సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు సమస్యను పరిష్కరించాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాధికారి రోహిణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, అదనపు భారం కారణంగా విద్యాబోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వెంటనే అవసరమైన చోట్ల వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. సర్కారు ఉత్తర్వుల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సర్దుబాట్లు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు నర్సింహ రాజు, నాయకులు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.


