బ్రిటన్ సంపన్నుల్లో భారత సంతతికి చెందినవారు టాప్ ర్యాంక్ లో నిలిచారు. సండేటైమ్స్ సంపన్నుల జాబితాలో రూబెన్, హిందూజా సోదరులు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.
ముంబైలో పుట్టిన వ్యాపార దిగ్గజాలు 77 ఏళ్ల డేవిడ్ రూబెన్, 74 ఏళ్ల సైమన్ రూబెన్ సోదరులు ఈసారి సండేటైమ్స్ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో యూకే సంపన్నుల జాబితాలో అగ్రభాగాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది ఐదో స్థానంలో ఉన్న రూబెన్ సోదరుల సంపద విలువ ఈసారి 3.4 బిలియన్ పౌండ్లు పెరిగింది. దాంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సోదరుల తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో హిందూజా గ్రూప్‌నకు చెందిన శ్రీచంద్ హిందూజా, గోపీచంద్ హిందూజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానాన్ని సంపాదించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 50 మంది కుబేరుల జాబితాలో ముఖేశ్, అనిల్ అంబానీ కలసి 17.90 బిలియన్ పౌండ్ల సంపదతో 30వ స్థానానికి పరిమితమయ్యారు. స్టీల్ పరిశ్రమల సంక్షోభం, యూకే ధనవంతుల సంపద ర్యాంకింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. 2008 లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్ లో నిలిచిన ఆర్సిలర్ మిట్టల్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద ఈ సంవత్సరం 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది.
ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950 సమయంలో బ్రిటన్ వెళ్ళి అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో భారీగా సంపదను ఆర్జించారు. సంపన్న ఇరాకీ జోయెషీ కుటుంబంలో పుట్టిన ప్రవాస భారతీయులైన ఈ హిందూజా సోదరులకు ఇండియాలో కూడ అశోక్ లేలాండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి మొదటి తరగతి కంపెనీలు ఉన్నాయి.
బ్రిటన్ సంపన్నుల్లో రూబెన్ సోదరులు టాప్
Published Mon, Apr 25 2016 9:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement