breaking news
Block
-
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్‌ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్‌కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్‌పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్‌పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్‌పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. -
3,718 యాప్‌లు బ్లాక్.. రూ.11,158 కోట్లు సేవ్!
సైబర్ నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గడిచిన జూన్ 30 నాటికి చట్టవిరుద్ధమైన, మోసపూరిత రుణ యాప్‌లతో సహా 3,718 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS) ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.రూ.11,158 కోట్ల నష్టం నివారణ2021లో ప్రారంభమైన సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ ద్వారా ఇప్పటివరకు 32.80 లక్షలకు పైగా సైబర్ మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా తీసుకున్న చర్యలతో రూ.11,158 కోట్లకు పైగా మోసపూరిత నష్టాన్ని నివారించగలిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లపై చర్యలుఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69-ఎ, 79(3)(బి) కింద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చర్యలు చేపట్టింది. పోలీసు అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది.సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్లు, కాలర్ ట్యూన్లు, సోషల్ మీడియా, టెలివిజన్, రేడియోతో పాటు పాఠశాలలు, సినిమాలు, సెలబ్రిటీ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్ ప్రచార కార్యక్రమాలను కూడా ప్రభుత్వం వినియోగిస్తోంది.మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో I4C 2024 సెప్టెంబర్‌లో ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి 30.48 లక్షలకు పైగా అనుమానిత ఐడెంటిఫైయర్లు, 32.08 లక్షలకు పైగా లేయర్-1 మ్యూల్ ఖాతాల వివరాలను సంబంధిత సంస్థలతో పంచుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా జూన్ 30, 2026 నాటికి రూ.25,698 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయగలిగినట్లు ప్రభుత్వం తెలిపింది.ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మాడ్యూళ్లుసైబర్ క్రైమ్ ఫిర్యాదులను ఏకరీతిగా నిర్వహించేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్-సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసింది. మోసపూరితంగా తరలించిన నిధుల రికవరీకి తోడ్పడటంతో పాటు స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలు, తాత్కాలిక లియన్ మార్క్‌లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ ఏప్రిల్ 2026లో ప్రారంభమయ్యాయి. -
పాక్ పైశాచికం: ‘పీఓకే’ చూపించారని ‘అల్ జజీరా’ బంద్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న నిరసనల కవరేజ్ నేపథ్యంలో, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలలో ‘అల్ జజీరా ఇంగ్లీష్’తో సహా పలు వార్తా వెబ్సైట్లను నిలిపివేశారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా బలగాల అణచివేతపై విస్తృతమైన వార్తా కథనాలు వెలువడుతున్న తరుణంలో ఈ డిజిటల్ సెన్సార్షిప్ అమలైనట్లు సమాచారం.పీఓకేలో ఎన్నికల ప్రక్రియ, నిరసనలపై అల్ జజీరా ‘ఎంపిక చేసిన వార్తాకథనాలు’ (సెలెక్టివ్ రిపోర్టింగ్) ప్రసారం చేస్తోందని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల ప్రామాణికతను ఏబీపీ న్యూస్ స్వతంత్రంగా ధృవీకరించలేదు. ముజఫరాబాద్‌లో ఓటింగ్‌కు ఎవరూ ముందుకు రాని విధంగా వాతావరణం ఉందని, గత 50 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ నిలిపివేత కారణంగా అక్కడి పరిస్థితులను నివేదించడం కష్టతరమైందని అల్ జజీరా పేర్కొంది.ముజఫరాబాద్‌లో మార్కెట్లు, బ్యాంకులు, పెట్రోలు బంకులు మూతపడ్డాయని, ప్రజా రవాణా నిలిచిపోయిందని తెలిపింది. ఆగస్టు 10 వరకు దశలవారీగా పీఓకేలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాలలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, జూన్ 2న పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, పలు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించేందుకు ఇస్లామాబాద్ కోర్టు గతంలో ప్రయత్నించింది.ఇది కూడా చదవండి: ‘చాందీపురా’ కలకలం: 22 మంది మృతి.. 35 మందికి పాజిటివ్ -
మీ వాట్సాప్ పని చేస్తోందా?
మీ వాట్సాప్ పని చేస్తోందా?. మెసేజ్‌లు వెళ్లకపోయినా.. అందుకోకపోయినా కంగారుపడకండి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో పలువురు యూజర్లు అనూహ్య సమస్యను ఎదుర్కొన్నారు. భారత్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వాట్సాప్ అకౌంట్లు సోమవారం రాత్రి ఒక్కసారిగా ‘అకౌంట్ ఇన్ రివ్యూ’ అంటూ కనిపించడంతో యూజర్లు ఆందోళనకు గురయ్యారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైనట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తమ అకౌంట్లు నిలిచిపోయాయని, మెసేజ్‌లు పంపడం, ఇతర ఫీచర్లు ఉపయోగించడం సాధ్యం కావడం లేదని తెలిపారు. అయితే.. రివ్యూ పూర్తయ్యే వరకు వాట్సాప్‌లోని ఫీచర్లు అందుబాటులో లేకుండా పోయాయి.వాట్సాప్ స్క్రీన్‌పై “Account in review” అనే సందేశం కనిపించింది. యూజర్ల అకౌంట్ యాక్టివిటీ, డివైస్ వివరాలను తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, సాధారణంగా 24 గంటల్లో ఫలితం తెలియజేస్తామని అందులో పేర్కొంది.ఈ పరిణామంపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ.. సేవలను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని అకౌంట్లను నిషేధిస్తామని తెలిపారు. అయితే కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉందని, అలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి యూజర్లను తిరిగి చాటింగ్‌కు అనుమతిస్తామని చెప్పారు.కొంతమంది యూజర్లు తమ అకౌంట్లు ఎలాంటి కారణం లేకుండా డిసేబుల్ అయ్యాయని, అప్పీల్ చేసినా సాధారణ మెసేజ్ మాత్రమే వస్తోందని సోషల్ మీడియాలో వాపోయారు. అధికారిక వాట్సాప్ యాప్ మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ తమ అకౌంట్ నిలిపివేయడం అన్యాయమని కొందరు పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రభావితమైన అకౌంట్లను వాట్సాప్ పరిశీలిస్తోంది. 24 గంటల్లో సమీక్ష పూర్తయిన తర్వాత అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ఈ సమస్య మీ వాట్సాప్‌కూ ఎదురైందా? లేదా సాధారణంగా పనిచేస్తోందా అనే విషయాన్ని యూజర్లు చెక్ చేసుకోవచ్చు.అయితే ఈ పరిణామంపై కొంతమంది యూజర్లు తమ వ్యక్తిగత సమాచారం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇది ప్రైవసీ ఉల్లంఘనకు సంబంధించిన సమస్యగా ఎలాంటి ఆధారాలు లేవు. వాట్సాప్ నిబంధనల ఉల్లంఘన, అనుమానాస్పద యాక్టివిటీ వంటి అంశాల ఆధారంగా అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్ల వ్యక్తిగత చాట్లు లేదా మెసేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. -
భార్య ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని.. భర్త ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా: ఫోన్ నంబర్‌ను భార్య బ్లాక్ లిస్టులో పెట్టిందని అవమానంగా భావించిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని మిన్పూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిటు్కల హనుమంతు (29)కు, కొన్యాలకు చెందిన అలివేణి మంగతో వివాహం జరిగింది. ఆమె ఈనెల 21న పుట్టింటికి వెళ్లింది. కాగా ఆమెకు హనుమంతు పదే పదే ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకునేవాడు. భర్త తరచూ ఫోన్ చేస్తుండటంతో విసుగు చెందిన భార్య హనుమంతు ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. హనుమంతు ఫోన్ నుంచి భార్యకు ఫోన్ కలవకపోవడంతో అన్న బాలయ్య ఫోన్‌తో ప్రయత్నం చేశాడు. బాలయ్య ఫోన్ ఎత్తిన అలివేణిమంగ పదే పదే ఫోన్ చేస్తుండటంతో భర్త నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టానని విసుగ్గా సమాధానం చెప్పింది. దీంతో బ్లాక్‌లో పెట్టడం అవమానంగా భావించిన హనుమంతు ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. శుక్రవారం ఉదయం హనుమంతు నిద్రలేవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూసే సరికి దూలానికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పుల్కల్ పోలీసులు కేసు నమోదుచేశారు. -
ఓటీటీల్లో అశ్లీల కంటెంట్.. ఏకంగా 50 ఫ్లాట్‌ఫామ్స్..!
ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను రద్దు చేసింది. ఆ ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించడం, 1986 వంటి పలు చట్టాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. సదరు ఓటీటీలు అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. డిజిటల్ న్యూస్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే ఫిర్యాదులను ఐటీ రూల్స్- 2021 కింద పరిష్కరిస్తారని డాక్టర్ మురుగన్ తెలిపారు. ఓటీటీల్లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించమని మధ్యవర్తులను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఓటీటీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. -
హర్ముజ్ తర్వాత మరో షాక్.. హౌతీల సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పదో రోజుకు చేరుకున్న వేళ.. యెమెన్‌కు చెందిన ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య, ఇంధన నౌకలపై నావికా దిగ్బంధం విధిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో మరో కొత్త యుద్ధ ఫ్రంట్ తెరుచుకునే ప్రమాదం కనిపిస్తోంది.సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్‌పై విధించిన ఆంక్షలు, చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సాయుధ విభాగం వెల్లడించింది. సౌదీకి వ్యతిరేకంగా ‘మారిటైమ్ ఎంబార్గో’ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలపై మరోసారి తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన బాబ్ ఎల్ మండెబ్ bab el mandeb జలసంధిపై ప్రభావం పడితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ కోత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు మార్కెట్లలో కలవరంహౌతీల ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అయితే దౌత్య చర్చలపై ఆశలు ఉండటంతో ధరలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ.. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా రవాణా మార్గాలకు ముప్పు ఏర్పడితే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది.ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపుమరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. పదో రోజు కూడా అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, నౌకా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తబ్రీజ్, చాబహార్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి పరిసర ప్రాంతాల్లో అమెరికా దాడుల ప్రభావం కనిపించినట్లు సమాచారం.ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రకటిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.హర్ముజ్‌లో ట్యాంకర్లపై దాడులుగల్ఫ్ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో మరో కలకలం చోటుచేసుకుంది. రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సురక్షితం కాని మార్గంలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగిందని ఇరాన్ పేర్కొంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వతంత్ర సంస్థలు ధ్రువీకరించలేదు. మరోవైపు ఒమన్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగినట్లు బ్రిటన్‌కు చెందిన సముద్ర భద్రతా సంస్థ వెల్లడించింది.దౌత్య ప్రయత్నాలు.. కానీ తగ్గని ఉద్రిక్తతలుయుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్‌కు చేరుకుని చర్చలు ప్రారంభించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు చేస్తోంది.అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం దౌత్యం కంటే సైనిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇరాన్ దాడుల్లో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.గల్ఫ్ దేశాల్లో భయంఇరాన్-అమెరికా ఘర్షణ ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. తమపై జరిగిన దాడులపై ఖతార్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. నష్టపరిహారం కోరుతూ చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధి.. ఇప్పుడు బాబ్ ఎల్ మండెబ్ మార్గంపై కూడా ముప్పు ఏర్పడటంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మధ్యప్రాచ్యంపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ మరింత విస్తరిస్తే.. అది కేవలం ప్రాంతీయ యుద్ధంగానే కాకుండా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
1600 సిరీస్ కాల్స్‌ను యాప్స్ బ్లాక్ చేయలేవు: ట్రాయ్
మొబైల్ వినియోగదారులను నిరంతరం వేధించే అయాచిత, ప్రమోషనల్, సర్వీస్ కాల్స్‌పై టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) శుక్రవారం కీలక వివరణ ఇచ్చింది. ఇకపై 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను థర్డ్ పార్టీ యాప్స్ (ట్రూకాలర్ వంటివి) బ్లాక్ చేయడం కానీ, ఫిల్టర్ చేయడం కానీ సాధ్యం కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. అదేవిధంగా, వ్యాపార ప్రకటనల కోసం వచ్చే 140 సిరీస్ కాల్స్‌ను నియంత్రించాలంటే ప్రభుత్వ అధికారిక ‘డీఎన్డీ’ రిజిస్ట్రీ మాత్రమే ఏకైక మార్గమని తేల్చిచెప్పింది.1600 సిరీస్ కాల్స్ ఎందుకు బ్లాక్ చేయకూడదు?టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్) నిబంధనల ప్రకారం.. 1600 సిరీస్ నంబర్లను బ్లాక్ చేయడం, ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం చట్టవిరుద్ధం. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ వంటి సర్వోన్నత సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు తమ ప్రస్తుత కస్టమర్లకు కీలక సమాచారం చేరవేయడానికి ఈ సిరీస్‌ను వాడుతుండడం ఇందుకు ఒక కారణమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంస్థలు పౌరులతో జరిపే అధికారిక లావాదేవీల సమాచారం కోసం 1600 సిరీస్‌ను తప్పనిసరి చేశారు. వినియోగదారులు ఇవి నమ్మకమైన, అధికారిక కాల్స్ అని గుర్తించి మోసపోకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక సిరీస్‌ను కేటాయించారు. ఒకవేళ యాప్‌లు వీటిని బ్లాక్ చేస్తే వినియోగదారులు కీలక ఆర్థిక సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.140 సిరీస్ ప్రమోషనల్ కాల్స్.. డీఎన్డీతోనే చెక్!రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల కోసం కేటాయించిన 140 నంబర్ సిరీస్ ప్రమోషనల్ కాల్స్‌పై ట్రాయ్ స్పందిస్తూ.. వినియోగదారులకు తమ ప్రాధాన్యతలను ఎంచుకునే పూర్తి హక్కు ఉందని తెలిపింది. ‘వినియోగదారులు ట్రాయ్ ‘డీఎన్డీ యాప్’ ద్వారా లేదా బహుళ మార్గాల్లో డూ నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చు. ఒకటి లేదా అన్ని రంగాల నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్‌ను బ్లాక్ చేసే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంది. ఒక రంగం నుంచి కాల్స్ స్వీకరించడానికి కస్టమర్ అంగీకరించినప్పుడు, థర్డ్ పార్టీ యాప్స్ దాన్ని స్పామ్‌గా ట్యాగ్ చేస్తే కస్టమర్ తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందుకే డీఎన్డీ మినహా మరే ఇతర ట్యాగింగ్ చెల్లదు’ అని ట్రాయ్ తెలిపింది. దీని ప్రకారం.. 140, 1600 సిరీస్ నంబర్లను వినియోగదారులు వ్యక్తిగతంగా స్పామ్, మోసం లేదా ఇతర కేటగిరీలుగా ట్యాగ్ చేయడం కుదరదని ట్రాయ్ స్పష్టం చేసింది.భారీగా పెరిగిన స్పామ్ కాల్స్ఒకవైపు ట్రాయ్ నిబంధనలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో ఈ నంబర్ల ద్వారా వస్తున్న స్పామ్ కాల్స్ వినియోగదారులను ముంచెత్తుతున్నాయని ప్రముఖ యాప్ ‘ట్రూకాలర్’ సీఈవో రిషిత్ ఝున్ ఝున్ వాలా సాషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన గణాంకాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.140, 1600 సిరీస్‌ల ద్వారా వచ్చే కాల్స్‌లో రోజుకు 5.1 కోట్లకు పైగా కాల్స్‌ను వినియోగదారులు సమాధానం ఇవ్వకుండా వదిలేస్తున్నారు.కేవలం సర్వీస్/లావాదేవీల కోసం కేటాయించిన 1600 సిరీస్ నుంచి అక్టోబర్ 2025 నుంచి రోజువారీ స్పామ్/బ్లాకింగ్ చర్యలు ఏకంగా 3 రెట్లు (208 శాతం) పెరిగాయి.గత 8 నెలల కాలంలో వినియోగదారులు ఈ సిరీస్‌లపై ఏకంగా 7.4 కోట్ల (74 మిలియన్లు) మాన్యువల్ బ్లాకింగ్ చర్యలు తీసుకున్నారు.ప్రస్తుతం ట్రూకాలర్ ప్లాట్‌ఫామ్‌పై రోజూ వినియోగదారులు 140 సిరీస్ నుంచి 4 లక్షల కాల్స్, 1600 సిరీస్ నుంచి 1.25 లక్షల కాల్స్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఐఆర్సీటీసీ.. మూడు కోట్ల అకౌంట్లు క్లోజ్!
రైల్వే ప్రయాణికులకు మరింత పారదర్శకమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మెగా ఆపరేషన్‌కు తెరలేపింది. ఒకవైపు కన్ఫర్మ్డ్ టిక్కెట్ల కోసం సామాన్య ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న టికెటింగ్ మాఫియాకు చెక్ పెడుతూ, మరోవైపు రైళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను నిలిపివేయడంతో పాటు రైల్వే వంటశాలల్లో నాణ్యతను పర్యవేక్షించడానికి ఏఐ కెమెరాలను తీసుకొచ్చింది.టికెట్ దందాపై చర్యలుసాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకకుండా బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ముఠాలు, దళారీల ఆట కట్టించేందుకు ఐఆర్సీటీసీ డిజిటల్ నిఘాను తీవ్రం చేసింది. ఇందులో భాగంగా తీసుకున్న కీలక చర్యలు చేపట్టింది.డిజిటల్ గుర్తింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3 కోట్లకు పైగా అనుమానాస్పద వినియోగదారుల ఖాతాలను ఐఆర్సీటీసీ బ్లాక్ చేసింది.వీటితో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో ఆరు కోట్ల ఐడీల ప్రామాణికతను తనిఖీ చేయడానికి వాటిని కఠినమైన ధ్రువీకరణ పరిధిలో ఉంచింది.గత ఏడాది కాలంలో అక్రమ బుకింగులకు కారణమవుతున్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు.నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించి 501 అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి.800 కిచెన్లలో ఏఐ కెమెరాలురైలు ప్రయాణంలో లభించే భోజనంపై తరచూ వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా బేస్ కిచెన్లలో (వంటశాలలు) పరిశుభ్రత, కార్యాచరణ లోపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు 2,394 ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలను మోహరించింది.తొమ్మిది రకాల ఉల్లంఘనలను పట్టేసే టెక్నాలజీఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ వంటశాలల్లో జరిగే 9 రకాల ప్రధాన ఉల్లంఘనలను ఇట్టే పసిగడుతుంది. వంట చేసేవారు తలకు క్యాప్ పెట్టుకోకపోవడం, చేతి తొడుగులు (గ్లౌజెస్) ధరించకపోవడం, వంటగదిని సరిగ్గా తుడవకపోవడం వంటి లోపాలతో పాటు వంటశాలల్లో ఎలుకలు, ఈగలు, బొద్దింకల కదలికలను కూడా ఈ కెమెరాలు క్షణాల్లో గుర్తిస్తాయి.టూ-అవర్స్ డెడ్‌లైన్.. వార్ రూమ్ పర్యవేక్షణఈ సాంకేతికత ఎంతటి చిన్న వస్తువునైనా, లోపాన్నైనా సులభంగా గుర్తించగలదని ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘వంటశాలల్లో పరిశుభ్రత లోపిస్తే ఏఐ కెమెరాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) హెచ్చరికలను జారీ చేస్తాయి. ఈ అలర్ట్ నేరుగా సంబంధిత కిచెన్ మేనేజర్‌కు వెళ్తుంది. ఐఆర్సీటీసీ ప్రత్యేక వార్ రూమ్ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలర్ట్ వచ్చిన రెండు గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వార్ రూమ్ పర్యవేక్షణ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం వంటశాలల్లో హెడ్ క్యాప్‌లు ధరించకపోవడం అనేదే అత్యంత ప్రాథమిక, ప్రధాన ఉల్లంఘనగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్‌కు ఫుల్ క్రేజ్! -
‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీ అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే, ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.బీజేపీని దాటేసిన క్రేజ్!కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్‌స్టా ఖాతాను ఇది అధిగమించింది. కాంగ్రెస్ 13 మిలియన్ల ఫాలోవర్లతో ముందుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఈ మైలురాయిని అందుకున్న కొన్ని గంటల్లోనే ‘సీజేపీ’ ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ‘మేము ఊహించినట్టే జరిగింది’ అంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ స్పందించారు.సుప్రీం వ్యాఖ్యల నుండి పుట్టిన ఉద్యమంనిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయాలపై విసుగు చెందిన జెన్-జీ యువత ఆవేదన నుండి పుట్టిన పొలిటికల్ సెటైర్ మూవ్మెంట్ ఇది. గత వారం ఒక కోర్టు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు, ఆన్లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి ‘బొద్దింకలు’,'పరాన్నజీవులు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ ఉద్యమం మొదలైంది. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ, యువత ఈ వినూత్న పార్టీని స్థాపించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, నకిలీ డిగ్రీల వారినే తానలా అన్నానని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు.సెలబ్రిటీల మద్దతు.. భారీ నెట్వర్క్బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మాజీ ఆప్ సోషల్ మీడియా కార్యకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఈ వినూత్న మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అనే నినాదంతో, కేవలం హాస్యం, మీమ్స్ ఆధారంగా యువతను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వైవిధ్యమైన డిజిటల్ ప్రచారానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలపడం విశేషం.ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ! -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్‌ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్‌తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్‌స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్‌కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్‌పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్‌ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముందు హర్ముజ్‌ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్‌కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది. ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్‌ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ఇరాన్‌కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్‌ను తాము మూసేయడంతో ఇరాన్‌కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.ప్లాన్‌బీ లేనే లేదు!అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్‌పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
