బాలికపై సామూహిక లైంగిక దాడి | Incident in Keesara | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక లైంగిక దాడి

Jul 25 2026 5:31 AM | Updated on Jul 25 2026 5:31 AM

Incident in Keesara

మేనమామ, వరుసకు సోదరులైన ఇద్దరి ఘాతుకం

కీసర: ఓ మైనర్‌ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన బాలిక (13) తల్లిదండ్రులు మృతిచెందడంతో కీసరలోని తన అమ్మమ్మ వద్ద కొన్ని సంవత్సరాలు ఉంది. స్థానికుల సహాయంతో ఇటీవల తుర్కపల్లిలోని వసతి గృహంలో చేరి ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. ఇటీవల సెలవులు కావడంతో కీసరలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.

బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మేనమామతో పాటు వరుసకు సోదరులైన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం వసతి గృహానికి వెళ్లిన బాలిక తలకు ఫ్యాన్‌ తగిలి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి రాగా ఈ విషయం తెలిసింది. దీంతో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement