రీసర్వేతో వివాదాలకు తెర | - | Sakshi
Sakshi News home page

రీసర్వేతో వివాదాలకు తెర

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

తలమడుగు: ప్రభుత్వం చేపడుతున్న భూభార తి భూముల రీసర్వేతో భవిష్యత్తులో వివాదా లకు తెరపడుతుందని అదనపు కలెక్టర్‌ చిత్రు అన్నారు.మండలంలోని బరంపూర్‌, ఉమ్రి, దే హగామ గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, గ్రామాల్లో ఈ సర్వే తో భూసమస్యలకు చెక్‌ పడనుందన్నారు. అలాగే రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూవివాదాలకు పరిష్కా రం లభిస్తుందన్నారు. ఇందులో ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, సహకార సంఘ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజ్‌మోహన్‌, సర్పంచ్‌ దేవరావు, ఉపసర్పంచ్‌ రంజిత్‌, కార్యదర్శి అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement