జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ.వినయ్‌కుమార్ కథనం ప్రకారం.. సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి ఈ నెల 13న మండలంలోని సత్వార్ గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా గాయాలయ్యాయి. వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్వార్ పాలనాధికారి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 61849 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ తెలిపారు.


