breaking news
Reuben
-
బ్రిటన్ సంపన్నుల్లో రూబెన్ సోదరులు టాప్
బ్రిటన్ సంపన్నుల్లో భారత సంతతికి చెందినవారు టాప్ ర్యాంక్ లో నిలిచారు. సండేటైమ్స్ సంపన్నుల జాబితాలో రూబెన్, హిందూజా సోదరులు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైలో పుట్టిన వ్యాపార దిగ్గజాలు 77 ఏళ్ల డేవిడ్ రూబెన్, 74 ఏళ్ల సైమన్ రూబెన్ సోదరులు ఈసారి సండేటైమ్స్ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో యూకే సంపన్నుల జాబితాలో అగ్రభాగాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది ఐదో స్థానంలో ఉన్న రూబెన్ సోదరుల సంపద విలువ ఈసారి 3.4 బిలియన్ పౌండ్లు పెరిగింది. దాంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సోదరుల తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో హిందూజా గ్రూప్‌నకు చెందిన శ్రీచంద్ హిందూజా, గోపీచంద్ హిందూజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానాన్ని సంపాదించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 50 మంది కుబేరుల జాబితాలో ముఖేశ్, అనిల్ అంబానీ కలసి 17.90 బిలియన్ పౌండ్ల సంపదతో 30వ స్థానానికి పరిమితమయ్యారు. స్టీల్ పరిశ్రమల సంక్షోభం, యూకే ధనవంతుల సంపద ర్యాంకింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. 2008 లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్ లో నిలిచిన ఆర్సిలర్ మిట్టల్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద ఈ సంవత్సరం 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950 సమయంలో బ్రిటన్ వెళ్ళి అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో భారీగా సంపదను ఆర్జించారు. సంపన్న ఇరాకీ జోయెషీ కుటుంబంలో పుట్టిన ప్రవాస భారతీయులైన ఈ హిందూజా సోదరులకు ఇండియాలో కూడ అశోక్ లేలాండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి మొదటి తరగతి కంపెనీలు ఉన్నాయి. -
యూకే కుబేరుల్లో రూబెన్, హిందుజా బ్రదర్స్ టాప్
లండన్: యూకే సంపన్నుల్లో భారతీయ సంతతికి చెందిన వారు టాప్‌లో ఉన్నారు. ‘సండేటైమ్స్ సంపన్నుల జాబితా-2016’లో రూబెన్ , హిందుజా బ్రదర్స్ తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు డేవిడ్, సైమన్ రూబెన్ బ్రదర్స్ 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ప్రాపర్టీ విలువ పెరుగుదల కారణంగా వీరి సంపద బాగా పెరిగింది. వీరి తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో శ్రీచంద్-గోపిచంద్ హిందుజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానంలో నిలిచారు. కాగా స్టీల్ పరిశ్రమ సంక్షోభం.. యూకే ధనవంతుల సంపద, ర్యాకింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 2008లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్‌లో ఉన్న ఆర్సిలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ సంపద ఈ ఏడాది 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950వ దశకంలో బ్రిటన్ వెళ్లి, అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో సంపదను ఆర్జించారు. ఇక ప్రవాస భారతీయులైన హిందుజా బ్రదర్స్‌కు ఇండియాలో కూడా అశోక్ లేలాండ్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి పెద్ద లిస్టెడ్ కంపెనీలున్న సంగతి తెలిసిందే.