ముగిసిన ఫుట్‌బాల్ సెలక్షన్స్
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా మూడు రోజులపాటు కొనసాగిన ఫుట్‌బాల్ రీజినల్ సెలక్షన్ ట్రయల్స్ శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. నవోదయ జాతీయస్థాయి టోర్నీలో పోటీ కోసం కేటగిరీల వారీగా జట్ల ఎంపిక సంపూర్ణమైంది. తెలంగాణ, ఏపీ, కేరళ, కర్నాటక, పాండిచ్చేరిలోని 26 నవోదయ విద్యాలయాల నుంచి 151 మంది బాలురు, 28 మంది బాలికలు సెలక్షన్ ట్రయల్స్‌కు తరలివచ్చారు. కేటగిరీల వారీగా హైదరాబాద్ రీజియన్ నుంచి జాతీయ టోర్నీకి ఎంపికై న బాలబాలికలకు ప్రిన్సిపాల్ రాజేందర్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. వచ్చే నెలలో అస్సాంలో జరిగే జాతీయ టోర్నీలో హైదరాబాద్ రీజియన్‌కు ఈ జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు. ముగింపు వేడుకలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరింపజేశాయి.
వర్గల్ నవోదయ నుంచి 16 మంది
సెలక్షన్ ట్రయల్స్ ద్వారా ఆతిథ్య వర్గల్ నవోదయ విద్యాలయం నుంచి జాతీయ టోర్నీకి ఆరుగురు బాలురు, 10 మంది బాలికలు ఎంపికయ్యారు. అండర్ –17లో రిషిక, శృతిక, మనస్వి, ఆశ్రిత, సంజన, అండర్ –19లో సోమ సంహిత, ఎం.నిత్యశ్రీ, సీహెచ్ శ్రీవల్లి, వీ.విజయ ఉన్నారు. బాలుర అండర్ –14లో శివతేజ్‌గౌడ్, జిలాని, శ్రేయన్, వి.కార్తీక్, అండర్ –17లో జోయల్ సుబోధ్, వరుణ్‌తేజ్ ఎంపికయ్యారు.
మూడు కేటగిరీలుగా జట్ల ఎంపిక
అండర్ –14, 17, 19 కేటగిరీలుగా ప్రత్యేక కోచ్‌ల బృందం బాలబాలికలకు ట్రయల్స్ నిర్వహించారు. ఆటలో వారి ప్రావీణ్యాన్ని అన్ని కోణాల్లో పరిశీలించారు. మెరికలైన క్రీడాకారులతో అండర్ – 14, 17, 19 బాలుర జట్లు, అండర్ –17, 19 బాలికల జట్లను ఎంపిక చేశారు.
వచ్చే నెలలో జరిగే టోర్నీలో
హైదరాబాద్ రీజియన్‌కు ప్రాతినిధ్యం
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు


