భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కింది.! | Barcode Clue Cracks Chennai Perambur Railway Station Suitcase Murder Mystery, Wife And Lover Arrested | Sakshi
Sakshi News home page

భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కింది.!

Jun 9 2026 9:06 AM | Updated on Jun 9 2026 10:04 AM

A twist in the Perambur railway station suitcase incident

పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై సూట్‌కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల  కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్‌ బట్టల బార్‌కోడ్‌ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన  షాపును గుర్తించారు.  దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్‌ డేటా రికార్డ్, వాట్సాప్‌ లోకేషన్‌ ఆధారంగా నిందితులు  తేనాంపేట, టి.నగర్‌ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. 

హత్యకు గల కారణాలు..  
పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్‌ గుర్తించారు.  నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్‌ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్‌ రోడ్‌ హౌసింగ్‌ బోర్డు క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. అయితే అమీర్‌ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్‌లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్‌ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.

 భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి  చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత  తన భర్త అమీర్‌ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్‌బుక్‌లో రోకిమా పోస్టు చేసింది.  మానసిక క్షోభతో∙అమీర్‌ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.

శవాన్ని ముక్కలుగా నరికి.. 
పథకం ప్రకారం, జూన్‌ 4వ తేదీ రాత్రి అమీర్‌ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్‌ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి కవర్‌లో చుట్టి సూట్‌కేసులో కుక్కారు. జూన్‌ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్‌కేసును పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం  గమనార్హం.

-సాక్షి, చెన్నై

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement