ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఒకటి. చాలామంది వాహన ప్రియులకు ఈ కార్లలో ఒక్కసారైనా తిరగాలని ఉంటుంది. కానీ వీటి ధర కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు. ధనవంతులు సైతం రోల్స్ రాయిస్ కారు కొనాలంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ (Reuben Singh) యూకేకు చెందిన వ్యాపారవేత్త, ఇషర్ క్యాపిటల్ సీఈఓ. తలపాగా ధరించడం వల్ల ఈయన ఒకప్పుడు జాతి వివక్షను, ఆంగ్లేయుల నుంచి అవమానాలను ఎదుర్కున్నారు. సిక్కులు పవిత్రంగా చూసే తలపాగాను అవమానించడంతో.. సింగ్ తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు.
టర్బన్ ఛాలెంజ్ పేరుతో ప్రతి వారం ఆయన ధరించిన తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి.. దానితో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తం 15 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయనను అవమానించినవారే అవాక్కయ్యారు.
ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్
రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. ఈయన వద్ద పోర్స్చే 918 స్పైడర్, బుగట్టి వెయ్రాన్, పగని హుయారా, లంబోర్గిని హురాకాన్, లిమిటెడ్ ఎడిషన్ ఫెరారీ F12 బెర్లినెట్టా కార్లను కూడా కలిగి ఉన్నారు.
ఎవరీ రూబెన్ సింగ్?
బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రూబెన్ సింగ్. తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు.


