్ఆర్ కడప జిల్లా: నందలూరు రైల్వేలోకోపైలెట్ శ్రీరామ్ శ్రీనివాస్ రెండో భార్య కృష్ణవేణి మరణం వెనుక అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణవేణి ఆత్మహత్య చేసుకున్న రాత్రంతా మద్యం సేవించి ఇంటిలోనే ఉన్నట్లు, గురువారం అటు పోలీసులకు, ఇటు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియజేశాడు.శ్రీరామ్ శ్రీనివాస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు అమ్మ చచ్చిపోయింది అని కిటికీలోంచి ఉరి వేసుకున్న కృష్ణవేణిని చూపించినట్లు తెలిసింది. అనంతరం పిల్లలకు భోజనాలు పెట్టి, తను మద్యం సేవించి, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లోనే పిల్లలతోనే భర్త ఉండిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణవేణి వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమయ్యాడని బంధువులు ఆరోపించారు.పది సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఆరుసంవత్సరాల కిందట మృతురాలిని వివాహం చేసుకున్నాడు. కాగా శ్రీనివాస్ మరో అమ్మాయి ప్రేమలో పడి భార్యకు చిత్రహింసలు పెడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోభార్యతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. కాల్చి వాత పెడుతున్నట్లు, ఆ గాయాలను పుట్టింటి వారికి చూపించి బాధపడేదని బంధువులు చెబుతున్నారు. మృతురాలి వంటిపై గాయాలు కూడా ఉన్నట్లుగా సంబంధీకులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు నాగరాజు మీడియా ఎదుట ఆరోపణలు చేస్తూ శ్రీరామ్ శ్రీనివాస్‌కు తగిన శిక్ష వేసి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. -
భార్య వేధింపులకు మరో భర్త బలి
-
బీమా డబ్బుల కోసం భర్త హత్య
ఖమ్మం రూరల్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు కథనం ప్రకారం.. ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి (55) పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కాగా, రవిపై ఇన్సూరెన్స్ చేయించి, బీమా డబ్బులు కాజేయాలని భార్య ప్రశాంతితో పాటు మరో నలుగురు కలిసి ప్లాన్ చేశారు. ప్రశాంతికి వరుసకు సోదరుడైన దేశబోయిన శ్రీనివాస్‌తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేశ్, జోగి రాంబాబు కలిసి రవి పేరున రూ.66 లక్షలకు బీమా చేయించారు. సమయం చూసి అతడిని హతమార్చి ఆ సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి దేశబోయిన శ్రీనివాస్.. రవి ఇంటికి వచ్చి మద్యం తాగుదామంటూ తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగాక ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లి గ్రామ శివారులో రవిని దింపి శ్రీనివాస్ వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ముందస్తు ప్లాన్ ప్రకారం జోగి వెంకటేశ్‌కు చెందిన కారును రాజ్‌కుమార్ వేగంగా నడుపుతూ వచ్చి రవిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత భార్య ప్రశాంతి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులకు అనుమానం వచ్చి.. విచారించగా నిందితులు అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. ‘సుప్రీం’లో భర్త వాదనలు హాట్ టాపిక్!
ఢిల్లీ: యువర్ హానర్. నేను కార్మికుడిని. నా జీతం నెలకు రూ.9వేలు. అలాంటిది భరణం కింద నా భార్యకు నెలకు రూ.12వేలు ఎలా ఇవ్వాలి. మీరే నాకు న్యాయం చేయాలి అంటూ ఓ భర్త సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే, భర్త వాదనలపై ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకేసులో భార్య, భర్తకు కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భరణం కింద భర్త.. భార్యకు రూ.6 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.నా భర్త నుంచి విడాకులు కోరుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చే భరణం సరిపోదు. పోషణ నిమిత్తం జీవితాంతం నెలకు రూ.12,000 భరణంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు శాతం, ఆరు శాతం పెంచాలి. లేదంటే ఒకేసారి రూ.30 లక్షలు చెల్లించాలి’ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం భర్త వాదనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఇంత తక్కువ వేతనం పొందడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది. కనీస వేతనానికి తగ్గకుండా చెల్లించే పరిస్థితి ఉండగా.. ఒక సంస్థ ఇంత తక్కువ వేతనం ఇస్తుందా అని ప్రశ్నించింది. భర్త తరఫు న్యాయవాది జార్జ్ పోథన్,తన క్లయింట్ నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడిస్తున్నాడని, దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని వాదించారు. బెంచ్ ఆ వాదనను ఖండించింది. భర్తకు భరణం చెల్లించే స్థోమత లేకపోతే భార్యను తనతో ఉంచుకుని, ఆమెకు వంట చేసి కుటుంబాన్ని చూసుకోవాలని హితువు పలికింది. అందుకు స్పందించిన భర్త.. భార్య తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిందని వాపోయారు. భర్త వ్యాఖ్యలపై జస్టిస్ మెహతా కఠినంగా స్పందించారు. భార్యకు పోషణ ఖర్చు ఇవ్వడం భర్త బాధ్యత. అవసరమైతే అప్పు చేయాలి. సహాయం తీసుకుని బాధ్యతను నెరవేర్చాలని స్పష్టం చేశారు. తన సంస్థ తనకు అంతే జీతం ఇస్తుందని భర్త చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసననం పరిశీలిస్తుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాలపై తమకు స్పష్టత ఇవ్వాలని సదరు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. -
పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో
ప్రస్తుత సమాజంలో భార్యను భర్త, భర్తను భార్య నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం పరిపాటిగా మారిపోయింది. స్వల్ప విషయాలకు , చట్టపరంగా తేల్చుకోవాల్సిన విషయాలకు మనుషుల ఉసురు తీయడం సునాయాసంగా జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అలాంటి దారుణం ఒకటి వెలుగు చేసింది.పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే అతిదారుణంగా ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపేశాడు. బుధవారం మధ్యాహ్నం మీరట్-ముజఫర్‌నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో ఉన్న సందడిగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా గుర్తించారు.In a chilling daylight killing in Meerut's Ramraj market, Pradeep Dhiman allegedly shot dead Sunil Gaba — his wife Poonam's lover — with multiple bullets (reports cite 3 shots from different bores: .12, .32 & .315) yesterday. Poonam had eloped with Gaba ~1.5 years ago, leaving… pic.twitter.com/AkhR2gKCSo— Megh Updates 🚨™ (@MeghUpdates) February 26, 2026 ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాంరాజ్లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్‌సైకిల్‌పై మార్కెట్ గుండా వెళుతుండగా దాడి జరిగింది వెనుక నుండి వచ్చిన ప్రదీప్, నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు , విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు .ఇదీ చదవండి: ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది.అప్పటినుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్, సుధీర్ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రదీప్ ఈ హత్యకి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్ట్స్ టార్గెట్ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు.బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీప్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. -
తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?
2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్ర సర్కారు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా నమోదైనాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్‌గా మారింది.పెద్ద నోట్లు రద్దైన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్త నుండి దాచిన రూ.500, రూ.1,000 నోట్లను తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను (@ayushidixit) అనే వినియోగదారు షేర్ చేశారు. దీని ప్రకారం.. పాతనోట్లను గుర్తించిన తరువాత అమ్మ తీవ్ర ఆందోళనకు లోనైంది. కంటతడి పెడుతోంది. నాన్నకు తెలియకుండా వీటిని దాచింది. ఇపుడు వీటిని బ్యాంకులు అంగీకరిస్తాయా, లేదా? అంటూ తన ఫాలోయర్స్‌ను ఉద్దేశించి అడగడాన్ని ఈ వీడియో క్లిప్‌లో చూడవచ్చు. View this post on Instagram A post shared by AD🧿 (@ayushidixit___)ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్తనెటిజన్లు ఏమన్నారంటేవైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్ కూడా రికార్డ్ చేయండి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమో అని మరికొందరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్‌లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్ -
ఆమె బీకాం కంప్యూటర్స్ .. అతనో అడ్వకేట్..!
సిరిసిల్ల: బిచ్చగాడు సినిమాలో తల్లి బాగుండాలనే తపనతో తనయుడు కోటీశ్వరుడైనా.. ఒప్పందం మేరకు వీధుల్లో భిక్షాటన చేస్తాడు. అనేక ఇబ్బందులు పడుతాడు. చివరికి కథ సుఖాంతమవుతుంది. అచ్చం ఇలాగే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆది భిక్షువు నెలవైన వేములవాడ రాజన్న, భీమన్న సన్నిధిలో జరిగింది ఓ సంఘటన.. అతనో అడ్వకేట్.. ఆమె బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్. ఇద్దరూ భార్యాభర్తలు. కానీ అతను అడ్వకేట్‌గా కరీంనగర్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఆమె ప్రైవేటు ఉద్యోగం చేసేది. కానీ ఆమెను అనారోగ్యం వెంటాడింది. వైద్యం చేయించుకునేందుకు అనేక ఆస్పత్రులు తిరిగారు. కానీ, ఎంతకూ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో మూడు నెలలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 19 ఏళ్లుగా కలిసి ప్రయాణం..అతడి పేరు కాసర్ల జలందర్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జలందర్‌రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన శిరీషతో 2006లో పెళ్లి జరిగింది. పెద్దలు కుదుర్చిన పెళ్లి. వారికి పిల్లలు లేరు. కరీంనగర్లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ.. జలందర్‌రెడ్డి, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ.. శిరీష దంపతులు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. శిరీష అనారోగ్యం బారిన పడగా.. ఆమె వైద్యం కోసం అత్తగారు కట్నంగా ఇచ్చిన ప్లాటును అమ్మేసి వైద్యానికి ఖర్చు చేశారు. అయినా ఆమెకు నయం కాలేదు. పెద్దగా ఆస్తులు లేని ఆ దంపతులు సర్కారు వైద్యాన్ని నమ్ముకున్నారు. కానీ, శిరీష కోలుకోలేదు. దీంతో వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే ఆమె కోలుకుంటుందనే నమ్మకంతో సదరు దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.అన్యోన్యతకు మారుపేరుచిన్న చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందులను అధిగవిుస్తూ.. భిక్షాటన చేస్తూ, దేవుడి సన్నిధిలో భుక్తిసాధిస్తున్నారు. ఆమెను వదలించుకుని వెళ్లడం జలంధర్‌రెడ్డికి పెద్ద విషయం కాదు. కానీ, పెళ్లితో ముడిపడిన ఆ బంధాన్ని కాదనలేక ఆత్మీయంగా ఉంటూ అన్యోన్యమైన దాంపత్యజీవితాన్ని సాగిస్తున్నారు. కష్టాలు ఎన్ని ఎదురైనా ఎదురిస్తూ.. జీవన యానం సాగిస్తున్నారు.అనర్గళ ఇంగ్లిష్‌కు అవాక్కయిన అధికారులురాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఏఎస్పీ చంద్రయ్య వేములవాడలోని భిక్షగాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ పునరావాస చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జలంధర్‌రెడ్డి, శిరీష దంపతులు అనర్గళమైన ఇంగ్లిష్ వాగ్ధాటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. వారి నేపథ్యం తెలుకున్నారు. దీంతో ఆ దంపతుల జీవన శైలి వెలుగులోకి వచ్చింది. నాకు పెద్దగా ఆస్తులేమీ లేవునాకు పెద్దగా ఆస్తులు లేవు. అద్దె ఇంట్లో ఉంటూ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసేవాడిని. మా ఆవిడ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయాను. చివరికి దేవుడే దిక్కని ఇక్కడికి వచ్చి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నా. నాకు ‘సాక్షి’ పేపర్ అంటే ఇష్టం. నిత్యం చదువుతాను. చదువుకున్న నేను భిక్షగాళ్ల మధ్యలో ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ తప్పదు కదా.– కాసర్ల జలంధర్‌రెడ్డి, అడ్వకేట్పోలియో ఉన్నా పెన్షన్ ఇవ్వడం లేదునాకు 60 శాతం పోలియో ఉంది. సదరం శిబిరం ఎప్పుడు ఉంటుందో తెలియదు. నాకు రేషన్, ఆధార్ కార్డు ఉంది. కానీ, సదరం సర్టిఫికెట్ లేదు. దీంతో నాకు పెన్షన్ కూడా రావడం లేదు. ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకుంటే కొంతైనా మాకు సాయం చేసినట్లు అవుతుంది. భిక్షాటనతోనే జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం ఆదుకుంటే మరో ఉపాధి మార్గం వెతుక్కుంటాం. – కాసర్ల శిరీష, దివ్యాంగురాలు -
భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త
రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు. అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
భార్యను హత్యచేసి నగలు ఎత్తుకెళ్లిన భర్త
చేగుంట (తూప్రాన్): ఇల్లరికం వచ్చిన భర్త భార్యను హత్యచేసి నగలను ఎత్తుకెళ్లాడు.ఈ సంఘటన మండల కేంద్రమైన చేగుంట స్టేషన్ రోడ్డులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన ఉప్పరి వరలక్ష్మి(35)కి, ఏపీ నెల్లూరుకు చెందిన త్రిమూర్తులుతో 2015లో వివాహమైంది. త్రిమూర్తులు చేగుంటకు ఇల్లరికం వచ్చి జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో వరలక్ష్మిని పారతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పుస్తెలతాడు, నగలు, డబ్బులు, సెల్‌ఫోన్ తీసుకొని పారిపోయాడు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతురాలి బావ సాయిబాబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చేవెళ్లలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..
-
Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..
-
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
-
దారుణానికి ఒడిగట్టిన ఇస్రో మాజీ సైంటిస్ట్
బెంగళూరు: డిప్రెషన్. ఈ డిప్రెషన్లో తాను మరణిస్తే.. తన భార్య ఒంటరైపోతుందని, ఆమెను చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో తువ్వాలతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే అవలహಳ್ಳಿ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. సంధ్య శ్రీ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించబడింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి, అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మా ఆయనకు చాలా మంది అమ్మాయిలతో..
బనశంకరి(బెంగళూరు): విదేశాల్లో కూర్చుని యువతులకు గాలం వేస్తున్న భర్త బండారాన్ని భార్యనే రట్టు చేసింది. భర్త కామకలాపాలపై మంగళూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మనీశ్ అనే వ్యక్తి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి వివాహం చేసుకున్నాడు. డబ్బులేదని వివాహానికి ముందు ఆత్మహత్య నాటకమాడాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులే పెళ్లి ఖర్చులు భరించారు. ఉద్యోగం కోసం భార్యనే రూ.2 లక్షలు ఇచ్చింది. దుబాయ్ వెళ్లిన అతను బహరాన్లో మరో మహిళతో ప్రేమకలాపాలు సాగించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతని వ్యవహారంపై నిఘా పెట్టగా వివాహానికి ముందు అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకుంది. వారి వద్ద కూడా అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగిట్లు తేలింది. టిక్‌టాక్‌తో యువతులకు గాలం వేసే మనీశ్నుంచి ఎవరూ మోసపోవద్దని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
లవ్ &రిలేషన్ షిప్ కి ఉన్న తేడా అదే..! ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే...
-
భార్య ఎఫైర్.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..
బ్రెజిల్లో ఇటుంబియారాలో దారుణం జరిగింది. భార్య అక్రమ సంబంధం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే, భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టాడు.ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను సైతం నియమించి పకడ్బందీగా ప్లాన్ చేశాడు.. భార్య తన ప్రియుడిని కలిసినప్పుడు వీడియో ఆధారాలు కూడా సంపాదించాడు. అక్రమసంబంధం నిజమేనని నిర్థారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ దారుణానికి కొన్ని గంటల ముందు ఆ వ్యక్తి.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, "దేవుడు నా పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక, నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు" అనే క్యాప్షన్‌ను రాశారు. చూడముచ్చటగా ఉన్న వీరి ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్‌గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి,.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. -
సోషల్ మీడియా సెలబ్రిటీ రేష్మా ఆత్మహత్య!
బెంగుళూరు: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే విడాకులు అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్‌స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి. View this post on Instagram A post shared by Real Time Malayali (@realtime_malayali) -
రెండోసారి ప్రెగ్నెన్సీ.. నటి పూర్ణ బేబీ బంప్ (ఫొటోలు)
-
భర్తను చితకబాదేసిన భార్య, వైరల్ వీడియో
భర్తపై భార్య దారుణంగా దాడిచేసిన వీడియో ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పటికీ ,అతనిపై హింసకు పాల్పడిన వైనం నెట్టింట భర్తలపై భార్యల హింసగురించి చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం, సీసీ కెమెరాలో బాధితుడ్ని కొడుతున్న దృశ్యలు నమోదయ్యాయి. తన భార్య నిర్వాకాన్ని రికార్డు చేసేందుకు,ఆధారాలు సేకరించడానికి బాధితుడు తన భార్యపై గదిలో రహస్య కెమెరాను అమర్చాడట. ఈ వీడియోను క్లిప్‌లో, ఆ మహిళ ఆ వ్యక్తిని మంచంపైకి విసిరి, అతనిపైకి ఎగిరి దూకి, రెండు చేతులతోనూ పిడి గుద్దుల వర్షం కురిపించింది. ఇంతలో మహిళ గదిలోకి వెళ్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న మరో వ్యక్తి కూడా గదిలోకి వెళ్లాడు. అయినా బాధితుడిపై దాడి కొనసాగుతూనే ఉంది.దీంతో నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భార్యల వేధింపులు తాళలేక తనువు చాలించిన అతుల్ సుభాష్,మానవ్ శర్మ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు. 2025లో ఏప్రిల్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడిది, బాధితుడు ఎవరు? అనే వివరాలపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?నెటిజనుల స్పందనఆమెపై కేసు నమోదు చేయాలని కొంతమంది కోరగా, గృహ హింస నుండి పురుషులను రక్షించడానికి, అలాంటి మహిళలను శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవని వాపోయారు. అదే పురుషుడు మహిళపై దాడిచేస్తే పదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.పేలవమైన చట్టాలు, అవినీతి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ బాధితుడిగా మారుతున్న ప్రతి పురుషుడికి మనం అధికారం ఇవ్వాలి.అలాగే ప్రతి పురుషుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్న ఇలాంటి మహిళలకు గుణపాఠం నేర్పాలి. వేధింపులకు గురవుతున్న వివాహిత పురుషుడు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి. అంతకానీ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు అని ఒక నెటిజన్ కోరడం గమనార్హం.అయితే వీడియో రికార్డు చేస్తున్నాడు కాబట్టి అతను కావాలనే ప్రతిఘటించడం లేదని కమెంట్ కూడా కనిపించింది. ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?Video source @mishrag47 . There is no domestic violence laws to protect men, no laws to severely punish such women. If man raise his hands on women simp men at once oppose him. #MenToo #GenderBiasedlaws #RejectWaqfBill #WaqfAmendmentBill #MuskanRastogi #IPL2025 #ToxicFeminism pic.twitter.com/KFoR0Ikf1Z— Saurabh Bahuguna46 (@bahuguna46) April 2, 2025 -
తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లి.. రెండు నెలలకే.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!
బరేలీ: తొమ్మిదేళ్ల ప్రేమ.. తర్వాత పెళ్లి.. రెండు నెలలకే విషాదంగా మిగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జితేంద్ర కుమార్ యాదవ్(33) తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం కలకలం రేపింది. మొదట ఆత్మహత్యగా అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. జితేంద్రను భార్య జ్యోతి గొంతు నులిమి చంపినట్లు తేలిపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా సహకరించారు. ఆ సమయంలో వారు అతడిని గట్టిగా పట్టుకోగా.. జ్యోతి గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.అసలేం ఏం జరిగిందంటే..మృతుడు జితేంద్ర, జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది వారాలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేసి ఆన్లైన్ జూదంలో పోగొట్టడమే వారి మధ్య వివాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. జనవరి 26న ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఆ సమయంలో జ్యోతి తన తండ్రి కాళీచరణ్, తల్లి చమేలి, సోదరుడు దీపక్‌లను ఇంటికి పిలిచింది.కాళ్లు, చేతులు కదలకుండా..వారందరూ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతని గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం తమ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, జితేంద్ర సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అది ఉరి వల్ల జరిగిన మరణం కాదని.. గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆర్థిక వివాదాలు కారణంగానే హత్యకు ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది. -
గల్లా మాధవి భర్త అంబటి హత్యకు కుట్ర! బయటపడ్డ వీడియో
-
పీటీ ఉష భర్త హఠాన్మరణం
రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(63) గుండెపోటుతో కన్నుమూశారు.గురువారం అర్ధరాత్రి దాటాక.. 12.30 గంటల ప్రాంతంలో తిక్కోడి పెరుమాళ్‌పురంలోని నివాసంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను పెరుమాళ్‌పురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉష ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణంతో ఆమె హుటాహుటిన కేరళ బయల్దేరారు. శ్రీనివాసన్ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force)లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పరుగుల రాణి, పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా పేర్లున్న పీటీ ఉష.. 1991లో దగ్గరి బంధువైన శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఉజ్జ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతి గురించి సమాచారం అందిన ప్రధాని నరేంద్ర మోదీ పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. శ్రీనివాసన్ మృతికి సంతాపం తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సైతం ఉష కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)
-
మొన్ననే పెళ్లి, తగాదా..నాలుక కొరికేసింది, తీవ్ర ఘర్షణ!
సంతోషంగా ‘‘నాకు నువ్వు, నీకు నేను’’ అన్నట్టుగా చాలా సరదాగా గడిపే జంటను చూస్తే నవ దంపతుల్లా ఎంత హాయిగా ఉన్నారు అనుకుంటాం. కదా. కానీ పెళ్లయ్యి ఏడాది కూడా అవ్వకుండా దంపతుల మధ్య వంట విషయంలో వచ్చిన స్వల్ప వివాదం, మాటల యుద్ధంగా, ఆ తరువాత తీవ్ర ఘర్షణగా మారిన ఘటన భర్త ఆస్పత్రి పాలైన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విషయం ఏమిటంటే..గత ఏడాది మే 6న విపిన్, ఇషా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సోమవారం సాయంత్రం వంట విషయంలో చిన్న తగాదా మొదలయ్యింది. మాటా మాటా పెరిగి చినికి చినికి గాలివానలా మంగళవారం తెల్లవారిందాకా సాగింది. అది కాస్తా భౌతికరూపం దాల్చింది. తీవ్ర ఆగ్రహంతో భర్త నాలుకను కొరికిపారేసింది. దీని తాలూకు పరిణామాలు మరో ఘర్షణకు దారితీశాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఇషా కుటుంబ సభ్యులు ఆమె అత్తమామల ఇంటికి వెళ్లారు. దీంతో రెండు కుటుంబాల మధ్య మరో పోరుకు తెరలేపింది. ఆడా, మగా ఇరు వర్గాలూ గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జోక్యంచేసుకుని, సంబంధిత వ్యక్తులందరినీ విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మోదినగర్లోని, సంజయ్ పూరిలో జరిగింది.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మోదినగర్) అమిత్ సక్సేనా అందించిన సమాచారం ప్రకారం ఈ గొడవ, హింసకు మూలం భార్యభర్తల కలహమే అని తేలింది. భార్య ఆగ్రహం భర్తవిపిన్ను ఆస్పత్రి పాలు చేసింది. అతనికి తీవ్ర గాయాలయ్యాయని, తొలుత ఘజియాబాద్‌లోని ఒ ఆసుపత్రిలో చేర్పించి, తదుపరి చికిత్స కోసం మీరట్‌లోని ఒక ప్రత్యేక హాస్పిటల్‌కు తరలించారు. వీరి వైవాహిక జీవితంలో కలహాలకు దారితీసిన అంతర్లీన కారణాల గురించి ఆరా తీస్తున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోరబండ మర్డర్ కేస్.. భార్యను చంపి వాట్సాప్ లో స్టేటస్
-
అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ప్రసన్న అనే వివాహిత తన భర్త సుధీర్‌రెడ్డిని చంపింది. చున్నీతో గొంతు నులిమి చంపినట్లు పోలీసుల ఎదుట ప్రసన్న అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్త
-
‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటా’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కలకలం రేపింది. సార్… నేను నా భార్యను గొంతు నులిమి చంపేశా. ఆమె శరీరం ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది” అని చెప్పాడు.భార్యను హత్య చేసిన తర్వాత సచిన్ నాలుగు గంటల పాటు నగరంలో తిరిగాడు.. పారిపోవాలనుకున్నాడు. చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి అతని భార్య శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫతేహ్పూర్ జిల్లా మోహన్పూర్ గ్రామానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. మొదట సూరత్‌లో నివసిస్తూ సచిన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. నెలరోజుల తర్వాత కాన్పూర్‌కి వచ్చి గది అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై సచిన్‌కు అనుమానం కలిగింది. శ్వేత ఖాతాలో తరచూ డబ్బు జమ అవుతుండటంపై సచిన్ నిలదీశాడు. ఆమె తన అమ్మమ్మ పంపిందని చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకులపై కూడా భర్తకు అనుమానం కలిగింది.భార్య ప్రవర్తనపై నిగ్గు తేల్చడానికి సచిన్.. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని.. ఇంటికి రానంటూ భార్యకు తెలిపాడు. కానీ తిరిగి వచ్చి గది తలుపు తెరిచి ఉండగా, భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. స్థానికులు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయడంతో పోలీసులు వారిని స్టేషన్‌కి తీసుకెళ్లారు. దంపతులను పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్‌కు భార్యతో గొడవ మరింత ముదిరింది. ‘‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటాను” అంటూ శ్వేత బెదిరించిందని సచిన్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. “మేము ఒకరికి ఒకరం మాత్రమే ఉన్నాం. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అందుకే పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాను” అని చెప్పాడు. శ్వేత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు. -
బూతు దంపతుల బాగోతం.. భార్యను పడుకోబెట్టి భర్త వీడియోలు
-
భర్త ఆశయం కోసం అక్షయపాత్ర పట్టిన ఇల్లాలు
విశాఖపట్నం: తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సందడి అంటేనే హరినామ స్మరణ. నెల రోజుల పాటు సాగే ఈ ధనుర్మాస ఉత్సవాల్లో అక్షయపాత్రను నెత్తిన మోస్తూ, చిడతల సవ్వడితో, తంబురా మీటుతూ వచ్చే హరిదాసులను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. తరతరాలుగా పురుషులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఈ పవిత్ర వృత్తిలో, విధి ఆడిన వింత నాటకంలో ఒక సామాన్య మహిళ ‘హరిదాసి’గా మారి అరుదైన బాటను ఎంచుకుంది.. విశాఖకి చెందిన కందుల నాగమణి. భర్త మరణానంతరం ఆయన వదిలివెళ్లిన భక్తి వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ఆమె చేస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. భక్తి సామ్రాజ్యంలో ... సాధారణంగా హరిదాసులంటే కాషాయ వస్త్రాలు, నుదుట తిరునామాలు, తలపై అక్షయపాత్రతో కనిపిస్తారు. ఇది పురందరదాసు, కనకదాసుల కాలం నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయం. హరిదాసుల గానామృతం కేవలం ఆధ్యాతి్మక చింతననే కాకుండా, సామాజిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇన్నాళ్లూ పురుషులకే పరిమితమైన ఈ రంగంలోకి నాగమణి అడుగుపెట్టడం వెనుక ఒక కన్నీటి గాథ, అంతకు మించిన గుండె నిబ్బరం ఉన్నాయి. జీవీఎంసీ 50వ వార్డు పరిధిలోని సాయిరామ్‌నగర్‌లో నివసించే నాగమణి భర్త కందుల చంద్రం, గతంలో బ్రాండిక్స్ కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తూనే, ఏటా ధనుర్మాసంలో హరిదాసుడుగా మారి భక్తిని పంచేవారు. భర్త కీర్తనలు పాడుతుంటే పరవశించిపోయే నాగమణి, ఆయనతో పాటే ఆ ఆధ్యాత్మిక గీతాలను నేర్చుకుంది. 2018లో గుండెపోటుతో చంద్రం మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అధైర్యపడని ఆత్మవిశ్వాసం భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కానీ నాగమణి కుంగిపోలేదు. భర్త పనిచేసిన కంపెనీలోనే స్టిచింగ్ ఆపరేటర్‌గా చేరి పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కుమార్తె చంద్రిక పదో తరగతి, చిన్న కుమార్తె వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అయితే కేవలం ఆర్థిక అవసరాలే కాకుండా, తమకు మగపిల్లలు లేరనే వెలితి రాకూడదని, తన భర్త కొనసాగించిన కులవృత్తి ఆగిపోకూడదని నాగమణి దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ సంకల్పమే ఆమెను ‘హరిదాసి’గా మార్చింది. తన భర్త గతంలో ఏ ఏ వీధుల్లో అయితే హరినామ స్మరణ చేశారో, సరిగ్గా అదే ప్రాంతాల్లో ఇప్పుడు నాగమణి తంబురా పట్టుకుని కనిపిస్తుంటే స్థానికులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపిస్తున్నారు. కఠినమైన నిష్ట.. నిరంతర నామస్మరణ ధనుర్మాసం మొదలవగానే నాగమణి దినచర్య ఎంతో కఠినంగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, స్నానపానాలు ముగించుకుని, దైవ ప్రార్థన అనంతరం హరిదాసి వేషధారణలో సిద్ధమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విరామం లేకుండా సాయిరామ్‌నగర్, మురళీనగర్, పట్టాభిరెడ్డి గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో కీర్తనలు పాడుతూ భక్తులను ఆశీర్వదిస్తోంది. హరిదాసుల సంప్రదాయం ప్రకారం తలపై ఉన్న అక్షయపాత్రను ఇంటికి వెళ్లే వరకు కింద పెట్టకూడదు. ఒకవేళ భక్తులు ఇచ్చే బియ్యం, కానుకలతో పాత్ర నిండిపోతే, ఒక రాయిపై దించి సంచిలోకి మార్చుకుంటారు. తిరిగి ఇంటికి చేరుకున్నాకే అక్షయపాత్రను దేవుడి మూల ఉంచి, పూజ నిర్వహించి అప్పుడు భోజనం స్వీకరిస్తారు.చేయూత కోసం ఎదురుచూపు ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా నాగమణి ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. సొంతంగా తంబురా కొనుగోలు చేసే స్తోమత లేక ఇతరుల నుంచి తీసుకుని వాడుతోంది. స్థానిక దాత పైలా దేముడు నాయుడు ఆమెకు 7 కేజీల రాగి పాత్రను బహూకరించి తన వంతు సాయం అందించారు. ‘భర్త నేరి్పన విద్యను, మా కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుకోవడమే నా లక్ష్యం. పిల్లల చదువుల కోసం, నా వృత్తి కోసం ఎవరైనా దాతలు సహకరిస్తే కృతజ్ఞతతో ఉంటాను’ అని నాగమణి విజ్ఞప్తి చేస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు అంతరించిపోతున్న కళారూపాన్ని మహిళగా భుజాన మోస్తున్న నాగమణి నిజంగానే అభినందనీయురాలు. -
భర్త శాడిజంపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాధిక
రాజంపేట : తన భార్య తనపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో.. ఆమె భర్త రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట హంగామా చేసిన సంఘటన రాజంపేట అర్బన్ పోలీసుస్టేషన్ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన అఖిల్, పుల్లంపేటకు చెందిన రాధిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో కొన్నాళ్లు నివసించారు. వీరికి ఇద్దరు సంతానం. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మొలకలచెరువులో కొంత కాలం కలిసి ఉన్నారు. కొన్ని రోజుల కిందట రాధిక రాజంపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే భార్య కనిపించడం లేదని మొలకలచెరువులో భర్త ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సీఐ నాగార్జున విచారణ చేపట్టారు. సీఐ నాగార్జునపై అఖిల్ ఆరోపణలు చేస్తూ, రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు కింద పడేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై సీఐ నాగార్జున మాట్లాడుతూ అఖిల్‌కు మతిస్థిమితం సరిగా లేదన్నారు. పోలీసులపై అఖిల్ వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేశామన్నారు.ఎస్పీకి ఫిర్యాదు చేశానంటున్న భార్యభర్త, అత్త, మామపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్లో.. వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారని అఖిల్ భార్య రాధిక మీడియాకు తెలిపింది. తన భర్త తనను కొడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడని, ప్రతి నెల తన ఇంటి నుంచి డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడన్నారు. రాకుంటే ఇకపై ఒకటే మానసికంగా వేధింపులు పెడతారన్నారు. పెళ్లయినప్పటి నుంచి మెంటల్ రీతిలో తనపై చావబాదేవాడన్నారు. రాయచోటికి వెళ్లి ఎస్పీకి తన భర్త శాడిజంపై ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు. తాను కనిపించకుండా పోలేదని, మా అమ్మమ్మ ఇంటికి వచ్చానని తెలిపారు. మొలకలచెరువులో తాను కనిపించలేదని, తప్పుడు ఫిర్యాదు ఎలా చేస్తారన్నారు. తన భర్తతో వివాహమైనప్పటి నుంచి నేటి వరకు తనకు జరిగిన సంఘటనలను ఆమె వివరించింది. -
మాకు న్యాయం చేయాలి
హైదరాబాద్: న్యాయం కోసం పిల్లలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని అహ్మద్‌గూడలో చోటుచేసుకుంది. సాయిచరణ్ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో 2020 సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి సాయిచరణ్ కనిపించకుండా తిరుగుతుండేవాడు. సాయిచరణ్ కీసర అహ్మద్‌గూడలోని హిడెన్ గార్డెన్ అపార్టుమెంట్లో ఉంటున్నాడని తెలుసుకొని పిల్లలతో కలిసి భార్య శిల్ప తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అనంతరం కీసర పోలీసులు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు, తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది. -
నా భార్యను చంపింది ఇంటి ఓనరే!
-
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
కర్ణాటక: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్‌రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్‌రాజ్‌ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య
-
భార్య వంట చేయకపోతే విడాకులా?
-
అతి కిరాతకంగా భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..
విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్‌లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే రెండో పెళ్లి.. ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘు అలియాస్ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.భర్తపై భార్య దాడి బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్ అస్గర్ చోరీలు, డ్రగ్స్ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్ అస్గర్‌ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అస్గర్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