సముద్రంలో ఉద్రిక్తత: ఇరాన్‌కు అమెరికా మరో షాక్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా, మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. తాజాగా ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.రంగంలోకి యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టాఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ (DDG 115) అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శనివారం అధికారికంగా ప్రకటించింది. Guided-missile destroyer USS Rafael Peralta (DDG 115) enforces the U.S. blockade on Iranian ports against an Iranian-flagged ship attempting to sail to a port in Iran, April 24. pic.twitter.com/XsGg65nXt2— U.S. Central Command (@CENTCOM) April 25, 2026దిగ్బంధనం కఠినతరంవాషింగ్టన్ ఆదేశాల మేరకు ఇరాన్ సముద్ర మార్గాలను, ఓడరేవులను దిగ్బంధించే భారీ ఆపరేషన్‌లో ఈ చర్య ఒక భాగం మాత్రమే అని మిలిటరీ అధికారులు తెలిపారు. ‘ఎక్స్’ వేదికగా సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇరాన్ తీరాలకు సరుకుల రవాణాను నిలువరించడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని అమెరికా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ ఘటనతో సముద్ర జలాల్లో హైఅలర్ట్ వాతావరణం నెలకొంది.చర్చలకు ఇరాన్ ససేమిరాఈ సైనిక చర్యలకు తోడు, దౌత్యపరంగా కూడా ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రత్యేక ప్రతినిధులుగా స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు పంపారు. అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ఇస్లామాబాద్ పర్యటనలో ఉన్నారు. అయితే అమెరికా ప్రతినిధి బృందంతో నేరుగా ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. కీలక నేతలు ఒకే నగరంలో ఉన్నప్పటికీ దౌత్యం ఫలించకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ షాకింగ్ డీల్.. ఆనందంలో సైనికులు -
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
ఇరాన్ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్‌తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైంది. అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్ఎన్జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. అమెరికా, చైనా ఇరాన్‌పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. -
పాక్ కు ఇరాన్ షాక్.. హర్ముజ్ లో నౌక అడ్డగింత
-
గ్యాంబ్లింగ్ సైట్లపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 పైగా వెబ్సైట్లు, యాప్‌లను బ్లాక్ చేసింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు, ఆన్లైన్ కేసినోలకు సంబంధించినవని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సట్టా, మట్కా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లు, రియల్ మనీ కేసినో గేమ్ యాప్స్‌పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి 8,400 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు వివరించాయి. ఇందులో అత్యధిక భాగం (సుమారు 4,900) ఆన్లైన్ గేమింగ్ చట్టం వచ్చాక చర్యలు తీసుకున్నవేనని వివరించాయి. -
విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులపై ఇకపై ప్రభుత్వం తన కీలక శాఖల కళ్లతో నిఘా సారించనుంది. ఇప్పటివరకు కేవలం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉన్న ‘కంటెంట్ బ్లాకింగ్’ అధికారాలను మరో నాలుగు కీలక మంత్రిత్వ శాఖలకు కూడా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69 (ఏ) కింద పలు మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఏదైనా వివాదాస్పద పోస్టును తొలగించాలన్నా లేదా బ్లాక్ చేయాలన్నా ఇతర శాఖలు ఐటీ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలి. ఈ కారణంగా ఐటీ శాఖ వద్ద ఫైళ్లు పేరుకుపోయి, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించే తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.అధికారాలు పొందే శాఖలు ఇవే..ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు నేరుగా బ్లాకింగ్ ఆర్డర్లు జారీ చేసే అవకాశం ఉన్న శాఖలు..హోం మంత్రిత్వ శాఖవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖరక్షణ శాఖసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ఆర్థిక సలహాలు ఇచ్చే ‘ఫిన్-ఫ్లూయెన్సర్ల’పై చర్యలు తీసుకునేందుకు వీలుగా సెబీ (సెబీ) వంటి నియంత్రణ సంస్థలకు కూడా ఈ అధికారాలు ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి.యూజర్లపై ప్రభావంఇటీవలే ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ తొలగింపు సమయాన్ని 36 గంటల నుండి కేవలం 3 గంటలకు తగ్గించింది. ఇప్పుడు అధికారాల వికేంద్రీకరణ జరిగితే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు నేరుగా వివిధ శాఖల నుండి ఆదేశాలు అందుతాయి. అయితే దీనివల్ల ప్రభుత్వంపై చేసే విమర్శలు లేదా సెటైరికల్ పోస్టులు కూడా తొలగించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దేశ సార్వభౌమాధికారం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ‘ట్రావెల్ విత్ జో’ కేసు.. 10 నెలలైనా వీడని ఉత్కంఠ -
ఛానల్ బ్లాక్.. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్?
-
నంబర్ బ్లాక్ చేస్తే సరిపోదు
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్‌ని ఆపేందుకు ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడంతో సరిపెట్టొద్దని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ డీఎన్డీ (డు నాట్ డిస్టర్బ్) యాప్ ద్వారా ఆ నంబర్ల గురించి ఫిర్యాదు చేయాలని సూచించింది. డీఎన్డీ యాప్ ద్వారా వచి్చన ఫిర్యాదుల ఆధారంగా స్పామ్, మోసపూరిత మెసేజీలతో సంబంధమున్న సుమారు లక్ష ఎంటీటీలను (సంస్థలు, వ్యక్తులు), 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్, బ్లాక్‌లిస్ట్ చేశామని పేర్కొంది. యూజర్లు ఏదైనా స్పామ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ గురించి యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వాటిని ట్రేస్ చేసేందుకు, నిర్ధారించుకునేందుకు, శాశ్వతంగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేసేందుకు ట్రాయ్ అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లకి వీలవుతుందని తెలిపింది. అలా కాకుండా వ్యక్తిగతంగా బ్లాక్ చేయడమనేది ఆ డివైజ్‌కి మాత్రమే పరిమితమవుతుందని, స్కామర్లు ఇతరులను కాంటాక్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూజర్లంతా కలిసికట్టుగా ఫిర్యాదులు చేస్తే, దేశవ్యాప్తంగా టెలికం సేవల దురి్వనియోగాన్ని అరికట్టవచ్చని వివరించింది. -
ప్రియురాలు ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో..!
కర్ణాటక: ఫోన్ నంబర్‌ను లవర్ బ్లాక్ చేయడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెరేసంద్ర గ్రామంలోని ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కేరళ మూలానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ (26) పెరేసంద్ర గ్రామంలో ఓ ప్రైవేట్ కాలేజ్‌లో సైన్స్ కోర్సు చదువుతున్నాడు. ఇటీవల షబ్బీర్ ఫోన్ నంబర్‌ను యువతి బ్లాక్ చేసింది. పలుమార్లు ఫోన్ చేసినా యువతి ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తీయలేదు. దీంతో మనస్థాపం చెందిన షబ్బీర్.. హాస్టల్ రూమ్‌లో టవల్‌తో ఉరేసుకుని మృతి చెందాడు. కాగా.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు నాతో ఎప్పడు ఉంటావు.’ అంటూ షబ్బీర్ డెత్‌నోట్‌లో రాశాడు. -
పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం
-
నీట్–పీజీ సీట్లు బ్లాక్ చేయకుండా కఠినచర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల విషయంలో కొన్ని కాలేజీలు ముందుగానే సీట్లు బ్లాక్ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నీట్–పీజీకి సంబంధించి కౌన్సెలింగ్‌కు ముందే ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని అన్ని ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. సీట్ల బ్లాకింగ్ వల్ల అవకాశం కోల్పోయిన ఇద్దరు అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, లక్నోలోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టర్ జనరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మెడికల్ పీజీ సీట్లను ముందుగానే బ్లాక్ చేసి, ఇష్టా్టనుసారంగా విక్రయించుకోవడం అనేది తప్పుడు చర్య మాత్రమే కాకుండా, వ్యవస్థలో లోపాలకు ఉదాహరణ అని వెల్లడించింది. పారదర్శకత లేకపోవడానికి, ప్రభుత్వ విధానాలు బలహీనంగా ఉండడానికి నిదర్శనమని తెలియజేసింది. సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌన్సెలింగ్‌కు ముందే ఫీజులను వెల్లడించడం తప్పనిసరి అని స్పష్టంచేసింది. ట్యూషన్, హాస్టల్ ఫీజులు, కాషన్ డిపాజిట్‌తోపాటు ఇతర ఫీజులను విద్యార్థులకు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్రీకృత ఫీజుల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. సీట్లు బ్లాక్ చేసే కాలేజీలకు జరిమానాలు విధించాలని స్పష్టంచేసింది. ఆయా కాలేజీలపై అనర్హత వేటు వేయాలని పేర్కొంది. -
చైనా మీడియా సంస్థ ఎక్స్ అకౌంట్ నిలిపివేత
-
పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్
జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రధాన మంత్రి 'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను శుక్రవారం భారతదేశంలో బ్లాక్ చేశారు.కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించిన తర్వాత ఈ ఖాతాలను బ్లాక్ చేశారు. వీటిలో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి. రెచ్చగొట్టే.. మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు మాత్రమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రసారం చేసినందుకు ఈ ఛానెల్‌లను నిషేధించారు.'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను బ్లాక్ చేయడంతో పాటు.. గాయకుడు అతిఫ్ అస్లాం, క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజం, నటుడు ఫవాద్ ఖాన్, హనియా అమీర్, మహిరా ఖాన్‌లతో సహా అనేక మంది పాకిస్తాన్ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కూడా సస్పెండ్ చేశారు.పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత.. భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం మాత్రమే కాకుండా, అటారీ-వాఘా సరిహద్దును కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. -
Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్‌ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.కాగా బర్త్‌రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.Birthright Citizenship అంటే ఏంటి?అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్‌లు పడినట్టే.ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికేH-1B (వర్క్ వీసాలు)H-4 (డిపెండెంట్ వీసాలు)L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)F (స్టూడెంట్ వీసాలు) ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ -
క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా క్రెడిట్‌కార్డుల వాడకం అధికమవుతోంది. అయితే ప్రయాణాల్లోనో లేదా ఇతర సందర్భాల్లోనో కార్డులను పోగోట్టుకోవడం సహజం. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏ చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేస్తూంటారు. ఆ కార్డు స్కామర్ల చేతికి చిక్కితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భాల్లో కార్డులు కోల్పోతే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వాటిని బ్లాక్ చేయించి కొత్తగా కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒకవేళ తమ కార్డు కోల్పోతే ఎలా బ్లాక్ చేయాలో కింద తెలుసుకుందాం.ఎస్బీఐ కార్డ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడను ముందు జత చేయాలి) లేదా 1860 180 1290కు డయల్ చేయాలి. పోయిన లేదా దొంగిలించబడిన కార్డు వివరాలతో ఐవీఆర్ సూచనలను పాటించాలి.ఎస్ఎంఎస్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 5676791కు BLOCKXXXX (XXXX స్థానంలో కార్డు నెంబరు చివరి నాలుగు అంకెలు ఉండేలా చూసుకోవాలి)అని టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వాలి.ఎన్‌బీఐ కార్డ్స్ వెబ్సైట్(https://www.sbicard.com/)కు లాగిన్ అవ్వాలి.లాగిన్ చేసిన తర్వాత హోం పేజీ ఎడమవైపున ఉన్న ‘రిక్వెస్ట్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.‘రిపోర్ట్ లాస్ట్/ స్టోలెన్ కార్డ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డును బ్లాక్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించాలి.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.హోం పేజీ ఎగువ ఎడమ వైపు కార్నర్లో మెనూ మీద ట్యాప్ చేయాలి.‘సర్వీస్ రిక్వెస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.‘లాస్/ స్టోలెన్ రిపోర్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డ్ నెంబరు ఎంచుకుని రెక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.పైన చెప్పిన ఏ పద్ధతులు మీకు అందుబాటులో లేకపోతే వెంటనే మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలి. కార్డును బ్లాక్ చేసిన తరువాత ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ధ్రువీకరణ అందుతుంది. -
పాక్ సర్కారుకు ‘ఇమ్రాన్’ భయం..మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు రద్దు
ఇస్లామాబాద్:పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఆదివారం(నవంబర్24) మొబైల్‌ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభిమానులు ఆందోళనలకు సిద్ధమైన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. కాగా,పాకిస్తాన్లో ఎక్స్‌ను ఇప్పటికే నిషేధించడం గమనార్హం. ఏయే ప్రాంతాల్లో మొబైల్,ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయనున్నారు, వాటిని తిరిగి ఎప్పుడు పునరుద్ధిరిస్తారన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కాగా,మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలు పాలై ఇప్పటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఇమ్రాన్ క్రేజ్ ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు.ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఈ పాకిస్తాన్(పీటీఐ)కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రభుత్వంపై పోరాడేందుకు ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతుంటారు.తాజాగా ఇమ్రాన్ విడుదలను డిమాండ్ చేస్తూ పీటీఈ కార్యకర్తలు ర్యాలీకి పిలుపునివ్వడంతో ప్రభుత్వం సోషల్‌మీడియాను నిషేధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ బ్యాక్ఎండ్ను బ్లాక్‌చేసినట్లు సమాచారం.వాట్సాప్ ద్వారానే నిరసన ర్యాలీల సమాచారాన్ని పీటీఐ శ్రేణులు చేరవేస్తుండడం ఇందుకు కారణం. మరోవైపు పీటీఐకి గట్టి పట్టున్న ప్రావిన్సులైన పంజాబ్, ఖైబర్ ప్రావిన్సుల నుంచి రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లే ప్రధాన రోడ్లన్నింటిపై అడ్డుగా కంటెయినర్లు పెట్టి బ్లాక్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చెమటోడ్చాల్సి వస్తోంది. -
బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..?
ఎంతో ఆసక్తిగా యూట్యూబ్‌లో వీడియా చూస్తూంటే యాడ్ వచ్చిందనుకోండి చిరాకేస్తుంది కదా. అందుకోసం మార్కెట్లో ఉన్న యాడ్బ్లాకర్లను వాడుతుంటారు. దాంతో ఎలాంటి యాడ్లు రాకుండా ఏంచక్కా వీడియో చూస్తుంటారు. కానీ ఇకపై ఇలాంటివి కుదరకుండా యూట్యూబ్ పక్కా చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కిప్ చేయలేని యాడ్లను డిస్ప్లే చేస్తున్న యూట్యూబ్.. యాడ్బ్లాకర్లు వాడుతున్నా వీడియో పాజ్ చేసినప్పుడు యాడ్ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.యూట్యూబ్ ‘యాడ్ బ్లాకర్ డిటెక్షన్ టెక్నాలజీ’ను వినియోగిస్తుంది. దీనివల్ల యాడ్ బ్లాక్ యాప్‌లు వాడుతున్న ఫోన్లు, డెస్క్టాప్ల్లో వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేస్తే యాడ్ డిస్ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. ‘యూట్యూబ్‌లో వీడియో పాజ్ చేయబడినప్పుడు కూడా స్క్రీన్‌పై పాప్ అప్ ప్రకటన డిస్ప్లే అవుతుంది. పాజ్ చేసిన స్క్రీన్ సమయాన్ని లక్ష్యంగా చేసుకుని యాడ్ వచ్చేలా ప్రకటనదారులకు కంపెనీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. త్వరలో ఇది అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది’ అని యూట్యూబ్ కమ్యూనికేషన్ మేనేజర్ ఒలువా ఫలోడున్ తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో ఎలాంటి యాడ్లు రాకూడదని భావించేవారు ‘యూట్యూబ్ ప్రీమియం’ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నెలకు సుమారు రూ.1,100 ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి యాడ్స్ రాకుండా వీడియోను వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రకటనదారులు చెల్లించే మొత్తంలో కంటెట్ క్రియేటర్లకు 55 శాతం, యూట్యూబ్‌కు 45 శాతం ఆదాయం అందేలా ప్రస్తుత యాడ్ రెవెన్యూ పాలసీ ఉంది. -
Turkey: ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసిన టర్కీ
ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే టర్కీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసి హెడ్‌లైన్స్‌లో చోటుదక్కించుకుంది. అమెరికన్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌పై సెన్సార్షిప్ ఆరోపణలు చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టర్కీ నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఆగస్టు 2 నుంచి బ్లాక్ చేస్తున్నట్లు బీటీకే కమ్యూనికేషన్స్ అథారిటీ తన వెబ్సైట్లో ఒక పోస్ట్‌లో వెల్లడించింది.టర్కీలోని వినియోగదారులు తమ ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌ను రిఫ్రెష్ చేయలేకపోయామంటూ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదు చేశారు. కాగా టర్కీ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్.. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌పై పలు ఆరోపణలు చేశారు. ‘హమాస్ అమరవీరుడు హనియాకు సంతాప సందేశాలను పోస్టు చేయకుండా యూజర్స్‌కు ఇన్‌స్టా ఇబ్బందులు కలిగించిందని’ పేర్కొన్నారు. కాగా టర్కీ అధికారులు సోషల్ మీడియా సైట్స్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దీనికిముందు 2017 ఏప్రిల్, 2020 జనవరి మధ్య దేశ అధ్యక్షుడు- ఉగ్రవాదం మధ్య సంబంధాలపై రాసిన రెండు కథనాల కారణంగా వికీపీడియాను టర్కీ బ్లాక్ చేసింది.హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేశారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడికాలేదు. ఇతని మరణానికి 94 రోజుల ముందు, అతని ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు పాలస్తీనాలో హతమయ్యారు. "Turkey’s communications authority blocked access to the social media platform Instagram,” apparently because Instagram had removed "posts by Turkish users that expressed condolences over [Israel's] killing of Hamas political leader Ismail Haniyeh." https://t.co/Mc4pERy9j5— Kenneth Roth (@KenRoth) August 2, 2024 -
'మా' దూకుడు.. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చెప్పినట్లుగానే కఠిన చర్యలు చేపట్టింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మూవీ ఆర్టిస్టులపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న వారికి గట్టి షాకిచ్చింది. తాజాగా అలాంటి కంటెంట్ ప్రసారం చేస్తున్న 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించినట్లు మా అసోసియేషన్ ట్వీట్ చేసింది. అంతకుముందే అలాంటి వీడియోలను 48 గంటల్లోగా తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా నటీనటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మా అసోసియేషన్ తెలిపింది. బ్రహ్మి ట్రోల్స్ 3.0, టీకే క్రియేషన్స్, డాక్టర్ ట్రోల్స్, ట్రోలింగ్ పోరడు, అప్డేట్ ట్రోల్స్, నేను మీ జాను, కామెడీ ట్రోలింగ్, మై ఛానెల్ మై రూల్స్ లాంటి ఛానెల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా.. అంతకుముందే మొదట ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను బ్లాక్ చేయించారు.ఈ సందర్భంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ట్రోలర్లకు మరోసారి మా హెచ్చరికలు పంపింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న ట్రోల్ వీడియోలపై సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదిక అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దయచేసి మీ ఛానెల్స్ నుంచి అలాంటి కంటెంట్ వెంటనే తొలగించాలని మరోసారి మా విజ్ఞప్తి చేసింది. On behalf of #MAA, we urge all YouTubers and social media trollers to take a note. We are preparing to report defamatory troll videos to Cyber Crime office. Kindly remove such content from your channels and profiles to avoid complications.#RespectOurArtists— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024As part of our ongoing efforts on terminating the YouTube channels for posting derogatory content on our artists.We have blocked an additional 18 channels that spread harmful content.Stay tuned for further updates.#MAA #RespectOurArtists pic.twitter.com/rDnCJbDVHX— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024 -
నారా లోకేష్ వాట్సాప్ నెంబర్ బ్లాక్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బాబు వాట్సాప్ బ్లాక్ అయ్యింది. దీంతో.. సమస్యలు ఏవైనా ఉంటే తనకు వాట్సాప్ చేయొద్దని.. ఒకవేళ తనదాకా తీసుకురావాలనుకుంటే మాత్రం మెయిల్ చేయాలని కోరుతున్నారాయన.నారా లోకేష్‌కు వాట్సాప్ చేస్తే చాటూ.. మీ సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయి అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే హఠాత్తుగా ఇవాళ ఆయన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. మీ సమస్యలు వాట్సప్ చేయొద్దంటూ మెసేజ్ ఉంచారు. అయితే.. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన "హలో లోకేష్"…— Lokesh Nara (@naralokesh) July 11, 2024జనం కంటే.. టీడీపీ శ్రేణుల నుంచే ఎక్కువగా సందేశాలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో విసుగుచెంది ఆయన ఆ నెంబర్‌ను బ్లాక్ చేసి ఉండొచ్చనే చర్చా నెట్టింట నడుస్తోంది. బ్లాక్ చేశాక ఆ నెంబర్‌కు వాట్సాప్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం, ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కితే నవ్వులపాలు అవ్వొచ్చనే ఉద్దేశంతో లోకేష్ ఎక్స్‌లో సదరు సందేశం ఉంచినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. -
స్పామ్ కాల్స్‌తో ఒళ్లు మండిపోతోందా? ఇలా చేయండి!
పొద్దున లేచింది మొదలు రాత్రి వరకూ స్పామ్ కాల్స్ బెడద ఇంతా అంతాకాదు. ఏ పనిలో ఉన్నా,ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా.. ఏదో పెద్ద పని ఉన్నట్టు మనల్ని డిస్ట్రబ్ చేస్తాయి. తీరా అది స్పామ్ అని తెలిసాక మన కొచ్చే కోపం అంతా కాదు. సెలెన్స్ అన్ నోన్ కాలర్స్, స్పామ్ కాల్ అలర్ట్.. ఇలా ఎన్ని అప్షన్స్ ఉన్నా.. ఎన్ని నంబర్లను బ్లాక్ చేసినామళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి..దాదాపు సెల్‌ఫోన్ ఉన్నప్రతి వారికి ఇది అనుభవమే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో ఒక వీడియో తెగ షేర్ అవుతోంది. How do you deal with unwanted telephone calls? pic.twitter.com/emVHvdv02N — Science girl (@gunsnrosesgirl3) March 31, 2024 సైన్స్గర్ల్ అనే ట్విటర్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. ఈవీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికే ఇది 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరి మీరు కూడా ఓ లుక్కేసుకోండి! -
18 ఓటీటీలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినందుకుగాను 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయనున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వీటికి సంబంధం ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడి యా ఖాతాలను దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొంది. తొలగించే 10 యాప్‌లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్, 3 యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేవి. వేటుపడిన 18 ఓటీటీలివే.. డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రీఫ్లిక్స్, ఎక్స్ప్రైమ్, నియోన్ ఎక్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రబ్బిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ ఎక్స్, మోజోఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ప్లే వంటి ఓటీటీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు. తొలగించిన వాటిలో 12 ఫేస్బుక్ ఖాతాలు, 17 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 16 ఎక్స్ ఖాతాలు, 12 యూట్యూబ్ ఖాతాలు సోషల్ మీడియా ద్వారా అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి. -
అద్దంకి సిద్ధం సభ: కిక్కిరిసిన రోడ్లు, ఒక్కటైన హృదయాలు
సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సిద్ధం సభ’ విజయవంతమైంది. సిద్ధం సభకు లక్షాలాదిగా ప్రజలు హాజరై.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ఉత్సాహంగా విన్నారు. కార్యకర్తలు, అభిమానులతో సభకు వచ్చే.. అన్ని దారులు నిండిపోయాయి. రోడ్లన్ని కిక్కిరిసి.. హృదయాలు ఒక్కటైయ్యాయి. సభా ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో.. సభ బయట అంత మంది కంటే ఎక్కువే ఉన్నారు. -
ఇంకా దొరకని బండి సంజయ్ ఫోన్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సీఈఐఆర్ విధానం ఉపయోగించి ఫోన్లను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్ విద్యార్థి నుంచి వృద్ధులు, అధికారి నుంచి కూలీవరకు, ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు, వార్డు మెంబరు నుంచి ప్రధాని వరకు అందరిని కలిపే సామాజిక మాధ్యమంగా మారింది. అలాంటి సెల్‌ఫోన్ పొరపాటున పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా అందులోని డేటాతోపాటు, విలువైన సమాచారం పోతుంది. అందుకే పోలీసులు అలా పోగొట్టుకున్న పోన్లను వేటాడి గుర్తించేందుకు సీఈఐఆర్ విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సాంకేతికతను తొలిసారిగా కరీంనగర్ కమిషనరేట్‌లో ప్రయోగపూర్వకంగా ప్రారంభించారు. ప్రస్తుతం 50శాతం వరకు ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించగలిగారు. నేటికీ దొరకని ‘బండి’ ఫోన్.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వాట్సాప్‌లలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎంపీ బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ ఫోన్ అదృశ్యమైంది. పోలీసులే తన ఫోన్ మాయం చేశారని సంజయ్ ఆరోపించారు. ఆయన ఫోన్‌తో తమకు సంబంధం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆరోపణల పర్వం ఎలా ఉన్నా.. బండి సంజయ్ ఫోన్ నేటికీ లభించలేదు. అందులో అనేక కీలక విషయాలు ఉన్నాయని, తన ఫోన్ వెంటనే అప్పగించాలని బండి అనుచరులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం. ఫోన్ల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ పోలీసులు ఎంపీ సెల్‌ఫోన్ విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై ఆయన అనచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. 1,318 ఫోన్ల అందజేత! ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతపై కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ వెంటనే రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా సిబ్బందికి శిక్షణను విస్తరించారు. ఈ సాంకేతికత వినియోగంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 5,449 ఫోన్లు ఉమ్మడి జిల్లాలో పోయినట్లు రిపోర్టయ్యాయి. అందులో 1,318 ఫోన్లను రికవరీ చేశారు. సెల్ఫోన్ల రికవరీ అత్యధికంగా 418 రామగుండం పరిధిలో ఉండగా, అత్యల్పంగా 157 జగిత్యాల పరిధిలో ఉండటం గమనార్హం. సీఈఐఆర్ సాంకేతికత అంటే.? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా పోయిన సెల్‌ఫోన్‌ను తిరిగి కనిపెట్టొచ్చు. సీఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను ఐఎంఈఐ నంబరు సాయంతో బ్లాక్ చేయవచ్చు. ఈ తరువాత ఆ సెల్‌ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. ఒకవేళ ఫోన్ ఆన్చేసినా, అందులో కొత్త సిమ్‌కార్డు వేసినా.. ఆ విషయం ఫోన్ యజమానికి ఎస్ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది. ఎలా పనిచేస్తుంది..? సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే డబ్లూ.డబ్లూ.డబ్లూ.సీఈఐఆర్.జీవోవీ.ఐఎన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. అందులో బ్లాక్ ఫోన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మొబైల్ నంబర్–1, మొబైల్ నంబరు–2, సెల్‌ఫోన్ బ్రాండ్, మోడల్, ఇన్వాయిస్ (బిల్) ఫొటో సూచించిన గడుల్లో నింపాలి. పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామా, అంతకుముందే ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ నంబరు, ఫోన్ యజమాని చిరునామా, ఈమెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చప్టాలను సూచించిన బాక్సుల్లో నింపాలి. వెంటనే సెల్‌ఫోన్ (పాత నెంబరు మీద తీసుకున్న కొత్త సిమ్) నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. ఆ తరువాత ఫోన్ దానంతట అదే బ్లాక్ అవుతుంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్ చేయలేరు. అందులోని డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ దొంగించించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే.. మీ నంబరుకు మెసేజ్ వస్తుంది. ఆ సందేశం ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉన్నా.. పట్టుకోవడం సులభతరంగా మారుతుంది. అన్‌బ్లాక్ చేయండిలా.. మీఫోన్‌ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీని, ఫోన్‌నంబరు, ఇతర వివరాలు నింపిన తరువాత ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది! -
స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టడానికి కొత్త యాప్..
-
‘ఎక్స్’లో మార్పులు.. యూజర్లకు భారీ షాక్!
ట్విటర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు షాకిచ్చారు. ఎక్స్ ఫ్లాట్ ఫామ్ నుంచి అకౌంట్లను బ్లాక్ చేసే ‘బ్లాక్’ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ‘టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ’ ఎక్స్ అకౌంట్ యూజర్ ‘బ్లాక్ అండ్ మ్యూట్’ ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటూ ప్రశ్నించిన సందర్భంగా ఎలాన్ మస్క్ పైవిధంగా స్పందించారు. బ్లాక్ ఆప్షన్ డిలీట్ చేస్తున్నట్లు తెలిపిన మస్క్.. యూజర్లు ఇతర అకౌంట్ల నుంచి ఏదైనా సమస్యలు తలెత్తితే మ్యూట్ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఇక తాము డిలీట్ చేసిన బ్లాక్ అనే ఫీచర్ వల్ల పెద్ద ఉపయోగం లేదనే అభిప్రాయాన్ని మస్క్ వ్యక్తం చేశారు. కానీ, ఎవరైతే మన అకౌంట్లను మ్యూట్ చేశారో వాళ్లు వారి ఎక్స్ అకౌంట్లో ఏ పోస్ట్‌లు పెడుతున్నారో, ఎన్ని కామెంట్స్, ట్వీట్లు, రీట్విట్లు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తే వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్‌లను తన స్నేహితులకు పంపుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ కూడా చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మరోవైపు, సోషల్ మీడియాలో బ్లాక్ అనే ఆప్షన్ యూజర్ల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడీ ఈ ఫీచర్‌ను తొలగించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యే అవకాశం ఉందని ఎక్స్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చదవండి👉ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. జియో ఫైనాన్స్ లిస్టింగ్ ఎప్పటినుంచంటే? -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. మరోసారి టీడీపీ పెద్దలకు పేదలే లక్ష్యం..
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు దక్కకుండా చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి విఫలమైన తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇప్పుడు మరోసారి ఆ పేదలను లక్ష్యంగా చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు పేదలు సిద్ధమవుతున్న తరుణంలో.. అడ్డుకునేందుకు మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ తమకు అనుకూలురైన వారిచేత పిటిషన్ వేయించారు. ఇందులో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగత హోదా లో ప్రతివాదిగా చేర్పించి, ఆయనపై పలు నిందారోపణలు చేయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకటజ్యోతిర్మయి ధర్మాసనం విచారించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మినహా మిగిలిన ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమిషనర్, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, భూ కేటాయింపు కమిటీ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్... అలాగే రాజధాని ప్రాంతంలో పేదల కోసం ఏర్పాటు చేసిన ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందా? లేక ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతినిచ్చిందా? పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా అనుమతినిచ్చిందా? అన్న విషయంలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. అప్పుడు అలా.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఆర్డీఏ చట్ట నిబంధనలు చెబుతున్నా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో చట్ట నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో 1,402 ఎకరాల్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఏకంగా ఆర్ 5 జోన్‌ను సృష్టించింది. పేదల కోసం ఆ భూములను సీఆర్డీఏ నుంచి కొనుగోలు చేసింది. ఈ భూముల్లో 50,793 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. తమ ప్రాంతంలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో వారికి పట్టాలు రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించారు. అయినా కూడా టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. పేదలకు ఇళ్లస్థలాల మంజూరు అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నొక్కి చెప్పడంతో పట్టాల మంజూరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం విజయవంతంగా పేదలకు పట్టాలు పంపిణీ చేసింది. పేదలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కేంద్రం అనుమతులు సైతం మంజూరు చేసింది. దీంతో ఖంగుతున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు పేదల స్థలాల్లో చేపట్టబోతున్న ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఇలా.. ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సవాలు చేసిన విధంగానే ఆర్ 5 జోన్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని, 1,402 ఎకరాల బదలాయింపు జీవోలను కూడా తాజా పిటిషన్లోను సవాలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
గోవా టూ గోదావరి.. కేడీ లేడీల లిక్కర్ దందా
కైకలూరు: ఏలూరు జిల్లాలోకి గోవా మద్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కైకలూరు రైల్వేస్టేషన్లో బుధవారం ముగ్గురు మహిళల నుంచి 24 బ్యాగులలో ఏకంగా 2,949 మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4,54,400 ఉంటుందని అంచనా. తెలంగాణ కాదు.. గోవా బెటర్ గతంలో తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తెచ్చేవారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణాకు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ట్రైన్ల ద్వారా గోవా నుంచి ఏపీ రవాణా చేస్తున్నారు. వామ్మో కిలాడీ లేడీస్ బాపట్ల జిల్లా చీరాల మండలం, ఓడరేవుల గ్రామం వైఎస్సార్‌కాలనీకి చెందిన మహిళలు ఈ మద్యం రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. గతంలో వీరిపై సారా విక్రయ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొందరు ముఠాలుగా ఏర్పడి ముంబయి మీదుగా గోవాకు రైలులో చేరుకుంటున్నారు. కొన్ని రైళ్లే కన్వినీయంట్ అక్కడ మద్యం కొనుగోలు చేసి తిరిగి ముంబయి–విశాఖ ఎల్టీటీ రైలు ద్వారా ఆంధ్రాకు వస్తున్నారు. ఇలా నెలలో ముఠాలు రెండు సార్లు వెళ్లి వస్తున్నారు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను లగేజీ బ్యాగ్‌లలో ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక ముఠా గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. గస్తీ లేని స్టేషన్ల ఎంపిక గోవా నుంచి ముంబయి, విజయవాడ మీదుగా విశాఖపట్నం ఎల్టీటీ రైలు రాత్రి వేళలో ప్రయాణిస్తోంది. ఈ రైలును అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా నలుగురు మహిళలు వేర్వేరు బోగీలలో మద్యం సీసాల లగేజీ బ్యాగులను సీటు అడుగుభాగంలో ఉంచుతున్నారు. లగేజీ మాటున లిక్కర్ ఉదయం విజయవాడ దాటిన తర్వాత రైల్వేస్టేషన్లలో పోలీసుల గస్తీ తగ్గుతుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఎల్టీటీ ట్రైన్ గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం వంటి స్టేషన్లలో ఆగుతోంది. వీరు కై కలూరు, ఆకివీడు స్టేషన్లలో లగేజీలు దించుతున్నారు. ఎక్స్ ప్రెస్ నుంచి ప్యాసింజర్ ఆ తర్వాత పాసింజర్ రైలులో ఎక్కించి రామవరప్పాడు స్టేషన్లో దిగి అక్కడ నుంచి వాహనాల ద్వారా అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో సభ్యులు ఆయా స్టేషన్ల వద్ద ముందుగానే ఉంటూ ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా మహిళలకు సమాచారాన్ని అందిస్తున్నారు. లాభం ఎంతంటే.? గోవాలో ఫుల్‌బాటిల్ ధర రూ.270 ఉంటే ఇక్కడ రూ.800 నుంచి రూ.1000, క్వార్టర్ బాటిల్ రూ.26 ఉంటే ఇక్కడ రూ.150 నుంచి రూ.200కి విక్రయిస్తున్నారు. రైలులో వీరు బ్యాగులను అక్కడక్కడ సీట్ల కింద ముందుగానే సర్ధుతున్నారు. దీంతో పోలీసులు ప్రయాణికుల బ్యాగులుగా భావించి తనిఖీ చేయడం లేదు. రైల్వే పోలీసుల నిఘా లేనిచోట ముందుగానే గమనించి ఆ స్టేషనలో అక్రమ మద్యాన్ని దించుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు అడ్డుకుంటాం స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో(సెబ్) సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేస్తుంది. పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైలు, బస్ స్టేషన్ల వద్ద ఎవరైన అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో మరిన్ని తనిఖీలు చేపడతాం. – ఆకుల రఘు, పట్టణ సీఐ, కై కలూరు -
మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్‌ను పైలట్‌గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్‌కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్‌ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమోదించిన IMEI నంబర్లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉంటుంది. అంటే తమ నెట్‌వర్క్‌లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్లను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? -
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ 14 యాప్స్ బ్లాక్
ఢిల్లీ: అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం 14 మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్‌బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్ మేరకు.. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్ ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది. ఇదీ చదవండి: మన్‌కీ బాత్ టైంలో పురిటి నొప్పులు, ఆపై..


