హైదరాబాద్: ఓ వైద్య విద్యార్థిని 5వ అంతస్తు నుంచి దూకి మృతిచెందిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఆనందచారి, తన భార్య అరుణ, పిల్లలతో కలిసి నాగారం వెస్ట్ గాం«దీనగర్ భవానీ ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వారి కుమార్తె దీక్షిత (28) ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పైచదువుల నిమిత్తం ఆరు నెలల కిందట కర్ణాటకలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో చేరి పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈనెల 17న నాగారంలోని ఇంటికి వచి్చంది. శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఎలాంటి అనుమానాలు లేవని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


