ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
సంగారెడ్డి జిల్లా: ఫోన్ నంబర్‌ను భార్య బ్లాక్ లిస్టులో పెట్టిందని అవమానంగా భావించిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని మిన్‌పూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిటు్కల హనుమంతు (29)కు, కొన్యాలకు చెందిన అలివేణి మంగతో వివాహం జరిగింది. ఆమె ఈనెల 21న పుట్టింటికి వెళ్లింది. కాగా ఆమెకు హనుమంతు పదే పదే ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకునేవాడు.
భర్త తరచూ ఫోన్ చేస్తుండటంతో విసుగు చెందిన భార్య హనుమంతు ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. హనుమంతు ఫోన్ నుంచి భార్యకు ఫోన్ కలవకపోవడంతో అన్న బాలయ్య ఫోన్‌తో ప్రయత్నం చేశాడు. బాలయ్య ఫోన్ ఎత్తిన అలివేణిమంగ పదే పదే ఫోన్ చేస్తుండటంతో భర్త నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టానని విసుగ్గా సమాధానం చెప్పింది. దీంతో బ్లాక్‌లో పెట్టడం అవమానంగా భావించిన హనుమంతు ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. శుక్రవారం ఉదయం హనుమంతు నిద్రలేవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూసే సరికి దూలానికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పుల్కల్ పోలీసులు కేసు నమోదుచేశారు.


