డీఎన్‌డీ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తేనే ఫలితం
స్పామ్ కాల్స్, మెసేజీలపై ట్రాయ్ సూచన
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్‌ని ఆపేందుకు ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడంతో సరిపెట్టొద్దని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ డీఎన్‌డీ (డు నాట్ డిస్టర్బ్) యాప్ ద్వారా ఆ నంబర్ల గురించి ఫిర్యాదు చేయాలని సూచించింది. డీఎన్‌డీ యాప్ ద్వారా వచి్చన ఫిర్యాదుల ఆధారంగా స్పామ్, మోసపూరిత మెసేజీలతో సంబంధమున్న సుమారు లక్ష ఎంటీటీలను (సంస్థలు, వ్యక్తులు), 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్, బ్లాక్‌లిస్ట్ చేశామని పేర్కొంది.
యూజర్లు ఏదైనా స్పామ్ కాల్ లేదా ఎస్‌ఎంఎస్ గురించి యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వాటిని ట్రేస్ చేసేందుకు, నిర్ధారించుకునేందుకు, శాశ్వతంగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేసేందుకు ట్రాయ్ అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లకి వీలవుతుందని తెలిపింది. అలా కాకుండా వ్యక్తిగతంగా బ్లాక్ చేయడమనేది ఆ డివైజ్‌కి మాత్రమే పరిమితమవుతుందని, స్కామర్లు ఇతరులను కాంటాక్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూజర్లంతా కలిసికట్టుగా ఫిర్యాదులు చేస్తే, దేశవ్యాప్తంగా టెలికం సేవల దురి్వనియోగాన్ని అరికట్టవచ్చని వివరించింది.


