చికిత్స పొందుతున్న సర్పంచ్‌ మృతి | Women Sarpanch Incident In Khammam | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న సర్పంచ్‌ మృతి

Jul 25 2026 11:21 AM | Updated on Jul 25 2026 11:27 AM

Women Sarpanch Incident In Khammam

పాల్వంచరూరల్‌/భద్రాచలం అర్బన్‌: కుడి కాలికి వాపు రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లిన మహిళా సర్పంచ్‌ పరిస్థితి విషమించి మృతిచెందింది. సర్పంచ్‌ భర్త ప్రేమ్‌కుమార్‌ కథనం మేరకు.. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్‌ సోడే వెంకటరమణ(36) మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడగా భద్రాచలంలో మోహన్‌రావు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. 

ఇటీవల అదే కాలుకు వాపు రావడం గమనించి బుధవారం మోహన్‌రావు ఆస్పత్రిలో చేరి్పంచారు. ఇన్‌ఫెక్షన్‌ మరింత పెరగడంతో ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు అంబులెన్స్‌లో ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి శుక్రవారం తరలించగా చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందింది. 

ఆమెకు భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, చికిత్స లోపమే తన భార్య మృతికి కారణమని ఆరోపించిన ప్రేమ్‌కుమార్‌.. మృతదేహంతో శుక్రవారం రాత్రి నేరుగా భద్రాచలంలోని మోహన్‌రావు ఆస్పత్రి వద్దకు వెళ్లి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకుని చర్చిస్తున్నారు. కాగా, సర్పంచ్‌ మృతిపై ఎంపీడీఓ పి.రాజారావు, ఎంపీఓ షబ్నా సంతాపం తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement