సర్ద్‌ బాటు | - | Sakshi
Sakshi News home page

సర్ద్‌ బాటు

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తర్వాత

జిల్లాలో పదుల సంఖ్యలో తగ్గే అవకాశం

నిర్ధారణ కాని ఓట్లపై కుదురుతున్న అవగాహన

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం

సాక్షి, ఆదిలాబాద్‌: ‘పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా 2025 ఓటరు జాబితా ప్రకారం 1200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను మా త్రమే పునర్‌ వ్యవస్థీకరించే ప్రతిపాదన ఉంది.. మ రణించిన, చిరునామా మారిన ఓట్ల తొలగింపు అ నంతరం మిగిలే తుది ఓట్ల సంఖ్య ఆధారంగా అవసరమైన చోట్ల మాత్రమే సర్దుబాటు ఉంటుంది.’ ప్రత్యేక ఓటరుజాబితా సవరణ కార్యక్రమంపై రాజ కీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించి న సమావేశంలో కలెక్టర్‌ మాటలివి. దీన్నిబట్టి సర్‌ ప్రక్రియ పూర్తయినతర్వాత తొలగింపునకు గుర య్యే ఓట్ల సంఖ్యపై స్పష్టత రానుంది. ఆ తర్వాత తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరగనున్నాయి.

మరో 10 రోజులు

సర్‌ ప్రక్రియ జూన్‌ 25న మొదలైంది. ఆగస్టు 3న ముగియనుంది. మరో పది రోజుల గడువు మిగిలింది. మొదట ఎన్యూమరేషన్‌ ఫారాలను ఓటర్లకు అందజేయడంతో మొదలైన ఈ ప్రక్రియలో ప్రస్తుతం బీఎల్‌వోలు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఓటరుకు సంబంధించి వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. మూడు అంశాల ఆధారంగా ఫారాన్ని నింపేలా రూపొందించిన విషయం తెలిసిందే. గత సర్‌ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు, బంధువుల వివరాలు, ప్రస్తుత వివరాల ఆధారంగా వాటిని పూరించి ఇస్తున్నారు. దీంట్లో మొదట అయోమయం చెందినప్పటికీ ఫారాలను బీఎల్‌వోలే ఓటరు వివరాలు తెలుసుకొని పూరించడం, అవగాహనపర్చడం వంటి వాటితో ప్రక్రియ ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చే దశకు చేరుకుంది.

లెక్క గడుతున్నారు..

ఓటరు నుంచి ఎన్యూమరేషన్‌ ఫారం పూరించి తీసుకోవడం, మ్యాపింగ్‌ పూర్తయిన తర్వాత కొన్ని అంశాల్లో తొలగింపునకు గురయ్యే ఓటర్ల వివరాలపై అవగాహన కుదురుకుంటున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారం ట్రాకింగ్‌ డిజిటలైజేషన్‌లో భాగంగా మొత్తం 26 అంశాల ఆధారంగా జిల్లాకు సంబంధించిన వివరాలను అధికార యంత్రాంగం చేపట్టింది. దీంట్లో నమోదుకు నోచుకోని.. పరిశీలనలో నిర్ధారణ కానటువంటి ఓటర్లకు సంబంధించి కొన్ని వివరాల ఆధారంగా లెక్కగడుతున్నారు.

మోడల్‌ పోలింగ్‌ కేంద్రం (ఫైల్‌)

పోలింగ్‌ కేంద్రాల వివరాలు

నియోజకవర్గం పోలింగ్‌ కేంద్రాలు

ఆదిలాబాద్‌ 292

బోథ్‌ 303

మొత్తం 595

ఓటర్ల వివరాలు..

మొత్తం ఓటర్లు 4,66,784

ఆదిలాబాద్‌ నియోజకవర్గం 2,50,393

బోథ్‌ నియోజకవర్గం 2,16,391

ఇప్పటివరకు గుర్తించిన ఓటర్ల

వివరాలు (జూలై 24 వరకు)

డెత్‌ 12,854

షిఫ్టెడ్‌ 24,645

డూప్లికేట్‌ 6,353

ఆబ్సెంట్‌ 4,691

అదర్స్‌ 146

మొత్తం 48,689

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement