భార్యకు భరణం భర్త నిరంతర బాధ్యత | Supreme Court Big Ruling on Divorce Settlements | Sakshi
Sakshi News home page

భార్యకు భరణం భర్త నిరంతర బాధ్యత

Apr 17 2026 5:30 AM | Updated on Apr 17 2026 6:18 AM

Supreme Court Big Ruling on Divorce Settlements

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: భార్యకు భర్త ఇచ్చే భరణం నామమాత్రంగా ఉండరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జి మసీహ్‌ల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇరుపక్షాల సామాజిక హోదాకు, భర్త ఆర్థిక సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని పేర్కొంది. 

వివాహ బంధంలో ఉండగా భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించిందో, విడిపోయిన తర్వాతా అదే స్థాయి గౌరవంతో జీవించేలా భర్త భరణం చెల్లించాలని తెలిపింది. అదే సమయంలో, భరణాన్ని నిర్ణయించడంలో ఇరుపక్షాల అవసరాలను బేరీజు వేస్తూ సమతూకం పాటించాలని సూచించింది. ఒక మహిళకు ఇస్తున్న నెలవారీ వేతనం మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. 

ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ జంటకు 2023 మే 7వ తేదీన హిందూ ఆచారం ప్రకారం వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులతో ఏడాదికే పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఆ దంపతులు వేరుగానే ఉంటున్నారు. తనకు ఎటువంటి ఆదాయ వనరులు లేనందున భరణం ఇప్పించాలంటూ ఆమె చంపావత్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, న్యాయస్థానం నెలకు రూ.8 వేలు భరణంగా నిర్ణయించింది. బాధితురాలు ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు వెళ్లారు. ఆ న్యాయస్థానం రూ.15 వేలకు భరణం మొత్తాన్ని పెంచింది. ఆపైన బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా పైవిధంగా తీర్పు వచ్చింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement