ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.
సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.
మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.
ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్‌పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.
ఇంతవరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్‌గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.
Yesterday one of our experienced engineers who works in my R&D team, showed me an assembly and machine code security tool he built in his spare time over the past month. I did not know he was building it. I was blown away by the depth and breadth of the tool.
He has developed…— Sridhar Vembu (@svembu) January 8, 2026


