గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు | Joint Raids Against Illicit Liquor In Mancherial | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

Jul 25 2026 11:50 AM | Updated on Jul 25 2026 12:17 PM

Joint Raids Against Illicit Liquor In Mancherial

ఆదిలాబాద్‌, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్లొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement