ఒంగోలు సబర్బన్: జిల్లాలోని రైతులందరిచే 100 శాతం పంటల బీమా ప్రీమియం కట్టించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసరావును కలెక్టర్ పి.రాజబాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులతో క్రాప్ ఇన్సూరెనన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐసీఐసీఐ లాంబార్డ్, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి పోస్టర్లను ఆవిష్కరించారు.
ఒంగోలు మెట్రో: నేడు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయాలను ముస్తాబు చేశారు. వైష్ణవాలయాలలో కలియుగదైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దేవస్థానం అధికారులు, పాలకవర్గ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైష్ణవ సంప్రదాయాలతో వచ్చే ఏకాదశులలో తొలి ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీంతో ఒంగోలు నగరంలోని వైష్ణవాలయాలను విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ఒంగోలు మెట్రో: స్థానిక పప్పుబజారువీధిలో సీతారామ భజన మందిరంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సీతా సమేత శ్రీరామలక్ష్మణుల ఆంజనేయస్వామికి అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీరామచంద్రుల వారికి గరుడ వాహనం నగరోత్సవం నిర్వహించారు.


