పారామెడికల్‌ కళాశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పారామెడికల్‌ కళాశాల తనిఖీ

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఎస్‌.పవార్‌ పారామెడికల్‌ కళాశాలను డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల అందులో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు కళాశాలలో రికార్డులను పరిశీ లించారు. అనుమతిలేని కోర్సులో అడ్మిషన్‌ తీ సుకోవద్దని, వెళ్లిపోవాలనుకుంటున్న వారికి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు అందజేయాలని యాజ మాన్యాన్ని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిసే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో డీఐవో వైసీ.శ్రీనివాస్‌ తదితరులున్నారు.

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి

నేరడిగొండ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య అన్నా రు. మండల కేంద్రంలోని నాలుగు పోలింగ్‌ బూత్‌లలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లతో మాట్లాడి సవరణ ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. అనంత రం మాట్లాడుతూ, అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోకుండా పారదర్శకంగా జాబితా లను రూపొందించాలని కోరారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి రమేష్‌, బద్దం పోతరెడ్డి, మనోజ్‌, నరేష్‌ రెడ్డి, రామ్‌లక్ష్మణ్‌ గౌడ్‌, కపిల్‌, ఊశన్న, చంద్రశేఖర్‌, వసంత్‌రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement