విటమిన్‌–సి పుల్లటి పండ్లలో కంటే వాటిల్లోనే అధికం..! | Health Tips: These Top Foods High in Vitamin C | Sakshi
Sakshi News home page

విటమిన్‌–సి పుల్లటి పండ్లలో కంటే వాటిల్లోనే అధికం..!

Jun 6 2026 11:25 AM | Updated on Jun 6 2026 11:27 AM

Health Tips: These Top Foods High in Vitamin C

మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్‌–సి అత్యంత కీలకమైనది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి, కణాల మరమ్మత్తుకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకని మన రోజూవారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఈ విటమిన్‌ని సులభంగా పొందవచ్చు. 

సిట్రస్‌ జాతికి చెందిన నారింజ పండ్లలో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విదేశీ పండైనప్పటికీ ప్రస్తుతం మన దేశంలో విరివిగా లభిస్తున్న కివీ పండులో విటమిన్‌–సి తోపాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. 

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలామంది విటమిన్‌–సి కేవలం పుల్లటి పండ్లలోనే ఉంటుందని భావిస్తారు. కానీ, ఎర్రటి క్యాప్సికమ్‌లో నారింజ కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్‌–సి ఉంటుంది. ప్రతిరోజూ తగిన మోతాదులో విటమిన్‌–సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. 

యాంగ్జైటీ తగ్గించే యాలక్కాయ!
భోజనం ముగిసిన వెంటనే ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమలడం మంచిది. యాలకుల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు లాలాజలాన్ని, డైజెస్టివ్‌ ఎంజైమ్‌లను ఎక్కువగా ఉత్పత్తి చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. వీటిల్లో ఉన్న కార్మినేటివ్‌ గుణాలు కడుపులో గ్యాస్‌ తయారవ్వకుండా నిరోధిస్తాయి. 

ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. వీటి నుంచి వచ్చే సువాసనలో మానసిక ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. యాంగ్జైటీ వల్ల వచ్చే జీర్ణ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం.   

(చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం)

Advertisement
 
Advertisement
Advertisement