ప్రకృతి వ్యవసాయంతోనే నేల సారవంతం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతోనే నేల సారవంతం

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

ప్రకృతి వ్యవసాయంతోనే నేల సారవంతం

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని, దీంతో నేల సారవంతమవడంతో పాటు, పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని కేవీకే హెడ్‌ సైంటిస్ట్‌ శంబాజీ దత్తాత్రేయ నల్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తునికిలో యూఎన్‌డీపీ– బయోపిన్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఆయన వ్యసాయంపై మాస్టర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఎంపికై న 10 గ్రామాల రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అవసరమైన జీవామృతం, పంచగవ్య, అగ్నిఅస్త్రం, దశపర్ణి కషాయం తదితర తయారీని చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేంద్రియంతోనే పంట దిగుబడి అధికంగా ఉండటంతో పాటు, ఆహార ఉత్పత్తులు నాణ్యతగా ఉంటాయన్నారు. ముఖ్యంగా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఎఫ్‌పీఓ ప్రతినిధులు, కేవీకే క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

కేవీకే హెడ్‌ సైంటిస్ట్‌

శంబాజీ దత్తాత్రేయ నల్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement